20-3-2023 (సోమవారం)కవిమిత్రులారా,ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...“భీముఁడు పార్వతిన్ వలచి పెండిలియాడెను మెచ్చ దేవతల్”(లేదా...)“భీముఁడు పార్వతిని మెచ్చి పెండ్లాడెఁ గదా”(ఆముదాల మురళి గారి శతావధానంలో మాలేపట్టు పురుషోత్తమాచారి గారి సమస్య)
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
సోముని శిరసున నాగునిదామముగ ధరించి యున్న తాపసి పయినన్కాముడు విరిశిఖి విడ , నాభీముఁడు పార్వతిని మెచ్చి, పెండ్లాడెఁ గదా
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
భీముడు = శివుడు
కాముని పదును శరమ్ములవాముని హృదయము చలించి వ్యాకులమాయెన్ప్రేమయెపొంగిపొరలగాభీముఁడు పార్వతిని మెచ్చి పెండ్లాడెఁ గదా
భామిని గౌరి శంకరుని భర్తగనొందెడి దీక్షబూనగాతామొక యుక్తితో సురలు తామరతూపరినంపినంతటన్కాముని కంకపత్రముల కందిన డెందము చంచలించగాభీముఁడు పార్వతిన్ వలచి పెండిలియాడెను మెచ్చ దేవతల్
మీ రెండు పూరణలు ప్రశస్తంగా ఉన్నవి. అభినందనలు.
ధన్యవాదాలు గురూజీ 🙏
ఉత్పలమాలనోములతో నపర్ణగ వినూత్న విధంబుగ సేవఁజేసినన్భామను గాంచఁబోడనుచు వాసవుఁడాది సురాళి వేడగన్కాముడు పుష్పబాణములఁ గ్రమ్మఁగఁ గాల్చియు యోగి త్ర్యక్షుడన్భీముఁడు పార్వతిన్ వలచి పెండిలియాడెను మెచ్చ దేవతల్కందంనోముల నపర్ణగ గొలువభామను గనడంచుఁ జెలఁగ పంచాస్త్రములన్గాముని దహించి హరుడన్భీముఁడు పార్వతిని మెచ్చి పెండ్లాడెఁ గదా!
🙏ధన్యోస్మి గురుదేవా!🙏
క్రమాలంకారంలో ---కామి హి డంబి పతి యెవ రు?నీమముతో జపము సలిపి నెగ్గ గ శివుడేలేమ కు పతి యయ్యె నెటుల?భీముడు :: పార్వతిని మెచ్చి పెండ్లాడె గదా!
కాముకి యా హిడంబి గజ గామి వరించెనువాయు పుత్రునిన్ఆమెను బెండ్లి యాడె తన యమ్మ యనుజ్ఞను బొంది వెంటనేభీముడు, పార్వతిన్ వలచి పెండిలియాడెనుమెచ్చ దేవతల్వాముడు శైల వాసుడును, వారిజ నేత్రి ముదంబుజెందగా.
క్షేమమొసంగువాడు శశిశేఖరు డాతడు విశ్వనాథుడే కాముని బూదిసేసి కరకంఠుడు కంటకుడైన తారకున్ నామమడంచు ధీరుడగు నాకునికై త్రిపురాంతకుండెయౌ భీముఁడు పార్వతిన్ వలచి పెండిలియాడెను మెచ్చ దేవతల్.కామారి పురహరుడు త్రిధాముడు వసుధారథుండు దహనాంబకుడావాముడు త్రిపురాంతకుడాభీముఁడు పార్వతిని మెచ్చి పెండ్లాడెఁ గదా.
కాముకుడౌ సింహబలునిభీమరమందెవడు జంపె, వృషభధ్వజడే భామను జేగొనె ననగన్ భీముడు, పార్వతిని మెచ్చి పెండ్లాడెఁ గదా! భీమరమందు కీచకుని పీచమడంచిన వీరుడెవ్వడో?కాముని బూదిసేసి కరకంఠుడు దేవతలెల్ల వేడగానే మగువన్ వరించె వచియించుమటంచన చెప్పె శిష్యుడే భీముఁడు, పార్వతిన్ వలచి పెండిలియాడెను మెచ్చ దేవతల్.
కాముఁడు పూశరమ్ముఁ గొని కల్మషకంఠుని గాసిఁబెట్ట నాసోముని చిచ్చుకంటి సెగ సోకఁగ మారుడు భస్మమయ్యె సంక్షేమముఁ గోరి వేల్పులకు చిన్మయమూర్తి శుభంకరుండునౌభీముఁడు పార్వతిన్ వలచి పెండిలియాడెను మెచ్చ దేవతల్
మీ పూరణ ప్రశస్తంగా ఉన్నది. అభినందనలు.
కాముని గోరఁగ వేల్పులుసోముని పై పూశరమ్ము సోకఁగ జేసెన్కాముడు భస్మంబాయెనుభీముఁడు పార్వతిని మెచ్చి పెండ్లాడెఁ గదా
నేమముతోతపమ్మునటనిశ్చలచిత్తముతోడచేయనాకాముడుభంగపర్పగనుకాల్చెనుమూడవకంటితోవడిన్భామయుగాంచుచాహరుని భక్తి ప్రపత్తులకోరభర్తగాభీముడు పార్వతిన్ వలచి పెండిలి యాడెను మెచ్చదేవతల్
ఆమ నిసొగసులకాదనికామునిబంధముమనసునకాంచనివాడైధీమంతుడుతపోరణమునభీముడు పార్వతినిమెచ్చిపెండ్లాడెగదా ,
ఆమనిరాకజూచియతడద్భుతమంచునులొంగడేగదాసోమునిసోయగంబులనుశోధనసేయడురక్తిలేకయున్భూమినినెల్లనారలనుబ్రోచుతపోధనుండునౌభీముఁడుపార్వతిన్వలచిపెండిలియాడెనుమెచ్చదేవతల్
ఏమఱి యన్నను సందియ మేమియు లే దిందు సుంత యేనియు సత్యం బీ మాట కాదనఁ గలమె భీముఁడు పార్వతిని మెచ్చి పెండ్లాడెఁ గదా భీముఁ డనంగ శంకరుఁడు భీకర తాండవ మాచరించు నిత్యామర సేవితుండు త్రిపురాంతకుఁ డంతక దర్ప హంతయున్ భీమపుఁ దత్తపో నిరతి ప్రీతి నొసంగ గణించి దీక్షనున్ భీముఁడు పార్వతిన్ వలచి పెండిలియాడెను మెచ్చ దేవతల్
పూజ్యులు శంకరయ్య గారికి నమః పూర్వక ధన్యవాదములు.
పాములు గిరగిరఁ దిరుగగఁ గామునిబాణమ్ము లైదు కాయము సోకన్ సోముఁడు చిహ్నము గాగల భీముఁడు పార్వతిని మెచ్చి పెండ్లాడెఁ గదా
సోముఁడు చిహ్నమై శిరము శోభిలు చుండగ పాపఱేడులున్ మోమును దాకుచుం దిరుగ మోమున కన్నున ముగ్ధ రూపుఁడై భీముఁడు పార్వతిన్ వలచి పెండిలియాడెను మెచ్చ దేవతల్ భీముని భక్తితో కొలువ పేర్మిని మోక్షము నొందురందరున్
కం.క్షేమము గూర్చగ జగతికిగాముడు వదలిన శరములు కదలించనెదన్,నీమములన్నియు వీడుచుభీముఁడు పార్వతిని మెచ్చి పెండ్లాడెఁ గదాఉ.మా.క్షేమము నెంచి లోకముల శీఘ్రము లక్ష్యము చేరినట్టి, యాకాముని బాణముల్దగిలి కందగ డెందము నాగ్రహించి,తానీమములన్ని వీడగను నెయ్యపురేని గనంగ గాల్చుచున్*భీముఁడు పార్వతిన్ వలచి పెండిలియాడెను మెచ్చ దేవతల్*
ధన్యవాదములు గురువర్యా🙏🙏
పిన్నక నాగేశ్వరరావు.కాముడు శరములు విసరగసోముడు కనుతెఱచినెదుట చూచిన నెలతన్ తా మోహావేశముతో భీముడు పార్వతిని మెచ్చి పెండ్లాడెఁ గదా!
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండిసోముని శిరసున నాగుని
రిప్లయితొలగించండిదామముగ ధరించి యున్న తాపసి పయినన్
కాముడు విరిశిఖి విడ , నా
భీముఁడు పార్వతిని మెచ్చి, పెండ్లాడెఁ గదా
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండిభీముడు = శివుడు
రిప్లయితొలగించండికాముని పదును శరమ్ముల
రిప్లయితొలగించండివాముని హృదయము చలించి వ్యాకులమాయెన్
ప్రేమయెపొంగిపొరలగా
భీముఁడు పార్వతిని మెచ్చి పెండ్లాడెఁ గదా
భామిని గౌరి శంకరుని భర్తగనొందెడి దీక్షబూనగా
తొలగించండితామొక యుక్తితో సురలు తామరతూపరినంపినంతటన్
కాముని కంకపత్రముల కందిన డెందము చంచలించగా
భీముఁడు పార్వతిన్ వలచి పెండిలియాడెను మెచ్చ దేవతల్
మీ రెండు పూరణలు ప్రశస్తంగా ఉన్నవి. అభినందనలు.
తొలగించండిధన్యవాదాలు గురూజీ 🙏
తొలగించండిఉత్పలమాల
రిప్లయితొలగించండినోములతో నపర్ణగ వినూత్న విధంబుగ సేవఁజేసినన్
భామను గాంచఁబోడనుచు వాసవుఁడాది సురాళి వేడగన్
కాముడు పుష్పబాణములఁ గ్రమ్మఁగఁ గాల్చియు యోగి త్ర్యక్షుడన్
భీముఁడు పార్వతిన్ వలచి పెండిలియాడెను మెచ్చ దేవతల్
కందం
నోముల నపర్ణగ గొలువ
భామను గనడంచుఁ జెలఁగ పంచాస్త్రములన్
గాముని దహించి హరుడన్
భీముఁడు పార్వతిని మెచ్చి పెండ్లాడెఁ గదా!
మీ రెండు పూరణలు ప్రశస్తంగా ఉన్నవి. అభినందనలు.
తొలగించండి🙏ధన్యోస్మి గురుదేవా!🙏
తొలగించండిక్రమాలంకారంలో ---
రిప్లయితొలగించండికామి హి డంబి పతి యెవ రు?
నీమముతో జపము సలిపి నెగ్గ గ శివుడే
లేమ కు పతి యయ్యె నెటుల?
భీముడు :: పార్వతిని మెచ్చి పెండ్లాడె గదా!
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండికాముకి యా హిడంబి గజ గామి వరించెను
రిప్లయితొలగించండివాయు పుత్రునిన్
ఆమెను బెండ్లి యాడె తన యమ్మ యను
జ్ఞను బొంది వెంటనే
భీముడు, పార్వతిన్ వలచి పెండిలియాడెను
మెచ్చ దేవతల్
వాముడు శైల వాసుడును, వారిజ నేత్రి ము
దంబుజెందగా.
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండి
రిప్లయితొలగించండిక్షేమమొసంగువాడు శశిశేఖరు డాతడు విశ్వనాథుడే
కాముని బూదిసేసి కరకంఠుడు కంటకుడైన తారకున్
నామమడంచు ధీరుడగు నాకునికై త్రిపురాంతకుండెయౌ
భీముఁడు పార్వతిన్ వలచి పెండిలియాడెను మెచ్చ దేవతల్.
కామారి పురహరుడు త్రి
ధాముడు వసుధారథుండు దహనాంబకుడా
వాముడు త్రిపురాంతకుడా
భీముఁడు పార్వతిని మెచ్చి పెండ్లాడెఁ గదా.
రిప్లయితొలగించండికాముకుడౌ సింహబలుని
భీమరమందెవడు జంపె, వృషభధ్వజడే
భామను జేగొనె ననగన్
భీముడు, పార్వతిని మెచ్చి పెండ్లాడెఁ గదా!
భీమరమందు కీచకుని పీచమడంచిన వీరుడెవ్వడో?
కాముని బూదిసేసి కరకంఠుడు దేవతలెల్ల వేడగా
నే మగువన్ వరించె వచియించుమటంచన చెప్పె శిష్యుడే
భీముఁడు, పార్వతిన్ వలచి పెండిలియాడెను మెచ్చ దేవతల్.
కాముఁడు పూశరమ్ముఁ గొని కల్మషకంఠుని గాసిఁబెట్ట నా
రిప్లయితొలగించండిసోముని చిచ్చుకంటి సెగ సోకఁగ మారుడు భస్మమయ్యె సం
క్షేమముఁ గోరి వేల్పులకు చిన్మయమూర్తి శుభంకరుండునౌ
భీముఁడు పార్వతిన్ వలచి పెండిలియాడెను మెచ్చ దేవతల్
మీ పూరణ ప్రశస్తంగా ఉన్నది. అభినందనలు.
తొలగించండికాముని గోరఁగ వేల్పులు
రిప్లయితొలగించండిసోముని పై పూశరమ్ము సోకఁగ జేసెన్
కాముడు భస్మంబాయెను
భీముఁడు పార్వతిని మెచ్చి పెండ్లాడెఁ గదా
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండినేమముతోతపమ్మునటనిశ్చలచిత్తముతోడచేయనా
రిప్లయితొలగించండికాముడుభంగపర్పగనుకాల్చెనుమూడవకంటితోవడిన్
భామయుగాంచుచాహరుని భక్తి ప్రపత్తులకోరభర్తగా
భీముడు పార్వతిన్ వలచి పెండిలి యాడెను మెచ్చదేవతల్
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండిఆమ నిసొగసులకాదని
రిప్లయితొలగించండికామునిబంధముమనసునకాంచనివాడై
ధీమంతుడుతపోరణమున
భీముడు పార్వతినిమెచ్చిపెండ్లాడెగదా ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండిఆమనిరాకజూచియతడద్భుతమంచునులొంగడేగదా
రిప్లయితొలగించండిసోమునిసోయగంబులనుశోధనసేయడురక్తిలేక
యున్
భూమినినెల్లనారలనుబ్రోచుతపోధనుండునౌ
భీముఁడుపార్వతిన్వలచిపెండిలియాడెనుమెచ్చదేవతల్
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండిఏమఱి యన్నను సందియ
రిప్లయితొలగించండిమేమియు లే దిందు సుంత యేనియు సత్యం
బీ మాట కాదనఁ గలమె
భీముఁడు పార్వతిని మెచ్చి పెండ్లాడెఁ గదా
భీముఁ డనంగ శంకరుఁడు భీకర తాండవ మాచరించు ని
త్యామర సేవితుండు త్రిపురాంతకుఁ డంతక దర్ప హంతయున్
భీమపుఁ దత్తపో నిరతి ప్రీతి నొసంగ గణించి దీక్షనున్
భీముఁడు పార్వతిన్ వలచి పెండిలియాడెను మెచ్చ దేవతల్
మీ రెండు పూరణలు ప్రశస్తంగా ఉన్నవి. అభినందనలు.
తొలగించండిపూజ్యులు శంకరయ్య గారికి నమః పూర్వక ధన్యవాదములు.
తొలగించండిపాములు గిరగిరఁ దిరుగగఁ
రిప్లయితొలగించండిగామునిబాణమ్ము లైదు కాయము సోకన్
సోముఁడు చిహ్నము గాగల
భీముఁడు పార్వతిని మెచ్చి పెండ్లాడెఁ గదా
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండిసోముఁడు చిహ్నమై శిరము శోభిలు చుండగ పాపఱేడులున్
రిప్లయితొలగించండిమోమును దాకుచుం దిరుగ మోమున కన్నున ముగ్ధ రూపుఁడై
భీముఁడు పార్వతిన్ వలచి పెండిలియాడెను మెచ్చ దేవతల్
భీముని భక్తితో కొలువ పేర్మిని మోక్షము నొందురందరున్
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండికం.
రిప్లయితొలగించండిక్షేమము గూర్చగ జగతికి
గాముడు వదలిన శరములు కదలించనెదన్,
నీమములన్నియు వీడుచు
భీముఁడు పార్వతిని మెచ్చి పెండ్లాడెఁ గదా
ఉ.మా.
క్షేమము నెంచి లోకముల శీఘ్రము లక్ష్యము చేరినట్టి, యా
కాముని బాణముల్దగిలి కందగ డెందము నాగ్రహించి,తా
నీమములన్ని వీడగను నెయ్యపురేని గనంగ గాల్చుచున్
*భీముఁడు పార్వతిన్ వలచి పెండిలియాడెను మెచ్చ దేవతల్*
మీ రెండు పూరణలు ప్రశస్తంగా ఉన్నవి. అభినందనలు.
తొలగించండిధన్యవాదములు గురువర్యా🙏🙏
తొలగించండి
రిప్లయితొలగించండిపిన్నక నాగేశ్వరరావు.
కాముడు శరములు విసరగ
సోముడు కనుతెఱచినెదుట చూచిన నెలతన్
తా మోహావేశముతో
భీముడు పార్వతిని మెచ్చి పెండ్లాడెఁ గదా!