24, మార్చి 2023, శుక్రవారం

సమస్య - 4376

25-3-2023 (శనివారం)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“ముక్కుఁ గోసి తీర్చె ముచ్చటఁ బతి”
(లేదా...)
“ముక్కును గోసి వల్లభుఁడు ముచ్చట తీర్చెను ముద్దుముద్దుగన్”

28 కామెంట్‌లు:

 1. ఆటవెలది
  చెప్పినట్టి మాట చెప్పినట్లు వినవె?
  ముక్కుఁ గోతునంచు ముదిత బలుక
  సుతుని బిల్చి నటనఁ జూపుడు వ్రేళితో
  ముక్కుఁ గోసి తీర్చె ముచ్చటఁ బతి

  ఉత్పలమాల
  ఎక్కడమున్గునో తిరిగి యెక్కడఁ దేలునొ యంతుజిక్కడన్
  టెక్కులమారి వాడనుచు డింభకు బట్టియు ముక్కుఁగోతనన్
  జెక్కిలి పట్టియున్ సుతుని జేకొని చూపుడు వ్రేలుఁ ద్రిప్పియున్
  ముక్కును గోసి వల్లభుఁడు ముచ్చట తీర్చెను ముద్దుముద్దుగన్

  రిప్లయితొలగించండి
 2. చిన్నిబాలుడంతచేరగజనని ని
  తండ్రిపలుకరించెతనయునిగని
  సన్నముక్కుసుదతిసైగనుజేసియు
  ముక్కుగోసిదీర్చెముచ్చటపతి

  రిప్లయితొలగించండి

 3. మగడు తెచ్చి నట్టి మామిడి పండ్లలో
  కొన్ని క్రుళ్ళె ననుచు కోమ చూప
  చతురు డైన వాడు చాకు జేకొనుచు నా
  ముక్కుఁ గోసి తీర్చె ముచ్చటఁ బతి.


  మక్కువ తోడ వేష్టికము మానిని కోరెనటంచు శ్రద్ధతో
  రొక్కమదెక్కువైనదని రోయక తెచ్చిన నేమి క్రుళ్ళెనే
  చుక్క ప్రమాణమంచు సఖి చూపగ వేగమునందు దానిలో
  ముక్కును గోసి వల్లభుఁడు ముచ్చట తీర్చెను ముద్దుముద్దుగన్.

  (ముక్కు = చెడు.)

  రిప్లయితొలగించండి
 4. జాణ శూర్ప ణ ఖను సౌమిత్రి శిక్షించె
  ముక్కు కోసి ::తీర్చె ముచ్చట బతి
  సతియు జింక గోర సాహసాన వెడలి
  వెంట బడియు తరిమె వీరు డ గుచు

  రిప్లయితొలగించండి
 5. మంచి గాను చెప్పి మాట వినక యున్న
  కోతుముక్కుననుచుకోమలియన
  చూపుమెటులయనగ చూపుడు వేలితో
  *“ముక్కుఁ గోసి తీర్చె ముచ్చటఁ బతి”*

  రిప్లయితొలగించండి
 6. కుతపుడు పొడువగనె క్రొత్త సంవత్సర
  పండుగ దినమందు బత్ని రహిగ
  కోరగ కొని నట్టి క్రొత్త యత్తరు బుడ్డి
  ముక్కుఁ గోసి తీర్చె ముచ్చటఁ బతి

  రిప్లయితొలగించండి
 7. అందరికీ నమస్సులు 🙏
  ఉమా

  చక్కనిచుక్క మెచ్చి తన చంపకమా! యనునట్టి నాసికన్
  మక్కువ తీర బెట్టుకొన మానికమద్దిన పైడి ముక్కెరన్;
  కొక్కెము వంగి గ్రుచ్చుకొన గొల్లు మనెన్ సతి, యద్ది నొక్కగన్
  *“ముక్కును; గోసి వల్లభుఁడు, ముచ్చట తీర్చెను ముద్దుముద్దుగన్”*

  *వాణిశ్రీ నైనాల*

  రిప్లయితొలగించండి
 8. ముక్కుకు ముక్కెరందమని ముచ్చట దీర్చమటంచు నర్మిలిన్
  చక్కనిచుక్క పెన్మిటిని సమ్మతిఁ గోరుచు వేడినంతఁ దా
  నిక్కపుటాలు కౌతుకము నెక్కొని దీర్చఁగ దెచ్చి ముక్కెరన్
  ముక్కును గోసి వల్లభుఁడు ముచ్చట తీర్చెను ముద్దుముద్దుగన్

  రిప్లయితొలగించండి
 9. ఉ.

  గ్రక్కన స్వప్నమందు గనె గ్రాహిగ నూర్మిళ లక్ష్మణున్ క్రియల్
  మిక్కిలి ప్రేమతో, నటి, సుమీ ! పగచాటున రామునాజ్ఞచే
  జొక్కిలి రూపి రక్కసియు శూర్పణఖన్ గొని కర్ణఖండనన్
  *ముక్కును గోసి వల్లభుఁడు ముచ్చట తీర్చెను ముద్దుముద్దుగన్.*

  రిప్లయితొలగించండి
 10. సొగసులీనుచున్న శుకనాస పుష్పాలు
  తరుణికంటబడగ తానుకోరె
  సత్వరమ్ము నేగి సతి చూపిన చిలుక
  ముక్కుఁ గోసి తీర్చె ముచ్చటఁ బతి

  చక్కని కేకు చేసి తన సజ్జన ఱేనికి దూరదేశమున్
  మక్కువ తోడబంప నది మార్గమునందున జాగు నొందగా
  ముక్కె, హతోస్మి! తానిచట పుట్టినరోజును సల్పువేళ నా
  ముక్కును గోసి వల్లభుఁడు ముచ్చట తీర్చెను ముద్దుముద్దుగన్

  [ముక్కు - ముక్కిన / చెడిన]

  రిప్లయితొలగించండి
 11. ముక్కు బోసిపోయె ముక్కెరఁ గొనమని
  ముదిత పతినిఁ గోర ముక్కెరఁ గొని
  రంధ్రమేర్పరచగ రమణి నాసికపైన
  ముక్కుఁ గోసి తీర్చె ముచ్చటఁ బతి

  రిప్లయితొలగించండి
 12. చక్కని యాననమ్ముగల చాన కళత్రముగా భిషక్కుకున్
  జిక్కగ, లోపమున్ గనుచు శ్రీమతి నాసిక, వైద్యశాలలో
  గ్రక్కున నామెనాసికను రమ్యముగా పొనరింపనెంచుచున్
  ముక్కును గోసి వల్లభుఁడు ముచ్చట తీర్చెను ముద్దుముద్దుగన్

  రిప్లయితొలగించండి
 13. ప్రక్కన నేనునుండగను బాతకి
  యొక్కతి చేసె హేళనన్
  తిక్క కుదిర్చె గోపమున దెంపరి వెంటనె
  నేను కోరగా
  ముక్కును గోసి వల్లబుడు ముచ్చట
  దీర్చెను ముద్దు ముద్దుగన్
  జెక్కెను జెప్పినట్టులను జేడియ పొందెను
  శాస్తి తప్పుకున్

  రిప్లయితొలగించండి
 14. సరసులోఁ బొడగని సరసకు నరుదెంచి
  భర్త నరసి నలిన పత్ర నేత్ర
  కాంత కోర నల్ల కలువఁ బోలం బయో
  ముక్కుఁ గోసి తీర్చె ముచ్చటఁ బతి

  అక్కుల కాంత కోరికల నన్నిటిఁ దీర్చుచు నొక్క టొక్కటిం
  జెక్కిలి మీటి యక్కునను జేరిచి మిన్నగఁ బొంగఁ బ్రేమయే
  చక్కని చుక్క గోరఁగను జక్కఁగ ముక్కర వెట్ట గోముగా
  ముక్కును గోసి వల్లభుఁడు ముచ్చట తీర్చెను ముద్దు ముద్దుగన్

  రిప్లయితొలగించండి
 15. మరొక పూరణ

  మక్కువతోడగాంచుచును మానిని రూపము నందివేగమా
  రక్కసి చుప్పనాతి రఘు రాముని కోరుచు పర్చదృక్కులన్
  నిక్కమెరింగిలక్ష్మణుడునేర్పుగకత్తినిచేతబట్టియా
  ముక్కునుగోసివల్లభుడుముచ్చటతీర్చెను ముద్దుముద్దుగన్

  రిప్లయితొలగించండి
 16. ఉ॥ చక్కఁగ వైద్యశాస్త్రమును సాధనఁ జేయఁగ మెచ్చిరెల్లరున్
  మక్కువ తోడ భార్యయును మాయము సేయవొ ముక్కువంకరన్
  జక్కఁగఁ దీర్చిదిద్దుమన సాధ్యతఁ గాంచఁగ శాస్త్ర బద్ధతన్
  ముక్కును గోసి వల్లభుఁడు ముచ్చట తీర్చెను ముద్దుముద్దుగన్

  ఆ॥వైద్యుని సతి తనదు వంకర ముక్కును
  జక్కఁ జేయు మనఁగ సాధ్యతఁ గని
  శాస్త్రబద్ధముగను శస్త్ర చికిత్సను
  ముక్కుఁ గోసి తీర్చె ముచ్చటఁ బతి

  రిప్లయితొలగించండి

 17. పిన్నక నాగేశ్వరరావు.

  చెక్కతోడ శిల్పి చక్కని బొమ్మను
  చేసి చూపగ తన చెలియ, కామె
  ముఖము కళగనుండె ముక్కు పెద్దదనగ
  ముక్కుఁ గోసి తీర్చె ముచ్చటఁ బతి.

  రిప్లయితొలగించండి