27, జులై 2023, గురువారం

సమస్య - 4486

28-7-2023 (శుక్రవారం)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“అన్నవరములో లభియింప దన్నమయ్యొ”
(లేదా...)
“అన్నవరంబునం దకట యన్నము లభ్యము గాదు చిత్రమే”

21 కామెంట్‌లు:

  1. భీముడని నీకు పేరిడ భీమమెంత
    కలదు నీలోన యనియెంచి గాంచు మయ్య
    యన్నవరములో లభియింప దన్నమయ్యొ
    యని వగచ నేల నది నామమనుచు నేర్వు

    రిప్లయితొలగించండి
  2. నవ్యనాగరీకముతోడ నాట్యమాడు
    అమెరికా యన్నయండనునాంధ్రుడుండె
    పట్టెడన్నంబుదొరకక పరుగులెత్తె

    అన్నవరములోలభియింపదన్నమయ్యొ

    రిప్లయితొలగించండి
  3. ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.

    రిప్లయితొలగించండి
  4. స్వామి వారిప్రసాదమ్ము వాసిగాను
    జనుల కంద జేదురచట సాగ్రముగను
    కాని విక్రయశాలలో కాసులేక
    అన్నవరములో లభియింప దన్నమయ్యొ.


    అన్నప్రసాదమంచు జనులందరి కాలయమందు లభ్యమౌ
    మిన్నగ భక్తులెల్లరు సమిష్టిగ గైకొనుచుంద్రు పెద్దలున్
    బిన్నల కైన భోజనము విక్రయశాలన కాసు లేనిదే
    అన్నవరంబునం దకట యన్నము లభ్యము గాదు చిత్రమే.

    రిప్లయితొలగించండి
  5. ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.

    రిప్లయితొలగించండి
  6. తేటగీతి
    "అన్నవరములో లభియింపదన్నమయ్యొ"
    యన్న నపరాధమేయగు కన్నులార
    సత్యదేవుని దర్శించ నిత్యమిడరె
    యన్నమే ప్రసాదంబుగ నాదరమున.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. ఉత్పలమాల
      సన్నుతమైన "రత్నగిరి "శైలమునందునగొల్వ భక్తులున్
      కన్నులపండువై వరలుగాదె రమాపతి సత్యదేవుఁడై
      "అన్నవరంబునం,దకట!యన్నము లభ్యముగాదు చిత్రమే
      యన్నము పెట్టు వేళకును హాజరు కాకయు జాగుసేసినన్.

      తొలగించండి
  7. అన్నవరపు వేల్పనుగని
    సన్నుతి సేయంగ భక్త జనులొచ్చెదరా
    సన్నయము జాగు చేసిన
    నన్నవరములో లభించ దన్నమయయ్యో

    రిప్లయితొలగించండి
  8. సత్య దేవుని దర్శించు సాధు జనుల
    కచట నొసగు ప్ర సాదమే కమ్మ ననుచు
    కోర రన్యమ్ము నచ్చట కుడువననరు "నన్న వరము లో లభియింప దన్న మ య్యొ "

    రిప్లయితొలగించండి
  9. తీర్థ యాత్రకని కదిలి తీరుబడిగ
    వ్యర్థముగ బాధపడకు వంట కొరకు
    అన్నవరములో లభియింప దన్నమయ్యొ
    యనకు రవ్వనె కేసరియై లభించు

    రిప్లయితొలగించండి
  10. ఉ.

    పిన్నగు నిల్వలుండు కనిపించిన విప్రుల బిల్వ భోక్తలై
    *అన్న, వరంబునం దకట యన్నము లభ్యము గాదు చిత్రమే*
    పన్నిన కుట్రచే మృతులు పాఱులు హుండుని మేక చియ్యచే
    కన్నిడి జీర్ణమున్ ముని యగస్త్యుడు నంతము జేసె భ్రాతలన్.

    ......
    వాతాపి, ఇల్వలుడు అనే ఇద్దరు సోదరుల (రాక్షసులు) వృత్తాంతం రామాయణంలో అరణ్యకాండలో చెప్పబడింది.

    రిప్లయితొలగించండి
  11. ఎన్నికల సమయాన తానెన్ని చెప్పె!
    'అన్న' వరములీయగ వచ్చెనని వచించె
    ఎన్ని కైనట్టి నేతన్న యేలుబడిన
    అన్నవరములో లభియింప దన్నమయ్యొ

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. ఎన్నికలప్డు తానుడివె నెన్నియొ 'అన్న వరాలు' పేరిటన్
      కన్నుల ముందు నిల్పెగద కల్పిత బాసలు మిక్కుటంబుగా
      పన్నిన జిత్తులే తనకు పట్టము గట్టగ నిత్య సత్యమై
      'అన్న వరంబు'నం దకట యన్నము లభ్యము గాదు చిత్రమే

      తొలగించండి
  12. ఎన్నగ పుణ్య క్షేత్రముల నెక్కుడు ఖ్యాతి గడించె నాంధ్రయం
    దన్నవరంబు పట్టణము నందలి దైవము సత్యదేవుడే
    చెన్నుగవచ్చు భక్తులకు, చెప్పకతప్పదు, రూకలిచ్చినన్
    అన్నవరంబునం దకట యన్నము లభ్యము గాదు చిత్రమే

    రిప్లయితొలగించండి
  13. ఆంధ్రరాష్ట్రము నందున నన్నవరము
    సత్యదేవుని ధామము, సకల భక్త
    జనులు రూకలెక్కుడు వెదజల్లకున్న
    నన్నవరములో లభియింప దన్నమయ్యొ

    రిప్లయితొలగించండి
  14. తేటగీతి
    సత్యనారాయణుని దల్చి నిత్యమచట
    నిండ్లనైనను పూటకూళ్లిండ్లనైన
    పూని చేయ ప్రసాదము గానిదౌచు
    నన్నవరములో లభియింప దన్నమయ్యొ!

    ఉత్పలమాల
    మిన్నగ సత్యదేవుఁడట మేదినిఁ గావఁగఁ గొల్వుఁ దీరఁగన్
    దిన్నగ స్వామినిన్ దలఁచి తీరుగ సర్వులు వండివార్చఁగన్
    జెన్నగు భక్తి భావమునఁ జీరఁ బ్రసాదము గానిదౌచు నా
    యన్నవరంబునందకట! యన్నము లభ్యము గాదు! చిత్రమే?

    రిప్లయితొలగించండి
  15. తే॥ అచట సత్యదేవుని గొల్చి యర్చనఁ గని
    భక్షణ ప్రసాదమును సేయఁ బావనమని
    అన్నము తినువారు కరవై నందు వలన
    నన్నవరములో లభియింప దన్న మయ్యె

    ఉ॥ ఎన్నఁగ భక్తితో మనుజు లీశుని గొల్చుచుఁ బారవశ్యులై
    మిన్నగ నందరూ నచట మేటి ప్రసాదపు భోక్తలైనచో
    నన్నముతోఁ బనేమిటని యన్నము వండుట మాని వేయఁగా
    నన్నవరంబునం దకట యన్నము లభ్యము గాదు చిత్రమే!

    (అచ్చట తినడమే కాకుండా 5-6 పొట్లాలు ఇంటికి పట్టుకెళ్ళి ప్రిజ్ లో ఉంచుకొని తినడమానవాయితి యండి)

    రిప్లయితొలగించండి

  16. పిన్నక నాగేశ్వరరావు.
    హనుమకొండ.

    స్వామి సన్నిధిని వ్రతము జరుపుకొనెడు
    భాగ్యమున్ గలదట యన్నవరమునందు
    నన్న ముచితముగ లభించు నాలయమున
    కాని కొండకు దిగువన కాసు లేక
    యన్నవరములో లభియింప దన్న మయ్యొ.

    రిప్లయితొలగించండి
  17. ఉ:అన్న వరమ్ము నీయ వదినమ్మ కు నన్నము వెట్ట దుఃఖమౌ
    నన్న!వరమ్ముగా దొరకె నన్నవరంపు ప్రసాద మొక్కటే
    యన్నవరాన వాన యిపుడైనను లేదుగ పంట లేదుగా!
    *అన్నవరమ్ము నందకట యన్నము లభ్య ము గాదు చిత్రమే!*
    (పై పాదాలలో దేన్ని తీసుకొన్నా,అన్నీ తీసుకున్నా సమస్యకి సరిపోతుంది.సమస్య బాగున్నది.)

    రిప్లయితొలగించండి
  18. తే.గీ:రేపు శనివారం మయ్యెను,రేపె సరిగ
    సెలవు లభియించె నచటికి జేరుకొనిన
    మాకు నుపవాస మగుట చే మాపు నందు
    నన్నవరము లో లభియింప దన్న మయ్యొ

    రిప్లయితొలగించండి
  19. భక్తి తోడను కొలిచిన భుక్తి కెపుడు
    నుండబోదులోటనుమాట నుర్వినిజము
    సత్యదేవునిచెంతను సత్యమిదియు
    *“అన్నవరములో లభియింప దన్నమయ్యొ”*
    యనెడి మాట యవాస్తవ మండ్రుబుధులు

    రిప్లయితొలగించండి