21, జులై 2023, శుక్రవారం

సమస్య - 4482

22-7-2023 (శనివారం)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“నిన్ను నిన్ను నిన్ను నిన్ను నిన్నె”
(లేదా...)
“నిను నిన్నున్ నిను నిన్ను నిన్ను నిను నిన్నే కాక యింకెవ్వనిన్”

20 కామెంట్‌లు:

  1. చేతి కైదు వ్రేళ్ళు శిష్యులం దునవారు
    మేటి శిష్యు లందు మెరుగు వారు
    గురువు తెలివి బట్టి గుర్తించె వారిని
    "నిన్ను నిన్ను నిన్ను నిన్ను నిన్నె"!

    రిప్లయితొలగించండి
  2. పద్య రచన యందు పటుతర సూచనల్
    కవుల కిచ్చు మీరు ఘనులు గారె
    మిమ్ము శంక రయ్య మిక్కిలి పొగడరే
    నిన్ను నిన్ను నిన్ను నిన్ను నిన్నె

    రిప్లయితొలగించండి
  3. వెంకటరమణ నిను వేడితి తెలుపుము
    నేనెవరినని, కరుణించి మది
    వేరు దారి తెలుపవేయని పిలిచెద
    నిన్ను నిన్ను నిన్ను నిన్నునిన్నె

    రిప్లయితొలగించండి
  4. 2 వ పాదం,నేనెవరినని కరుణించి మదిని

    రిప్లయితొలగించండి
  5. పాండవులను జూచి భానుజుడు బలికె
    నిన్ను నిన్ను నిన్ను నిన్ను నిన్నె
    తప్ప కుండ చంపెద ననుచు , దీనిని
    వినగ వారికి కడు వెరగు కలిగె

    రిప్లయితొలగించండి
  6. పూర్వసంధ్యవచ్చెప్రోద్రోవనిద్దుర
    పికముపాడెగీతిపెద్దగొంతు
    చేతనంపుజగతిచేయెత్తిపిలచెరా
    నిన్నునిన్నునిన్నునిన్నునిన్నె

    రిప్లయితొలగించండి
  7. మ.

    నును బుగ్గల్ నిమురంగ రాధ కినుకన్ నూత్నమ్ముగా కృష్ణునిన్
    వనమాలీభుజదండలో నిముడ శ్రీవత్సాంకునిన్ నెట్టుచున్
    దినబత్తెమ్ముగఁ గ్రీడలన్ వశముఁ బ్రార్థించంగ హాస్యమ్మనెన్
    *నిను నిన్నున్ నిను నిన్ను నిన్ను నిను నిన్నే కాక యింకెవ్వనిన్.*

    రిప్లయితొలగించండి
  8. లేను నీవులేక నేను నా ప్రియ సఖీ
    నేనులేక నీవు లేనెలేవు
    చేరి చూచి వలచి కోరుకొంటిని నేను
    నిన్ను నిన్ను నిన్ను నిన్ను నిన్నె

    రిప్లయితొలగించండి
  9. నినుఁ నే జూచితి నిన్ను కోరితిని నిన్నేనాదు ప్రాణంబుగా
    మనమందున్ దలబోసి రేయిపవలున్ మజ్జారె నీనామమున్
    ననఁబోఁడీ! జపయించితిన్ వలచితిన్ నారాణిగా నెంచితిన్
    నిను నిన్నున్ నిను నిన్ను నిన్ను నిను నిన్నే కాక యింకెవ్వనిన్

    రిప్లయితొలగించండి

  10. ఓటు కొరకెవండు నోటునాశించిన
    గౌరవమ్ము మంట గలియు నదియు
    హీన గుణమటంచు హెచ్చరించెద నేను
    నిన్ను, నిన్ను, నిన్ను, నిన్ను, నిన్నె.



    ననుకావంగను రమ్ము వేగమున కృష్ణా దిక్కికన్ నీవెరా
    వనజాక్షా మురళీధరా మురహరా పద్మాక్ష నీనామమే
    యనునిత్యమ్ము స్మరించు కృష్ణనుగదా యర్ఠింతు నేనెప్పుడున్
    నిను నిన్నున్ నిను నిన్ను నిన్ను నిను నిన్నే కాక యింకెవ్వనిన్.

    రిప్లయితొలగించండి
  11. మననీడెన్నడు వెన్న పాలు పెరుగుల్ మా కన్నులన్ గప్పి దా
    ననుమానం బణు మాత్రమైన గనరాదా చోర చాతుర్యమున్
    వినుమీ చాలును బేల లీలలిక గోపీలోల యేఁరందువా
    నిను నిన్నున్ నిను నిన్ను నిన్ను నిను నిన్నే కాక యింకెవ్వనిన్

    రిప్లయితొలగించండి
  12. నా స్వయంవరమున నన్నుగెల్పొందినన్
    బంచ సోదరులకుఁ బంచిరి కద
    పాండు పుత్రులార పరిణయ మాడితిన్
    నిన్ను నిన్ను నిన్ను నిన్ను నిన్నె

    రిప్లయితొలగించండి
  13. అతులిత‌బలధామ‌ హనుమంత మారుతీ‌!
    బుద్ధిబలముయశము‌ సిద్ధినొసగు‌
    నీవె‌ దిక్కునాకు‌ నిరతంబుతలచెద‌
    నిన్ను నిన్ను నిన్ను నిన్ను నిన్నె.

    రిప్లయితొలగించండి
  14. నన్ను ధర్మపథము‌ నడిపించు‌దయచేసి‌
    పవనసుతుడ‌ నీకు‌ ప్రణతిప్రణతి‌
    నమ్ముకొంటినిన్ను‌ నాప్రాణదైవమా‌
    నిన్ను నిన్ను నిన్ను నిన్ను నిన్నె‌

    రిప్లయితొలగించండి
  15. మ॥ అనఘా ధాత్రిని చూడవో జనుల యీ యాక్రందనల్ బాగుగన్
    గనుమా నేఁడిలలో యిటుల్ ప్రకృతి ఘీకారంబులన్ బ్రాణముల్
    చనుటన్ దీనులఁ గావఁగా భువిని నీసాయంబునే వేడెదన్
    నిను నిన్నున్ నిను నిన్ను నిన్ను నిను నిన్నే కాక యింకెవ్వరిన్

    రిప్లయితొలగించండి
  16. ఆ॥ భువిని ధర్మరక్ష భూతనాథ గనుమా
    దారిఁ దప్పి జనులు దూరమైరి
    నిన్ను ధర్మ పథము నిలుపఁగఁ గోరితి
    నిన్ను నిన్ను నిన్ను నిన్ను నిన్నె

    రిప్లయితొలగించండి
  17. ద్రౌపది పరాభవము తరువాత పాండుసుతుల ఆత్మఘోష...

    ఆటవెలది
    పాండు సుతులు మీరు పాచికలోడంగ
    రాజ రాజు రెచ్చి రమణిఁ దెచ్చి
    బానిసలుగ మిమ్ము హీనులుగన్ జూచె
    నిన్ను నిన్ను నిన్ను నిన్ను నిన్నె


    శ్రీరామదాసు ఆక్రందన...

    ఆటవెలది
    ఆలయంబు గట్టి యాలితో నినుఁదీర్చి
    యాభరణములిచ్చి శోభగూర్చి
    చెరను జిక్కి బ్రోవ శరణమంటిని నేను
    నిన్ను నిన్ను నిన్ను నిన్ను నిన్నె!

    మత్తేభవిక్రీడితము
    మనగన్ జేసియు నాలయంబున నినున్ మామంచి రామయ్యగన్
    దనరన్ మాతకు జానకీ సతికి సంధానించినన్ భూషలన్
    కునుకున్ దీర్చుచు నార్తిఁబాపఁ గనవే? కోరంగ నేనెంతురా!
    నిను నిన్నున్ నిను నిన్ను నిన్ను నిను నిన్నే కాక యింకెవ్వనిన్?

    రిప్లయితొలగించండి

  18. పిన్నక నాగేశ్వరరావు.
    హనుమకొండ.

    గోపికలు వెదకిరి గోపాలుని కొఱకు
    కడకు నొక్క చోట కానుపించ
    నెల్ల రడిగినార లెటు పోయినావని
    నిన్ను నిన్ను నిన్ను నిన్ను నిన్నె.

    రిప్లయితొలగించండి
  19. కనుగొంటిన్ మిము లందరిన్ విడవ
    నింకన్ మీరలే నన్ను నా
    ధనమున్ జేకొని యోటువేయక
    యత్యంతాష తోనుండగా
    నను మోసంబును జేసినారు గదరా
    నమ్మించి వీడన్ మిమున్
    నినునిన్నున్ నిను నిన్నునున్ నిను
    నినున్ నిన్నే కాక యింకెవ్వనిన్

    రిప్లయితొలగించండి
  20. మ.ఘనమృత్యుంజయ!నీలకంధర!మహాకారుణ్యపాథోనిధా
    న!నటేశా!నగజావరా!స్మరహరా!నాగేంద్రహారా!హరా!
    వినరా!నామొఱ!శంకరా!భవహరా!వేడంగఁబోనీశ్వరా!
    నినునిన్నున్ నినునిన్నునిన్ను నిను నిన్నేకాక యింకెవ్వనిన్.
    ....చంద్రమౌళి రామారావు,బాపట్ల.

    రిప్లయితొలగించండి