30, మార్చి 2023, గురువారం

సమస్య - 4382

31-3-2023 (శుక్రవారం)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“కూర్మము పరుగెత్తె వడిని గుఱ్ఱమువోలెన్”
(లేదా...)
“కూర్మము వాఱె వేగమున గుఱ్ఱమువోలె శిలీముఖంబుగన్”

28 కామెంట్‌లు:


 1. శర్మా! గాంచితివా యిది
  నిర్మాణపు పనులలోన నేర్పరి వాడా
  కర్మిష్ఠుడచట కనపడ
  కూర్మము, పరుగెత్తె వడిని గుఱ్ఱమువోలెన్.

  రిప్లయితొలగించండి
 2. రిప్లయిలు
  1. కందం
   అర్మిలి సుధఁబొందు కతనఁ
   బేర్మి నగము క్షీరజలధి వ్రేలగ హరియే
   మర్మమెరిగి యయ్యె నిలుప
   కూర్మము, పరుగెత్తె వడిని గుఱ్ఱమువోలెన్

   ఉత్పలమాల
   అర్మిలిఁ బొందగన్ సుధను నయ్యహి కవ్వము సేసి త్రచ్చగన్
   బేర్మి నగమ్ము మందరయె వ్రేలగ క్షీరజలాబ్ధి, విష్ణువే
   మర్మమెఱింగి నిల్పగను 'మార్చగ రూపము' సంద్రమందునన్
   ' గూర్మము' వాఱె వేగమున గుఱ్ఱమువోలె శిలీముఖంబుగన్

   తొలగించండి
  2. మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.

   తొలగించండి
 3. అర్మిలిమ్రొక్కగశిష్యుడు
  చర్మమువాయగగురువునుఝడిపించంగా
  శర్మగమారెనునాతఁడు
  కూర్మముపరుగెత్తెవడినిగుఱ్ఱమువోలెన్

  రిప్లయితొలగించండి

 4. నిర్మల మానసమ్మున ననీసుని తామరకంటి భూరినిన్
  ధర్మము నిల్పు దీక్షగల తార్క్ష్యుడు భావనుడే త్రిధాముడా
  ధర్మి పదాంబుజమ్ములె సదాగతి మార్గము జూపునంచు శ్రీ
  కూర్మము వాఱె వేగమున గుఱ్ఱమువోలె శిలీముఖంబుగన్.

  రిప్లయితొలగించండి
 5. మర్మము తో నొకడిలలో
  నిర్మాణము జేసె బాంబు నేర్పొ ద వంగన్
  కూర్మ పు రూపున గాల్చ గ
  కూర్మము పరుగెత్తె వడిని గుర్రము వోలెన్

  రిప్లయితొలగించండి
 6. బర్మా మరబొమ్నలు తమ
  ధర్నము దిగనా డి మెలగ
  దలపడి నంతన్
  మర్మము దెలియదు స్పర్ధన
  కూర్మము పరుగెత్తె వడిని గుఱ్ఱమువోలెన్

  రిప్లయితొలగించండి
 7. రిప్లయిలు
  1. మీ పూరణ బాగున్నది. అభినందనలు.
   రెండవ పాదంలో గణభంగం. సవరించండి.

   తొలగించండి
  2. సవరించాను గురూజీ...

   మర్మము నెరిగిన వాడై
   ధర్మార్థంబుల గడించు తలపుల తోడన్
   నిర్మల చిత్తుడు తా శ్రీ
   కూర్మము పరుగెత్తె వడిని గుఱ్ఱమువోలెన్

   తొలగించండి
 8. ధర్మముజాటగాజనెను దక్షుని యజ్ఞము జూడనెంచుచున్
  కర్మమదేమిజిత్రమన కాండము సాగెను వీరభద్రమై
  మర్మమెఱుంగజాలకను మార్చుచుఁదీరులు నొక్కరొక్కరై
  కూర్మము వాఱె వేగమున గుఱ్ఱమువోలె శిలీముఖంబుగన్
  కొరుప్రోలు రాధాకృష్ణ రావు

  రిప్లయితొలగించండి
 9. శర్మకు పాపభీతియన సాగ్రఁపు నమ్మిక దైవచింతనన్
  నిర్మలచిత్తుడై బ్రతుకు నెమ్మిని సల్పుచు పుణ్య కార్యముల్
  కర్మవశంబునన్ నియమ ఘాతము గల్గగ భీతినొంది శ్రీ
  కూర్మము వాఱె వేగమున గుఱ్ఱమువోలె శిలీముఖంబుగన్

  రిప్లయితొలగించండి
 10. ధర్మాతిక్రమణమునన్
  శర్మముఁ గోల్పోయి పాప శమనము కొరకున్
  కర్మిష్ఠుడు సరగున శ్రీ
  కూర్మము పరుగెత్తె వడిని గుఱ్ఱమువోలెన్

  రిప్లయితొలగించండి
 11. ఉ.

  ధర్మము మాతృభాష గని స్థాయిని బెంచ వధాన పాఠముల్
  శర్మలు శాస్త్రులున్ గలయ సర్వజనీనము శిష్యులై రహిన్
  గర్మము నాచరించు గతి, గ్రాహ్యము, బాలుర ధారణా విధిన్
  *కూర్మము వాఱె వేగమున గుఱ్ఱమువోలె శిలీముఖంబుగన్.*

  రిప్లయితొలగించండి
 12. మర్మములేకపారమునుమానకసాధనజేయునత్తఱిన్
  అర్మిలిమ్రొక్కెశిష్యుడునునమబరమంటగతన్నిథానమున్
  శర్మగమారెశోధనముసత్యమునందుచుమానసంబునన్
  కూర్మమువాఱెవేగమునగుఱ్ఱమువోలెశిలీముఖంబుగన్

  రిప్లయితొలగించండి
 13. మర్మమ్ములు భేదిలఁ ద
  త్కర్మమ్మును గాంచిన జనకాయపుఁ గేకల్
  మార్మోగ నక్కయె గ్రసిత
  కూర్మము పరుగెత్తె వడిని గుఱ్ఱము వోలెన్

  నర్మిలిఁ జేయ సాయము ఘనమ్ముగ వెన్నుఁడు స్వీయ సత్కృపా
  ధర్మ మెడంద నెంచి వసుధన్ ధవ లాంబుధిఁ జేయఁగన్ బృహ
  త్కర్మము మంద రాగమము దాల్పఁ దలంచుచు సంభ్రమమ్మునం
  గూర్మము వాఱె వేగమున గుఱ్ఱము వోలె శిలీ ముఖంబుగన్

  రిప్లయితొలగించండి
 14. కం॥ కర్మ మనగఁ గడు సోమరి
  కర్మ మనకఁ బాటుపడఁగఁ గష్టము తొలగున్
  కర్మ మనక నాపదలో
  కూర్మము పరిగెత్తె వడిని గుఱ్ఱము వోలెన్

  ఉ॥మర్మముఁ దెల్పెదన్ వినవొ మారఁగఁ గాలము మారె నెన్నియో
  ధర్మము లేని కాలమిది తప్పక దక్షత యుండగాఁ దగున్
  కర్మ మటంచు దీనతను గాంచకఁ జూడవొ యాపదల్ గనన్
  గూర్మము వాఱె వేగమున గుఱ్ఱము వోలె శిలీముఖంబునన్

  (నేటి దేశ కాల పరిస్థిలకనువుగా వ్రాయాలని ప్రయత్నమండి)

  రిప్లయితొలగించండి
 15. శర్మావినుమీ కథలో
  మర్మము గని నేర్చుకొనుము మానుగ నీవున్
  నిర్మల మతితో సాగుచు
  కూర్మము పరిగెత్తె వడిని గుర్రము వోలెన్

  రిప్లయితొలగించండి

 16. పిన్నక నాగేశ్వరరావు.

  నిర్మలమగు సరసు బయట
  కూర్మము శునకమ్మును గని కొంకుచు వడకెన్
  మర్మమెఱిగి కొలను దరికి
  కూర్మము పరుగెత్తె వడిని గుఱ్ఱము వోలెన్.

  రిప్లయితొలగించండి