11, జులై 2023, మంగళవారం

దత్తపది - 198

12-7-2023 (బుధవారం)
కవిమిత్రులారా,
"నది - ఏరు - వాగు - కాలువ"
పై పదాలను అన్యార్థంలో ప్రయోగిస్తూ
భారతార్థంలో స్వేచ్ఛాఛందంలో
పద్యం వ్రాయండి

18 కామెంట్‌లు:

  1. రిప్లయిలు
    1. కందం
      నేనది యూర్వశినైనన్
      గానగ నన్నేరు కొనవె కవ్వడి! కలువన్
      రానందువా! గుఱిపడనె?
      మౌనులె తమకాలు వదల మగువలఁ గొనరే?

      తొలగించండి
  2. తానదిధర్మజుడోర్చెను
    ఆనగవేరునుగనరుగనయ్యెడసభలో
    పూనెనుబావా గుంపు
    కానగయాకాలువలనకదలవునీవున్
    దుర్యోధనునకుహితవుజెప్పినవికర్ణుడు

    రిప్లయితొలగించండి
  3. ఉ.

    ఏ రుణమో? యెరుంగనది యేలికగా రవి యిచ్చె పుత్రునిన్
    తీరెడివా? గురూత్తముని తీక్షణ కోపము వెండి శాపముల్
    పోరు సుకాలు వచ్చినవి పొత్తును వీడెను కర్ణుడెప్పుడున్
    వారణ కృష్ణ, కుంతి, యిన వాక్కులు వ్యర్థము గ్రుడ్డి మైత్రిచే.

    రిప్లయితొలగించండి
  4. ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.

    రిప్లయితొలగించండి
  5. *(వస్త్రాపహరణ సమయంలో ద్రౌపతి మనోవేదన)*

    బ్రోవవానను మాధవా గుణపుల్కసుండ్రిట రేగగన్
    చేవగల్గిన భర్తలేవు రచేతనమ్ముగ మారిరే
    కావరమ్మది యేరుసెప్పిరొ కాంత వల్వల నూడ్చగన్
    నావశమ్మిక కాదు కాలువనమ్మె నాకిక దిక్కురా!

    రిప్లయితొలగించండి
  6. కృష్ణుడు పార్థునితో

    తే॥గీ॥

    నేను చెప్పు’నది’ వినుము , నీస్వజనులు
    ‘ఏ రు’ జువును వీక్షించుచు
    నివ్విధముగ
    రాజ్య మున పంప ‘కాలు వ’ లదని రిపుడు ?
    కనుక బా’వా ! గు’ రి నెరిగి కలను సలుపు

    రిప్లయితొలగించండి
  7. వచ్చినది కృష్ణుడే రాయబారమునకు
    ఏరుపాటుకు యత్నించ పోరు తొలగు
    వాగురువు బిగియ గలదు జాగుసేయ
    పంపకాలు వక్రించుట పాడి కాదు

    రిప్లయితొలగించండి
  8. రాయబార సమయమున విసిగిన కృష్ణడు ధృతరాష్ట్రునితో

    తే॥ పాండవులడిగినది యిచ్చి పరిణతిఁ గను
    వినుము నాపల్కులేరును బెంచు యుద్ధ
    మేలఁ బుత్రుల వాగుడు నేల మాన్ప
    వయ్య కాలు వడిగ వేయు మయ్య యధిప

    మరొక పూరణ
    ఉత్తర గోగ్రహణ సమయమున సమరార్థియై వచ్చు అర్జుని జూచి భీష్ముడు కర్ణునితో

    తే॥ వచ్చునది ఫల్గుణుఁడు కర్ణ వాని తోడ
    యుద్ధమేరు బెంచు మనకు బుద్ధిఁ గనుమ
    వాగుడు వలదు నేర్పుగ వాని గెలుచు
    విధము నరసి కాలు వడిగ వేయఁ దగును

    ఏరు తలనొప్పి (నిఘంటువు సహాయమండి)

    రిప్లయితొలగించండి
  9. సంధి పొసగిననది మేలు సారసాక్ష!
    యేరు సమరము మాన్పుదు రెట్టులైన?
    పోరు వాగురి శాంతికి, పొందు సుఖము
    వలదు బింకాలు వలదింక వాసుదేవ!

    వాగురి=ఉరి)

    రిప్లయితొలగించండి
  10. శ ల్యుడు కర్ణుని తో ---
    ఔ నది కవ్వడి రథమే
    నే నడుపు దు నీ రథంబు. నేరును గన కన్
    మానుము వాగుట కర్ణా!
    కానగ లేన య్య నీదు కాలు వణ కు ట న్

    రిప్లయితొలగించండి
  11. ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.

    రిప్లయితొలగించండి
  12. కనుగొని గాండీవమ్మును
    తనకిక నదియే రుజువని తరుణుం డపుడా
    తని నీవాగు, ఘనుడునీ
    వని నాయర్జునుని కాలు వదలక బట్టెన్.
    (విరాట రాకుమారుడు)

    రిప్లయితొలగించండి
  13. మూడినది కీచకా నీకు పుడమి పైన
    వాగుచుండుట పిచ్చిగా పాడి యౌనె
    యేరు కాపాడలేరిక యిపుడు నిన్ను
    కాలువశమునకంపెద క్షణములోనె

    రిప్లయితొలగించండి
  14. తే: దివ్యమై *న ది* నమ్మున భవ్యమంచు
    *నేరు* తగుదు రగ్రాసనమెక్కననుచు
    పద్మనాభుని నెన్నగ *వాగు* చు నుండ
    దృతి తొలగ నడ్డ *కాలు వ* ధించె చైద్య
    చక్ర దారి రయమ్మున జంక రిపులు

    రిప్లయితొలగించండి