1, జులై 2023, శనివారం

సమస్య - 4464

2-7-2023 (ఆదివారం)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“విజయము రామునకు మిగుల వేదనఁ బెంచెన్”
(లేదా...)
“విజయము రామచంద్రునకు వేదనఁ బెంచె నదేమి చిత్రమో”

16 కామెంట్‌లు:

  1. ఒకానొక రోజు మహాభారత యుద్ధ సమయంలో..
    వ్రజనాధుడు సారథియై
    విజయుని నడిపించుచుండ, వీతభయుడునై
    భుజబలయుతుడగు, కర్ణుని
    విజయము రామునకు మిగుల వేదనఁ బెంచెన్
    విజయము= కర్ణుని ధనువు
    రాముడు = అర్జునుడు


    రిప్లయితొలగించండి
  2. అజిలో సౌమిత్రి నితన
    నిజసోదరుడిని రణమున నిలచిన మాయా
    విజయించెనని వగచె నా
    విజయము రామునకు మిగుల వేదనఁ బెంచెన్”

    రిప్లయితొలగించండి
  3. కందం
    కుజనంద రావణుఁ దునిమి
    యజరామరమైనకీర్తి నందియు కడకున్
    రజకుని నిందల కతనన్
    విజయము రామునకు మిగుల వేదనఁ బెంచెన్

    చంపకమాల
    కుజఁగొన రావణున్ దునిమి కోమలి యగ్ని పునీతయైనఁ దా
    భుజబల తేజుఁడై నిలచి భూపతియౌచును గద్దెనెక్కినన్
    రజకుని నిందలన్ వగచి రాజ్ఞిని కానలకంపి కుందఁగన్
    విజయము రామచంద్రునకు వేదనఁ బెంచె! నదేమి చిత్రమో?

    రిప్లయితొలగించండి
  4. కుజనపహరించిన ఖలుని
    భుజబలుడైన కపిరథుడు బుద్ధి బలముతో
    విజయించెనమోఘముగా
    విజయము రామునకు మిగుల వేదనఁ బెంచెన్


    [వేదన = సుఖదుఃఖానుభవము]

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. కుజను హరించె రావణుడు కోరిక నిండిన మానసంబుతో
      సుజనుల బాసటన్ గెలిచె సుందర రాముడు యుద్ధమందునన్
      స్వజనులనేక సైనికులు స్వర్గతి నొందగ వ్యాకులమ్ముతో
      విజయము రామచంద్రునకు వేదనఁ బెంచె నదేమి చిత్రమో

      తొలగించండి

  5. అజుని ప్రియభక్తు డతనిని
    ఖజమున దునుమాడితినని కల్పము నందున్
    ద్విజుని యడచుట కలక మని
    విజయము రామునకు మిగుల వేదనఁ బెంచెన్.



    కుజనుడు కాదు రావణుడు కోడెవయాళి వజీరు భక్తుడౌ
    ద్విజుడును సర్వశాస్త్రములు వేదములందు విశారదుండునున్
    ఖజమున నూచమట్టగను కల్మషమంటెనటంచు నెంచుచున్
    విజయము రామచంద్రునకు వేదనఁ బెంచె నదేమి చిత్రమో.

    రిప్లయితొలగించండి
  6. ప్రజలకు చావులేని పరిపాలన సాగెడి రాజ్యమందు భా
    నుజుని భటుల్ కఠారముల నూరుచు నుండ క్రియావిహీనులై
    యజుని గురించి శూద్రుడొకడర్థి తపస్సునుచేయ దోసమై
    ద్విజుడగు బాలకుండు కడతేఱెననంగ బుధుల్, పరేతరాట్
    విజయము రాఘవేంద్రునకు వేదన బెంచె నదేమి చిత్రమో
    అసనారె

    రిప్లయితొలగించండి
  7. కుజనుల దండించు తన క
    ప జయము నే నెరుగనట్టి బలయుతు కనిలో
    భుజ బలు సౌ మిత్రి పయిని
    విజయము రామునికి మిగుల వేదన బెంచెన్

    రిప్లయితొలగించండి
  8. కుజను వెదకు సమయమున స
    హజులగు సుగ్రీవ,వాలి యంతర మందున్
    నా జిద్దునందు గన పా
    వి జయము రామునకు మిగుల వేదనఁ బెంచెన్

    రిప్లయితొలగించండి
  9. చం.

    కుజనుడు వాలి, సోదరుని గొట్టి రుమన్ జెరపట్టె, మోహమున్
    సుజనుల రక్షకుండు మధుసూదన మానమె రాము జేరెడిన్
    భుజబల యుద్ధమున్ గవల పోలిక గత్తరసేయ, వాలికిన్
    *విజయము, రామచంద్రునకు వేదనఁ బెంచె నదేమి చిత్రమో!*

    రిప్లయితొలగించండి
  10. నిజముగ రావణా సురుడు నీచుడు
    గాడు మహోన్నతుండు తా
    ద్విజుడును వేద శాస్త్రములు
    దెల్సినవాడును శౌచధర్మముల్
    అజితుని భక్తు బ్రాహ్మణుని యత్య
    మహా యఘమంచు నెంచె యా
    విజయము రామచంద్రునకు వేదన
    బెంచె నదేమి చిత్రమో

    రిప్లయితొలగించండి
  11. కుజనుడు మైకమందనిన కొండియముల్ జనవాక్యమంచు నా
    వృజినుడి మాటయే తనకు వేదముగా దలబోసి నిర్దయన్
    కుజను వనంబులన్ బనిచి కుందెను రాఘవుఁ డగ్గలంబుగా
    విజయము రామచంద్రునకు వేదనఁ బెంచె నదేమిచిత్రమో

    రిప్లయితొలగించండి
  12. రజకుడు కుజనొక పతితగ
    స్వజనముతో బలుక నదియె జనవాక్యముగా
    నిజసతి నంపె నడవులకు
    విజయము రామునకు మిగుల వేదనఁ బెంచెన్

    రిప్లయితొలగించండి

  13. పిన్నక నాగేశ్వరరావు.
    హనుమకొండ.

    నిజమిది రావణ మరణము
    విజయము రామునకు; మిగుల వేదన
    బెంచెన్
    రజకుని నిందలకు న(అ)యో
    నిజ నడవుల కంపు ఘటన నిర్దయగా తాన్.

    రిప్లయితొలగించండి
  14. కం॥ నిజముగ వాలి బలాఢ్యుడు
    భుజబలమున సాటిలేని పురుషుఁడుఁ దెలుపన్
    స్వజనులఁ గావఁగఁ దునిమిన
    విజయము రామునకు మిగుల వేదనఁ బెంచెన్

    చం॥ నిజముగ రావణాసురుఁడు నిత్యము శంకర భక్తి వర్యుఁడే
    భుజబల శౌర్యమందునను భూరి పరాక్రమశాలి యెన్నఁగన్
    స్వజనులఁ గాయు ధీరుఁడును వానిని ద్రుంచఁగఁ దప్ప లేదనిన్
    విజయము రామచంద్రునకు వేదనఁ బెంచె నదేమి చిత్రమో!

    రిప్లయితొలగించండి
  15. కుజనున్జంపగ కలిగెను
    *“విజయము రామునకు మిగుల వేదనఁ బెంచెన్”*
    నిజసతిధరణినజేరగ
    భుజబలమదిమెంతయున్నపుడమిజ వీడన్

    రిప్లయితొలగించండి