28, జులై 2023, శుక్రవారం

సమస్య - 4487

29-7-2023 (శనివారం)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“సీసాలను మెచ్చిరి రససిద్ధికి లోకుల్”
(లేదా...)
“సీసాలం గడు మెచ్చి రెల్లరు రసాశేషోత్సుకత్వంబునన్”

22 కామెంట్‌లు:

  1. భాషా ప్రేమికు లగుచు హ
    మేషా వృత్తము లనెల్ల మిగుల జదివినన్,
    ఆసాంత మిష్ట పడుచును
    సీసాలను మెచ్చిరి రససిద్ధికి లోకుల్.

    రిప్లయితొలగించండి
  2. భాసురమౌ పద్యాలన్
    వ్రాసిన కవులే గ్రహించె రసికతమెండై
    వాసిగ కూర్చిన ఘనతర
    సీసాలను మెచ్చిరి రససిద్ధికి లోకుల్

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. ప్రాసాశోభితమౌ రసాన్విత కృతుల్ ప్రాప్తించినన్ నిశ్చయం
      బాసాంతంబును హాయిగూర్చు పదముల్ మత్తిల్లగా జేయగా
      భాసించెన్ గద సీసపద్య మెపుడున్ పద్యాలలో మేటిగా
      సీసాలం గడు మెచ్చి రెల్లరు రసాస్వాదైకచిత్తుల్ గనన్

      తొలగించండి
  3. సీసా పద్యం బుతెలుగు
    కైసేత నవును రసయుత గాన మధురిమన్
    ఆసాంతము నిండగనే
    సీసాలను మెచ్చిరి రససిద్ధికి లోకుల్

    రిప్లయితొలగించండి
  4. చూసిరిభావమునర్తన
    చేసినరీతినిసరిగమతెచ్చినవిధమున్
    వ్రాసినకవిమానసమును
    సీసాలనుమెచ్చిరిరససిద్ధికిలోకుల్

    రిప్లయితొలగించండి
  5. కందం
    వేసమ్మున వాణి తెలియ
    వాసిఁగను గవిత్వమల్లి పఠితులకు మనో
    ల్లాసము నిడ శ్రీనాథుని
    సీసాలను మెచ్చిరి రససిద్ధికి లోకుల్


    శార్దూలవిక్రీడితము
    వేసమ్మందున వాణి వైభవముగన్ వీక్షింపగన్ దోచుచున్
    వాసిన్ గాంచ కవిత్వమాధురులు విప్పారన్ గనంగన్ మనో
    ల్లాసమ్మే! కవిసార్వభౌముడనెడున్ ప్రాజ్ఞుండునందింపఁగన్
    సీసాలం గడు మెచ్చి రెల్లరు రసోత్సేకప్రమోదమ్మునన్

    రిప్లయితొలగించండి
  6. ప్రాసలు గల్గినది యగుచు
    నే సార ములేని పద్య మే లా యనుచున్
    భా సంబై భావ సహిత
    సీ సాల ను మెచ్చిరి రస సిద్ధి కి లోకు ల్

    రిప్లయితొలగించండి
  7. వాసిన్ గాంచిన కావ్యరాజములనే ప్రాజ్ఞుండు శ్రీనాథుడే
    వ్రాసెన్ గాదుటె బ్రహ్మకన్యక కృపాలబ్దంబె ప్రాప్తింపగన్
    ప్రాశస్త్యమ్ము గడించెనా కృతులలో రమ్యంబులౌ పద్యముల్
    సీసాలం గడు మెచ్చి రెల్లరు రసోత్సేక ప్రమో దమ్మునన్.

    రిప్లయితొలగించండి
  8. వ్రాసెను కవి శ్రీనాథుడు
    వాసిగ కావ్యమ్ము లెన్నొ బహు రమణీయం
    బౌ సద్గ్రంథము లందున
    సీసాలను మెచ్చిరి రససిద్ధికి లోకుల్.

    రిప్లయితొలగించండి
  9. వాసన బీల్చిన జాలును
    మాసము లోపున నశక్తి మానున నగనే
    మోసము నెరుగక మూలిక
    సీసాలను మెచ్చిరి రససిద్ధికి లోకుల్

    రిప్లయితొలగించండి
  10. శార్దూలము:
    సీసంబుల్ కవిసార్వభౌమ కృత కాశీఖండ కావ్యంబునన్
    వాసింగాంచెను, సీసపద్యముల కావ్యంబందు భవ్యంబుగా
    గాసింబొందక వర్ణనంబుల కవుల్ గావింప సాధ్యంబగున్
    సీసాలం గడు మెచ్చి రెల్లరు రసాశేషోత్సుకత్వంబునన్

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మూడవ పాదాంతమున సాధ్యంబగున్ కు మారుగా 'హృద్యంబుగా' అని సవరించడమైనది 🙏🏿

      తొలగించండి
  11. గాసింబొందక సుకవులు
    వ్రాసిరి సీసములను కడు రమణీయముగా
    కాశీఖండమునందలి
    సీసాలను మెచ్చిరి రససిద్ధికి లోకుల్

    రిప్లయితొలగించండి
  12. గాసింబొందక సీసపద్యములతో గావ్యంబులన్ వ్రాయుచున్
    వాసింగాంచె కవీశ్వరుండు తనభవ్యంబైన విద్వత్తుతో
    కాశీఖండములోని సీసముల సంఘాతంబులన్ గాంచియా
    సీసాలం గడు మెచ్చి రెల్లరు రసాశేషోత్సుకత్వంబునన్

    రిప్లయితొలగించండి
  13. కం॥వ్రాసిన భావమిముడునని
    భాసురముగ నమితముగను భావనఁ దెలుపన్
    దాసులుగ మారి ముదముగ
    సీసాలను మెచ్చిరిరససిద్ధికి లోకుల్

    రిప్లయితొలగించండి

  14. పిన్నక నాగేశ్వరరావు.
    హనుమకొండ.

    సీసములన నిష్టముతో
    వాసిగ శ్రీనాథుడు పలు పద్యమ్ములతో
    వ్రాసిన కావ్యము లందలి
    సీసాలను మెచ్చిరి రససిద్ధికి లోకుల్.

    రిప్లయితొలగించండి
  15. మీసాల దువ్వి జోరుగ
    వేష మ్మునుదా ల్చిషోకు పెంపుగ నుండన్
    భేషుగ ద్రాగవి దేశీ
    సీసాలను మెచ్చిరి రససిద్ధికి లోకుల్.

    రిప్లయితొలగించండి
  16. సీసమ్మందున లేదు ప్రాస నియతిన్ శీఘ్రమ్ము నిర్మాణమున్
    సీసమ్మందున నింద్రసూర్య గణముల్ శిష్టమ్మునాముక్తమున్
    సీసమ్మందుపజాతి పద్యము తుదిన్ సేబాసు వల్లించగన్
    *సీసాలం గడు మెచ్చి రెల్లరు రసాశేషోత్సుకత్వంబునన్.*

    రిప్లయితొలగించండి
  17. ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. శా. పోసెన్పాలను,నీటియున్పొరలకన్,పోయంద్రవంబెల్లయున్
      ప్రాశస్త్యంబుగ నన్నియున్,వెరసహో! యాపాలిథిన్ సంచులన్
      వేసారెన్,భువిపాపపంకిలమవన్,వీడంగ ప్రాణంబులన్
      సీసాలం గడు మెచ్చి రెల్లరు రసాశేషోత్సుకత్వంబునన్.

      (ప్రస్తుతమున్న ద్రవములు మరియే యితరములైన వస్తు సముదాయమంతయు నేడు ప్లాస్టిక్ సంచులతో నింపుతున్న కారణంగా భూమిలోని కాలుష్యం ఏర్పడి ప్రజల ప్రాణాలకే ముప్పు వాటిల్లిన కారణాన ప్రజలందరూ పూర్వం గాజు పదార్ధం లో అన్ని నింపి నట్టుగానే ఇప్పుడుకూడా అలాగే చేస్తే బాగుండును అని అందరూ సీసాలనే మెచ్చుకుంటున్నారు అని భావన.

      తొలగించండి
  18. వాసిగ విషయం బెల్లయు
    సీసాలందుంచవీలు చిక్కున టంచున్
    వ్రాసిరి ప్రాచీనకవులు
    సీసాలను మెచ్చిరి రససిద్ధికి లోకుల్

    రిప్లయితొలగించండి