22, జులై 2023, శనివారం

సమస్య - 4483

23-7-2023 (ఆదివారం)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“ఈగలు వడిన పానక మెంతొ మేలు”
(లేదా...)
“ఈగలు వడ్డ పానకమె యెంతొ హితంబొనగూర్చుఁ గ్రోలినన్”

17 కామెంట్‌లు:

  1. కష్టమెంచినశక్తిని కార్మికుండు
    తేనెటీగలు వోలెనుదెచ్చుధనము
    బాధ్యతెఱుగుచు ఖర్చుల బరువునెంచు
    ఈగలువడినపానకమెంతొమేలు

    రిప్లయితొలగించండి
  2. పలురకముల మాధురి నిడు పదములుండ
    తీపి బెల్లము వలెనని దెలియు టకయి
    త్రాగక నమూన నుంచగ దాని పయిన
    నీగలు వడిన , పానక మెంతొ మేలు

    రిప్లయితొలగించండి
  3. పండుగ దినమున వలదు పానకమని
    కల్లు త్రాగబోయిననీగ కంట బడెను
    పానకమె ద్రాగె, మరికల్లు పాడగు గద
    యీగలు వడిన! పానక మెంతొ మేలు.

    రిప్లయితొలగించండి
  4. ఆగనికాయకష్టమున నయ్యయితావులనిశ్చయాత్ముడై
    జాగునుసేయకేఘనత చాలగజూపుచువృద్ధినంతటన్
    వేగునుచుక్కవోలె దిశ వెల్గులనింపునుకార్మికుండహో
    ఈగలువడ్డపానకమెఎంతొహితంబొనగూర్చుఁగ్రోలినన్

    రిప్లయితొలగించండి
  5. తేటగీతి
    ఉచితబియ్యము పేదల నుద్ధరింప
    గద్దెనెక్కిన పెద్దలు కలుగజేసి
    దోచనెంతురు స్వార్థాన, రాచనగరు
    కీగలు వడిన పానక మెంతొ మేలు

    ఉత్పలమాల
    బాగొన గూర్ప బీదలకు పంచెడు బియ్యము సైతమాశతో
    సాగిన యంత దాక తమ స్వార్థపు బుద్ధిని దోచుకొందురే
    తూగుచు గద్దెలన్ సిరుల దొంగిల జూచెడు చింతనంబునం
    దీగలు వడ్డ పానకమె యెంతొ హితంబొనగూర్చుఁ గ్రోలినన్!

    రిప్లయితొలగించండి
  6. ఉ.

    రేగు ఫలాలకై బదరి రీతిగ జేర నదృశ్యమే కదా
    వీగుచు జేయగా భజన వేదియు వేత్తయు గాడు భక్తుడే
    తూగుచు బ్రహ్మనిష్ఠ నవధూత వచించెడి పన్నకమ్ముగా
    *ఈగలు వడ్డ పానకమె యెంతొ హితంబొనగూర్చుఁ గ్రోలినన్.*

    రిప్లయితొలగించండి

  7. గుడము నిమ్మకాయ రసము గూర్చి చేసె
    బామ్మ పెద్దబాణిలి నిండ ప్రశ్రయమున
    తక్షణమె మూత పెట్టుడు త్రాగడెవ్వ
    డీగలు వడిన పానక మెంతొ మేలు.


    యోగులు భోగులై ననది యుక్తమటంచు దలంచి నిత్యమున్
    త్రాగెడి వారటంచనుచు తాతయె బాణిలి నిండచేసెనే
    వేగిరమే సరామునట పెట్టుడు, త్రాగడెవండునం దులో
    నీగలు వడ్డ, పానకమె యెంతొ హితంబొనగూర్చుఁ గ్రోలినన్.

    రిప్లయితొలగించండి
  8. ఈగలు వడిన పానక మెంతొ మేల
    టంచు పిసినారి త్రాగును హర్ష ముగను
    కాని యారోగ్య సూత్రాల ఖచ్చి తముగ
    నెవరు పాటింతు రో వార లిష్ట పడరు

    రిప్లయితొలగించండి
  9. మద్యము నిషిద్దమనిచెప్పి మాయచేసి
    చౌకబారైన సారాయి సరకుసేయ
    కొనక తప్పదనుచు చవిగొనుట కన్న
    నీగలు వడిన పానక మెంతొ మేలు

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. రాగలకాలమందు తన లక్ష్యము మద్యనిషేదమేననెన్
      వేగమె గద్దెనెక్కి శరవేగముతో చవుకైన మద్యమున్
      త్రాగుట కీయజొచ్చె మరి దానిని పొందుటకన్న మేలగున్
      ఈగలు వడ్డ పానకమె యెంతొ హితంబొనగూర్చుఁ గ్రోలినన్

      తొలగించండి
  10. ఈగలు వడిన పానకమెంతొ మేలు
    యనకు తప్పించకు పనియనత్త జెప్పె
    కోడలితొ, నే జేసెద గుడము నీరు
    దొంగ వేషములే పని దొంగ వేను

    రిప్లయితొలగించండి
  11. బాగుగ సంపదల్ గలుగువారలెరుంగరు క్షుత్పిపాసలన్
    రోగము రొచ్చులంజితికి రోఁజుతు రోజులు వెళ్ళబుచ్చుచున్
    యేగతిలేక గంజికొర కిక్కటులంబడు పేదవానికిన్
    యీగలు వడ్డ పానకమె యెంతొ హితంబొనగూర్చుఁ గ్రోలినన్

    రిప్లయితొలగించండి
  12. భోగభాగ్యములందునఁ దూఁగువార
    లెట్లెరుంగుదు రాకలి నెన్నడైన
    మంచినీరెరుంగని విధి వంచితునకు
    నీగలు వడిన పానక మెంతొ మేలు

    రిప్లయితొలగించండి
  13. తే॥ మూగిరి జనులెక్కువగాను ద్రాగ పాన
    కమ్ము బయట భిక్షకులును గలిపి చూడ
    నీగలుండఁగ భిక్షకుల్ ద్రాగి రనుచు
    నీగలు వడిన పానక మెంతొ మేలు

    ఉ॥ ఈగలు వడ్డ పానకము నెవ్వరుఁ ద్రాగరు బుద్ధియున్నచో
    రోగములన్ని కీటకపు రొచ్చున ప్రాకును, శాస్త్ర విజ్ఞతన్
    బాగుగఁ దెల్సి యీనిజము పాలనఁ జేసిరి యెట్టులందువో
    యీగలు వడ్డ పానకమె యెంతొ హితంబొన గూర్చుఁ గ్రోలినన్

    రిప్లయితొలగించండి
  14. వేగమె దెచ్చిరంచు నవివేకముగా పరికింపకే వడిన్
    ద్రాగకు మాగు మాగు మది దాహము దీర్ప దనర్థ హేతువౌ
    నీగలు వడ్డ పానకమె; యెంతొ హితంబొనగూర్చుఁ గ్రోలినన్
    బాగగు నీరు గుక్కెడ దవశ్యము దప్పిక దీర్చు మేలుగా

    రిప్లయితొలగించండి
  15. ఆటవెలది
    అవుర!కీడె *యీగలువడిన పానక,
    మెంతొ మేలు*గూర్చు నెవరికైన
    స్వచ్ఛమైన యట్టి పానకంబునుద్రావ
    సరస కవివరేణ్య!శంకరార్య!

    రిప్లయితొలగించండి

  16. పిన్నక నాగేశ్వరరావు.
    హనుమకొండ.

    త్రాగవలదు పానీయ మేదైన గాని
    యీగలు పడిన; పానక మెంతొ మేలు
    కలుగ జేయును వేసవి కాలమందు
    రామనవమికి ప్రతి వత్సరమున నిడగ.

    రిప్లయితొలగించండి