11-7-2023 (మంగళవారం)కవిమిత్రులారా,ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...“కలహము శుభముల నొసఁగు నగణ్యముగ భువిన్”(లేదా...)“కలహముచే శుభంబుల నగణ్యముగాఁ గనవచ్చు ధాత్రిపై”
కలలు గనెడి జంటలలోకలుగును తఱచుగ మురిపెపు కలహము నదియేవలపును బెంచును సతమాకలహముశుభముల నొసగు నగణ్యముగన్.
చంపకమాలనళినదళాక్షుడున్ సతులు నారదుడెంచిన వ్యూహమందునన్గిలగిలలాడ నంతమున క్షేమము గూర్చియు నీతి దెల్పెడున్విలువల నాటకీయతను వేడుకఁ గొల్పెడు మౌని కల్పనన్గలహముచే శుభంబుల నగణ్యముగాఁ గనవచ్చు ధాత్రిపై
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
కందంనళినాక్షునకు సతులకున్కలహము గుదిరించి లోక కల్యాణమునన్వెలయించు నీతి! నారదకలహము శుభముల నొసఁగు నగణ్యముగ భువిన్
నెలతగపుష్పముకొఱకైకులసతిసత్యయునొకింతకుందెనుమదిలోవలపునపోరాడెనుగాకలహముశుభములనొసంగునగణ్యముగభువిన్
కలరెందరొ సజ్జనులిలపలుమారులు ధర్మవిషయ పరిశీలనలోకలహింతు రట్టి సజ్జన కలహముశుభముల నొసగు నగణ్యముగన్.
వలపులు గలిగిన వారైతలపుల లో వైర మేమి దా చక ప్రేమన్చెలువపు మాటల తోడన్గలహము శుభముల నొసగు న గణ్యము గ భువిన్
విలువలుదప్పుచోటనునివేదనఁజేయకడుంగడులక్ష్యపెట్టకన్పలుకకభేదభావమునపండితుమానముమంటగల్పుచోవెలయగసత్యధర్మములువిజ్ఞులుపోరునుసల్పవచ్చుగాకలహముచేశుభంబులనగణ్యముగాగనవచ్చుధాత్రిలో
లలనలు సుకుమారులు వా రలె సద్గుణ శీలురంద్రు రాఘవ సుతయౌకలిమిచెలిమి తుల్యులు నక్కల, హము శుభముల నొసఁగు నగణ్యముగ భువిన్. విలసిత సద్గుణాంబుధులు విజ్ఞులు నోర్మిని ధాత్రి తుల్యులున్ వలపుల రాణులై సతము వల్లభు క్షేమము గోరువారలౌలలనల గౌరవింపవలె రాఘవపుత్రి సదృక్షమైన యక్కల, హముచే శుభంబుల నగణ్యముగాఁ గనవచ్చు ధాత్రిపై. అక్క= పడతిహము= ఉల్లాసము
చం.కొలుతురు రాక్షసుల్ సురలు కోర్కెల గోరుచు బ్రహ్మదేవునిన్బలుపును జూప యుద్ధమున భాగ్యము వీడక మందెమేలమై*కలహముచే, శుభంబుల నగణ్యముగాఁ గనవచ్చు ధాత్రిపై*నెలకొను శాంతి భద్రతలు నేర్పరి రక్షక విష్ణుమూర్తియే.
నెలతుక దన కాంతునితోపలువురు శిశుకములు మనకు వలదనుట గనన్కలవర పడకుమది ప్రణయకలహము , శుభముల నొసఁగు నగణ్యముగ భువిన్
కలహము దుఃఖము నొసగునువలపే పెంపొందజేయు పరితోషమునేనెలకొను మానసమందునకల హము శుభముల నొసఁగు నగణ్యముగ భువిన్కలహములే మనుష్యులను కష్ట కుచేలము నందుముంచుగాలలితమనోహరంబయిన లాలన పెంచును సంతసమ్మునేచెలిమియె కల్గజేయు చవి చింతలు తీర్చెడిమానసమ్ములోకల హముచే శుభంబుల నగణ్యముగాఁ గనవచ్చు ధాత్రిపైహము = సంతోషము
నిలబెట్ట దలచి ధర్మమువిలువలు కాపాడుటందు వీరత్వమునన్ఖలులున్ మలినాత్ములతోకలహము శుభముల నొసఁగు నగణ్యముగ భువిన్
కలహాశనుడను పేరునకలితుండౌ సురమునివరు కర్జము లెల్లన్కలహము లెనయించు తుదకుకలహము శుభముల నొసఁగు నగణ్యముగ భువిన్
అలుసుగ దేవమౌనిఁ గలహాశనుడందురు లోకులిద్ధరన్కలహమె భుక్తిగా సతము కర్జములన్ నెరపించి యంత్యమందలరగ జేయునెల్లరను, హ్లాదమునొందగ జేయునట్టిదౌకలహముచే శుభంబుల నగణ్యముగాఁ గనవచ్చు ధాత్రిపై
కం॥ కలహము హద్దులు దాఁటఁగవిలయము తథ్యము విహితము వివరింపంగానలుకలు ప్రణయముఁ బెంచఁగఁ గలహము శుభముల నొసఁగు నగణ్యముగ భువిన్చం॥ అలిగిన సత్యభామ నమితాలనఁ గృష్ణుఁడు చేసెఁ బ్రేమతోనలుకను దీర్చి మోదముగ నక్కునఁ జేర్చెను సౌఖ్యమందఁగన్గలహము ప్రేమఁ బెంచఁగను గమ్మని సౌఖ్య మొసంగు నట్టిదౌకలహముచే శుభంబుల నగణ్యముగాఁ గనవచ్చు ధాత్రిపై
కలుగు నశాంతి, నెక్కొనును కాపురమందున చిక్కులెన్నియో,వెలయు గుటుంబమందునను బెక్కు సమస్యలు నెల్లవేళలన్కలహముచే, శుభంబుల నగణ్యముగా గనవచ్చు ధాత్రిపైవిలసిత మానసంబుననుబ్రేమగ మెల్గు కుటుంబమందునన్
ఇలలోసతిపతులనడుమపలుమారులుసాగుచుండు ప్రణయకలహముల్కిలకిల నగవులతోనా*కలహము శుభముల నొసగునగణ్యముగభువిన్పలుకుల తల్లి శారద కృపన్మన పైకనపర్చి నంతనేజలజల పూలు రాలినటు చక్కని ధారగ పుట్టు మాటలన్పలువురుచేరినంతయటపద్యములుద్భవమొందపాండితీకలహముచేశుభంభులనగణ్యముగా గనవచ్చు ధాత్రిపై
కలహమె దైత్య సోదరుల గర్వమడంచెనొసంగె మోక్షమున్ కలహమె ముక్తి హేతువల గాంచగ రావణ కుంభకర్ణులన్ కలహమె జేర్చె విష్ణుపదకంజము చైద్యుని దంతవక్త్రునిన్కలహముచే శుభంబుల నగణ్యముగాఁ గనవచ్చు ధాత్రిపై
కలహములముని నొనర్చెడు కలహము శుభముల నొసఁగు నగణ్యముగ భువిన్ విలవిల లాడెడు జనములు కలకల మని నవ్వు చుండ్రు కన్నులు వెలుగన్
పిన్నక నాగేశ్వరరావు.హనుమకొండ. కలిగించును నష్టములను కలహము; శుభముల నొసగు నగణ్యముగ భువిన్నలుగురితో కలసి మెలసికలకాలము జీవనమ్ము గడుపుచునుండన్.
కలలు గనెడి జంటలలో
రిప్లయితొలగించండికలుగును తఱచుగ మురిపెపు కలహము నదియే
వలపును బెంచును సతమా
కలహముశుభముల నొసగు నగణ్యముగన్.
చంపకమాల
రిప్లయితొలగించండినళినదళాక్షుడున్ సతులు నారదుడెంచిన వ్యూహమందునన్
గిలగిలలాడ నంతమున క్షేమము గూర్చియు నీతి దెల్పెడున్
విలువల నాటకీయతను వేడుకఁ గొల్పెడు మౌని కల్పనన్
గలహముచే శుభంబుల నగణ్యముగాఁ గనవచ్చు ధాత్రిపై
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
తొలగించండికందం
తొలగించండినళినాక్షునకు సతులకున్
కలహము గుదిరించి లోక కల్యాణమునన్
వెలయించు నీతి! నారద
కలహము శుభముల నొసఁగు నగణ్యముగ భువిన్
నెలతగపుష్పముకొఱకై
రిప్లయితొలగించండికులసతిసత్యయునొకింతకుందెనుమదిలో
వలపునపోరాడెనుగా
కలహముశుభములనొసంగునగణ్యముగభువిన్
కలరెందరొ సజ్జనులిల
రిప్లయితొలగించండిపలుమారులు ధర్మవిషయ పరిశీలనలో
కలహింతు రట్టి సజ్జన
కలహముశుభముల నొసగు నగణ్యముగన్.
వలపులు గలిగిన వారై
రిప్లయితొలగించండితలపుల లో వైర మేమి దా చక ప్రేమన్
చెలువపు మాటల తోడన్
గలహము శుభముల నొసగు న గణ్యము గ భువిన్
విలువలుదప్పుచోటనునివేదనఁజేయకడుంగడులక్ష్యపెట్టకన్
రిప్లయితొలగించండిపలుకకభేదభావమునపండితుమానముమంటగల్పుచో
వెలయగసత్యధర్మములువిజ్ఞులుపోరునుసల్పవచ్చుగా
కలహముచేశుభంబులనగణ్యముగాగనవచ్చుధాత్రిలో
లలనలు సుకుమారులు వా
రిప్లయితొలగించండిరలె సద్గుణ శీలురంద్రు రాఘవ సుతయౌ
కలిమిచెలిమి తుల్యులు న
క్కల, హము శుభముల నొసఁగు నగణ్యముగ భువిన్.
విలసిత సద్గుణాంబుధులు విజ్ఞులు నోర్మిని ధాత్రి తుల్యులున్
వలపుల రాణులై సతము వల్లభు క్షేమము గోరువారలౌ
లలనల గౌరవింపవలె రాఘవపుత్రి సదృక్షమైన య
క్కల, హముచే శుభంబుల నగణ్యముగాఁ గనవచ్చు ధాత్రిపై.
అక్క= పడతి
హము= ఉల్లాసము
చం.
రిప్లయితొలగించండికొలుతురు రాక్షసుల్ సురలు కోర్కెల గోరుచు బ్రహ్మదేవునిన్
బలుపును జూప యుద్ధమున భాగ్యము వీడక మందెమేలమై
*కలహముచే, శుభంబుల నగణ్యముగాఁ గనవచ్చు ధాత్రిపై*
నెలకొను శాంతి భద్రతలు నేర్పరి రక్షక విష్ణుమూర్తియే.
నెలతుక దన కాంతునితో
రిప్లయితొలగించండిపలువురు శిశుకములు మనకు వలదనుట గనన్
కలవర పడకుమది ప్రణయ
కలహము , శుభముల నొసఁగు నగణ్యముగ భువిన్
కలహము దుఃఖము నొసగును
రిప్లయితొలగించండివలపే పెంపొందజేయు పరితోషమునే
నెలకొను మానసమందున
కల హము శుభముల నొసఁగు నగణ్యముగ భువిన్
కలహములే మనుష్యులను కష్ట కుచేలము నందుముంచుగా
లలితమనోహరంబయిన లాలన పెంచును సంతసమ్మునే
చెలిమియె కల్గజేయు చవి చింతలు తీర్చెడిమానసమ్ములో
కల హముచే శుభంబుల నగణ్యముగాఁ గనవచ్చు ధాత్రిపై
హము = సంతోషము
నిలబెట్ట దలచి ధర్మము
రిప్లయితొలగించండివిలువలు కాపాడుటందు వీరత్వమునన్
ఖలులున్ మలినాత్ములతో
కలహము శుభముల నొసఁగు నగణ్యముగ భువిన్
కలహాశనుడను పేరున
రిప్లయితొలగించండికలితుండౌ సురమునివరు కర్జము లెల్లన్
కలహము లెనయించు తుదకు
కలహము శుభముల నొసఁగు నగణ్యముగ భువిన్
అలుసుగ దేవమౌనిఁ గలహాశనుడందురు లోకులిద్ధరన్
రిప్లయితొలగించండికలహమె భుక్తిగా సతము కర్జములన్ నెరపించి యంత్యమం
దలరగ జేయునెల్లరను, హ్లాదమునొందగ జేయునట్టిదౌ
కలహముచే శుభంబుల నగణ్యముగాఁ గనవచ్చు ధాత్రిపై
కం॥ కలహము హద్దులు దాఁటఁగ
రిప్లయితొలగించండివిలయము తథ్యము విహితము వివరింపంగా
నలుకలు ప్రణయముఁ బెంచఁగఁ
గలహము శుభముల నొసఁగు నగణ్యముగ భువిన్
చం॥ అలిగిన సత్యభామ నమితాలనఁ గృష్ణుఁడు చేసెఁ బ్రేమతో
నలుకను దీర్చి మోదముగ నక్కునఁ జేర్చెను సౌఖ్యమందఁగన్
గలహము ప్రేమఁ బెంచఁగను గమ్మని సౌఖ్య మొసంగు నట్టిదౌ
కలహముచే శుభంబుల నగణ్యముగాఁ గనవచ్చు ధాత్రిపై
కలుగు నశాంతి, నెక్కొనును కాపుర
రిప్లయితొలగించండిమందున చిక్కులెన్నియో,
వెలయు గుటుంబమందునను
బెక్కు సమస్యలు నెల్లవేళలన్
కలహముచే, శుభంబుల నగణ్య
ముగా గనవచ్చు ధాత్రిపై
విలసిత మానసంబుననుబ్రేమ
గ మెల్గు కుటుంబమందునన్
రిప్లయితొలగించండిఇలలోసతిపతులనడుమ
పలుమారులుసాగుచుండు ప్రణయకలహముల్
కిలకిల నగవులతోనా
*కలహము శుభముల నొసగు
నగణ్యముగభువిన్
పలుకుల తల్లి శారద కృపన్మన పైకనపర్చి నంతనే
జలజల పూలు రాలినటు చక్కని ధారగ పుట్టు మాటలన్
పలువురుచేరినంతయటపద్యములుద్భవమొందపాండితీ
కలహముచేశుభంభులనగణ్యముగా గనవచ్చు ధాత్రిపై
కలహమె దైత్య సోదరుల గర్వమడంచెనొసంగె మోక్షమున్
రిప్లయితొలగించండికలహమె ముక్తి హేతువల గాంచగ రావణ కుంభకర్ణులన్
కలహమె జేర్చె విష్ణుపదకంజము చైద్యుని దంతవక్త్రునిన్
కలహముచే శుభంబుల నగణ్యముగాఁ గనవచ్చు ధాత్రిపై
కలహములముని నొనర్చెడు
రిప్లయితొలగించండికలహము శుభముల నొసఁగు నగణ్యముగ భువిన్
విలవిల లాడెడు జనములు
కలకల మని నవ్వు చుండ్రు కన్నులు వెలుగన్
రిప్లయితొలగించండిపిన్నక నాగేశ్వరరావు.
హనుమకొండ.
కలిగించును నష్టములను
కలహము; శుభముల నొసగు నగణ్యముగ
భువిన్
నలుగురితో కలసి మెలసి
కలకాలము జీవనమ్ము గడుపుచునుండన్.