11-3-2023 (శనివారం)కవిమిత్రులారా,ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...“రణము సేయ వచ్చితి విచిత్రంపు నుడుల”(లేదా...)“రణముల్ సేయఁగ వచ్చినాఁడను విచిత్రంబౌ వచోవృత్తితో”(ఆముదాల మురళి గారి శతావధానంలో ఎమ్మెస్వీ గంగరాజు గారి సమస్య)
పలు విధముల నారోపణ పలుకులు వినినిజము ను దెలిసి కొనియును నిశ్చ యముగజరిగిన ది పొర పాటని సరియగు సవరణము. సేయ వచ్చి తి వి చిత్రంపు నుడుల
కంది శంకరు డొ సగిన కమ్మ నైనహృద్య. పాదపు పూరణ పద్య ములనుపొత్త. ముగ జేయు కోర్కె తో బూనియు ప్రచురణము సేయ వచ్చితి విచిత్ర o పు నుడుల
పాండవులు కోరు భంగి భూభాగములనునీయగా కుదరదు నవనీతచోర!సకలమెరిగియు నేల నీ సాకులు "వివ రణము" సేయ వచ్చితివి చిత్రంపు నుడుల
రాజ్యభాగమీకనురాజురహినిదప్పదౌత్యకార్యంబుకొఱకునైతాల్మితోడరాయబారిగనేడుగారాగమొలుకరణముసేయవచ్చితివిచిత్రంపునుడుల
వణకెన్హంసయురాజుమోముగనితావారింపలేకన్దమిన్పుణికెన్నైషధరాజుముద్దుగనునాపుంభావనైర్మల్యమున్అణచన్తాపముపల్కెనిట్టులనుతాహర్షాతిరేకంబునన్రణమున్సేయగవచ్చినాడనువిచిత్రంబౌవచోవృత్తితో
మ.మణిగా వెల్గెడు ముద్దు రాజ కవి ప్రామాణ్యమ్ము క్షిప్రమ్ముగాకణుపుల్ మాదిరి పద్యమల్ల గల సాకారుండు మెచ్చంగ నేప్రణతుల్ సేయగ భాగ్యమే తెలుగులో పాండిత్యమౌ నంకపూ*రణముల్ సేయఁగ వచ్చినాఁడను విచిత్రంబౌ వచోవృత్తితో.*
దినమునకొక పద్యమయిన తనివితీరవ్రాయకున్నను మనసుకు హాయి రాదుప్రొద్దు పొడవక మున్ముందు పూరణమనురణము సేయ వచ్చితి విచిత్రంపు నుడుల
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
కవులు పండితు లెందరో గాంచునట్టిసభను జేరి వధానము జరుపు వేళనలుపెరుగక చక్కని పద్యములను రువ్వి రణము సేయ వచ్చితి విచిత్రంపు నుడుల.ప్రణతుల్ శాబ్ది విశాలనేత్రికనుచున్ బ్రార్థించి యాపైని ధిగణులైనట్టి బుధానవర్యులకు నే కైదండలన్ మోడ్చి సద్గుణులౌ ప్రేక్షకులెల్ల మెచ్చువిధినిన్ దోషమ్ము లేకుండ బూరణముల్ సేయఁగ వచ్చినాఁడను విచిత్రంబౌ వచోవృత్తితో.
పద్యమును వ్రాయ , దానిని ప్రజ్ఞుడు గనియెరుకబరచె దప్పుల , వాటి నెంచి సవరణము సేయ వచ్చితి ; విచిత్రంపు నుడులదీసివేయ మొదలిడితి దీరుబడిగ
భాగ్య నగరమునందు నేర్పరచబడినధారణాబ్రహ్మదౌ యవధానమందురణము సేయ వచ్చితివి చిత్రంపు నుడులపృచ్ఛకులకు సాధ్యమగునా రెచ్చిపోవ
క్షణికావేశము లేని వాడను సదా కర్తవ్య సౌముఖ్యుడన్ప్రణతుల్ సల్పెద భక్తితోడ సభలో పాల్గొన్న జంజానిరీక్షణకున్ న్యాయమొనర్చు కౌతుకముతో సంపూర్ణమౌ పద్యతోరణముల్ సేయఁగ వచ్చినాఁడను విచిత్రంబౌ వచోవృత్తితో
క్షణమున్ వీడక జ్ఞాన శాస్త్రములు నే గష్టించిసాధించి సద్గుణసంపన్నుల తోడ బండితలతో గూలంకషంగాను వాగ్రణముల్ సేయగ వచ్చినాడ విచిత్రంబౌవచో వృత్తిచేగణుతిన్ గాంచిన జ్ఞానవేత్తలువినంగావచ్చియోడించుడీ.
అనయంబున్ కవితాలలామపద సేవాసక్తియే ధ్యేయమైవినయంబున్ పొలుపారదాల్చి మదిలో విజ్ఞానులౌ నొజ్జలన్దినమున్ రాతిరి సేవచేసి కొనుచున్ దీక్షన్ ప్రశస్తంపు పూరణముల్ సేయఁగ వచ్చినాఁడను విచిత్రంబౌ వచోవృత్తితో
చెణకుల్ చిమ్ముచు పండితోత్తములు విశ్లేషించుచున్ మెచ్చి ప్రేరణమున్ గల్గగ చేయుచుండ కడు సారమ్మైన పద్యమ్ములన్ఘనమౌ యీయవధానమున్ దలసి సంగ్రామమ్ముగా, మించు పూరణముల్ సేయఁగ వచ్చినాఁడను విచిత్రంబౌ వచోవృత్తితో
తేటగీతివృత్తి వేరైన పద్యమ్ము వేడ్కనాకుగురువర! తమ దయను మెలకువలెఱుంగరణము సేయ వచ్చితి విచిత్రంపు నుడులతెలియ జెప్పుచు మన్నించి దిద్దుడయ్యమత్తేభవిక్రీడితముమణులన్ బోలిన మాటలన్ మలచ సంభావించి ధీమూర్తిగన్ప్రణతుల్ గూర్తును, పద్యవిద్య నొగి నేర్వన్దల్చి వేడన్ క్షమాగుణసంపన్నత నేర్పుమా! గురువరా! కొంగ్రొత్తదౌ వృత్తినిన్రణముల్ సేయఁగ వచ్చినాఁడను విచిత్రంబౌ వచోవృత్తితో
సంతసము పిక్కటిల్లఁగ సుంత యేని నోహటిల్లకయుఁ బర మోత్సాహమున వినంగ వచ్చిన వారి మానసము లపహరణము సేయ వచ్చితి విచిత్రంపు నుడులతృణ మాత్రమ్మును స్వీయ డెందముల సందేహింపకే యొడ్డఁగా ఫణ మొక్కింత వరావధాన సభలన్ స్వాంతమ్ము హర్షింపఁ బ్రాంగణ మందున్న మహానుభావు లెదలం గంపింప నుత్సాహినైరణముల్ సేయఁగ వచ్చినాఁడను విచిత్రంబౌ వచోవృత్తితో
తే॥ రమ్యమైన పద్యములను వ్రాయనెంచికఠిన సాధన యొనరించి కంద పద్యములను వ్రాయఁగ మెచ్చకఁ బోయిరనుచురణము సేయ వచ్చితి విచిత్రంపు నుడులమ॥ గణముల్ గూర్చితిఁ బద్యమాలలను వాగౌచిత్య ధారామృతమ్మణుమాత్రంబుగ నైనఁ దగ్గకను వ్రాయంగన్ బ్రయత్నించితిన్గణయత్యాదుల తప్పులెంచఁగను నాకావ్యంబునన్ బండితుల్రణముల్ సేయఁగ వచ్చినాడను విచిత్రంబౌ వచోవృత్తితో
పలు విధముల నారోపణ పలుకులు విని
రిప్లయితొలగించండినిజము ను దెలిసి కొనియును నిశ్చ యముగ
జరిగిన ది పొర పాటని సరియగు సవ
రణము. సేయ వచ్చి తి వి చిత్రంపు నుడుల
కంది శంకరు డొ సగిన కమ్మ నైన
తొలగించండిహృద్య. పాదపు పూరణ పద్య ములను
పొత్త. ముగ జేయు కోర్కె తో బూనియు ప్రచు
రణము సేయ వచ్చితి విచిత్ర o పు నుడుల
పాండవులు కోరు భంగి భూభాగములను
రిప్లయితొలగించండినీయగా కుదరదు నవనీతచోర!
సకలమెరిగియు నేల నీ సాకులు "వివ
రణము" సేయ వచ్చితివి చిత్రంపు నుడుల
రాజ్యభాగమీకనురాజురహినిదప్ప
రిప్లయితొలగించండిదౌత్యకార్యంబుకొఱకునైతాల్మితోడ
రాయబారిగనేడుగారాగమొలుక
రణముసేయవచ్చితివిచిత్రంపునుడుల
వణకెన్హంసయురాజుమోముగనితావారింపలేకన్దమిన్
రిప్లయితొలగించండిపుణికెన్నైషధరాజుముద్దుగనునాపుంభావనైర్మల్యమున్
అణచన్తాపముపల్కెనిట్టులనుతాహర్షాతిరేకంబునన్
రణమున్సేయగవచ్చినాడనువిచిత్రంబౌవచోవృత్తితో
మ.
రిప్లయితొలగించండిమణిగా వెల్గెడు ముద్దు రాజ కవి ప్రామాణ్యమ్ము క్షిప్రమ్ముగా
కణుపుల్ మాదిరి పద్యమల్ల గల సాకారుండు మెచ్చంగ నే
ప్రణతుల్ సేయగ భాగ్యమే తెలుగులో పాండిత్యమౌ నంకపూ
*రణముల్ సేయఁగ వచ్చినాఁడను విచిత్రంబౌ వచోవృత్తితో.*
దినమునకొక పద్యమయిన తనివితీర
రిప్లయితొలగించండివ్రాయకున్నను మనసుకు హాయి రాదు
ప్రొద్దు పొడవక మున్ముందు పూరణమను
రణము సేయ వచ్చితి విచిత్రంపు నుడుల
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండిఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండికవులు పండితు లెందరో గాంచునట్టి
రిప్లయితొలగించండిసభను జేరి వధానము జరుపు వేళ
నలుపెరుగక చక్కని పద్యములను రువ్వి
రణము సేయ వచ్చితి విచిత్రంపు నుడుల.
ప్రణతుల్ శాబ్ది విశాలనేత్రికనుచున్ బ్రార్థించి యాపైని ధి
గణులైనట్టి బుధానవర్యులకు నే కైదండలన్ మోడ్చి స
ద్గుణులౌ ప్రేక్షకులెల్ల మెచ్చువిధినిన్ దోషమ్ము లేకుండ బూ
రణముల్ సేయఁగ వచ్చినాఁడను విచిత్రంబౌ వచోవృత్తితో.
పద్యమును వ్రాయ , దానిని ప్రజ్ఞుడు గని
రిప్లయితొలగించండియెరుకబరచె దప్పుల , వాటి నెంచి సవ
రణము సేయ వచ్చితి ; విచిత్రంపు నుడుల
దీసివేయ మొదలిడితి దీరుబడిగ
భాగ్య నగరమునందు నేర్పరచబడిన
రిప్లయితొలగించండిధారణాబ్రహ్మదౌ యవధానమందు
రణము సేయ వచ్చితివి చిత్రంపు నుడుల
పృచ్ఛకులకు సాధ్యమగునా రెచ్చిపోవ
క్షణికావేశము లేని వాడను సదా కర్తవ్య సౌముఖ్యుడన్
తొలగించండిప్రణతుల్ సల్పెద భక్తితోడ సభలో పాల్గొన్న జంజానిరీ
క్షణకున్ న్యాయమొనర్చు కౌతుకముతో సంపూర్ణమౌ పద్యతో
రణముల్ సేయఁగ వచ్చినాఁడను విచిత్రంబౌ వచోవృత్తితో
క్షణమున్ వీడక జ్ఞాన శాస్త్రములు నే గష్టించి
రిప్లయితొలగించండిసాధించి స
ద్గుణసంపన్నుల తోడ బండితలతో గూలంక
షంగాను వా
గ్రణముల్ సేయగ వచ్చినాడ విచిత్రంబౌ
వచో వృత్తిచే
గణుతిన్ గాంచిన జ్ఞానవేత్తలువినంగావచ్చి
యోడించుడీ.
అనయంబున్ కవితాలలామపద సేవాసక్తియే ధ్యేయమై
రిప్లయితొలగించండివినయంబున్ పొలుపారదాల్చి మదిలో విజ్ఞానులౌ నొజ్జలన్
దినమున్ రాతిరి సేవచేసి కొనుచున్ దీక్షన్ ప్రశస్తంపు పూ
రణముల్ సేయఁగ వచ్చినాఁడను విచిత్రంబౌ వచోవృత్తితో
చెణకుల్ చిమ్ముచు పండితోత్తములు విశ్లేషించుచున్ మెచ్చి ప్రే
రిప్లయితొలగించండిరణమున్ గల్గగ చేయుచుండ కడు సారమ్మైన పద్యమ్ములన్
ఘనమౌ యీయవధానమున్ దలసి సంగ్రామమ్ముగా, మించు పూ
రణముల్ సేయఁగ వచ్చినాఁడను విచిత్రంబౌ వచోవృత్తితో
తేటగీతి
రిప్లయితొలగించండివృత్తి వేరైన పద్యమ్ము వేడ్కనాకు
గురువర! తమ దయను మెలకువలెఱుంగ
రణము సేయ వచ్చితి విచిత్రంపు నుడుల
తెలియ జెప్పుచు మన్నించి దిద్దుడయ్య
మత్తేభవిక్రీడితము
మణులన్ బోలిన మాటలన్ మలచ సంభావించి ధీమూర్తిగన్
ప్రణతుల్ గూర్తును, పద్యవిద్య నొగి నేర్వన్దల్చి వేడన్ క్షమా
గుణసంపన్నత నేర్పుమా! గురువరా! కొంగ్రొత్తదౌ వృత్తినిన్
రణముల్ సేయఁగ వచ్చినాఁడను విచిత్రంబౌ వచోవృత్తితో
సంతసము పిక్కటిల్లఁగ సుంత యేని
రిప్లయితొలగించండినోహటిల్లకయుఁ బర మోత్సాహమున వి
నంగ వచ్చిన వారి మానసము లపహ
రణము సేయ వచ్చితి విచిత్రంపు నుడుల
తృణ మాత్రమ్మును స్వీయ డెందముల సందేహింపకే యొడ్డఁగా
ఫణ మొక్కింత వరావధాన సభలన్ స్వాంతమ్ము హర్షింపఁ బ్రాం
గణ మందున్న మహానుభావు లెదలం గంపింప నుత్సాహినై
రణముల్ సేయఁగ వచ్చినాఁడను విచిత్రంబౌ వచోవృత్తితో
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండితే॥ రమ్యమైన పద్యములను వ్రాయనెంచి
రిప్లయితొలగించండికఠిన సాధన యొనరించి కంద పద్య
ములను వ్రాయఁగ మెచ్చకఁ బోయిరనుచు
రణము సేయ వచ్చితి విచిత్రంపు నుడుల
మ॥ గణముల్ గూర్చితిఁ బద్యమాలలను వాగౌచిత్య ధారామృత
మ్మణుమాత్రంబుగ నైనఁ దగ్గకను వ్రాయంగన్ బ్రయత్నించితిన్
గణయత్యాదుల తప్పులెంచఁగను నాకావ్యంబునన్ బండితుల్
రణముల్ సేయఁగ వచ్చినాడను విచిత్రంబౌ వచోవృత్తితో