26-7-2023 (బుధవారం)కవిమిత్రులారా,ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...“చవట గద నినుం దలంప శంకరపత్నీ”(లేదా...)“చవట గదా నినుం దలప శంకరపత్ని గణేశ్వరాంబికా”
వివరముగ నిన్ను దలచకజవసత్వములు నుడిగేను జనులకు, ఇహమున్రవ రవము సుఖము గోరెడిచవటగద నినుం దలంప శంకరపత్నీ
అవసర మొచ్చిన మ్రొక్కుచు,అవకాశము గలుగ మిడుకు నట్టి యధములౌచవటల నెప్పుడు గరుణించవటగద నిను దలంప శంకర పత్నీ
కవనము గాదు ముక్తసరి కౌశికి భక్తులఁ బ్రోచు దేవియేవివిధములంబరూపములు వేడినఁ దీర్చుట నన్ని వేళలన్ప్రవచన కర్తలందరును ప్రాజ్ఞుల బోధనఁ దల్చ, "మోసగిం*చవట గదా నినుం దలప శంకరపత్ని గణేశ్వరాంబికా!”*
వివరముతెలియనిభక్తుండవమతితోడుత బలమునఠవఠవలాడన్సవనముజేసిననుసహించవటగదనినుందలంపశంకరపత్నీ
శివ నోలగించ కుండినచవట గద ; నినుం దలంప శంకరపత్నీయవసర ములెల్ల దీరునుభువిపై జనులం దరకును మోదము తోడన్
భువి సంపద పెంపొందగసవినయముగ లక్ష్మినడుగ సాధ్యంబగుగాఈ విషయమ్ము నెరుంగనిచవటగద నినుదలంప శంకరపత్నీ
అవమతిగాకమానసమునందుననిల్పుచునీదురూపమున్అవిరళభక్తిభావమునహంసగసాధనసేయుభక్తునాశివునెదిరించిబ్రోవగనుసేఁగినిసైతువుగాక, మోసగించవటగదానినుందలంపశంకరపత్నిగణేశ్వరాంబికా
అవని జనుల్ నినుం గొలువ ఆర్తిని దీర్చెదవంచు నిచ్చలున్ భువనములెల్ల నీ కృపను బొందగ పూజలు సేతురమ్మ రో భవభయహారి వీవనుచు పాపము బాపెదవంచు దోస మెంచవట గదా నినుం దలప శంకరపత్ని గణేశ్వరాంబికా
అవసరమున మ్రొ క్కులిడుచునవ సరము లు దీరు పిదప నాకే మనుచున్భువి మెల గెడు వారిసహించవట గద నినుందలo ప శంకర పత్నీ!
అవనిజనులు నినుఁ గొల్వగభవనాశిని యార్తిఁ దీర్చి వరములనొసగేభువనేశ్వరివట కీడెంచవట గద నినుం దలంప శంకరపత్నీ
కందముఅవరోధంబులు రాగాభవబంధములందుఁజిక్కు వరభక్తతతిన్ ప్రవిమలమతుల నుపేక్షిం చవటగద!నినుందలంప శంకరపత్నీ.
చంపకమాల శివ!శివ!శాంకరీ!విబుధ సేవిత దివ్యపదారవింద!దుర్గ!విజయ!భైరవీ!యగజ!గౌరి!మహేశ్వరి!భద్రకాళి!భార్గవి!నగనందినీ!గిరిజ!కౌశికి!భక్తులనెల్లఁద్రోసిపుచ్చవటగదా!నినుందలప శంకరపత్ని!గణేశ్వరాంబికా!
అవివేకముతో నిత్యంబవగడములనెన్నొ చేసె డాలరకుల పెక్కువతో వారిదోషము నెం చవట గద నినుం దలంప శంకరపత్నీభువనములేలు తల్లివని ముక్తినొసంగెడు దానవంచు నాభవభయ నాశినిన్ గొలుచు భక్తజనాళిని బ్రోచునట్టి యాశివ సతి పాదపద్మముల జేరిన దీనజనాళి దోషమెంచవట గదా నినుం దలప శంకరపత్ని గణేశ్వరాంబికా.
అవనతమై నినువేడినభవాని కరుణించెదవట పాపులనైనన్శివయన యిడుములు బాధించవట గద నినుం దలంప శంకరపత్నీ
శివశివయంచునిన్నెపుడు చిత్తమునందున నిల్పియున్నచోభవకులు సత్వరమ్ము తమబాధల నుండివిముక్తి నొందరాభవభయహారి నీకృపను భక్తుల పైబడు కష్టముల్ రహించవట గదా నినుం దలప శంకరపత్ని గణేశ్వరాంబికా
కం॥ భవమున నినుఁ గనని నరుఁడుచవట గద, నినుం దలంప శంకర పత్నీయవనిని శుభములఁ బడయమతవ కృప నొందగ నిరతముఁ దలచెద నమ్మాచం॥ భవమునఁ బ్రోచి కాయుదువు భక్తుల నిన్నును నమ్మ కున్నచోచవట గదా, నినుం దలప శంకర పత్ని గణేశ్వరాంబికాయవనిని మమ్ము మోదముగ నాదర భావము నిల్పి చూతువేతవ కరుణా కటాక్షమున ధన్యత నొందఁగ మ్రొక్కి వేడెదన్
కందంశివమున్ గూర్పఁగ జగతికిభవునే విషమంద మనెడు పత్నివి జననీ!యెవరికి నిడుములెపుడు పంచవట గద నినుం దలంప శంకరపత్నీ!చంపకమాలశివమునొసంగ లోకులకు క్ష్వేళము మ్రింగుమటంచు భర్తనేజవమున గోరితే జనని సర్వశుభంకరి శత్రుభీకరీ!భువనవశంకరీ! జయము! ప్రోవఁగ మమ్ములఁ బూని జాగు నెంచవట గదా నినుం దలప శంకరపత్ని! గణేశ్వరాంబికా!
శంకరాభరణం గ్రూప్ వారిచ్చిన సమస్యలకు నా పూరణలు శివసతి ననవరతమ్మునుస్తవముల తోడను నుతించ దయతో మాకున్శివమొసగుచుదోసములెం*చవటగద నినున్ దలంప శంకరపత్నీ*స్తవన ముచేయుచున్ మనము చక్కగ గొల్చిన నంబ తాదయన్జవము నచూపి కష్టము లుసర్వు లకున్ సతతంబుబాపుచున్శివములు కూర్చుచుందువట శీఘ్రముగానిక నెప్పు డీవు నెం*“చవట గదా నినుం దలప శంకరపత్ని గణేశ్వరాంబికా*
అవని తలంబునందున గడాదరభావముతోడ నిత్యమున్నవిరళ చిత్తశుద్ధిమెయి యర్చనజేసెడు భక్త కోటికిన్భవికము దప్పకుండ వెస భార్గవితీర్చెదవంట యేది దాచవట గదా నినుందలప శంకర పత్ని గణేశ్వరాంబికా!
పిన్నక నాగేశ్వరరావు.హనుమకొండ. అవిరళమగు పూజలతో స్తవమెంతయు చేయ జనులు సర్వజ్ఞ సతీ!భవ సాగరమున వెతలుంచవట గద నినుం దలంప శంకర పత్నీ!
వివరముగ నిన్ను దలచక
రిప్లయితొలగించండిజవసత్వములు నుడిగేను జనులకు, ఇహమున్
రవ రవము సుఖము గోరెడి
చవటగద నినుం దలంప శంకరపత్నీ
అవసర మొచ్చిన మ్రొక్కుచు,
రిప్లయితొలగించండిఅవకాశము గలుగ మిడుకు నట్టి యధములౌ
చవటల నెప్పుడు గరుణిం
చవటగద నిను దలంప శంకర పత్నీ
కవనము గాదు ముక్తసరి కౌశికి భక్తులఁ బ్రోచు దేవియే
రిప్లయితొలగించండివివిధములంబరూపములు వేడినఁ దీర్చుట నన్ని వేళలన్
ప్రవచన కర్తలందరును ప్రాజ్ఞుల బోధనఁ దల్చ, "మోసగిం
*చవట గదా నినుం దలప శంకరపత్ని గణేశ్వరాంబికా!”*
వివరముతెలియనిభక్తుం
రిప్లయితొలగించండిడవమతితోడుత బలమునఠవఠవలాడన్
సవనముజేసిననుసహిం
చవటగదనినుందలంపశంకరపత్నీ
శివ నోలగించ కుండిన
రిప్లయితొలగించండిచవట గద ; నినుం దలంప శంకరపత్నీ
యవసర ములెల్ల దీరును
భువిపై జనులం దరకును మోదము తోడన్
భువి సంపద పెంపొందగ
రిప్లయితొలగించండిసవినయముగ లక్ష్మినడుగ సాధ్యంబగుగా
ఈ విషయమ్ము నెరుంగని
చవటగద నినుదలంప శంకరపత్నీ
అవమతిగాకమానసమునందుననిల్పుచునీదురూపమున్
రిప్లయితొలగించండిఅవిరళభక్తిభావమునహంసగసాధనసేయుభక్తునా
శివునెదిరించిబ్రోవగనుసేఁగినిసైతువుగాక, మోసగిం
చవటగదానినుందలంపశంకరపత్నిగణేశ్వరాంబికా
అవని జనుల్ నినుం గొలువ ఆర్తిని దీర్చెదవంచు నిచ్చలున్
రిప్లయితొలగించండిభువనములెల్ల నీ కృపను బొందగ పూజలు సేతురమ్మ రో
భవభయహారి వీవనుచు పాపము బాపెదవంచు దోస మెం
చవట గదా నినుం దలప శంకరపత్ని గణేశ్వరాంబికా
అవసరమున మ్రొ క్కులిడుచు
రిప్లయితొలగించండినవ సరము లు దీరు పిదప నాకే మనుచున్
భువి మెల గెడు వారిసహిం
చవట గద నినుందలo ప శంకర పత్నీ!
అవనిజనులు నినుఁ గొల్వగ
రిప్లయితొలగించండిభవనాశిని యార్తిఁ దీర్చి వరములనొసగే
భువనేశ్వరివట కీడెం
చవట గద నినుం దలంప శంకరపత్నీ
కందము
రిప్లయితొలగించండిఅవరోధంబులు రాగా
భవబంధములందుఁజిక్కు వరభక్తతతిన్
ప్రవిమలమతుల నుపేక్షిం
చవటగద!నినుందలంప శంకరపత్నీ.
చంపకమాల
తొలగించండిశివ!శివ!శాంకరీ!విబుధ సేవిత దివ్యపదారవింద!దు
ర్గ!విజయ!భైరవీ!యగజ!గౌరి!మహేశ్వరి!భద్రకాళి!భా
ర్గవి!నగనందినీ!గిరిజ!కౌశికి!భక్తులనెల్లఁద్రోసిపు
చ్చవటగదా!నినుందలప శంకరపత్ని!గణేశ్వరాంబికా!
రిప్లయితొలగించండిఅవివేకముతో నిత్యం
బవగడములనెన్నొ చేసె డాలరకుల పె
క్కువతో వారిదోషము నెం
చవట గద నినుం దలంప శంకరపత్నీ
భువనములేలు తల్లివని ముక్తినొసంగెడు దానవంచు నా
భవభయ నాశినిన్ గొలుచు భక్తజనాళిని బ్రోచునట్టి యా
శివ సతి పాదపద్మముల జేరిన దీనజనాళి దోషమెం
చవట గదా నినుం దలప శంకరపత్ని గణేశ్వరాంబికా.
అవనతమై నినువేడిన
రిప్లయితొలగించండిభవాని కరుణించెదవట పాపులనైనన్
శివయన యిడుములు బాధిం
చవట గద నినుం దలంప శంకరపత్నీ
శివశివయంచునిన్నెపుడు చిత్తమునందున నిల్పియున్నచో
తొలగించండిభవకులు సత్వరమ్ము తమబాధల నుండివిముక్తి నొందరా
భవభయహారి నీకృపను భక్తుల పైబడు కష్టముల్ రహిం
చవట గదా నినుం దలప శంకరపత్ని గణేశ్వరాంబికా
కం॥ భవమున నినుఁ గనని నరుఁడు
రిప్లయితొలగించండిచవట గద, నినుం దలంప శంకర పత్నీ
యవనిని శుభములఁ బడయమ
తవ కృప నొందగ నిరతముఁ దలచెద నమ్మా
చం॥ భవమునఁ బ్రోచి కాయుదువు భక్తుల నిన్నును నమ్మ కున్నచో
చవట గదా, నినుం దలప శంకర పత్ని గణేశ్వరాంబికా
యవనిని మమ్ము మోదముగ నాదర భావము నిల్పి చూతువే
తవ కరుణా కటాక్షమున ధన్యత నొందఁగ మ్రొక్కి వేడెదన్
కందం
రిప్లయితొలగించండిశివమున్ గూర్పఁగ జగతికి
భవునే విషమంద మనెడు పత్నివి జననీ!
యెవరికి నిడుములెపుడు పం
చవట గద నినుం దలంప శంకరపత్నీ!
చంపకమాల
శివమునొసంగ లోకులకు క్ష్వేళము మ్రింగుమటంచు భర్తనే
జవమున గోరితే జనని సర్వశుభంకరి శత్రుభీకరీ!
భువనవశంకరీ! జయము! ప్రోవఁగ మమ్ములఁ బూని జాగు నెం
చవట గదా నినుం దలప శంకరపత్ని! గణేశ్వరాంబికా!
శంకరాభరణం గ్రూప్ వారిచ్చిన సమస్యలకు నా పూరణలు
రిప్లయితొలగించండిశివసతి ననవరతమ్మును
స్తవముల తోడను నుతించ దయతో మాకున్
శివమొసగుచుదోసములెం
*చవటగద నినున్ దలంప శంకరపత్నీ*
స్తవన ముచేయుచున్ మనము చక్కగ గొల్చిన నంబ తాదయన్
జవము నచూపి కష్టము లుసర్వు లకున్ సతతంబుబాపుచున్
శివములు కూర్చుచుందువట శీఘ్రముగానిక నెప్పు డీవు నెం
*“చవట గదా నినుం దలప శంకరపత్ని గణేశ్వరాంబికా*
అవని తలంబునందున గడాదర
రిప్లయితొలగించండిభావముతోడ నిత్యము
న్నవిరళ చిత్తశుద్ధిమెయి యర్చన
జేసెడు భక్త కోటికిన్
భవికము దప్పకుండ వెస భార్గవి
తీర్చెదవంట యేది దా
చవట గదా నినుందలప శంకర
పత్ని గణేశ్వరాంబికా!
రిప్లయితొలగించండిపిన్నక నాగేశ్వరరావు.
హనుమకొండ.
అవిరళమగు పూజలతో
స్తవమెంతయు చేయ జనులు సర్వజ్ఞ సతీ!
భవ సాగరమున వెతలుం
చవట గద నినుం దలంప శంకర పత్నీ!