26, మార్చి 2023, ఆదివారం

సమస్య - 4378

27-3-2023 (సోమవారం)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“అద్దమందుఁ గాంతు నన్యు నొకని”
(లేదా...)
“అద్దమునందుఁ గాంచినపు డన్యుఁడు గన్పడు నెల్లవేళలన్”

22 కామెంట్‌లు:


  1. పాండుపుత్రుల వన వాసమ్ము ముగిసిన
    పాళమందు పలికె పార్థు డిటుల
    యచ్చర శాపమదియె యబ్రము నన్నునే
    నద్దమందుఁ గాంతు నన్యు నొకని.

    రిప్లయితొలగించండి

  2. పెద్దయె కంకుభట్టుగను భీముడు వంటల వల్లభుండు వా
    రిద్దరి సోదరుండగు మహేంద్రసుతుండు బృహన్నలయ్యెనే
    నిద్ధర యందు ప్రాగసరుడింద్రతనూభవుడంత తన్నుతా
    నద్దమునందుఁ గాంచినపు డన్యుఁడు గన్పడు నెల్లవేళలన్.

    రిప్లయితొలగించండి
  3. మాయకాడు వచ్చి మంత్రించి యిచ్చిన
    యద్దమందుఁ గాంతు నన్యు నొకని ,
    విస్మయము బడితిని వింతను జూడగ
    నెటులనయ్యెనిటుల నెరుకలేదు

    రిప్లయితొలగించండి
  4. రద్దు లేనిచోటసాధనసేయగా
    రూపమింతలేనిరోచియనగ
    మలినమంటరానిమానసంబనియెడి
    అద్దమందుగాంతునన్యునొకని

    రిప్లయితొలగించండి
  5. వద్దనుజేరితండ్రిగనుభావనసేయనవారితంబుగా
    విద్దెలసాధనంబులనువేంకనగొల్వగనార్తితోడనా
    కద్దిర! కానిపించెగదకమ్మనిరూపుననాత్మసాక్షిలో
    నద్దమునందుగాంచినపుడన్యుడుగన్పడునెల్లవేళలన్

    రిప్లయితొలగించండి
  6. మాయ ముకుర మొకటి మానిని గొని దెచ్చి
    సుతున కొసగి దాని చూడు మనియె
    గదికి వెడలి వాడు గమనించి యిట్లనె
    యద్ద మందు గాంతు నన్యు నొకని

    రిప్లయితొలగించండి
  7. హద్దులు లేని కోర్కులు మహాత్ములలైనను
    ధూర్త చేష్టలున్
    నిద్దర లేపి చేయుమను నిత్యము నిష్టము
    లేకపోయినన్
    పెద్ద మనస్సుతో గడు వివేకముతోడ స
    మున్నతాత్మయౌ
    అద్దమునందు గాంచినపుడన్యుడు గన్పడు
    నెల్లవేళలన్.

    రిప్లయితొలగించండి

  8. పైకి సుమతి వోలె పలునీతులను బల్కు
    నాదు నటన గాంచి నమ్ముచుంద్రు
    వెఱ్ఱి జనులు వీరు, వీక్షింప మనసనే
    అద్దమందుఁ గాంతు నన్యు నొకని.



    ఖద్దరు వస్త్రధారియని గాంధి పథమ్మును విశ్వసించుచున్
    సుద్దులు చెప్పువాడనుచు సూరులె నమ్మిన నాయకుండు దు
    ర్బుద్ధిని కల్గినట్టి యొక మూఢుడు వాడట మానసమ్మనే
    అద్దమునందుఁ గాంచినపు డన్యుఁడు గన్పడు నెల్లవేళలన్.

    రిప్లయితొలగించండి
  9. మయసభాభవనము నయన మనోజ్ఞము
    యెంతసుందరమ్ము నెంత హొయలు
    చిత్ర రీతులలరు చిత్రాతి చిత్రమ్ము
    అద్దమందుఁ గాంతు నన్యు నొకని

    రిప్లయితొలగించండి
  10. బుద్ధియుతుండ నేననుచు మోసమెరుంగని వాడనంచు బల్
    పెద్దను జేసి మెచ్చుకొని పేరిమిఁ జూతురు లోకులెల్లరున్
    వద్దని నేఁదలంచినను బాయక నాత్మ విలోకనంబగున్
    అద్దమునందుఁ గాంచినపు డన్యుఁడు గన్పడు నెల్లవేళలన్

    రిప్లయితొలగించండి
  11. బుద్ధియుతుఁడనంచు పుణ్యమూర్తి నటంచు
    పురజనమ్ము నన్నుఁ బొగుడుచుండ
    నాత్మ ఘోషచేసి యారడి వెట్టఁగ
    నద్దమందుఁ గాంతు నన్యు నొకని

    రిప్లయితొలగించండి

  12. ఆ.వె
    తెల్లజుట్టు జూచి తెలిసిన వారలు
    వయసు ముదిరెననుచు వాగుచుండ
    తెచ్చి నలుపురంగు దీరుగ బులిమితి.
    అద్దమందుఁ గాంతు నన్యు నొకని”

    ద్వారకానాథ్

    రిప్లయితొలగించండి
  13. ఆటవెలది
    సంకటమ్మిడ నరిషడ్వర్గము మదిని
    గెల్వలేక సతము గృంగిపోదు
    నడ్డు కొనక బుద్ధి యంతరంగమనెడు
    నద్దమందుఁ గాంతు నన్యు నొకని

    ఉత్పలమాల
    సద్దొన రించిమించి యరిషట్కము సంకటమొందఁ జేయ నే
    నద్దరి గెల్వలేక కడుయాతనఁ జెందుచుఁ గృంగి యొక్కచో
    బుద్ధిని మీరి మానసము ముందుకుఁ ద్రోయఁగ నాకు నేను లో
    నద్దమునందుఁ గాంచినపు డన్యుఁడు గన్పడు నెల్లవేళలన్

    రిప్లయితొలగించండి
  14. వద్దు వద్దని కడు వారించినను విన
    కుండ నాదు సుద్దు లుత్సహించి
    యద్ద నల్ల రంగు నానన మందు నే
    నద్ద మందుఁ గాంతు నన్యు నొకని

    అద్దము నందుఁ గాన నగు నాత్మ ముఖమ్ము యథాతథమ్ముగం
    బెద్దలు పిల్ల లెల్లరు నభేదము నిత్యము చూతు రద్దముం
    దద్ద నిజం బశక్య మిది తప్పన నేరికి వాహనమ్మునం
    దద్దము నందుఁ గాంచి నపు డన్యుఁడు గన్పడు నెల్ల వేళలన్

    రిప్లయితొలగించండి
  15. ఆ॥ ఊర్వసి తనకొసఁగె నొక్క శాపమదియె
    వరమగు నిపుడనుచుఁ బార్థుఁడు తన
    రూపు మార్చి వేరు రూపమునఁ బలికె
    నద్దమందుఁ గాంతు నన్యు నొకని

    ముద్దుగ నద్దమందు తన మోమును జూడఁగ నందగాఁడనిన్
    సుద్దులఁ జెప్పి నిత్యమును సోమరియై తిరుగాఁడు మూర్ఖుకున్
    మొద్దుకు బుద్ధి నేర్పఁగను బూర్తిగ కోణముఁ ద్రిప్పి మార్చుమా
    యద్దమునందుఁ గాంచినపు డన్యుఁడు గన్పడు నెల్లవేళలన్

    రిప్లయితొలగించండి
  16. డా బల్లూరి ఉమాదేవి

    చూ చు చుం డ మే ని సొ బ గ ది హె చ్చం గ
    న ద్ద మం దు గాం తు న న్యు నొ క ని
    మ గ ని గ న ని త ల చి మ ది ని మ గు వ యో ర్తు
    ము రి సి పో వు చుం డె భూ రి గా ను


    రిప్లయితొలగించండి
  17. ఉ.

    అద్దపు పొంగు పల్లవము హాస్యము గొల్పును వక్ర బింబముల్
    ముద్దుగ జూడ వింతయిన మోమును దర్పణ మాయగా నగున్
    సద్దును జేయుచున్ భ్రమను సహ్యము గాని విచారణీయమౌ
    *అద్దమునందుఁ గాంచినపు డన్యుఁడు గన్పడు నెల్లవేళలన్.*

    రిప్లయితొలగించండి
  18. ఎద్దుల గూర్చి నాగలికి నింపగు పెన్మిటి పోయె చేనుకున్
    అద్దమరాత్రి వాడు నిలయమ్మున చేసిన చెయ్దు లెంచగా
    హద్దులులేని మోదమది యాకస మంటెను వాడి చింతలో
    నద్దమునందుఁ గాంచినపు డన్యుఁడు గన్పడు నెల్లవేళలన్

    రిప్లయితొలగించండి