2, జులై 2023, ఆదివారం

సమస్య - 4465

3-7-2023 (సోమవారం)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“శరతల్పముపై సురతము స్వర్గమ్మె యగున్”
(లేదా...)
“శరతల్పమ్మున మానినీ మధుర సంసర్గంబు స్వర్గంబగున్”

26 కామెంట్‌లు:

  1. ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.

    రిప్లయితొలగించండి
  2. అరయగబాధనుసౌఖ్యము
    నరుడునుకోరగనెపుడునునాకంబేగా
    తరచియుచూడగసత్యము
    శరతల్పముపైసురతముస్వర్గంబెయగున్

    రిప్లయితొలగించండి
  3. మరునకు పువ్వుల బాణము
    శరమైననునది కడుసుఖ సంవర్ధినియౌ,
    మరియా సున్నిత మగు విరి
    శరతల్పముపై సురతము స్వర్గమ్మె యగున్”

    రిప్లయితొలగించండి
  4. మరలన్జేయకమానసంబునహనీమాలన్సదావీడకన్
    విరియన్తేజముజీవునందుగనగావిష్ణుస్వరూపంబుతో
    మురియన్సాధనసంగమున్గనకయున్మౌనంబుగానుండగా
    శరతల్పమ్మునమానినీమధురసంసర్గంబుస్వర్గంబగున్

    రిప్లయితొలగించండి
  5. అరుసముగ పెండ్లి జరుగగ
    కరమున నొక రూక కూడ కానగ రాదే
    కరకుపడు నేల కంటెను
    శరతల్పముపై సురతము స్వర్గమ్మె యగున్

    రిప్లయితొలగించండి
  6. వరునకు జె ప్పె నొకండిల
    మరు ని విరి శర ముల ధాటి మరులును రే పన్
    తరుణము లభియింప గ విరి
    శర తల్ప ము పై సురతము స్వర్గ మ్మె యగున్

    రిప్లయితొలగించండి
  7. కందం
    కురువీరా! యూర్వశి నిన్
    మురిపింపఁ దపించి వచ్చె ముద్దార దొరా!
    సరసన్ గూర్చిన సుమకే
    శరతల్పముపై సురతము స్వర్గమ్మె యగున్

    మత్తేభవిక్రీడితము
    కురువీరా! నిను మెచ్చి వచ్చితినిరా! కొంగ్రొత్త రుచ్యమ్ము ల
    ప్సరనై మైమరపింప చూపెదనురా! పాలింప రావేదొరా!
    సరసాలన్ దరిచేర నూర్వశి తగన్ జాగేలరా! పుష్పకే
    శరతల్పమ్మున మానినీ మధుర సంసర్గంబు స్వర్గంబగున్!

    రిప్లయితొలగించండి
  8. కందము
    సరసతఁగోమలి పల్కెను
    మురిపంబులు కౌగిలింతముద్దులుఁజాలున్
    త్వరగా రారా!నా సుమ
    శర!తల్పముపై సురతము స్వర్గంబె యగున్.

    రిప్లయితొలగించండి
  9. హరిణాంకుని వెన్నెలదియె
    మరుని కుసుమ శరముల వలె మదిలో గ్రుచ్చన్
    పురుషునితో తామర కే
    శరతల్పముపై సురతము స్వర్గమ్మె యగున్.


    మరునిన్ మించిన సుందరాంగుడతడా మాన్యుండు ప్రాణేశుడే
    సరసన్ జేరుచు ప్రేమయూసులను తా సంధించు చున్ భూరిగా
    మరులన్ గొల్పెడు మల్లెపూలవనమున్ మంచమ్ము పై పద్మ కే
    శరతల్పమ్మున మానినీ మధుర సంసర్గంబు స్వర్గంబగున్.

    రిప్లయితొలగించండి
  10. పరమానందము గల్గు తాపసికివల్మీకంబునందైన, స్థా
    వరమేకాంతమునందుగావలయు, వైరాగ్యంబె గాపాడు నా
    మరుడే‌ భంగముజేయ బూననిక మాయంబౌ తపోదీక్ష యున్
    శరతల్పమ్మున మానినీ మధుర సంసర్గంబు స్వర్గంబగున్”

    రిప్లయితొలగించండి
  11. పరువపు వేగమెరుగవా
    పురిగొల్పుటకై నిరతము పుష్పదళములన్
    పరువగ వలదభినవ సుమ
    శర! తల్పముపై సురతము స్వర్గమ్మె యగున్

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.

      తొలగించండి
    2. పరువమ్మే పరుగెత్తుచుండ కనమా పంచాస్త్రు మాహాత్మ్యమున్
      బరుపేచాలుగదా మదీయ మదనా పన్నుండ సంప్రీతిగా
      పురుషార్థం బనుచున్ సదా పడక పై పుష్పాలఁ గోరన్ దురా
      శర! తల్పమ్మున మానినీ మధుర సంసర్గంబు స్వర్గంబగున్

      తొలగించండి
  12. వరూధినితో మాయా ప్రవరుడు

    వరమై తారస మైతి వీవ మరి నే వల్దంచు వారింప నా
    తరమే మానిని? యేకమౌదమిక మాత్సర్యంబు మానంగ నీ
    దరికింజేరితి నాదరింప దగుదున్ ధన్యుండనే, పద్మకే
    శరతల్పమ్మున మానినీ మధుర సంసర్గంబు స్వర్గంబగున్

    రిప్లయితొలగించండి
  13. విరిశరముల దొర మదనుడు
    కురిపించె నిశిత శరముల గుఱిచూసి యెదన్
    శరములె పానుపు కాగా
    శరతల్పముపై సురతము స్వర్గమ్మె యగున్

    రిప్లయితొలగించండి
  14. విరివింటిన్ కరమందు దాలిచిన పూవిల్తుండు కీలించి పూ
    శరముల్ తొయ్యలి హృత్సరోజము పయిన్ శస్తంబుగా నాటనా
    శరముల్ పూవులపాన్పువోలె నమరన్ శర్మమ్ముగా భర్తకున్
    శరతల్పమ్మున మానినీ మధుర సంసర్గంబు స్వర్గంబగున్

    రిప్లయితొలగించండి
  15. మ.

    సురలోకమ్మున సౌఖ్యమున్ సుకృతమే శోభిల్లు స్వర్వేశ్యలన్
    జిరకాలమ్మున పూజసేయు విధిచే శ్రీమంతుడై భామలన్
    మురిపమ్మున్ గురియంగ సౌహృదమునన్ మోహమ్ముతో నంబుకే
    *శరతల్పమ్మున మానినీ మధుర సంసర్గంబు స్వర్గంబగున్.*

    రిప్లయితొలగించండి
  16. కం॥ కురులారబోసి మానిని
    మరులఁ గొల్పఁగ మనమున మరుని శరములన్
    విరియఁగఁ దాపము నిజసుమ
    శరతల్పముపై సురతము స్వర్గమ్మె యగున్

    శా॥ కురులారంగను విప్పుకున్న సతి సోకుల్ గాంచఁగన్ భర్తకున్
    విరియన్ మోహము మిక్కుటమ్ముగఁ గనన్ బ్రేమార్థుఁడై చేరఁగన్
    సురతన్ గోరుచు భార్యచెంతకు నటుల్ శోభస్కరంబేను కే
    శరతల్పమ్మున మానినీ మధుర సంసర్గంబు స్వర్గంబగున్

    రిప్లయితొలగించండి

  17. తరుణమ్మైన వయస్సునన్ వఱలుచున్ తన్వంగి కన్పించగా
    మరుతాపమ్ముఁ దపస్వి వాసరము సంపర్కమ్ము కాంక్షింపగా
    వరమౌనిన్ గని మత్స్యగంధి యనె సంభావించి రాత్రిన్ పరా
    శర! తల్పమ్మున మానినీ మధుర సంసర్గంబు స్వర్గంబగున్

    రిప్లయితొలగించండి

  18. పిన్నక నాగేశ్వరరావు.
    హనుమకొండ.

    పరిణయము జరిగినంతనె
    సరగున శోభనము చేయ సంకల్పించన్ మురిసెడు దంపతులకు సుమ
    శరతల్పముపై సురతము స్వర్గమ్మె యగున్.

    రిప్లయితొలగించండి
  19. వెరవుగ నుండెను వినుటకు
    శరతల్పముపై సురతము స్వర్గమ్మె యగున్
    శరతల్పము సుఖమగునా?
    నిరవుగ నెటులుండుసామి! యియ్యది చెపుమా!

    రిప్లయితొలగించండి
  20. కరముగు బాధల చేతను
    నిరతము దు:ఖించుచున్న నీమనమందున్
    తరగని ధైర్యంబుండిన
    శరతల్పముపై సురతము
    స్వర్గమ్మె యగున్.


    రిప్లయితొలగించండి
  21. మురిపెముతోడను దంపతు
    లిరువురుయుత్సుకతతోడనింపారంగా
    సరుగునచేరగనాపూ
    *“శరతల్పముపై సురతము స్వర్గమ్మె యగున్

    రిప్లయితొలగించండి
  22. పైన నా పూరణలో పొరపాటున మత్తేభము ను శార్దూలమని వ్రాసాను. మన్నించాలి

    రిప్లయితొలగించండి