5, జులై 2023, బుధవారం

సమస్య - 4468

6-7-2023 (గురువారం)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“మేడిపండులో విశ్వమున్ జూడఁగలము”
(లేదా...)
“వింతగఁ గానుపించునఁట విశ్వము సర్వము మేడిపండులో”

17 కామెంట్‌లు:

  1. తేటగీతి
    ఆటకైనఁ బాటకయినఁ గూటికైనఁ
    బురుగు పట్టిన లోకాన బుద్ధులొకటె
    స్వార్థ, రాజకీయాలవె వరలు, వెరశి
    మేడిపండులో విశ్వమున్ జూడఁగలము

    ఉత్పలమాల
    అంతట రాజకీయముల నాటకు పాటకు కూటికైనయున్
    వంతలు వెట్టుచున్ బురుగు పట్టిన రీతిగ లోకముండఁగన్
    జింతన జేసి చూచిననె చిత్తమునందున తేటతెల్లమై
    వింతగఁ గానుపించునఁట విశ్వము సర్వము మేడిపండులో!

    రిప్లయితొలగించండి
  2. కనులు మూసిక్షణము నందె కాశికేగ
    గలము, మేఘయానము జేయ గలము, వూహ
    కేది హద్దసాధ్యమె లేదు, మదిని దలచి
    మేడిపండు లో విశ్వమున్ జూడ(గలము

    రిప్లయితొలగించండి
  3. గంతలుగట్టికన్నులకఘంబులనెన్నిటినైనజేయుచున్
    సుంతయుతాపమున్గనకషోడశపూర్ణుడుచంద్రుడాయనన్
    చింతనులేకమానవుడుసిగ్గునులేకనుసాగుచుండగా
    వింతగసాగుచుండెనటవిశ్వముసర్వముమేడిపండులో

    రిప్లయితొలగించండి
  4. అణువణువునను దాగియుండును జగమ్ము
    సూక్ష్మ రూపమై, పూర్ణమే సుమ్ము ప్రతి క
    ణము, మనిషిలోన,పూవులోన, శిల లోన,
    మేడిపండులో విశ్వమున్ జూడఁగలము”



    రిప్లయితొలగించండి
  5. ఆధునిక కాల మందున నరుదు గాగ
    వింత వింతలు సృష్టించు విజ్ను లగు చు
    శాస్త్ర వేత్తల కృషి చేత సాధ్య మవగ మేడి పండులో విశ్వమున్ జూడ గలము

    రిప్లయితొలగించండి

  6. అవని గోళపుటాకార మదియె గాంచ
    నధిక సుందరమే కాని యంతరమున
    లుకలుకలవెన్నియోగల లోకము గన
    మేడిపండులో విశ్వమున్ జూడఁగలము.


    చెంతన జేరినట్టి ప్రియ శిష్యుల గాంచుచు మాన్యు డైన వే
    దాంతమెఱంగినట్టి యొక తాత్వికు డిట్లనె సృష్టిలో సము
    ద్రాంతయె బాహ్యమందుకడు రాణ, వికారమె లోన గాంచినన్
    వింతగఁ గానుపించునఁట విశ్వము సర్వము మేడిపండులో.

    రిప్లయితొలగించండి
  7. చంద్ర శేఖరుడు మహేంద్రజాలికుండు
    వీలగునట వాని మహేంద్ర జాలమందు
    బోడి గుండుపై నెఱకలు చూడనగును
    మేడిపండులో విశ్వమున్ జూడఁగలము

    వింతగ తోచునెల్లరకు వేదికపైని మహేంద్రజాలమే
    చెంతనుచేరి ప్రేక్షకులు చెప్పిన వన్నియు చేయునాతడే
    భ్రాంతికిలోనుజేయునట స్వాంతము హర్షమునొందు రీతిగా
    వింతగఁ గానుపించునఁట విశ్వము సర్వము మేడిపండులో

    రిప్లయితొలగించండి
  8. నిరతమవినీతి నెరపెడు నేతలుండి
    యెల్లెడల జెడు వేగమె యెదుగు చుండ
    నింపుగ పొదలు సంఘము నెంచి తలచ
    మేడిపండులో విశ్వమున్ జూడఁగలము

    రిప్లయితొలగించండి
  9. అంతయు తానెయైనటుల నాప్తుని రీతిగ పేదసాదలం
    దెంతయు జూపు నక్కటిక మెన్నడు నూనడు మానసంబునన్
    సుంతయు ప్రేమ వారియెడ, చోద్యము కాదొకొ! యెంచి చూడగన్
    వింతగఁ గానుపించునఁట విశ్వము సర్వము మేడిపండులో

    రిప్లయితొలగించండి
  10. మాటలందున జూపును మంచితనము
    మనసులో నిండి యుండును మచ్చరమ్ము
    మేక ముసుగున దాగిన మెకము వాడు
    మేడిపండులో విశ్వమున్ జూడఁగలము

    రిప్లయితొలగించండి
  11. తే॥ నోటిలోఁ బదునాలుగు మేటి గాను
    భువన భాండము లిముడఁగ బుద్ధి నిలిపి
    దైవ తత్వమరియఁగాను దప్పకుండ
    మేడి పండులో విశ్వమున్ జూడఁ గలము

    ఉ॥ ఇంతనిఁ దెల్పవీలగున యీశుని లీలలు జ్ఞాన మొందుమా
    అంతయు నంతటా యతఁడె యన్యము లేదయ యీజగత్తునన్
    బొంతము లేని మాటనకు బుద్ధిగఁ గృష్ణునిఁ దల్చి చూచినన్
    వింతగఁ గానుపించునఁట విశ్వము సర్వము మేడిపండులో

    రిప్లయితొలగించండి
  12. అంతయు రాష్ట్ర సంపద నరాధము లెల్లరు మ్రింగ జూడగా,
    సుంతయు గానరాదుగ వసుంధర నంతట నీతి యింక, నీ
    వెంతయు నేడ్చినన్ ఫలిత మింతయు లేదని యీ వెరుంగమా,
    వింతగఁ గానుపించునఁట విశ్వము సర్వము మేడిపండులో.

    రిప్లయితొలగించండి
  13. సంతత మెల్ల నేతలు ప్రజన్
    దమ వైపుకు త్రిప్ప తంత్రముల్
    వింతగ బన్నుచుంద్రు సుమి
    పేదల కెల్లను బాధలేవియున్
    చెంతకు జేరవటంచు బ్రేమతో
    జెప్పుదు రెన్నికవేళ నేతలున్
    వింతగ గానుపించునట విశ్వము
    సర్వము మేడిపండులో .

    రిప్లయితొలగించండి
  14. ఉ.

    తంతులు స్నేహ పూర్వకము తామస మానవ దృష్టి కోణమున్
    గుంతలు లేని దారులను గూర్చుట మాటలె రాజకీయమే
    చింతలు లేక సౌఖ్యమును జేర్చుట సాధ్యము బాసలందురే
    *వింతగఁ గానుపించునఁట విశ్వము సర్వము మేడిపండులో.*

    రిప్లయితొలగించండి

  15. పిన్నక నాగేశ్వరరావు.
    హనుమకొండ.

    మేలుతరముగ కనిపించు మేడిపండు
    నరయ లోపల నుండును పురుగులెన్నొ
    యవని యాకారమున్ గాంచ నందమొలుకు
    లోన నుండవచ్చును లుకలుకలు చాల
    భ్రమయె గద విశ్వమున్ మేడిపండు రీతి
    మేడిపండులో విశ్వమున్ జూడగలము.

    రిప్లయితొలగించండి
  16. అందరిమనములందున నచ్యుతుండు
    నుండుననుమాటనమ్ముచునొప్పుగాను
    చోటునందిన చాలునుశుభకరముగ
    *“మేడిపండులో విశ్వమున్ జూడఁగలము”*

    రిప్లయితొలగించండి