31-7-2023 (సోమవారం)కవిమిత్రులారా,ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...“పిడికిలిలోనఁ గనుపించె విధుఁడును రవియున్”(లేదా...)“పిడికిలిలోనఁ గాంచితిని వింతగఁ జంద్ర దినేశ బింబముల్”
విడువడు కృష్ణుడు భీష్మునిపొడమినకోపముకనలెను పూషునివోలెన్కడకును చంద్రుడునాయెగపిడికిలిలోనకనిపించెవిధుడునురవియున్
చం.గొడవల దెంపు నొజ్జ సమకూర్చును విద్యలు బద్ధదృష్టిచేతడబడుచున్న నాకు గురుదక్షిణ గోరని శాస్త సన్నిధిన్ వడివడి నేను పల్క శ్రుతి బాండితి లేదని శాపమిచ్చెడిన్ *పిడికిలిలోనఁ గాంచితిని వింతగఁ జంద్ర దినేశ బింబముల్.*
కొడుకట పేరిమి జూపుచునడిగితినని తెచ్చి యిచ్చె నద్భుతమగు నాగడసరి ఫోనది పట్టగపిడికిలిలోనఁ , గనుపించె విధుఁడును రవియున్అడిగితినంచు ఖర్చనక నద్భుతమైన మొబైలు ఫోను నాకొడుకట పట్టణమ్ము జని కూరిమి జూపుచు తెచ్చె జూడగాపడమిని కొండకోనలు సముద్రములున్ గన నెంచి పట్టితిన్ పిడికిలిలోనఁ , గాంచితిని వింతగఁ జంద్ర దినేశ బింబముల్
కోరగ కొడుకిచ్చె పసిడితో రవిచంద్రులు గలనొక తులమునకు సరిన్భారము గల హారమునేపిడికిలిలోన గనుపించె విధుడును రవియున్
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
పిడికిలి బిగియించిన భీముడు పైబడి మోదగ మతిపోయినవాడై కడు భయపడు కీచకునకుపిడికిలిలోనఁ గనుపించె విధుఁడును రవియున్
అడిగెను యశోద కృష్ణుని"గడసరి! తెరువుమిక నోరు కణ్ణా" యని, యాతడికరముపై బిగించెనుపిడికిలి; లోనఁ గనుపించె విధుఁడును రవియున్
కందం:వడివడి నటనాస్థలిలోపిడికిలితో సింహబలుని భీముడు మోదన్చిడిముడిపడి తాఁదలచెనుపిడికిలిలోనఁ గనుపించె విధుఁడును రవియున్చంపకమాల:వడివడి జేరె కీచకుడు భామినిఁ గూడగ నాట్యశాలకున్పడతుక రూపుదాల్చియట వానిని జంపఁగ వేచి భీముడేపిడికిలినెత్తి కీచకుని బిట్టుగ మోదఁగ తాదలంచె హా!పిడికిలిలోనఁ గాంచితిని వింతగఁ జంద్ర దినేశ బింబముల్
గడగడ లాడే గారడితడబడి చూపించి నపుడు తంత్రము తోడన్గడు వడి జనులకు ద న దౌ పిడికిలి లో న గను పించె విధుడును రవియున్
అడిగిన వెంటనె పడతికిగెడ కరముల కలముతోడ గీసితి నెరిగన్ముడిచిన చేతులు విప్పగపిడికిలిలోనఁ గనుపించె విధుఁడును రవియున్
కందంమిడిసిపడుచు మన్నుఁ దినెడుబుడతడిఁ జూపుమన జనని, మోమున జూపన్జడియక విడి మంటిఁ గలుగుపిడికిలి, లోనఁ గనుపించె విధుఁడును రవియున్ యశోద తనతో తను మాటాడుచు...చంపకమాలమిడియుచు బాల కృష్ణుఁడు భ్రమింపగ జేయగ మట్టి మెక్కుచున్వడిజని మోముజూపమని పట్టుచు కర్ణము కోపగింపగన్జడియక చూపఁగన్ విడుచు జారగ మట్టిని గల్గి నట్టిదౌపిడికిలి, లోనఁ గాంచితిని వింతగఁ జంద్ర దినేశ బింబముల్
అడుగగ నాతియు భీముడు వడిగా కీచకుని కొట్టి వధియించంగా వడకుచు తలంచె మది నా పిడికిలి లోన కనిపించె విధుడును రవియున్
విడువడు కృష్ణుడు భీష్ముని
రిప్లయితొలగించండిపొడమినకోపముకనలెను పూషునివోలెన్
కడకును చంద్రుడునాయెగ
పిడికిలిలోనకనిపించెవిధుడునురవియున్
చం.
రిప్లయితొలగించండిగొడవల దెంపు నొజ్జ సమకూర్చును విద్యలు బద్ధదృష్టిచే
తడబడుచున్న నాకు గురుదక్షిణ గోరని శాస్త సన్నిధిన్
వడివడి నేను పల్క శ్రుతి బాండితి లేదని శాపమిచ్చెడిన్
*పిడికిలిలోనఁ గాంచితిని వింతగఁ జంద్ర దినేశ బింబముల్.*
కొడుకట పేరిమి జూపుచు
రిప్లయితొలగించండినడిగితినని తెచ్చి యిచ్చె నద్భుతమగు నా
గడసరి ఫోనది పట్టగ
పిడికిలిలోనఁ , గనుపించె విధుఁడును రవియున్
అడిగితినంచు ఖర్చనక నద్భుతమైన మొబైలు ఫోను నా
కొడుకట పట్టణమ్ము జని కూరిమి జూపుచు తెచ్చె జూడగా
పడమిని కొండకోనలు సముద్రములున్ గన నెంచి పట్టితిన్
పిడికిలిలోనఁ , గాంచితిని వింతగఁ జంద్ర దినేశ బింబముల్
కోరగ కొడుకిచ్చె పసిడి
రిప్లయితొలగించండితో రవిచంద్రులు గలనొక తులమునకు సరిన్
భారము గల హారమునే
పిడికిలిలోన గనుపించె విధుడును రవియున్
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండి
రిప్లయితొలగించండిపిడికిలి బిగియించిన భీ
ముడు పైబడి మోదగ మతిపోయినవాడై
కడు భయపడు కీచకునకు
పిడికిలిలోనఁ గనుపించె విధుఁడును రవియున్
అడిగెను యశోద కృష్ణుని
రిప్లయితొలగించండి"గడసరి! తెరువుమిక నోరు కణ్ణా" యని, యా
తడికరముపై బిగించెను
పిడికిలి; లోనఁ గనుపించె విధుఁడును రవియున్
కందం:
రిప్లయితొలగించండివడివడి నటనాస్థలిలో
పిడికిలితో సింహబలుని భీముడు మోదన్
చిడిముడిపడి తాఁదలచెను
పిడికిలిలోనఁ గనుపించె విధుఁడును రవియున్
చంపకమాల:
వడివడి జేరె కీచకుడు భామినిఁ గూడగ నాట్యశాలకున్
పడతుక రూపుదాల్చియట వానిని జంపఁగ వేచి భీముడే
పిడికిలినెత్తి కీచకుని బిట్టుగ మోదఁగ తాదలంచె హా!
పిడికిలిలోనఁ గాంచితిని వింతగఁ జంద్ర దినేశ బింబముల్
గడగడ లాడే గారడి
రిప్లయితొలగించండితడబడి చూపించి నపుడు తంత్రము తోడన్
గడు వడి జనులకు ద న దౌ
పిడికిలి లో న గను పించె విధుడును రవియున్
అడిగిన వెంటనె పడతికి
రిప్లయితొలగించండిగెడ కరముల కలముతోడ గీసితి నెరిగన్
ముడిచిన చేతులు విప్పగ
పిడికిలిలోనఁ గనుపించె విధుఁడును రవియున్
కందం
రిప్లయితొలగించండిమిడిసిపడుచు మన్నుఁ దినెడు
బుడతడిఁ జూపుమన జనని, మోమున జూపన్
జడియక విడి మంటిఁ గలుగు
పిడికిలి, లోనఁ గనుపించె విధుఁడును రవియున్
యశోద తనతో తను మాటాడుచు...
చంపకమాల
మిడియుచు బాల కృష్ణుఁడు భ్రమింపగ జేయగ మట్టి మెక్కుచున్
వడిజని మోముజూపమని పట్టుచు కర్ణము కోపగింపగన్
జడియక చూపఁగన్ విడుచు జారగ మట్టిని గల్గి నట్టిదౌ
పిడికిలి, లోనఁ గాంచితిని వింతగఁ జంద్ర దినేశ బింబముల్
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండిఅడుగగ నాతియు భీముడు
రిప్లయితొలగించండివడిగా కీచకుని కొట్టి వధియించంగా
వడకుచు తలంచె మది నా
పిడికిలి లోన కనిపించె విధుడును రవియున్