16, మార్చి 2023, గురువారం

సమస్య - 4368

17-3-2023 (శుక్రవారం)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“నామంబునుఁ బెట్టితే జనంబులకుఁ గవీ”
(లేదా...)
“నామముఁ బెట్టినాఁడవు జనంబులకున్ మురళీ కవీశ్వరా”
(ఆముదాల మురళి గారి శతావధానంలో పైనేని తులసీనాథం నాయుడు గారి సమస్య)

22 కామెంట్‌లు:

  1. నీ మధురోక్తులన్ నయము, నీ దరహాసము బుద్ధిమత్వమున్
    ప్రేమ కరావలోకనము, ప్రీతిఁ కనుంగొని పృచ్ఛకాళికిన్
    ధీమతివౌచుఁ బల్వురిన దేవుని గాంచి, వధానమందు, ను
    న్నామముఁ బెట్టినాఁడవు జనంబులకున్ మురళీ కవీశ్వరా!

    రిప్లయితొలగించండి

  2. కోమలమగు నీ కృతులను
    నేమము గాను పఠియించు నేస్తము లనుచున్
    ప్రేమగ వాణీ సుతులను
    నామంబునుఁ బెట్టితే జనంబులకుఁ గవీ.


    నేమము తప్పబోమనుచు నీతిఁ జరించెడు వారలమ్మనిన్
    భామము తోడనీ ప్రజల పక్షము పూచి వహించెడుత్తిగా
    నామని వేడ్కలన్ జరుపె డంతరమందున విశ్వసించి య
    న్నా! మముఁ బెట్టినాఁడవు జనంబులకున్ మురళీ కవీశ్వరా.

    రిప్లయితొలగించండి
  3. రాముని పేరును తలచుచు
    స్వామీ నీవే శరణని పలుమార్లనుచున్
    నేమముతోడను నిలువుగ
    *“నామంబునుఁ బెట్టితే జనంబులకుఁ గవీ”*

    రిప్లయితొలగించండి
  4. కామితముల దీర్చ మనుచు
    నా మలయప్పను గనగనె నాలయ మందున్
    దామేల నివ్విధిగ దిరు
    నామంబునుఁ బెట్టితే జనంబులకుఁ గవీ

    రిప్లయితొలగించండి
  5. నీమముతో దీనుల సం
    క్షేమమ్మే లక్ష్యమనుచు స్థిర చిత్తముతో
    ధామము ప్రేమాలయమని
    నామంబునుఁ బెట్టితే జనంబులకుఁ గవీ!

    రిప్లయితొలగించండి
  6. ప్రామాణికసూత్రమ్ముల
    నేమాత్రము నరయకుండ నెత్తుగడలతో
    వేమరి భళాభళీ యెగ
    నామంబునుఁ బెట్టితే జనంబులకుఁ గవీ

    రిప్లయితొలగించండి
  7. నీమము దప్పియు రుణములు
    ధీమాగా జేసి నీవు తీర్చక కవితల్
    Kàకామిత మొప్పగ నల్లుచు
    నామంబును బెట్టితే జనంబులకు కవీ

    రిప్లయితొలగించండి
  8. నీ మహిమాన్వితంబయిన నేర్పు కవిత్వమునందు జూపిసం
    క్షేమమె నీదు ధ్యేయమని జెప్పుచుఁ నీయవ ధానమందునన్
    నీమము వీడి దీనులను నిర్దయగా తెగనాడుచున్ భళా
    నామముఁ బెట్టినాఁడవు జనంబులకున్ మురళీ కవీశ్వరా!

    రిప్లయితొలగించండి
  9. నేమము వీడకే సతము నిష్టగ కొల్చుచు శ్రీ శునెప్పుడున్
    ప్రేమగపల్కరించుచునువీఢుచు జంకును గౌరవించితా
    నేమరపాటుచెందకయె యిమ్ముగ చేయగనెంచి వేగమే
    *“నామముఁ బెట్టినాఁడవు జనంబులకున్ మురళీ కవీశ్వరా*

    రిప్లయితొలగించండి
  10. ఉ.

    నేమము తోడ గొల్చు విధి నిర్గుణ దేవుని వేద మంత్రముల్
    హోమము పూర్ణమయ్యెనని హోతలు నల్లని చూర్ణమివ్వగన్
    క్షేమము నొంద దీవనలు క్షేపణమౌనని యంగుళంబుతో
    *నామముఁ బెట్టినాఁడవు జనంబులకున్ మురళీ కవీశ్వరా!*

    రిప్లయితొలగించండి
  11. కందం
    నీమంబుగ హిందువునని
    సేమమ్మని నుదుట దిద్ది సింధూరముతో,
    *శ్రీమంతమనుచుఁ దెలుపఁగ*,
    నామంబునుఁ బెట్టితే, *జనంబులకుఁ గవీ!*

    ఉత్పలమాల
    నీమమనంగ హిందువుగ నిత్యము నా తిలకమ్ము దాల్చఁగన్
    రాముని భక్తుడౌ హనుమ రాజిలె మోమున సుందరుండనన్
    *సేమమటంచుఁ దెల్పగ విశిష్టత*, మెచ్చి లలాటమందునన్
    నామముఁ బెట్టినాఁడవు, *జనంబులకున్ మురళీ! కవీశ్వరా!*

    రిప్లయితొలగించండి
  12. మిీమాయనుభేదములను
    తామానసమందులేకమసిబూసిబ లే
    సీమాంతముదాకువిధము
    నామంబునుబెట్టితేజనములకుకవీ,

    రిప్లయితొలగించండి
  13. ధీమతి! పద నానార్థ
    స్తోమ విశేషజ్ఞ! కవన ధుర్యా!సుగుణ
    స్తోమ!ప్రజ యని సమంచిత
    నామంబునుఁ బెట్టితే జనంబులకుఁ గవీ

    స్తోమ పరంపరార్హ సువచో రచనా నిపుణా! వధాన సం
    గ్రామ సభా స్థలాంతర సుఖస్థిత పండిత వర్య! వీత దం
    భా! మృదు భాషి! ప్రాశ్నికుల మన్నన కర్హులుగాఁ గలంక హీ
    నా! మముఁ బెట్టినాఁడవు జనంబులకున్ మురళీ! కవీశ్వరా!

    రిప్లయితొలగించండి
  14. కం॥ ప్రేమగఁ గవితా ధారలఁ
    దామస రీతులఁ దెలుపుచుఁ దత్వము నుడువన్
    నేమమెఱుఁగని నరులనిరి
    “నామంబునుఁ బెట్టితే జనంబులకుఁ గవీ"

    ఉ॥ సామము లెన్నియో నుడివి సర్వులు మెచ్చఁగ సద్వధానమున్
    నేమము తోడఁ జేసితివి నేర్పుగఁ గాని గ్రహించితిట్టులన్
    వేమన పద్యసూక్తులను వేరు విధమ్ముగఁ గూర్చి చెప్పుచున్
    నామముఁ బెట్టినాడవు జనంబులకున్ మురళీ కవీశ్వరా!

    రిప్లయితొలగించండి