26-7-2023 (బుధవారం)కాకి - డేగ - నెమలి - కోడిపై పదాలను అన్యార్థంలో ప్రయోగిస్తూభారతార్థంలో స్వేచ్ఛాఛందంలోపద్యం వ్రాయండి.
ఏకాకిగ నతడేగగ,చీకాకు పరచిరతనిని చిరు బాలుడినే,రాకాసి వంచనకోడి,రాకనె జచ్చెనె, మలిన మరయ డతడయ్యో! (పద్మవ్యూహంలో అభిమన్యుడు)
బాలు డేగ నే కాకిగ బవర మునకుచుట్టు ముట్టి రి వైరులు మట్టు బెట్టవారి కోడి యు వెనుకకు పార కుండతానె మలిచియు నిలిచెను ధైర్య ముగను
కోడిగమాడిరి ధూర్తులుచేడియనేకాకి సేసి చేలములూడ్చన్ నాడే గండ నిలుపడే?పాడియగునె మలికనిట్లు భంగించుటయే. గండ ...భర్త; మలిక ....రాణి.
చీకాకింతయులేకనుఆకౌరవుడేగనంతహరియున్జూడన్చేకొనెమలిమరియాదనుతాకలకోడియుపిదపవుననిలోజచ్చెన్దుర్యోధనుడు కృష్ణునిసాయమర్థించిన సందర్భము
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
తేటగీతివినె'నె?మలి'న వస్త్రనటన్న వెలఁది మాటభీముఁ'డే గ'దతో వానిపీచమణచె ఔర!యభిమన్యుఁడే'కాకి 'యగుచు పోరెకూడి యందఱితో ,తుద'కోడి'పోయె.
కృష్ణునె మలి పొద్దు దలచితృష్ణతొ రుక్మిణి వలచెను తానే కాకిన్కృష్ణుండేగ పతియనియుతృష్ణతొ గైకోడిక నను తా శిశుపాలున్
తే. గీ.నాంది సౌభద్రుడే గర్జన నొనరించెఁజేసిరేకాకిగా పోరు చెలగె, సైంధవ వర శక్తికోడితిమిలే, వధ్యుడతడుచెల్లునె మలికితము, కృష్ణ! శ్రేయ మెద్ది?
ఉత్తర గోగ్రహణ సమయంలో ఉత్తరకుమారుడు పయనమగు సందర్భముతే॥గీ॥పసిని కాయ నే’కాకి’గ పయన మగుదుననగ’నె మలి’కితము నొందిరచటి వారుఆత’డేగ’ బో వ కిరీటి యనుసరించికొసరు నీకు తీరదనుచు ‘కోడి’గించె
[నర్తనశాలలో నిశీధిలో...]భీమ సేనుడేకాకిగ వెడలెనటకుమారుత సుతుడేగగ గనె మలినముఖుడుకేశనియని తలంచెను కీచకుండుకోడిగీడు చంపెనుగద ఘోరరీతి
ఫల్గుణునిసుతుఁ*డేగ*గా బవరమందుబాలునే*కాకి*నింజేసి పలువురచటదయయు లేక*నెమలి*నహృదయులుగాఁగకూల జేసిరి నిర్దయ*కోడి*రకట
అభిమన్యుడు పద్మవ్యూహములో ఒంటరిగా చని యుద్ధము చేయుటతే॥ బవర మందునేకాకిగ బాలుఁడేగకోడిగము తోడ చుట్టిరి కుత్సితులునువీడెనె మలికత మనుచు వీరుఁడచటభీకర యనిని జేసెను భీతిఁ గనక కోడిగము విలాస చేష్టమలికితము సందేహము (నిఘంటువు సహాయము)
స్వరము లో అర్జునుని తో ఊర్వశి:కందంఏకాకివి దివిలోననిసోకుల నాడే గరితను సోకవదేలా?తాకగ నంటునె మలినము?నీకోడి సుఖింప లలన నేరమ్మగునే?
కీచకా కిల్బిషపు తలపు కీడుచేయునెప్పుడేగతి నీ చావు చొప్పడునొ యెఱుంగలేవు మున్నె, మలిన భంగి తోడనెందుకోడిపోవుట, నాథు లీసు నొంద
తగునె? మలినంబు మనసంత దాచి వారుపిలచి కోడిగ మాడిరి బేలుగానుద్రౌపదే కాకియై యేడ్చు తరుణమందుకృష్ణుడే గద కాపాడె కృపను జూపి.
ఏకాకిగ నతడేగగ,
రిప్లయితొలగించండిచీకాకు పరచిరతనిని చిరు బాలుడినే,
రాకాసి వంచనకోడి,
రాకనె జచ్చెనె, మలిన మరయ డతడయ్యో! (పద్మవ్యూహంలో అభిమన్యుడు)
బాలు డేగ నే కాకిగ బవర మునకు
రిప్లయితొలగించండిచుట్టు ముట్టి రి వైరులు మట్టు బెట్ట
వారి కోడి యు వెనుకకు పార కుండ
తానె మలిచియు నిలిచెను ధైర్య ముగను
కోడిగమాడిరి ధూర్తులు
రిప్లయితొలగించండిచేడియనేకాకి సేసి చేలములూడ్చన్
నాడే గండ నిలుపడే?
పాడియగునె మలికనిట్లు భంగించుటయే.
గండ ...భర్త; మలిక ....రాణి.
చీకాకింతయులేకను
రిప్లయితొలగించండిఆకౌరవుడేగనంతహరియున్జూడన్
చేకొనెమలిమరియాదను
తాకలకోడియుపిదపవుననిలోజచ్చెన్
దుర్యోధనుడు కృష్ణునిసాయమర్థించిన సందర్భము
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండిఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండితేటగీతి
రిప్లయితొలగించండివినె'నె?మలి'న వస్త్రనటన్న వెలఁది మాట
భీముఁ'డే గ'దతో వానిపీచమణచె
ఔర!యభిమన్యుఁడే'కాకి 'యగుచు పోరె
కూడి యందఱితో ,తుద'కోడి'పోయె.
కృష్ణునె మలి పొద్దు దలచి
రిప్లయితొలగించండితృష్ణతొ రుక్మిణి వలచెను తానే కాకిన్
కృష్ణుండేగ పతియనియు
తృష్ణతొ గైకోడిక నను తా శిశుపాలున్
తే. గీ.
రిప్లయితొలగించండినాంది సౌభద్రుడే గర్జన నొనరించెఁ
జేసిరేకాకిగా పోరు చెలగె, సైంధ
వ వర శక్తికోడితిమిలే, వధ్యుడతడు
చెల్లునె మలికితము, కృష్ణ! శ్రేయ మెద్ది?
ఉత్తర గోగ్రహణ సమయంలో ఉత్తరకుమారుడు పయనమగు సందర్భము
రిప్లయితొలగించండితే॥గీ॥
పసిని కాయ నే’కాకి’గ పయన మగుదు
ననగ’నె మలి’కితము నొందిరచటి వారు
ఆత’డేగ’ బో వ కిరీటి యనుసరించి
కొసరు నీకు తీరదనుచు ‘కోడి’గించె
[నర్తనశాలలో నిశీధిలో...]
రిప్లయితొలగించండిభీమ సేనుడేకాకిగ వెడలెనటకు
మారుత సుతుడేగగ గనె మలినముఖుడు
కేశనియని తలంచెను కీచకుండు
కోడిగీడు చంపెనుగద ఘోరరీతి
ఫల్గుణునిసుతుఁ*డేగ*గా బవరమందు
రిప్లయితొలగించండిబాలునే*కాకి*నింజేసి పలువురచట
దయయు లేక*నెమలి*నహృదయులుగాఁగ
కూల జేసిరి నిర్దయ*కోడి*రకట
అభిమన్యుడు పద్మవ్యూహములో ఒంటరిగా చని యుద్ధము చేయుట
రిప్లయితొలగించండితే॥ బవర మందునేకాకిగ బాలుఁడేగ
కోడిగము తోడ చుట్టిరి కుత్సితులును
వీడెనె మలికత మనుచు వీరుఁడచట
భీకర యనిని జేసెను భీతిఁ గనక
కోడిగము విలాస చేష్ట
మలికితము సందేహము (నిఘంటువు సహాయము)
స్వరము లో అర్జునుని తో ఊర్వశి:
రిప్లయితొలగించండికందం
ఏకాకివి దివిలోనని
సోకుల నాడే గరితను సోకవదేలా?
తాకగ నంటునె మలినము?
నీకోడి సుఖింప లలన నేరమ్మగునే?
కీచకా కిల్బిషపు తలపు కీడుచేయు
రిప్లయితొలగించండినెప్పుడేగతి నీ చావు చొప్పడునొ యె
ఱుంగలేవు మున్నె, మలిన భంగి తోడ
నెందుకోడిపోవుట, నాథు లీసు నొంద
తగునె? మలినంబు మనసంత దాచి వారు
రిప్లయితొలగించండిపిలచి కోడిగ మాడిరి బేలుగాను
ద్రౌపదే కాకియై యేడ్చు తరుణమందు
కృష్ణుడే గద కాపాడె కృపను జూపి.