18, జులై 2023, మంగళవారం

న్యస్తాక్షరి - 82

19-7-2023 (బుధవారం)
విషయం - కుంభవృష్టి
ఛందం - ఉత్పలమాల
1వ పాదం 1వ అక్షరం 'శ్రా'; 2వ పాదం 2వ అక్షరం 'వ';
3వ పాదం 11వ అక్షరం 'ణ'; 4వ పాదం 10వ అక్షరం 'ము'
లేదా...
'శ్రా-వ-ణ-ము' ఆద్యక్షరాలుగా ఆటవెలది వ్రాయండి.

26 కామెంట్‌లు:

  1. శ్రామికులకు గలుగు శ్రావణ మాసపు
    వర్షము గురియంగ హర్షము, కరు
    ణకొలది శివుడొసగినాడు వర్షమనుచు
    ముదము తోడ జనులు ముచ్చటింప.

    రిప్లయితొలగించండి
  2. శ్రావణంబు వచ్చె సంబరమ్మును దెచ్చె
    వలసి నంత నొసగు వర్ష మని ప్ర
    ణ తు ల నిడగనె వరు ణ కృ ప ను నయ్యె డ
    మురియ రైతు వాన కురిసె మిగుల

    రిప్లయితొలగించండి
  3. శ్రావణమ్మని రమ శ్రావణ లక్ష్మిగ
    వచ్చె బావి నదుల వర్షపు నీరరు
    ణంగ మారె మట్టి నలదుకొనంగను
    ముచ్చటన్ గలిగెను మురిసెను రైతులె

    రిప్లయితొలగించండి
  4. శ్రావణశోభవచ్చెవడిసాయుధుడయ్యెగమేఘుడంతటన్
    చేవనుదెచ్చెప్రాణికినిచేతననిచ్చెగవృక్షజాతికిన్
    భావనజేయనింద్రుడునుబాణముగ్రుచ్చెనుకుంభవృష్టితో
    మోవగఁదీరెధారుణికిముంగిటచిత్తడినాట్యమాడగా

    రిప్లయితొలగించండి
  5. శ్రావనమున వాన సరిపోను వచ్చెను
    వలను గూర్చె పంట వండ ,జనగ
    ణమ్ము మురిసె రైతు నాట్యము జేసెను
    ముంచె కొన్ని చోట్లు మునిగెనిండ్లు

    రిప్లయితొలగించండి
  6. శ్రా* వణమరుదెంచ జవముగ కురియును
    *వ*ర్షమంచు తలచ వానకార
    *ణ*ముగ పంటలెల్ల నాశమై పోవగ
    *ము*నిగె వెతను రైతు ముంపు గాంచి


    రిప్లయితొలగించండి
  7. శ్రావణ మాసమొచ్చెనని శంబరమంబర మందు నర్తిలెన్
    శ్రావణ మందు చూడనగు శక్తియుతంబగు కుంభవృష్టినే
    వావిరి యైనవానలకు ప్రాణము లెన్నియొ చెల్లిపోవుగా
    పోవును పైరుపంటలని ముప్పును తల్తురు సీరవాహకుల్

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. శ్రావ్యత దొరయించు శ్రావణ మేఘాల
      వలన కురియు చుండు వాన కార
      ణమున జరుగుదారుణములెన్నొ గమనింప
      ముప్పు పొంచి యుండు మూలమూల

      తొలగించండి
  8. శ్రావణము మొదలిడె సాయంత్ర వేళన
    వర్ష మెక్కువగుచు వడిగ పడిన కార
    ణమున నచటి బ్రాహ్మణ సమాజ మందలి
    ముదిత లెల్ల దడిసి పోయి రయ్యో

    రిప్లయితొలగించండి
  9. శ్రావణ మేఘముల్ ముసిరి రాగుని శక్తి హరించి కింకతో
    నీ వసుధాతలమ్మునిక నేక సముద్రము జేయనెంచెనో
    వావిరిగాను జంబకుని బాణమటుల్ వడగండ్లు రాల్చుచున్
    పూవనముల్ గృహమ్ములును మున్గెను వాగులు పొంగినంతనే.



    శ్రావణికమిదియె పరామృత కాలంబు
    వసిగ వానకురియ పల్లె పట్ట
    ణముల జూడ నేక నభసమయ్యెననుచు
    ముచ్చిరి జనులెల్ల భూరి గాను.

    రిప్లయితొలగించండి
  10. శ్రావణమాసమన్ననికచక్కగవర్షము వచ్చునంచునే
    భావన చేయచుండగను వమ్మును చేయుచు కుంభవృష్టి గా
    బావులు నిండిపారగను ప్రాణభ యమ్మున పర్వుదీయుచున్
    బోవగ నెంచిరెల్లపురమమున్విడివేగసురక్షివీటికిన్

    రిప్లయితొలగించండి
  11. *శ్రా*వణ మేగుదెంచె నిక శంబరముల్ గగనాంగణమ్మునం
    దీ *వ*సుధాతలంబుపయి నిబ్భడిముబ్బడి వర్షణమ్ముతో
    పావన తోయమున్ జనుల ప్రా*ణ*ములన్ నిలుపంగ వచ్చెనా
    పూవుల వానలో తడిసి *ము*ద్దవుటన్ననదెంత హాయియో!

    రిప్లయితొలగించండి
  12. శ్రామికులకు పని నొసంగ కరుణతోడ
    వరుణుడొసగ కుంభ వర్షమును వ
    ణకుచును వలిగాడ్పునకు చన పొల
    మునకు సిద్ధమైరి ముదము తోడ

    రిప్లయితొలగించండి
  13. శ్రావణమ్ము వచ్చె రైతుకు దరి జూపు
    నావ యట్లు ,నేల నాని పోగ
    కుంభవృష్టి నిచ్చె గొప్పగా రణ గొణ
    ధ్వనుల మెరుపు జీవితముల నిండ


    రిప్లయితొలగించండి
  14. ఆ॥ శ్రావ్య గానము వలె భవ్యముగా వాన
    వరుణ దేవుని గృప వలన ఝణఝ
    ణ కురియంగ గణగణ మను ధ్వనిఁ బడసి
    ముచ్చటలను రైతు మునిగె నంట

    ఉ॥ శ్రావణ మాస సంబరము చక్కఁగఁ బైకెగయంగఁ జూడఁగాఁ
    జేవను బొంది చేనులును జీవము తోడను వెల్గుచుండఁగా
    భావన మీర కర్షకులుఁ బ్రాణము నిల్చునటంచు మెచ్చఁగాఁ
    బ్రోవఁగ నెల్లరన్ గురిసె ముద్దుగ వర్షముఁ గుంభవృష్టియై

    రిప్లయితొలగించండి
  15. ఉత్పలమాల
    శ్రావణమందు శ్రావ్యమగు రాలెడు శబ్దము వానజల్లులన్
    గావలెఁ గర్షకాళికది కమ్మనితిండి నొసంగ జాతికిన్
    రావలె నందురే వరద ప్రాణము దీసెడు కుంభవృష్టితోఁ?
    బ్రోవఁగ వేడుకొందుమయ! ముద్దుల కృష్ణుని వైపరీత్యమై

    ఆటవెలది
    శ్రావ్యమౌను వర్ష శబ్దము వినఁగ శ్రా
    వణము నందు నెంచి పంటకనుగు
    ణమగు రీతిఁ గురియ, దమనమెంచంగ నే
    ముదము? కుంభవృష్టి పొట్టఁగొట్టు

    రిప్లయితొలగించండి
  16. శ్రావణ మేఘ సంచయము సామజ సంఘము లేగినట్లుగన్
    పావన గంగతోడ బరువై మెలమెల్లగ సాగి భూమిపై
    జీవప్రదాతలై గురిసె జీర్ణనదమ్ముల నెల్ల నింపుచున్
    బావులుకుంటలందు జలముద్ధృతమై ప్రవహించు చుండగన్.

    రిప్లయితొలగించండి
  17. (శ్రా)వణ మేగుదెంచె గన శ్యామ ఘనాఘన సంవృతంబుగా
    గా(వ)గ గ్రీష్మ తాప పరికంపిత భూతలమెల్ల ఝల్లనన్
    వావిరి జల్లులన్ గురిసి ప్రా(ణ)దయై జని వాగు వంకలన్
    బోవగ కాటకం బెలమి (ము)బ్బడియౌనటు కర్షకాళికిన్

    రిప్లయితొలగించండి

  18. పిన్నక నాగేశ్వరరావు.
    హనుమకొండ.

    శ్రావణమ్మునందు ప్రారంభమైనట్టి
    వర్షమెచ్చి వరద వచ్చె, దారు
    ణముగ పంట లుడుగ నదులన్ని పొంగుచు
    ముదము లేదు రైతు మోమునందు.

    రిప్లయితొలగించండి
  19. (శ్రా)వణ మాసమందునను సర్వ
    జనంబులు కుంభవృష్టిచే
    తీ(వ)ర బాధలున్ వడిరి దేరు
    కొనంగను జాలరిప్పుడున్
    రావలదిట్టి వాన పలు ప్రా(ణ)ము
    లర్గెను నీటి వెల్లువన్
    పూవులతోడ గొల్చెదము (ము)జ్జగ
    మేలెడి దేవబ్రోవరా!

    రిప్లయితొలగించండి
  20. *శ్రా* వణ మాసమం దసదృశమ్ముగ వర్షము కుండపోతగా
    నీ *వ* సుగర్భపై గురియ, నేపుగఁ బెర్గిన పంట కూలగా
    భావనఁ జేసి నష్టమును ప్రా *ణ* ము తల్లడ మొంద, కర్షకుల్
    బ్రోవ మటంచు పంట పొల *మున్* గని, వేడుచు నుండ్రి నాయకున్

    రిప్లయితొలగించండి