7, జులై 2023, శుక్రవారం

సమస్య - 4470

8-7-2023(శనివారం)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“పుస్తకము గాదిపుడు హస్తభూషణమ్ము”
(లేదా...)
“పుస్తకమన్న నేఁడు గరభూషణమన్నది వట్టిమాటయే”

19 కామెంట్‌లు:

  1. వస్తు తత్వము మారెగావరములీయ
    గ్రంథ భారంబుతొలగగాగారవమున
    చరమువాణిగచేతితోజతనుగూడి
    పుస్తకముకాదిపుడుహస్తభూషణము

    రిప్లయితొలగించండి
  2. ఇరువది యొకటవ శతాబ్దమిది మనుగడ
    మారెనన్ని విధములందు స్మార్టు ఫోనె
    భూషణము చేతికి మనకెపుడును గాన
    పుస్తకముగాదిపుడు హస్త భూషణమ్ము.

    రిప్లయితొలగించండి
  3. మనకు కాలాను గుణమైన మార్పులెన్నొ
    కనుల ముందర లోకాన కాంచ వచ్చు
    నెచట చూచిన కానవచ్చు చరవాణి
    పుస్తకము గాదిపుడు హస్తభూషణమ్ము

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. పుస్తకమన్న నేఁడు గరభూషణమన్నది వట్టిమాటయే
      హస్తములందు నెల్లెడల హాయిగ కన్పడరాదు చూడగా
      వాస్తవమే జనాళి చరవాణినజస్ర విభూషణంబుగా
      ప్రస్తుత కాలమందు తగు భావన సేయుట శుద్ధమైనదే

      తొలగించండి
  4. పుస్తెను గట్టలేదు, మరి బొత్తిగ వీడని తోడునీడయై,
    నేస్తము కన్న దా మిగుల నేఱుపు తోడుత ముచ్చటింపగా,
    వాస్తవ మెంచి చూడ కర వాణిన గూగులు చెంతనుండగా,
    పుస్తకమన్న నేఁడు గరభూషణమన్నది వట్టిమాటయే.

    రిప్లయితొలగించండి
  5. ఉ.

    దుస్తర విద్యలన్ని తొలి దోషము లేక గురూపదేశముల్
    శాస్తలు ముద్రవెట్ట ఘన శాస్త్రము లెల్లయు గ్రంథ రూపముల్
    మస్తకమందు జేర్చ, బిస మద్దతు, వీడుచు గంఠపాఠమున్
    *బుస్తకమన్న నేఁడు గరభూషణమన్నది వట్టిమాటయే.*

    రిప్లయితొలగించండి
  6. ప్రస్తుత కాలమందునను బ్రజ్వల
    మొందెడు జ్ఞానసంపదన్
    మస్తుగ బొందు చుండ్రి ప్రజ మా
    న్యత బొందిన సర్వ సంగతుల్
    నేస్తమ గూగులందునను నిక్కము
    చిక్కును సర్వమందులో.
    పుస్తకమన్న నేడు కరభూషణ
    మన్నదివట్టి మాటయే

    రిప్లయితొలగించండి
  7. పుస్తకము గాది పుడు హస్త భూషణమ్ము
    రంగు రంగుల చరవాణి రహిగ నేడు
    భూషణమ్ముగ నలరారి మురిప మలర
    కాను పించును హస్తా న గల్ల గాదు

    రిప్లయితొలగించండి
  8. మార్పనునది సహజమేను మనికి నందు
    పుస్తకము గాదిపుడు హస్తభూష
    ణమ్ము
    జదువ వ్రాయ దెలియకున్న
    సమయమయ్యు
    హస్తమున మొబయిలు ఫోనె యాభరణము

    రిప్లయితొలగించండి
  9. మస్తకమందునున్న మహిమాన్వితమౌ విషయమ్ములెల్ల గ్రం
    ధస్తములైనవే యనగ తాతల కాలము నందు జెల్లె చా
    దస్తపు మాటలందురవి, తాతల కైనను ఫోనెగావలెన్,
    పుస్తకమన్న నేడుగర భూషణమన్నది వట్టి మాటయే.

    రిప్లయితొలగించండి

  10. ధరణి మానవుని పరిశోధనల ఫలము
    భువిని యవతరించినసెల్లు ఫోనె నేడు
    ముఖ్యమంచు దలంచెడు మూఢులున్న
    పుస్తకము గాదిపుడు హస్తభూషణమ్ము.


    విస్తృతమైన శోధనలు వింతలవెన్నియొ చూపునట్టిదౌ
    వస్తువు సృష్టిజేసె చరవాణిగ పేరుగడింప దానినే
    ప్రస్థుతమందు మానవుడు రాతము చేతను దాల్చియుండగా
    పుస్తకమన్న నేఁడు గరభూషణమన్నది వట్టిమాటయే.

    రిప్లయితొలగించండి
  11. తేటగీతి
    వాస్తవము సెప్పి నారు సమస్త జగము
    మరులుకొని చరవాణినిఁ గరమునఁ గొన
    ముద్రితములందున దొరికి ముచ్చటగుచుఁ
    బుస్తకము గాదిపుడు హస్తభూషణమ్ము!

    ఉత్పలమాల
    వాస్తవమేమిటో తెరచి వాదనలెంచని నిత్యసత్యమున్
    మస్తకమున్న వారెవరు మాఱ్కొననొప్పని రీతి చెప్పగన్
    ప్రస్తుతి కెక్కి నేడు చరవాణి సమస్తము సూపు చుండఁగన్
    పుస్తకమన్న నేఁడు గరభూషణమన్నది వట్టిమాటయే!

    రిప్లయితొలగించండి
  12. పుడమి జనులకు పనిలేదు పుస్తకములు
    పుస్తకము కన్న చరవాణి శస్తమిపుడు
    హస్తమందున నిమిడెనీ యవనియెల్ల
    పుస్తకము గాదిపుడు హస్తభూషణమ్ము

    రిప్లయితొలగించండి
  13. పుస్తకమే ప్రపంచముగ పొల్పుగ చేకొని యబ్బరంబుగా
    హస్తమునందు దానినొక యాస్తిగ దాల్చిరి నాడు యెల్లరున్
    పుస్తకముల్ భరంబులయె బూనిరహో చరవాణి చేతిలో
    పుస్తకమన్న నేఁడు గరభూషణమన్నది వట్టిమాటయే

    రిప్లయితొలగించండి
  14. తే॥ శాస్త్ర లాభములు విరియ చక్కఁగాను
    వెలసె జనులకంతర్జాల బలిమి నేఁడు
    గరమున యిముడ విజ్ఞాన మరియఁగాను
    బుస్తకము గాదిపుడు హస్తభూషణమ్ము

    ఉ॥వాస్తవ మేను బుస్తకము వాడుట యేలను శాస్త్రవిజ్ఞతన్
    నేస్తమ చేతిలో యిముడ నిత్యము విద్యల భాండమంతయున్
    మస్తుగ వస్తురూపమున మానవులెల్లరుఁ బ్రీతిఁ బొందఁగన్
    బుస్తకమన్న నేఁడు గరభూషణమన్నది వట్టిమాటయే

    రిప్లయితొలగించండి

  15. పిన్నక నాగేశ్వరరావు.
    హనుమకొండ.

    శాస్త్ర సాంకేతికమ్ముగ స్థాయి పెరిగి
    ప్రతిది చరవాణి యందునే లభ్యమగుచు
    నుండ,పుస్తకాలున్న లేకున్న గాని
    చేరె చరవాణి ప్రతి వ్యక్తి చేతియందు
    పుస్తకము గాదిపుడు హస్త భూషణమ్ము.

    రిప్లయితొలగించండి
  16. విస్తరమై జగంబు నతి వేగముగా చరవాణి వాడుకన్
    హస్తములందు జేరె సకలార్థ వివేక వరప్రసాదియై
    మస్తకమందు చిక్కుకొని మానవులెల్లరమేధులైరహా
    పుస్తకమన్న నేఁడు గరభూషణమన్నది వట్టిమాటయే

    రిప్లయితొలగించండి
  17. కాలమెంతగమారెనోగాంచుడయ్య
    నందరికరకమలములనమరెనుచర
    వాణిపొత్తముచేపట్టువారలేరి?
    పుస్తకముకాదిపుడుహస్తభూషణమ్ము

    రిప్లయితొలగించండి