21, మార్చి 2023, మంగళవారం

సమస్య - 4373

22-3-2023 (బుధవారం)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“పాలు నీరు గలిపి చేసె పచ్చడి సతి”
(లేదా...)
“పాలను నీటిలోఁ గలిపి భామిని సేసె నుగాది పచ్చడిన్” 

(ఈ సమస్యను పంపిన అక్కెర కరుణాసాగర్ గారి ధన్యవాదాలు)

15 కామెంట్‌లు:

  1. వేపపూవునులేదుగావెలకుకూడ
    పచ్చి మామిడి కాయయేభారమయ్యె
    చింతపండునుబెల్లముచేదు, సగము
    పాలు నిీరుగలిపిజేసెపచ్చడిసతి

    రిప్లయితొలగించండి

  2. చిటికెడుప్పు దీప్యము క్రొత్త చింతపండు
    పూప కరకపు ముక్కలున్ వేప పూవు
    ద్రువజములనెల్ల తెప్పించి తురుముచు తగు
    పాలు నీరు గలిపి చేసె పచ్చడి సతి.

    రిప్లయితొలగించండి
  3. కాలపు చక్రమున్ దిరిగి క్రమ్మర వచ్చె నుగాది
    నేడు నా
    మేలును గోరి నాకునిడె మిక్కిలి ముచ్చట
    తోడ నెచ్చెలిన్
    మేలిమి చింతపండు మరి మెచ్చిన బెల్లము
    దెచ్చి చక్కగా
    పాలను నీటిలో గలిపి భామిని సేసె నుగాధి
    పచ్చడన్.

    రిప్లయితొలగించండి
  4. చింతపండురసమునందుచిటికెడుప్పు
    వేసినందులోనకలిపివేపపువ్వు
    మామిడితురమునుజతకు ‌మంచి గుడము
    పాలు నీరు గలిపిచేసె పచ్చడిసతి

    రిప్లయితొలగించండి

  5. మేలగు సాంప్రదాయమని మిక్కిలి మక్కువ జూపెడింతియే
    యాలయ మేగి యచ్చట ప్రియాంభువు ముక్కలు
    క్రొత్త బెల్లమున్
    బాలుడు తెచ్చియిచ్చిన యవానియు తింత్రిణి యుప్పు వేప పు
    ష్పాలను నీటిలోఁ గలిపి భామిని సేసె నుగాది పచ్చడిన్.

    రిప్లయితొలగించండి
  6. వాడుకగ టీ ని వశ యిడె పాత్రలోన
    పాలు నీరు గలిపి ; చేసె పచ్చడి సతి
    తప్పక ప్రతి యుగాదిని తనరు
    నటుల
    ప్రొద్దు పొడువ నారు రుచులు పొందురీతి

    రిప్లయితొలగించండి
  7. పండుగ దినాన నాసతి భక్తి తోడ
    చేయ బూనెను గోఘృత పాయసమును
    పాలు నీరు గలిపి; చేసె పచ్చడి సతి
    శుచికరమ్ముగ నేడు షడ్రుచుల తోడ

    బాలలకిష్టమౌననుచు పర్వదినంబున పాయసంబునే
    పాలను నీటిలోఁ గలిపి భామిని సేసె, నుగాది పచ్చడిన్
    బాలరసాలమున్ దునుచి భామిని సేసెసు వేపపూతతో
    మేలగు పచ్చడే యనుచు మెచ్చిరి సర్వులు షడ్రసమ్ములన్

    రిప్లయితొలగించండి
  8. వరుణదేవుని కరుణలో కొరత దోఁచె
    కసిగ కురిపించెనిల వడగండ్ల వాన
    చూతమును వేము గనరాక భూతలమున
    పాలు నీరు గలిపి చేసె పచ్చడి సతి

    రిప్లయితొలగించండి
  9. ఏల నకాలమందు నిటులిబ్బడిముబ్బడి వానలెల్లెడన్?
    నేలను వాలె భూజములు నీటను మున్గెను పంట భూములే
    కాలము సానుకూల పడకన్ గతిలేక నుగాది వేళలో
    పాలను నీటిలోఁ గలిపి భామిని సేసె నుగాది పచ్చడిన్

    రిప్లయితొలగించండి
  10. పర్వదిన మని ప్రత్యేక వంట జేయ
    వెదుక గనబడె. నొక చోట వేరు శె నగ
    పప్పు దానిలో జేకొని యప్పుడు సగ
    పాలు నీరు గలిపి చేసె పచ్చ డి సతి

    రిప్లయితొలగించండి
  11. పండుగ దినమందు నడరి మెండుగాను
    గారె లామవడలు వండి మూరి పప్పు
    నరఁటి కూర పులుసు పరమాన్నము దగఁ
    బాలు నీరు గలిపి చేసెఁ బచ్చడి సతి

    కాలము మించ కా పలు రకమ్ములు నైన పదార్థముల్ గడున్
    మేలుగ సంగ్రహించి మితి మీఱిన వేగము తోడఁ బ్రీతితో
    నా లలితాంగి వే వలసి నట్టివి, ముందుగఁ జక్కఁబెట్టి యా
    పాలను నీటి, లోఁ గలిపి భామిని సేసె నుగాది పచ్చడిన్

    రిప్లయితొలగించండి
  12. గురుదేవులకు కవిమిత్రమండలికి శోభకృతు నామ సంవత్సర ఉగాది పర్వదిన శుభాకాంక్షలు💐💐💐

    తేటగీతి
    సంప్రదాయాన బెల్లమ్ము చారడేసి,
    పిండి చింతగుజ్జు, కటువు, వేపపూత
    వగరుమామిడి నుప్పును వలసినంత
    పాలు నీరు గలిపి చేసె పచ్చడి సతి

    ఉత్పలమాల
    కాలము మారినన్ మిగుల కట్టడి తప్పని సంప్రదాయమై
    మేలని బెల్లమున్, గటువు, మేలిమి పుల్సును, వేపపూతయున్
    చాలెడు మావి ముక్కలును షడ్రుచికుప్పును చాలినంతటిన్
    బాలను నీటిలోఁ గలిపి భామిని సేసె నుగాది పచ్చడిన్

    రిప్లయితొలగించండి
  13. ఉ.

    ఆలులు భక్తితో సురల హాటక విగ్రహ పూజ జేయు *శి*
    *ల్పాలను నీటిలోఁ గలిపి భామిని సేసె నుగాది పచ్చడిన్*
    మేలిమి షడ్రుచుల్ బెరయ మేనుకు నిచ్చును శాంతి సౌఖ్యముల్
    శీలము స్వాస్థ్యమున్ బలము చిక్కుట నూతన వత్సరంబునన్.

    రిప్లయితొలగించండి
  14. ఉ॥ మాలగఁ జెట్లకున్ గనక మామిడి పిందెలు వేప పువ్వులున్
    వేళకుఁ జేయలేననుచు వేదనఁ జెంద నుగాది పచ్చడిన్
    మాలిమిఁ జేసి భర్త చని మాలిని కన్నియమర్చ గోప తా
    పాలను నీటిలోఁ గలిపి భామిని సేసె నుగాది పచ్చడిన్

    రిప్లయితొలగించండి