23, జులై 2023, ఆదివారం

సమస్య - 4484

24-7-2023 (ఆదివారం)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“ఆదివారము పనిదిన మయ్యె నయ్యొ”
(లేదా...)
“పనిదినమయ్యె నయ్యొ రవివారము కాదని చెప్ప నొప్పునే”

19 కామెంట్‌లు:

  1. దూరమని తలపోయక చేర వచ్చి
    నీదు పెండ్లికి శుభలేఖ నిచ్చి నావు
    రాక యుందునా సెలవైన, కాకపోయె
    నాదివారము, పనిదిన మయ్యె నయ్యొ

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. వెనుకటి కాలమందు మనబృందపు సభ్యుడు పిల్చె పెండ్లికై
      తను మనువాడునాడు తలదాల్చిన కార్యము లడ్డువచ్చినన్
      కినుకవహించునేమొ తనకిప్పుడు చెప్పక మానివైచినన్
      పనిదినమయ్యె నయ్యొ, రవివారము కాదని చెప్ప నొప్పునే

      తొలగించండి
  2. అత్యవసర సేవల కొరకనుచు చేయ
    వలసి వచ్చు కొందరకు తప్పని సరియగు
    సెలవు దినముల పని వార మాదియైన,
    ఆదివారము పనిదినమయ్యెనయ్యొ!

    రిప్లయితొలగించండి
  3. వానలు కురియుచుండినవనుచు విడుపు
    నొసగి చాల పనుల శేషముండినదని,
    దాని నిప్పుడు సరిజేయ దలచి నంత
    నాదివారము పనిదిన మయ్యె నయ్యొ

    రిప్లయితొలగించండి
  4. వంటశాలయెపిలచెగాపండుగనుచు
    కాంతసంతసమునకాఫికలుపమనియెబంధువొచ్చెను నింటి రాబందువోలె
    ఆదివారముపనిదినమయ్యెనయ్యొ

    రిప్లయితొలగించండి
  5. ఆరు రోజులు విధులే ఔర నేను
    జేయ నొక్కటి వచ్చెను జిలుగు వెలుగు
    ఆదివారము, వచ్చెను ఆత్మబంధు
    ఆదివారము పని దినమయ్యె నయ్యొ

    రిప్లయితొలగించండి
  6. సెలవు లభియించు మగనికి చిత్ర ముగను
    నాకు సెలవన్న దే లేదు న్యాయ మేన?
    నాది వారము పని దిన మయ్యె న య్యొ నని వగచు చుంటి ని గద నతి వ నగు చు

    రిప్లయితొలగించండి

  7. అనవరతము పనులతో నలసి పోతి
    నేడు సెలవంచు జరిపితి వేడుకలను
    కాలమాగదు గాదుటే గడచి నంత
    నాదివారము , పనిదిన మయ్యె నయ్యొ



    అనుజుని పెండ్లి రమ్మనుచు నాదరమందున బిల్వనేమి యా
    దినమది సోమవారము తేరగ నివ్వగ లేడుదాస్థితుం
    డనుమతి యంచు చెప్పగ నహంబది యడ్డుగ వచ్చె నాకిటన్
    బనిదినమయ్యె నయ్యొ , రవివారము కాదని చెప్ప నొప్పునే.

    రిప్లయితొలగించండి
  8. ఒక సతీమణి భర్తతో...

    తేటగీతి
    సెలవు దినమునఁ బనులను చేతునంచు
    గడువు పెట్టగ సైచితి గతియెలేక
    పుస్తకావిష్కరణమని పోవ మీర
    లాదివారము పనిదిన మయ్యె నయ్యొ!

    గొణగకుమంచు నన్ను పనికూర్చెదనంచని యాదివారమున్
    బెనిమిటి! మీరలున్ గడువుఁ బెట్టుచు నన్నిటు నిద్రఁ బుచ్చుచున్
    మునిగిరి పద్య ఖండికల పూర్తిని జేయఁగ బట్టుఁబట్టుచున్
    పనిదినమయ్యె నయ్యొ రవివారము కాదని చెప్ప నొప్పునే?

    రిప్లయితొలగించండి
  9. చం.

    *పనిదినమయ్యె నయ్యొ రవివారము కాదని చెప్ప నొప్పునే*
    వనితయు మద్య మాంసములు భాస్కర వారము నాడు త్యక్తముల్
    కనుగొన నాంగ్ల జాతి జన గండుల చేత విరామమయ్యెనే
    యినకుల చంద్ర వంశముల యిచ్ఛలు భక్తియు నంతరించెడిన్.

    రిప్లయితొలగించండి
  10. ప్రభుత కొలువున నుండవు పగలు రేయి
    యెంత చేసిన చాకిరి కంతు గనము
    భార్యతో కలిసి గడుప వలయునన్న
    నాదివారము పనిదినమయ్యె నయ్యొ

    రిప్లయితొలగించండి
  11. ఒక చిరుద్యోగి ఆత్మఘోష:
    అనవరతమ్ము దేవరకు నర్పణమాయెను జీవితమ్ము నా
    పనికొకయంతు గాననొక భారముమోయు ఖరమ్ము కైవడిన్
    పనుల నిమగ్నమై తుదకు భార్యకు సైతము దూరమైతినే
    పనిదినమయ్యె నయ్యొ రవివారము కాదని చెప్ప నొప్పునే

    రిప్లయితొలగించండి
  12. తే॥ తైల శోధనను వలదు తడవు సేయ
    నర్ధరాత్రి పిలిచినంత యరుగ వలయు
    నాది వారమనెడి వంక యమలు కాక
    ఆదివారము పనిదిన మయ్యె నయ్యొ

    చం॥ అనుమతి లేదు సెలవుల నాశగ కోరఁగఁ దైల శోధనన్
    బనులను వీడి పోవుటయు పాడియె గాదరియంగ నచ్చటన్
    గనఁగను వార మేదియును గాదగు నైనను గార్య ముండునే
    పనిదినమయ్యె నయ్యొ రవివారము కాదని చెప్ప నొప్పునే

    (మా స్వానుభవమేనండి)

    రిప్లయితొలగించండి
  13. తేటగీతి
    చెలియ!యిట్టె గడచిపోయె సెలవు దినము
    *ఆదివారము;పనిదినమయ్యెనయ్యొ*
    సోమవారము లేలెమ్ము సుప్తి నుండి
    వేగ పోవలె గాదె యుద్యోగమునకు.

    రిప్లయితొలగించండి
  14. వాన లెక్కువ కురియుట వలన సెలవు
    లీయు కారణ మునుజూపి యింక నుండి
    యాదివారము పనిదిన మయ్యె, నయ్యొ యనకండి చేయుడు హర్ష మొంది

    రిప్లయితొలగించండి
  15. వినుముర రాజ శేఖరుఁడ !వీనుల కిష్టము కానిమాట యే
    పనిఁగొని చెప్పు చుంటినిఁక వారము వారము తప్పకుండ గాఁ
    బనిదినమయ్యె నయ్యొ రవివారము కాదని చెప్ప నొప్పునే
    ననయము మాన కుండగను హర్షము తోడను బోవు మాయిఁకన్

    రిప్లయితొలగించండి
  16. అనిశము జర్గు సంగతిది యందరె
    రింగిన నగ్న సత్యమే
    వినవలె జెప్పినట్టుల వివేకము
    తోడ ప్రభుత్వకార్యముల్
    విని యనివార్యమైననవి వెంటనె
    సేయక తప్పదేరికిన్
    పనిది నమయ్యె నయ్యొ రవివారము
    కాదని చెప్ప నొప్పునే

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు

    1. పిన్నక నాగేశ్వరరావు.
      హనుమకొండ.

      వచ్చుచుంటిరి యధికార వర్గము తని
      ఖీకి, సెలవు లేదెవ్వరికింక యనుచు
      నాజ్ఞ నివ్వగ కార్యాలయాధికారి
      రెండవ శనివారమును మరి మరు రోజు
      నాది వారము పనిదిన మయ్యె నయ్యొ.

      తొలగించండి