16, జులై 2023, ఆదివారం

సమస్య - 4478

17-7-2023 (సోమవారం)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“జన్మదినోత్సవపు వేడ్క జరుపుట మేలా”
(లేదా...)
“జన్మదినోత్సవంబనుచు సంబరముల్ జరుపంగ మేలొకో”
(జులై 17 నా పుట్టినరోజు)

33 కామెంట్‌లు:

  1. జన్మఘన కార్యమగునా,
    తన్మయము గలుగు మనిషికి తన కొరకే యీ
    సన్మానము జరుగుటచే
    జన్మ దినోత్సవ వేడుక జరుగుట మేలా!

    రిప్లయితొలగించండి
  2. ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.

    రిప్లయితొలగించండి
  3. తన్మయుడైనరుడునుతా
    చిన్మయుశ్రీహరిదలచుచుచేరగముక్తిన్
    మృణ్మయ దేహమువలదుగ
    జన్మదినోత్సవపువేడ్కజరుపుటమేలా

    రిప్లయితొలగించండి
  4. సన్మానముల జరుగు మీ
    జన్మ దినోత్సవపు వేడ్క: జరుగుట మేలా?
    జన్మము నెత్తియు బ్రతుకున
    తన్మయుడై కీర్తి లేని దౌ ర్భా గ్యు నకున్

    రిప్లయితొలగించండి

  5. చిన్మయ రూపుడు కారణ
    జన్ముడు రఘురాముని విడి సంధ్యాబలుడై
    జన్మించిన రావణునకు
    జన్మదినోత్సవపు వేడ్క జరుపుట మేలా?



    చిన్మయ రూపుడైన ఘన శ్రీ రఘు రాముని సద్గుణోత్తమున్
    జన్మదినోత్సవమ్మదియె జాతికి మేలగు కాని దిత్యుడై
    జన్మము నెత్తినట్టి యఱజాతి దశాననుడైన రావణున్
    జన్మదినోత్సవంబనుచు సంబరముల్ జరుపంగ మేలొకో.?

    రిప్లయితొలగించండి
  6. జన్మము జీవికి సహజము
    జన్మించిన మోదమొందు జననీజనకుల్
    జన్మము సార్థకమైనను
    జన్మదినోత్సవపు వేడ్క జరుపుట మేలా

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మన్మథబాణతాడితులు మాయకు లోబడి ధర్మబద్ధులై
      తన్మయులై సృజింతురను తాత్విక చింతన కల్గియుండుమా
      జన్మమొసంగువారు బహుసంతస మొందుచు వెచ్చపెట్టుచున్
      జన్మదినోత్సవంబనుచు సంబరముల్ జరుపంగ మేలొకో

      తొలగించండి
    2. మీ రెండు పూరణలు ప్రశస్తంగా ఉన్నవి. అభినందనలు.

      తొలగించండి


    3. ధన్యవాదాలు గురూజీ 🙏 జన్మదిన శుభాకాంక్షలు.

      తొలగించండి
  7. మన్మనిపై ప్రీతినిగొని
    జన్మదినోత్సవపు వేడ్క జరుపగ నొప్పున్
    చిన్మయునికి కూడ నటుల
    జన్మదినోత్సవపు వేడ్క జరుపుట మేలా

    రిప్లయితొలగించండి
  8. ఉ.

    చిన్మయ భావ పద్యములు చెప్పిన శిష్యుల నాదరించుచున్
    తన్మయుడైన బోధకుడు తప్పక దిద్దుచు హెచ్చరించుచున్
    సన్ముని రూపుగా దలచి ఛాత్రులు శిక్షక పూజగా తగున్
    *జన్మదినోత్సవంబనుచు సంబరముల్ జరుపంగ మేలొకో.*

    రిప్లయితొలగించండి
  9. జన్మములందున మానవ
    జన్మమ్మే శ్రేష్ఠమనుచు సంబరపడుచున్
    చిన్మయ ధామముఁ గోరక
    జన్మదినోత్సవపు వేడ్క జరుపుట మేలా

    రిప్లయితొలగించండి
  10. జన్మము లందు మర్త్యుఁనిగ జన్మమునొందుట సత్కృతమ్మిలన్
    తన్మయమొంది శ్రీహరిని ధ్యానము సల్పుచు మానసంబునన్
    చిన్మయమూర్తి ధామమును చేరెడునిచ్చను వీడి యూరకే
    జన్మదినోత్సవంబనుచు సంబరముల్ జరుపంగ మేలొకో

    రిప్లయితొలగించండి
  11. కం॥ జన్మము సార్థకమై చను
    తన్మయుఁడై పరులకు సుకృతములొనరించన్
    సన్మార్గముఁ గన కున్నను
    జన్మదినోత్సవపు వేడ్క జరుపుట మేలా!

    ఉ॥ జన్మము సార్థకంబు నగు సభ్యత సంస్కృతి నొంది ధాత్రిలో
    తన్మయుఁడౌచు సర్వులకుఁ దప్పక సాయముఁ జేయ గాక నీ
    మన్మథ తాపమొందుచును మానిని మానము దోచు దుష్టులున్
    జన్మదినోత్సవంబనుచు సంబరముల్ జరుపంగ మేలొకో!

    అయ్య మీకు జన్మదిన శుభాకాంక్షలండి

    రిప్లయితొలగించండి
  12. LIFE CERTIFICATE FOR 2023

    అందరికీ వందనములు.
    అందరి పూరణలూ అలరించు చున్నవి.
    అలరించనున్నవి.
    శంకరార్యులకు జన్మదిన శుభాకాంక్షలు.శుభాభివందనములు.

    B-1)శంకరార్యా యిది మీకు న్యాయమా ???
    ________________________________________________________

    చిన్మయ రూపుడౌ శివుడె - చిత్రముగా నిల శంకరయ్యగా
    జన్మము నెత్తి, శిష్యులకు - చక్కగ ఙ్ఞానపు బోధ సేయ, వి
    ద్వణ్మణి వీవె యంచు తమ - ధర్మముగా నిను ప్రస్తుతించగాన్
    తన్మయులైన బంట్లు సభ - తక్షణ మిచ్చట నేర్పరించగా
    నున్ముఖు లైన యట్టి తరి - నుబ్బదె వాయగ వేరె తావునన్
    జన్మదినోత్సవంబనుచు - సంబరముల్ జరుపంగ మేలొకో ???
    ________________________________________________________
    బంటు = శిష్యుడు
    ఏర్పరించు = ఏర్పాటు చేయు
    ఉబ్బు = సంతోషము
    వాయగ = పాయగ

    రిప్లయితొలగించండి
  13. గురువుగారికి హార్దిక జన్మదినోత్సవ శుభాకాంక్షలు. సాహితీ సేవలో నిండు నూరేళ్ళు తమరు వర్ధిల్లాలని ఆకాంక్షిస్తూ భగవంతుని ప్రార్థిస్తున్నాను.

    రిప్లయితొలగించండి
  14. గురువర్యులకు నమస్సులు. జన్మదిన శుభాకాంక్షలు. అసనారె

    రిప్లయితొలగించండి
  15. గురుదేవులకు జన్మదినోత్సవ శుభాకాంక్షలు 💐💐💐

    కందం
    మృణ్మయ మగు దేహమనన్
    గన్మఱుగగు నాత్మవీడ కట్టెలపాలై
    చిన్మయుఁ, బరహితము మఱచి
    జన్మదినోత్సవపు వేడ్క జరుపుట మేలా?

    ఉత్పలమాల
    మృణ్మయమైన దేహమన మేదిని నెప్పటికైనఁ దప్పకన్
    గన్మఱుగౌను నాత్మయది కాయము వాయఁగ కాష్టమందునన్
    జిన్మయుఁ గొల్చుటే మఱచి చేతల వీడి పరోపకారమున్
    జన్మదినోత్సవంబనుచు సంబరముల్ జరుపంగ మేలొకో?

    రిప్లయితొలగించండి
  16. జన్మదినమ్మునసహజము
    జన్మదినోత్సవపు వేడ్క జరుపుట, మేలా
    తన్మయులైదీపమ్మును
    సన్మార్గమునువిడియార్పజనములకెల్లన్

    రిప్లయితొలగించండి
  17. శ్రీ శంకరయ్య గూరువరులకు జన్మదిన
    శుభాకాంక్షలు••••

    సన్మతి తోడ పేదలను సజ్జనులన్
    హితకారలోకులన్
    జన్మము నిచ్చు దాతలను జ్ఞానము
    బంచెచెడి గుర్వులన్ సదా
    జన్మదినోత్సవంబనుచు సంబర
    ముల్ జరిపించ మేలొకో
    తన్మతి లేనివారలకు దండుగ జన్మ
    ది నొత్సవంబులున్.

    రిప్లయితొలగించండి
  18. గురువుగారికి జన్మదిన శుభాకాంక్షలు

    రిప్లయితొలగించండి
  19. గురువు గారికి జన్మదిన శుభాకాంక్షలతో ..

    సన్మతి సద్గురూత్తముడు శంకరవర్యు కనుంగు శిష్యులై
    మన్మథనంబునందమృతమాధురి జిందెడి పద్యధారలన్
    చిన్మయు సత్కృపార్థవరసిద్ధిని దక్షిణ నీక డంబమున్
    జన్మదినోత్సవంబనుచు సంబరముల్ జరుపంగ మేలొకో

    రిప్లయితొలగించండి

  20. పిన్నక నాగేశ్వరరావు.
    హనుమకొండ.

    చిన్మయ మూర్తిని గొలువక
    సన్మార్గము విడి విదేశ సంస్కృతి నెఱపన్
    మున్ముందు దీపమార్పుచు
    జన్మ దినోత్సవపు వేడ్క జరుపుట మేలా?

    రిప్లయితొలగించండి