29, జులై 2023, శనివారం

సమస్య - 4488

30-7-2023 (ఆదివారం)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
"ఆలు బిడ్డల విడుటె గార్హస్థ్యమగును"
(లేదా...)
"ఆలుంబిడ్డల వీడి యేగుటయె గార్హస్థ్యంబనున్ శాస్త్రముల్"

(పిరాట్ల వేంకట శివరామకృష్ణ గారికి ధన్యవాదాలతో...)

21 కామెంట్‌లు:

  1. ఆరు శత్రువుల వదిలించియాత్మయందు
    ముక్తిమార్గంబుకొఱకునైమౌనియగుచు
    తామరాకుననీరునైదరికిరాక
    ఆలుబిడ్డలవీడుటె గార్హస్థ్యమగును

    రిప్లయితొలగించండి
  2. అలసి సొలసిన మగువకు వలయునుగద
    నాటవిడుపపుడపుడామె‌ వెంట పిల్ల
    లుండ పుట్టింటి కనుపమేలు గద యపుడు
    ఆలు బిడ్డల విడుటె గార్హస్థ్య మగును.

    రిప్లయితొలగించండి

  3. వీధు లందున తిరుగుచు పేనవాహు
    లమ్ము వ్యాపారి కావున సొమ్ము పొంద
    వృత్తి ధర్మమటంచును నిత్తె మాత
    డాలు బిడ్డల విడుటె గార్హస్థ్యమగును.


    చాలీచాలని వేతనంబతనిదౌ సంసారమే పెద్దదై
    పాలమ్మంగ దలంచె పైకమును సంపాదింపగా హెచ్చుగా
    కాళందీసుడు తూర్పుచేరగనె దుగ్దంబమ్మగా నెంచి తా
    నాలుంబిడ్డల వీడి యేగుటయె గార్హస్థ్యంబనున్ శాస్త్రముల్.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. కాళందీసుడు బదులు "కాళిందీసుడు " అనండి

      తొలగించండి
    2. కాళిందీసువు సూర్యునకుఁ బర్యాయ పదముగాఁ దెలుఁగు పర్యాయ పద నిఘంటువులోఁ గనిపించుచున్నది.
      కాని యది ముద్రాదోష మని నాకుఁ దోఁచు చున్నది.

      అది కాళిందీసుతి యని నా యభిప్రాయము.

      సుతిన్ న కారాంత పుంలింగ శబ్దము.
      తండ్రి యని యర్థము
      (సుతుఁడు కలవాఁడు )

      కాళిందీసుతి - యమున తండ్రి.
      తత్సమము. సూర్యుఁడు.

      ఇది నా యభిప్రాయము.

      తొలగించండి
  4. ఆలు బిడ్డల క్షేమమె హాయినొసగు
    ఆలు బిడ్డల పరిపోషణార్థియగుచు
    అన్య దేశమరుగుట కాదబ్బురమ్ము
    ఆలు బిడ్డల విడుటె గార్హస్థ్యమగును

    రిప్లయితొలగించండి
  5. ఆలు బిడ్డల కు హాయి చేకూర్చి వారి పోషణార్ధమగుచు అని ఆలు బిడ్డలు విడుటే అన్నది సబబే ?

    రిప్లయితొలగించండి
  6. దస్యుల దళము తమపయి దాడి సేయ
    సమరము కొనసాగునపుడు సైనికునికి
    పాళెమును పరులనుండి కాపాడుటకయి
    నాలు బిడ్డల విడుటె గార్హస్థ్యమగును

    రిప్లయితొలగించండి
  7. అనవరతము రక్షించుచు హాయిగుంచ
    ఆలుబిడ్డల, విడుటె గార్హస్థ్యమగును
    బ్రహ్మచర్యము, హతవిధి పంజరమున
    చిక్కిన చిలుక బోలును జీవితమ్ము

    రిప్లయితొలగించండి
  8. తే॥ అమిత సేవ సంతుకుఁ జేసి యనవరతము
    భార్య బాగోగులను జూచి బహు ముదముగ
    నలసి సొలసి చాలని యెంచి నప్పుడింక
    నాలు బిడ్డల విడుటె గార్హస్థ్యమగును

    శా॥ చాలా చేయుచు నాలుబిడ్డల కవిశ్రాంతంబుగా సేవలన్
    మేలుంబొందఁగ వారు మేటిగను నీమేనున్ గృశించంగ నా
    కేలం బంధములింక చాలనుచు సంకేతంబులంజూపి నీ
    యాలుంబిడ్డల వీడి యేగుటయే గార్హస్థ్యంబనున్ శాస్త్రముల్

    3 వ పాదములో అఖండ యతి మన్నించాలి

    రిప్లయితొలగించండి
  9. అహరహంబును గాపాడు నాశయమున
    దేశ రక్షణ కొఱకు నై దీక్ష బూని
    సతము శ్రమియించు వాడునై సైనికుo డు
    నాలు బిడ్డల విడుటె గా ర్హ స్థ్య మగును

    రిప్లయితొలగించండి
  10. తేటగీతి
    సతిని ధర్మార్థ కామ మోక్షార్థమంది
    యింటి బాగోగులన్నవి కంటఁ జూడ
    కార్యనిర్వహణమ్మున గమనమెంచి
    యాలు బిడ్డల విడుటె గార్హస్థ్యమగును

    శార్దూలవిక్రీడితము
    ప్రాలంబౌచును బాసచేసితని ధర్మార్థాదిగన్ గామమో
    క్షాలందంగను గార్యనిర్వహణ దీక్షాబద్ధుఁడై భర్తయే
    వాలాయంబుగ బాధ్యతల్ దెలిసి సంపాదింప విత్తమ్ము దా
    నాలుంబిడ్డల వీడి యేగుటయె గార్హస్థ్యంబనున్ శాస్త్రముల్

    రిప్లయితొలగించండి
  11. దేశ మాతను గాపాడ యాశ వలన
    ఆలు బిడ్డల విడుటె గార్హస్థ్యమగును
    ముద్దు బిడ్డలు వారలే పుడమి లోన
    నిక్క మీయది సోదర! యెక్కడైన

    రిప్లయితొలగించండి
  12. ఆలుంబిడ్డల వీడి యేగుటయె గార్హస్థ్యంబనున్ శాస్త్రముల్
    గాలంజెల్లెను సుమ్ము శాస్త్రము నకున్ గాలంబు మారెన్ గదా
    యాలుంబిడ్డల వీడుటయ్యది వినన్ హర్షంబు గానుండ దో
    బాలా! క్షేమముఁగాదు యేరికి సుమా భవ్యంబుఁ జింతించుమా.

    రిప్లయితొలగించండి
  13. ఆలుంబిడ్డల సేమమే మగడు తానాలోచనంజేయుగా
    వేళాకోళపు మాటలాడ దగునా పెచ్చారివా వెఱ్ఱివా?
    యేలాయిట్టుల నీవు బల్కెదవు నీకెవ్వారు వాక్రుచ్చిరో
    "యాలుంబిడ్డల వీడి యేగుటయె గార్హత్యంబనున్ శాస్త్రముల్"?

    రిప్లయితొలగించండి
  14. ఆలు బిడ్డల సేమము నరయుచుండు
    నతిథి యభ్యాగతుల నెపుఁ డాదరించు
    నతఁడె గేస్తన, నెవ్విధి నందువీవు
    "ఆలు బిడ్డల విడుటె గార్హస్థ్యమగును"?

    రిప్లయితొలగించండి

  15. పిన్నక నాగేశ్వరరావు.
    హనుమకొండ.

    క్రొత్తగా చేర పరదేశ కొలువునందు
    భార్య పిల్లల తోడను ప్రస్తుతమున
    వీలుపడదని చెప్పుచు వెడలుచుండె
    నొక్కడే కొంతకాలము నుంట కొఱకు
    అలుబిడ్డల విడుటె గార్హస్థ్యమగును.

    రిప్లయితొలగించండి
  16. ఆలుబిడ్డలపోషింపననవరతము
    పడకతప్పదుకష్టమువసుధయందు
    ఇట్టి స్థితి యందు భర్తకు నిలనుజూడ
    *నాలు బిడ్డల విడుటె గార్హస్త్యమగును*

    రిప్లయితొలగించండి