24, జులై 2023, సోమవారం

సమస్య - 4485

25-7-2023 (సోమవారం)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“మాటలలో తీపి యెటులొ మాన్యుల చేతల్”
(లేదా...)
“మాటల యందు తీపి గద మాన్యుల చేతలఁ జూడ నెట్టివో”
(తోపెల్ల బాలసుబ్రహ్మణ్య శర్మ గారికి ధన్యవాదాలతో)

22 కామెంట్‌లు:

  1. దీటుగ కార్యము లెల్ల ను
    నీటుగ నెరవేర్చ నెంచి నేర్పరు లగుచున్
    పూట కొక రీతి మారుచు
    మాటలలో తీపి యెటు లొ మాన్యుల చేతల్

    రిప్లయితొలగించండి
  2. చేటును జెయ్యరు మాన్యులు
    మాటలలో తీపి యెటులొ మాన్యుల చేతల్
    దీటుగ నట్టులె తియ్యన
    మాటలు చేతలకు భేదమనునది లేకన్.


    రిప్లయితొలగించండి
  3. ఊటనుదేచ్చునురసనను
    కోటనుదాటునుప లుకులుకోరగవసతుల్
    వీటికకివచ్చినమంత్రుల
    మాటలలోతీపి, యేటులోమాన్యులచేతల్

    రిప్లయితొలగించండి
  4. రాయబారి శ్రీకృష్ణపరమాత్మ మాటలు విన్న దుర్యోధనుని మానసం...

    కందం
    నీటగు సంధి వచనములఁ
    బాటింపఁగ రాజ్యమొదవు పాండవులకహో!
    బూటకము కృష్ణునిదనఁగ
    మాటలలో తీపి! యెటులొ మాన్యుల చేతల్?

    ఉత్పలమాల
    నీటగు సంధివాక్యముల నేరక నమ్మియు నొప్పినంతటన్
    బాటిగ పాండునందనులు భాగమునొందురె రాజ్యమందునన్
    బూటకముల్ గనంగనివె మోహన కృష్ణుడు సూత్రధారిగన్
    మాటల యందు తీపి గద! మాన్యుల చేతలఁ జూడ నెట్టివో?

    రిప్లయితొలగించండి
  5. కందము
    లోటేమియు రానీయము
    కూటికి గుడ్డకునటంచు కూరిమిఁబలుకున్
    ఓటునువేసే వరకే
    మాటలలో తీపి;యెటులొ మాన్యుల చేతల్.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. ఉత్పలమాల
      ఓటును మాకు వేసియు నహో!గెలిపించగ మీకు మాత్రమే
      లోటును లేక జూచెదము లో నను మానము వీడుడయ్య మీ
      పేటలు కోటలే యగును పేదరికంబు నశించునన్న నా
      మాటలయందు తీపిగద ;మాన్యుల చేతలఁజూడనెట్టివో.

      తొలగించండి
  6. పూటకు పూటకు మార్చెడు
    మాటలలో తీపియొటులొ?
    మాన్యుల చేతల్
    మాటలు సక్కగ నుండిన
    పాటింతురు వారి మాట
    ప్రజలెల్ల సుమీ

    రిప్లయితొలగించండి
  7. పాటలవీథివీథితమపాండితిజూపుచునోటుగోరుచున్
    కూటికిలేనిబీదలకుగూటినినిచ్చేదమంచుజేప్పుచున్
    ఘాటునుపన్యసించేదరుఘర్మపుబిందువుజారమంత్రులున్
    మాటలయందుతీపి, గద, మాన్యులచేతలుజూడనేట్టివో

    రిప్లయితొలగించండి

  8. ఓటడుగు నేత చెప్పెడు
    పూటకు లేనట్టివాని పొట్టను నింపన్
    మేటి పథకములటంచును
    మాటలలో తీపి, యెటులొ మాన్యుల చేతల్



    చేటొనరించు వారికిక చెల్లును కాలము జాగరూకులై
    యోటును నాకొసంగిన మహోజ్వల భావి పురోభి వృద్ధికై
    బాటలు వేయువాడనని బాసలు చేసిన నాయకుం గనన్
    మాటల యందు తీపి గద, మాన్యుల చేతలఁ జూడ నెట్టివో.

    రిప్లయితొలగించండి
  9. సాటి మనుష్యులు నుడువెడు
    మాటలలో తీపి యెటులొ ,
    మాన్యుల చేతల్
    నాటును మానస మందున
    దీటగు కార్యముల జేయ దీమస మొసగున్

    రిప్లయితొలగించండి
  10. మాటలు కోటలు దాటును
    ధాటిగ వాగ్దానములను దనరించుటలో
    మూటగ కట్టిన నీరము
    మాటలలో తీపి యెటులొ మాన్యులచేతల్

    రిప్లయితొలగించండి
  11. ఉ.

    తోటను జేరి రావణుడు ధూర్తుడు సీతను దొంగిలించెడిన్
    మాటుగ బల్కె నుత్తరకుమారుడు గోగ్రహణమ్ము ముంగలన్‌
    చేటు, ప్రగల్భముల్, కపటి చెప్పెడి నీతులు మారువేషమున్
    *మాటల యందు తీపి గద మాన్యుల చేతలఁ జూడ నెట్టివో.*

    రిప్లయితొలగించండి
  12. మూటలు సంపాదింపగ
    చాటున చేసెడు పనులకు సంతస పడుచున్
    ఓటునడుగుటకు చెప్పెడు
    మాటలలో తీపి, యెటులొ మాన్యుల చేతల్

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మాటల యందు తీపి గద మాన్యుల చేతలఁ జూడ నెట్టివో?
      బూటక మేకదా గనిన మూర్ఖత నిండిన దొడ్డ నేతలన్
      మాటలు తేటతేనెలగు మానస మందలి కాంక్ష వేరగున్
      చాటున చేయు దుండగముల సంతసమొందుట నిత్యకృత్యమే

      తొలగించండి
  13. కోటలు దాటే కోరిక
    మాటలలో తీపి, యెటులొ మాన్యుల చేతల్
    ఆటగదా వారికికన్
    చేటుగ మారనిది చేత చెంగలువ కదా

    రిప్లయితొలగించండి
  14. ధాటిగ వాక్ప్రవాహమునదందడిగా ప్రకటించు సేవలన్
    మాటల మాంత్రికుంబగిదిమానసముల్ హరియించు నేత యా
    మాటలు నీటిమూటలగుమంత్రిగ గద్దె నలంకరించగన్
    మాటల యందు తీపి గదమాన్యుల చేతలఁ జూడ నెట్టివో

    రిప్లయితొలగించండి
  15. బూటక నేతలెన్నికల పూర్వము
    వేదిక లెక్కి చెప్పు యా
    మాటలయందు తీపిగద ,మాన్యుల
    చేతల జూడ నెట్టివో !
    నీటుగ నెల్ల మానవులు నేడు
    గ్రహించుచనుండ్రి నేర్పుతో
    మాటలు సెప్పినట్టులను మచ్చుకు
    చేయరు చేతలెప్పుడున్

    రిప్లయితొలగించండి
  16. కం॥ నాటకములాడు వారల
    మాటలలో తీపి యెటులొ మాన్యుల చేతల్
    మాటలు కోటలు దాటినఁ
    జాటుగ చేసెడి పనులను సారించ తగున్

    ఉ॥ నాటక మాడు వారలను నమ్ముటఁ గష్టము గాద తెల్పఁగన్
    దీటుగ మాటలాడుచును దేకువఁ జూపుచు నమ్మఁ బల్కరా
    చాటుగఁ జేయు కార్యములు చౌకగ నుండునొ మేటివో గదా
    మాటలయందు తీపి గద మాన్యుల చేతలఁ జూడ నెట్టివో

    రిప్లయితొలగించండి
  17. శంకరాభరణం గ్రూప్ వారిచ్చిన సమస్యలకు నా పూరణలు


    డా బల్లూరి ఉమాదేవి

    కోటలుదాటెడిరీతిగ
    మాటల నాడుచుజనములమనసులతోడన్
    యాటలనాడెడివారల
    *“మాటలలో తీపి యెటులొ మాన్యుల చేతల్”*

    డా బల్లూరి ఉమాదేవి

    పూటకునొక్కతీరుగను బోలెడుమాటలుచెప్పుచున్సదా
    మాటలతోడనేవడిగ మాడిలు గట్టుచు నోట్లకోసమై
    వాటిని గద్దెనెక్కగనె వాకిటికావలపారవేయనా
    *“మాటల యందు తీపి గద మాన్యుల చేతలఁ జూడ నెట్టివో”*

    రిప్లయితొలగించండి
  18. పాటవముఁగలుగు వారలు
    చేటునుదాజేయరెపుఁడు శిష్యుల పనికిన్
    మూటలు గట్టిన విధముగ
    మాటలలో తీపి యెటులొ మాన్యుల చేతల్

    రిప్లయితొలగించండి

  19. పిన్నక నాగేశ్వరరావు.
    హనుమకొండ.

    కోటలు దాటెడు పలుకుల
    నోటు కొఱకు చెప్పు నేతలుండుదు రెపుడున్
    పాటింపరు హామీలను
    మాటలలో తీపి! యెటులొ మాన్యుల చేతల్?

    రిప్లయితొలగించండి