3, జులై 2023, సోమవారం

సమస్య - 4466

4-7-2023 (మంగళవారం)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“తన్నిరి ప్రాశ్నికులు శతవధానినిఁ గంటే”
(లేదా...)
“తన్నిరి ప్రాశ్నికుల్ శతవధానిని వేదిక మీఁదఁ జూచితే”

20 కామెంట్‌లు:

  1. ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.

    రిప్లయితొలగించండి
  2. ఎన్నెన్ని ప్రశ్నలు వేసిన
    నన్నిం టికినియ వధాని నవ్వుచు బూతుల్
    మిన్నగ జేర్చిప లుకవిని
    తన్నిరి ప్రాశ్నికులు శతవధానినిఁ గంటే

    రిప్లయితొలగించండి
  3. ఎన్నగకుడియెడమలనా
    మన్నీడులవోలెనిలచిమాయలజేసిన్
    పన్నిరిపాండితివలయము
    తన్నిరిప్రాశ్నికులుశతవథానినిగంటే

    రిప్లయితొలగించండి
  4. కందము
    అన్నన్న!వర్ణనాంశము
    లెన్నొ నిషిద్ధాక్షరంబులెన్నొ సమస్యల్
    మిన్నగు దత్తపదంబుల
    తన్నిరి ప్రాశ్నికులు శతవధానినిఁగంటే.

    రిప్లయితొలగించండి
  5. మున్నటచేరుచునందరు
    తిన్నగ నేమియు నడుగకతికమకలిడుచున్
    ఎన్నెన్నో ప్రశ్నలతో
    *“తన్నిరి ప్రాశ్నికులు శతవధానినిఁ గంటే”*

    రిప్లయితొలగించండి
  6. మున్నెరిగించిన విధమున
    జెన్నుగ ప్రశ్నలు సలుపగ జెప్పిన వేళన్
    మిన్నగ కోపము జెందన్
    దన్నిరి ప్రాశ్నికులు శతవధానినిఁ గంటే

    రిప్లయితొలగించండి
  7. కందం
    ఉన్నత భావకవిత్వము
    తిన్నగ పృచ్ఛకులుమెచ్చఁ దీర్చఁ బ్రతిభయే
    మన్ననఁ గొన, వైరులనిరి
    "తన్నిరి ప్రాశ్నికులు శతవధానినిఁ గంటే! "

    ఉత్పలమాల
    ఉన్నత మైన భావముల నొప్పు కవిత్వ సుధారసమ్మునే
    మిన్నగ పద్యసూనముల మేలుగఁ బంచఁగ మెచ్చపృచ్ఛకుల్
    మన్నన నోర్వలేక పలుమారులు వైరుల వ్యంగ్యభాషణన్
    దన్నిరి ప్రాశ్నికుల్ శతవధానిని వేదిక మీఁదఁ జూచితే


    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. ఉ.

      మిన్నగ పద్య పూరణము మేలని మెచ్చ పరోక్ష యానమున్
      వన్నియ నొందు కారణము పల్కులు మిత్రులు నందజేసెడిన్
      మన్నన ధారణా విధిని మాత్రమయోగ్యముగా దలంచగా
      *తన్నిరి ప్రాశ్నికుల్ శతవధానిని వేదిక మీఁదఁ జూచితే.*

      తొలగించండి
  8. మిన్నగ సాగె వధానము
    మున్నెన్నడు గాంచలేదు మూర్ఖుండ్రైనన్
    మన్నింతురనుచు నట సా
    తన్నిరి ప్రాశ్నికులు, శతవధానినిఁ గంటే.


    ఎన్నడు గాంచలేదనుచు నింతటి పాటవమున్న పండితుల్
    చెన్నుగ నొక్కవేదికను చేరుట యద్భుతమంచు మెచ్చుచున్
    దన్నుగ నుందుమంచు విబుధానుల ధారణ గాంచినట్టి సా
    తన్నిరి ప్రాశ్నికుల్ , శతవధానిని వేదిక మీఁదఁ జూచితే.

    సాతన్నిరి (సాతు+అన్నిరి)
    సాతు= వర్తకజన సమూహము
    అన్ను = మైమరచు

    రిప్లయితొలగించండి

  9. కన్నదిలేదు పూర్వమిట కైతలలో గన నింత పాటవ
    మ్మెన్నడు గాంచలేదుగద, యింపుగ పద్యము లల్లి భూరిగా
    మన్నన పొందినట్టి కడు మాన్యులనే యిట ప్రజ్ఞతో దలన్
    తన్నిరి ప్రాశ్నికుల్ శతవధానిని వేదిక మీఁదఁ జూచితే.


    మిన్నయటంచు జనాళియె
    మన్నన జేసిన వధాని మాన్యుని కన్నన్
    చెన్ను నడిగి వారి తలన్
    తన్నిరి ప్రాశ్నికులు శతవధానినిఁ గంటే.

    రిప్లయితొలగించండి
  10. చెన్నగు సమస్య లొసగుచు
    మన్నన లొందు చు సభికుల మానితు లగుచున్
    మిన్నగ రాణించి యు దల
    ద న్ని రి ప్రా శ్ని కు లు శత వ ధానిని గం టీ!

    రిప్లయితొలగించండి
  11. ఎన్నిక చేసిన పలుకులు
    తన్నిక శ్రమపెట్టవనెడి దర్పము తోడన్
    మిన్నగ వధాని తెలుపగ
    తన్నిరి ప్రాశ్నికులు శతవధానినిఁ గంటే

    పన్నుగనెన్ని ప్రశ్నలను పండితుడైన వధాని కేయగా
    తన్నిక శ్రమపెట్టవని దర్పముతోడ వధాని సిద్ధమై
    మిన్నగ నుత్తరంబిడగ మెచ్చిరి ప్రేక్షకు లెల్ల వాసిగా
    తన్నిరి ప్రాశ్నికుల్ శతవధానిని వేదిక మీఁదఁ జూచితే

    రిప్లయితొలగించండి
  12. మిన్నగ వధానమందున
    నెన్నియొ తెరఁగుల సమస్యలిచ్చుచు సభలో
    పన్నుగ ప్రశ్నపరంపర
    తన్నిరి ప్రాశ్నికులు శతవధానినిఁ గంటే

    రిప్లయితొలగించండి
  13. ఎన్నివధానముల్ నెరపె నెందరి మన్ననలొందెనో గదా
    మిన్నగ నిల్చినాడు మన మేటి వధాన షడాననుండు నే
    డన్నవరంబునన్ జరుగునట్టి వధానమునందునన్ తలన్
    దన్నిరి ప్రాశ్నికుల్ శతవధానిని వేదిక మీఁదఁ జూచితే

    రిప్లయితొలగించండి
  14. కం॥ తిన్నఁగను సమస్యలడుగ
    మిన్నగఁ బూరణలఁ జేసి మేటిగ నుడువన్
    భిన్నమగు దత్త పదులను
    దన్నిరి ప్రాశ్నికులు శతవధానినిఁ గంటే

    ఉ॥ మన్ననతో సమస్యలను మాన్యుని కిచ్చినఁ బద్య పూరణల్
    మిన్నగఁ జేసి మెప్పుదల మేటిగ పొందగఁ గ్లిష్టమౌ నటుల్
    భిన్నముఁ జేసి ప్రశ్నలను వేయుచు సూటిగ వాడిగన్ దలన్
    దన్నిరి ప్రాశ్నకుల్ శతవధానిని వేదిక మీఁదఁ జూచితే!

    రిప్లయితొలగించండి
  15. సన్నగసాదీసినిడెసంకటమైనసమస్యనంతటన్
    తన్నుకుచావనిచ్చెగదదత్తపదంబులుసొంపుమీరగా
    వన్నెనిషిద్ధమక్షరమువాయగమేథయునాటయాడెనే
    తన్నిరిప్రాశ్నికుల్శతవథానినివేదికమీదఁజూచితే

    రిప్లయితొలగించండి
  16. వన్నెలు చూప నెంచుచు సభాస్థలి చేర వదాన్యు లెందరో
    కన్నులపండువాయె నట కాంచ వధానము పండితాళికిన్
    చెన్నగు పద్యపాదముల శీఘ్రముగా పచరించి మించుచున్
    దన్నిరి ప్రాశ్నికుల్ శతవధానిని వేదిక మీఁదఁ జూచితే

    రిప్లయితొలగించండి
  17. మన్ననతో వధానులసమాను
    లటంచను బల్కుప్రాశ్నికుల్
    తన్నిరి ప్రాశ్నకుల్ శత వధానిని
    వేదికమీద జూచితే
    ఎన్నడు లేని వేషమతడేసి
    నటించగ బోయెగాని వేం
    కన్నకు చేయరాకను నికారము
    బొందె సభాస్థలంబునన్

    రిప్లయితొలగించండి

  18. పిన్నక నాగేశ్వరరావు.
    హనుమకొండ.

    మన్నన చేయక పృచ్ఛకు
    లన్నియు క్లిష్టముగనుండు ప్రశ్నల నిడుచున్
    ఎన్నొ సమస్యల తోడను
    దన్నిరి ప్రాశ్నికులు శతవధానినిఁ గంటే!

    రిప్లయితొలగించండి