20, జులై 2023, గురువారం

సమస్య - 4481

21-7-2023 (శుక్రవారం)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“ఏ గురుఁడు గనిపెట్టె యడాగమముల”
(లేదా...)
“ఔర యడాగమంబులు నుగాగమముల్ గనిపెట్టి రెవ్వరో”

17 కామెంట్‌లు:


  1. బాగుగ పలుకవ లయుమన భాషనెపుడు
    లోగడ ప్రజలనోట బలికెడు విధము
    నేగద మనవ్యా కరణమ్మ నిరి గురువులు
    ఏగురు(డు గనిపెట్టె యడాగమముల.

    రిప్లయితొలగించండి
  2. ఉ.

    తీరెను రాజరాజ నర దేవర కోరిక భారతమ్ముగా
    లేరట చిన్నయాఖ్యుడును లెస్సగు వ్యాకరణోపలబ్ధియున్
    నేరుపు నన్నయాంధ్రమున నిక్కముగా కనిపించు శ్రేష్ఠమై
    *ఔర యడాగమంబులు నుగాగమముల్ గనిపెట్టి రెవ్వరో!*

    రిప్లయితొలగించండి
  3. ఆరయచిన్మయుండునగునాంధ్రునితేజమునాగమంబునై
    తేరెనువింగడించుతఱితెల్గులసంధులజెప్పుచోటులో
    వేరునతేటమాటలకువిస్తరముగనెచండశాసనుల్
    ఔరయడాగమంబులునుగాగమంబులుగనిపెట్టిరెవ్వరో

    రిప్లయితొలగించండి
  4. చేరెనువింగడించుతఱి
    వేరునతేటమాటలకువిస్తరమున్

    రిప్లయితొలగించండి
  5. తేటగీతి
    భావఝరిని పద్యమ్మును బలుకుచుండ
    పంటి క్రింది రాయివలె నిబ్బందిఁ గూర్చు
    తగవను నుగాగమమ్ములు దప్పనివన
    నే గురుఁడు గనిపెట్టె యడాగమముల?

    ఉత్పలమాల
    ధారగ పద్యమున్ నుడువ దాగక నోటిని దాటివచ్చుచున్
    గూరిన పల్కులున్ దగక కోవిదులొప్పరటన్న మీదటన్
    బోరుపడంగ జేయుచు విమోచనమెంచగ నూహకందవే
    యౌర! యడాగమంబులు నుగాగమముల్ గనిపెట్టి రెవ్వరో?

    రిప్లయితొలగించండి

  6. ఆవు యది యనగానె కాదావది యని
    యుత్వమునకచ్చు పరమైన యుండదిక య
    డాగమమనుచు సరిచేసె నాగురువట
    నే గురుఁడు గనిపెట్టె యడాగమముల.


    దూరుచు నుందురెప్పుడును దుష్టసమాసము లంచు మేటిగా
    సూరులు చెప్పినట్టి పలు సూత్రములన్ వచియించు చుండగా
    సౌరపదమ్ములన్ నిలిపి చక్కని పద్యము వ్రాయు టెట్టులో
    ఔర యడాగమంబులు నుగాగమముల్ గనిపెట్టి రెవ్వరో.

    రిప్లయితొలగించండి
  7. తెలుగు భాషను సొగసుగా దీర్చి దిద్ద
    వ్యాక ర ణు లిల నియమాలు పద్ధతులను
    జొనిపి య య్యె డ వ్రాసిన సూత్ర ము లవి
    యే గురుడు గని పెట్టె యడాగమముల

    రిప్లయితొలగించండి
  8. “ఏ గురుఁడు గనిపెట్టె యడాగమముల”
    యని యడిగిరే ! కలిపి యుంచ ననువు కలుగ
    వలయు నియతి నిలుపవచ్చు, పదముల నడి
    నొరిమ లేక లంచము నీయ నొప్పును గద !

    రిప్లయితొలగించండి
  9. ఆరయ మాతృ భాషయని యద్భుత
    పద్యము లల్లబూనితిన్
    సారపు పద్యమల్లినను సత్యము
    దప్పులు దొర్లుచుండెడిన్
    నేరక యుంటి యిప్పటికి నేను
    విశేషపు టల్ప దోషముల్
    ఔరయడాగమంబులు నుగాగముల్
    గనిపెట్టి రెవ్వరో !

    రిప్లయితొలగించండి
  10. తీరుగ వ్రాయ బూనితి మదీయ ప్రయత్నము లందునే సదా
    మీరక సంధి సూత్రముల మేరకె వ్రాయగ జూచిగూడ ను
    న్నారయ లేకబోతిని యడాగమమాదులు సంధులయ్యరో!
    ఔర యడాగమంబులు నుగాగమముల్ గనిపెట్టిరెవ్వరో.

    రిప్లయితొలగించండి
  11. ఏ గురుఁడు గనిపెట్టె యడాగమముల
    నే గురుఁడు గనిపెట్టె నుగాగమముల
    నే గురుఁడు గనిపెట్టె రుగాగమముల
    నే గురుఁడు వివరించె నీ యోగములను


    తీరుగ పద్య సృష్టికని తీరిక చిక్కిన వేళ చోద్యమై
    బారులు తీరెనామదిని ప్రశ్నలు సంశయ ముక్తిఁ గోరుచున్
    నేరములెత్తి చూపుటకు నేర్పుగ సంధులఁ సృష్టి సేసిరో!
    ఔర! యడాగమంబులు నుగాగమముల్ గనిపెట్టి రెవ్వరో

    రిప్లయితొలగించండి
  12. ఆగమమ్ము నాదేశమ్ము లర్ధబిందు
    వాదిగా పద బంధముల్ ప్రోదిచేసి
    సంధిపొసగని పదముల సంగడించ
    నే గురుఁడు గనిపెట్టె యడాగమముల?

    రిప్లయితొలగించండి
  13. తోరమునందు పుష్పముల దోరముగా ఘటియించు నట్టులన్
    కూరిమి నందమైన పదగుంఫనముల్ సమకూర్చునప్పు డిం
    పార పదంబులన్గలిపి పద్యములల్లెడు సంధులందు నౌ
    రౌర యడాగమంబులు నుగాగమముల్ గనిపెట్టి రెవ్వరో

    రిప్లయితొలగించండి
  14. తే॥ భాషకు పులిమిరి యధిక వ్యాకరణము
    సంధులను సమాసములను బంధమాయెఁ
    జక్కఁగను బద్యమును వ్రాయఁ జిక్కు లాయె
    యే గురుఁడు గనిపెట్టె యడాగమముల

    ఉ॥ నేరకఁ బద్యకావ్యమును నేమము తోడను వ్రాయఁ బూనితిన్
    మారఁగఁ జేయ నచ్చులను మచ్చికఁ జేసిన సంధి సూత్రముల్
    గోరిన పద్యమాలలను గూర్చఁగ సాధ్యము గాకఁ బోయెనే
    యౌర యడాగమంబులు నుగాగమముల్ గని పెట్టిరెవ్వరో

    (పదివీ విరమణానంతరము పద్యములు వ్రాయట ప్రారంభించిన క్రొత్తలో నాఅనుభవమే నండి)

    రిప్లయితొలగించండి
  15. నేరిచి ప్రాసలన్ యతుల నీమములన్ బలు ఛంద రీతులన్
    నేరుగ వ్రాయబూనితిని నేనొక పద్యము నందు ముందుగా
    "వారలఁ జందనంబలది" పల్కగ దోచె నసాధుశబ్ద మౌ
    రౌర యడాగమంబులు నుగాగమముల్ గనిపెట్టి రెవ్వరో

    రిప్లయితొలగించండి
  16. జారుచు వచ్చునే సులువు చక్క నుగాగమె పంపులన్ పరూ
    షన్ రవమే మరీ సరళ చందముగన్ సరళాలకున్ పరం
    బై రుచిగా యడాగమము వచ్చును సంధియు లేని చోటనే
    ఔర యడాగమంబులు నుగాగముల్ గనిపెట్టిరెవ్వరో

    రిప్లయితొలగించండి

  17. పిన్నక నాగేశ్వరరావు.
    హనుమకొండ.

    పద్యమును వ్రాయగా నడ్డుపడుచు నుండె
    పంటిక్రింద రాయి వలెను పలు తడవలు
    నెచ్చట యడాగమమొ మరి యెట నుగాగ
    మమ్ము నుంచవలెనొ తికమక పడితి
    యే గురుడు గనిపెట్టె యడాగమముల?
    2 వ పూరణము.
    పద్యమును వ్రాయ తికమక పడుచునుంటి
    నెచ్చట యడాగమమొ మరి యెట నుగాగ
    మమొ తెలియక యోచించుచు మధనపడితి
    యే గురుడు గనిపెట్టె యడాగమముల?

    రిప్లయితొలగించండి