15, జులై 2023, శనివారం

సమస్య - 4477

16-7-2023 (ఆదివారం)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“రసభంగమె యగును పెక్కు రమణులు సేరన్”
(లేదా...)
“భోరునఁ గాంతలెల్లఁ జొరఁబూనినచో రసభంగమే కదా”
(రామరాజ భూషణుని పద్యపాదానికి చిన్న మార్పు)

24 కామెంట్‌లు:

  1. గుసగుసలాడుచుచెవిలో
    పసలేనివికబురులెన్నొపడతులుసెప్పన్
    కసరుదురొకచోనొకరును
    రసభంగమెయగునుపెక్కురమణులుసేరన్

    రిప్లయితొలగించండి
  2. అసలు విషయము వదలివై
    చిసుదతులు తరచుగ చర్చజేతురు మరియిం
    కసమయము గడచి పోయిస
    రసభంగమె యగును పెక్కు రమణులు సేరన్.

    రిప్లయితొలగించండి
  3. పేరునబాలకృష్ణుడటపెద్దలకందనిపెన్నిధే
    గున్
    కోరడుబాహ్యసౌఖ్యమునుకొందలమందడుకాంతసన్నిథిన్
    తోరపుబంధమున్గనుచుతొయ్యలిగోపికనాట్యమాడగా
    భోరునకాంతలెల్లజొరబూనినచోరసభంగమే
    గున్

    రిప్లయితొలగించండి
  4. సిసలగు విషయము విడిచియు
    వెస చర్చించ o గడంగి వెలదులు దమ కున్
    పస లేని యూసు లాడుచు
    రస భంగమె యగును పెక్కు రమణులు సేరన్

    రిప్లయితొలగించండి
  5. రుస రుసలాడు పడతులే
    విసవిసలాడుచు బుస బుస వేడుక జేరీ
    గుసగుస కొండెములు పలుక
    రసభంగమెయగును పెక్కు రమణులు సేరన్

    రిప్లయితొలగించండి
  6. కందం
    గుసగుసలాడగ రమ్మని
    వెసఁ బ్రేయసి గుంపు వీడి ప్రియునిన్ గలువన్
    బసిగట్టి చొరబడంగన్
    రసభంగమె యగును పెక్కు రమణులు సేరన్

    ఉత్పలమాల
    జోరుగ నాటలన్ సఖుల జుట్టుచు నాడుచు నూసులాడుచున్
    జారుకొనంగఁ బ్రేమికుని సందిటఁ జిక్కగ జాణయొక్కతే
    తీరునెఱింగి జంటనట దిగ్గున నవ్వుల పాలు సేయఁగన్
    భోరునఁ గాంతలెల్లఁ జొరఁబూనినచో రసభంగమే కదా!

    రిప్లయితొలగించండి

  7. అసహాయ భార్య బాధితు
    ల సభయట కలదను వార్త రయమున ప్రాకన్
    ఖుసిగను జరుగెడి పాళము
    రసభంగమె యగును పెక్కు రమణులు సేరన్.



    మారరు పంకజాక్షులని మంత్రియొకండు సభాంత రమ్మునన్
    వారిజ నేత్రులన్ననిల వంటలజేసెడి సాధన మ్మనిన్
    వారిని మొక్కపుచ్చుచును వాగుచు నుండెడి పాళ మందునన్
    భోరునఁ గాంతలెల్లఁ జొరఁబూనినచో రసభంగమే కదా.

    రిప్లయితొలగించండి
  8. ఉ.

    వీరుడు కామదేవునిగ వేషము వేయగ రంగవేదికన్
    జోరుగ దేహ శక్తి శుభ చోద్యము జూపుచు నాట్య శైలిలో
    దారుణ బుద్ధిచే మనసు తాపము నొందగ తొట్రుపాటుగా
    *భోరునఁ గాంతలెల్లఁ జొరఁబూనినచో రసభంగమే కదా!*

    రిప్లయితొలగించండి
  9. ముసిముసినవ్వులమాటున
    నసూయ కాననగును సరియగు సమయమునన్
    విసవిసలాడుట సహజము
    రసభంగమె యగును పెక్కు రమణులు సేరన్

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. తీరిక లేనివాడు తన తియ్యపు నెచ్చెలి పొందు కోరుచున్
      వేరొక తావునుండితన వేడుక మీరగ వచ్చియుండగా
      కోరినవాని కౌగిలికి కోమలి చేరెడు వేళ నత్తరిన్
      భోరునఁ గాంతలెల్లఁ జొరఁబూనినచో రసభంగమే కదా

      తొలగించండి
  10. పసివాడు తినుటకయి పా
    యసమును జేయుటకు పల్వు రతివలు కూడన్
    కసరుల నడుమన మాడగ
    రసభంగమె యగును పెక్కు రమణులు సేరన్

    రిప్లయితొలగించండి
  11. ముసిముసి నవ్వుల‌ మొదలిడి‌
    పసిడినగలు పట్టుచీర‌ పావడ‌ రవికల్‌
    విసుగగు‌‌ చర్చలు‌ ముదరగ‌
    రసభంగమె యగును పెక్కు రమణులు సేరన్”

    రిప్లయితొలగించండి
  12. గుసగుస లాడగ నొంటిగ
    వెసఁ జేరెను వధువుచెంత పెండ్లికొమరుడే
    పసిగట్టి విషయమంతట
    రసభంగమె యగును పెక్కు రమణులు సేరన్

    రిప్లయితొలగించండి
  13. నీరము కోసమై ఘటము నెత్తిన దాలిచి రత్తి మెల్లగా
    దూరపు భూధరంబు కడ తోరపు బావికి నేగుచుండగా
    చేరెను మల్లిగాడు తన చెంతకు లాలనసేయ నింతలో
    భోరునఁ గాంతలెల్లఁ జొరఁబూనినచో రసభంగమే కదా

    రిప్లయితొలగించండి
  14. కం॥ పసలేని గృహవిషయములు
    వసఁ బోసినటుల గలగల పలుకుచుఁ గాంతల్
    విసవిస చర్చించ సభకు
    రసభంగమె యగును పెక్కు రమణులు సేరన్

    ఉ॥ జోరుగ సాగు చుండఁగను శోభలు మీరఁగ సద్వధానమున్
    గోరిన పద్యపూరణలు గొప్పగఁ జేయుచు నుండు వేళలో
    బారులు తీరి ముచ్చటగ వాకిలిఁ ద్రోసుకు సంభ్రమమ్ముతో
    భోరునఁ గాంతలెల్లఁ జొరఁ బూనినచో రసభంగమే కదా!

    రిప్లయితొలగించండి
  15. కోర నిగూఢ ప్రదేశమున కూడిక, కృష్ణుడు రాధకోసమై
    తీరగు కుంజమున్ నిలిచి తీర్చుచు నుండగ నామె కోర్కెలన్
    మారుని తాపమున్ మునిగి మాధవు చెంతకు చేర నెంచుచున్
    భోరునఁ గాంతలెల్లఁ జొరఁ బూనినచో రసభంగమే కదా

    రిప్లయితొలగించండి
  16. మారుని బారి జిక్కి మధుమాసపు చెన్నెల రేయి మెల్లగా
    చేరి నిజాంగనన్ వలపు చిందగ తీయని యూసులాడుచున్
    కూరిమి బాహుబంధమున గూడితి నత్తఱి స్వప్న భంగమై
    భోరునఁ గాంతలెల్లఁ జొరఁబూనినచో రసభంగమే కదా

    రిప్లయితొలగించండి
  17. కూరిమి తోడ స్త్రీలు గుమిగూడిరి చూడగ దుఃఖ నాటక
    మ్మూరికి మధ్యయందు తెరముందరె గూర్చొని చూచుచుండ క
    న్నీరును నాపలేకనిక నేడ్వదొడంగిరి, వోపలేకయున్
    భోరునఁ గాంతలెల్లఁ జొరఁబూనినచో రసభంగమే కదా”

    రిప్లయితొలగించండి

  18. పిన్నక నాగేశ్వరరావు.
    హనుమకొండ.

    గుసగుసలు చెప్పుకొను ప్రే
    యసీ ప్రియులచట సరసము లాడుచు
    నుండన్
    పసిగట్టినచో చెలులున్
    రసభంగమె యగును పెక్కు రమణులు సేరన్.

    రిప్లయితొలగించండి
  19. ముసిముసి నవ్వులు హెచ్చగ
    కసిగాచూచూచునుండకళవళపడుచున్
    రుసరుసలాడుచుచేరగ
    రసభంగమెయగును పెక్కురమణులుచేరన్

    రిప్లయితొలగించండి