17, జులై 2023, సోమవారం

సమస్య - 4479

18-7-2023 (మంగళవారం)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“దారము లేనట్టి దండ దగు సుందరమై”
(లేదా...)
“దారము లేని దండ వనితా కనువిందొనఁగూర్చెఁ జూడుమా”

23 కామెంట్‌లు:

  1. తారల బోలిన మల్లెల
    హారము చేమం తిదవన మమరిన నదియే
    తీరుగ నుండగ లదు మం
    దారము లేనట్టి దండదగు సుందరమై.

    రిప్లయితొలగించండి
  2. నేరుగ కాడల ముడిగొన,
    దారము లేనట్టి దండ దగు సుందరమై
    పేరొందె పురము నందున
    ఆరయవలె నా మనీష ననుమో దమునన్

    రిప్లయితొలగించండి
  3. కోరిన విరులను దెచ్చి యు
    వారిజ నేత్రి యొ కర్తు క భవుని కొఱకు నై
    నేరుపు తో గూర్చ గ మం
    దారము లేనట్టి దండ దగు సుందర మై

    రిప్లయితొలగించండి
  4. ఆరయసంధినిదెలియక
    మారములేమియుగనకను మసలినచోటన్
    కూరిమికొలువైయుండును
    దారములేనట్టిదండదగు సుందరమై

    రిప్లయితొలగించండి
  5. హారముకట్టగనెంచుచు
    నారను తెచ్చిరి తరుణులు నయమొప్పంగన్
    తీరుగ కట్టగ తెల్లని
    *“దారము లేనట్టి దండ దగు సుందరమై”*

    రిప్లయితొలగించండి

  6. వారిజ నేత్రీ కనవే
    పారిజములు మల్లియలును వకుళమ్ములతో
    తారుచు నల్లినదిది మం
    దారము లేనట్టి దండ దగు సుందరమై.



    హారము లెన్నియున్న సుమహారము కొప్పున లేక పోయినన్
    వారిజ నేత్రులొప్పరిది వాస్తవ మంచు నెఱంగి తెచ్చితిన్
    పారిజముల్ సవంతి వరవాదల గూర్చిన నిట్టి మాల మం
    దారము లేని దండ వనితా కనువిందొనఁగూర్చెఁ జూడుమా.

    రిప్లయితొలగించండి
  7. హారముఁగట్ట దారమున నన్ని సుమంబులు గూర్చగా దగున్
    వారిజనేత్రి నీపయినవావిరియై దనరారు యల్మినిన్
    జూరగొనంగ నీ మనసు సొచ్చముగా మణిహారమిచ్చితిన్
    దారము లేని దండ వనితాకనువిందొనఁగూర్చెఁ జూడుమా

    రిప్లయితొలగించండి
  8. క్రొవ్విడి వెంకట రాజారావు:

    తీరగు పూలను దెచ్చియు
    సౌరగు విధమున తొడిమలు సర్ది ముడుచుచున్
    నేరిమితో నల్లినదౌ
    దారము లేనట్టి దండ దగు సుందరమై.

    రిప్లయితొలగించండి
  9. హారమునకు నాధారము
    దారము పూలన్నిగూర్చి తగ సమకూర్చన్
    కూరిమి మణిహారమలరె
    దారము లేనట్టి దండ దగు సుందరమై

    రిప్లయితొలగించండి
  10. క్రొవ్విడి వెంకట రాజారావు:

    తీరుగ తోటనుండిగొని దెచ్చిన పూలను సుందరమ్ముగా
    నేరిమితోడ కాడలను నెమ్మదియౌవిధి సంతరించుచు
    న్నారజమైన చందమున యందము చిందెడి రీతినల్లినా
    దారములేనిదండ వనితా! కనువిందొనగూర్చెజూడుమీ!

    రిప్లయితొలగించండి
  11. హారము నీకీయదలచి
    నేరుగ నంగడిని చేరి నేకోరగ సొ
    న్నారిని చేసెనుగద చే
    దారము లేనట్టి దండ దగు సుందరమై

    చేదారము = తఱుగు

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. కోరికతోడనీమెడను కోమల హారము వేయనెంచితిన్
      నేరుగ చేరి యంగడిని నేను కళాదుని కోరినంతటన్
      దీరగు సంప్రసాధనము తేకువతో వెలయించి యిచ్చె చే
      దారము లేని దండ వనితా కనువిందొనఁగూర్చెఁ జూడుమా

      తొలగించండి
  12. మరొక పూరణ:

    కోరిక మీరఁ దెచ్చితిని కోమలి రవ్వలహార మొక్కటిన్
    తీరుగదాల్చ నిన్ను తమి దీరని యర్మిలిఁ కౌగిలించ నా
    హారము నీగళమ్ముపయి హత్తుకు కన్పడె వింతగొల్పుచున్
    దారము లేని దండ వనితా కనువిందొనఁగూర్చెఁ జూడుమా

    రిప్లయితొలగించండి
  13. దారము తోడ పూవులను దండగ గూర్చుచు విక్రయ మ్ము సా
    ధారణ మెచ్చటైన మరి దారము లేకయె వీరలిచ్చటన్
    వూరక పొన్నపూవులను పూవుకు పూవును గూర్చి జే సిరే
    దారము లేని దండ వనితా కనువిందొనగూర్చె జూడుమా.

    రిప్లయితొలగించండి
  14. ఆరని దీపము వెలిగెన
    నీ రుద్రుని పూజకు మరి నీలపు విరులన్
    నేరుపుగ తొడిమెలల్లగ
    దారము లేనట్టి దండ దగు సుందరమై

    రిప్లయితొలగించండి
  15. గారుఢ హారముల్ మిగుల కంఠపు
    శోభను బెంచు కాని యీ
    హారము నీదు కొప్పుకు కడందము
    గూర్చునటంచుదెచ్చితిన్
    కోరికతోడ ప్రేమమెయి కోమలి
    సౌరభ మల్లెమాల మం
    దారములేని దండ వనితా కను
    విందొనరించె జూడుమా

    రిప్లయితొలగించండి
  16. కం॥ కోరిన రీతిని పువ్వుల
    నేరుగ గ్రుచ్చుచుఁ గలుపఁగ నేర్పుగఁ దరుణుల్
    బారుగ, సిద్ధం బాయెను
    దారము లేనట్టి దండ దగు సుందరమై

    ఉ॥ వేరుగ మాలఁ గూర్చఁగను విచ్చిన పూలను సేకరించుచున్
    నేరుగ గ్రుచ్చి కాడలను నేర్పుగ కల్పుచుఁ బూలనన్నిటిన్
    బారుగఁ దీర్చిదిద్దగను భవ్యముగా నొక మాల యాయెనే
    దారము లేని దండ వనితా కనువిందొనఁ గూర్చెఁ జూడుమా

    రిప్లయితొలగించండి
  17. (పెద్దనామాత్యుని ఉత్పలమాలికకు రాయల వారు గండపెండేరం తొడిగిన నేపథ్యంలో)
    సారసగర్భు రాణి వర సత్కృప సత్కవి సంస్కృతాంధ్ర స
    త్సౌరభమొప్పగా పద లతాంతములెన్నిక నేర్చి గూర్చి బృం
    దార రసప్రసారభరితంబగు పద్యములల్లె నేరిమిన్
    దారము లేని దండ వనితా కనువిందొనఁగూర్చెఁ జూడుమా

    రిప్లయితొలగించండి
  18. కందం
    నీరజ నేత్రుని చిత్రము
    దీరుచ వనమాలి వలెను దివ్యమనంగన్
    గూరుపఁ దూలిక రంగుల
    దారము లేనట్టి దండ దగు సుందరమై!

    ఉత్పలమాల
    మారుని తండ్రినెంచి వనమాలిగ చిత్రము రూపుదిద్దెడున్
    గోరిక చిత్రకారుడట గుత్తపు రంగుల దివ్యశోభలన్
    గూరుపఁ దూలికన్ గదిపి గొప్పగ నద్ద సజీవమా యనన్
    దారము లేని దండ వనితా కనువిందొనఁగూర్చెఁ జూడుమా!

    రిప్లయితొలగించండి
  19. ఉ.

    మేరు గిరీశు మెప్పు గొన మేధము జేయ తలంచి భక్తితో
    గోరుచు బుష్ప కాష్ఠములు గూర్చెను ద్రవ్యములేరుపాటులో
    శూరుడు వాడి బాణమును సుందర పద్ధతి బూల గ్రుచ్చగా
    *దారము లేని దండ వనితా కనువిందొనఁగూర్చెఁ జూడుమా!*

    రిప్లయితొలగించండి
  20. ఉ.మారవిరోధి విశ్వపతి మంగళదాయిని యన్నపూర్ణతో
    కోరనిదే వరంబులిడు కొంగుపసిండిగఁగొల్వుదీరి చె
    ల్వారగ వారణాసి,శివరాత్రిని చుక్కలపూలఁదచ్ఛిఖన్
    దారములేనిదండ వనితా!కనువిందొనగూర్చెఁజూడుమా!
    (ఒక భక్తుడు వారణాసిలో శివరాత్రివేళ గంగాతటమున విశ్రమించి తన భార్యతోనిట్లనినాడు.)
    ....చంద్రమౌళి రామారావు,బాపట్ల.

    రిప్లయితొలగించండి