ధార్మికుడగు తండ్రి యొకడు ధర్మము గూర్చి తెలిపె తన తనయకు ప్రీతిన్ నిర్మల! పతిని విడి మొదట ధర్మవిరుద్ధమ్మె యగును తండ్రికి మ్రొక్కన్.
ధార్మికుడైన తండ్రి తన దారిక తోడ వచించె నిట్టులన్ నిర్మల మానసమ్ముగల నేత్రుడె నీకిల దైవ మంచు నీ వోర్మి వహించి ముందుగను వోఢ నమించుట మేలు ముందుగా ధర్మవిరుద్ధమౌను గద తండ్రికి సాగిలి మ్రొక్కు కార్యమే.
అర్మిలిపెంచినతనయుని
రిప్లయితొలగించండికర్మకువదలియుజగతినికరుణనువీఁడన్
ధర్మవిరుద్ధమెయగును, తండ్రికిమ్రొక్కన్
నిర్మలుడగుగాతనయుఁడు నిజమారయగన్
ధర్మము లేనియు కీచక
రిప్లయితొలగించండిదుర్మార్గుడగు పినతండ్రి తుచ్చుడగుటనే
కర్మమని వదిలి వేసిన
ధర్మ విరుద్ధమ్మె యగును తండ్రికి మొక్కన్
మర్మమెరుంగక మెలగుట
రిప్లయితొలగించండిధర్మవిరుద్ధమ్మె యగును; తండ్రికి మ్రొక్కన్
ధర్మము కాదంచు నుడువ
ధర్మవిరుద్ధమ్మె యగును ధరపైనెపుడున్
మర్మమెరుంగ ముక్తినిడుమార్గము నిశ్చల భక్తిమార్గమే
తొలగించండినిర్మలచిత్తులై జనులు నిర్గుణ మూర్తికి పూజ సల్పుటే
ధర్మము దైవదూషణకు తండిరి పాల్పడు తోయమందునన్
ధర్మవిరుద్ధమౌను గద తండ్రికి సాగిలి మ్రొక్కు కార్యమే
రిప్లయితొలగించండిధార్మికుడగు తండ్రి యొకడు
ధర్మము గూర్చి తెలిపె తన తనయకు ప్రీతిన్
నిర్మల! పతిని విడి మొదట
ధర్మవిరుద్ధమ్మె యగును తండ్రికి మ్రొక్కన్.
ధార్మికుడైన తండ్రి తన దారిక తోడ వచించె నిట్టులన్
నిర్మల మానసమ్ముగల నేత్రుడె నీకిల దైవ మంచు నీ
వోర్మి వహించి ముందుగను వోఢ నమించుట మేలు ముందుగా
ధర్మవిరుద్ధమౌను గద తండ్రికి సాగిలి మ్రొక్కు కార్యమే.
ఉ.
రిప్లయితొలగించండినర్మమె సోమశర్మ జని నారద బోధన దైత్యవంశమున్
మర్మము ముక్తి మార్గముగ మాధవసేవయె జీవకోటికిన్
కర్మము భక్తి శ్రీహరిని గానము చేయుచు తొల్లి గొల్వకన్
*ధర్మవిరుద్ధమౌను గద తండ్రికి సాగిలి మ్రొక్కు కార్యమే!.*
కర్మలుచేయకపోవుట
రిప్లయితొలగించండి*“ధర్మవిరుద్ధమ్మె యగును, తండ్రికి మ్రొక్కన్
నిర్మూలమగుదురితమీ
మర్మమెరుంగుచుమసలెడుమనుజాళికిలన్
ధర్మాధర్మ విచక్షణ
రిప్లయితొలగించండిమర్మమెరుఁగు సంయతుఁడు కుమారునిఁ జూడన్
శర్మముగా నేతెంచఁగ
ధర్మవిరుద్ధమ్మె యగును తండ్రికి మ్రొక్కన్
నర్మముగ ధనము నిమ్మని
రిప్లయితొలగించండినిర్మల మనసున నడిగిన నెపమున దల్లిన్
చార్మముతో యేచుట గని
ధర్మవిరుద్ధమ్మె యగును తండ్రికి మ్రొక్కన్
ఉ. దుర్మదమున్,దురాత్ములయి,దోసెడు యన్నము పెట్టకుండ,దు
రిప్లయితొలగించండిష్కర్మల దూషనాదులతొ, కష్టము పెట్టగ తల్లిదండ్రి,స
త్కర్మపరంబుజేసినను,కాండ్రిచి యుమ్మరె,లోకులెల్లరున్?
మర్మముకానుడయ్య,ప్రతిమాలకు,దండల,హారతిచ్చినన్,
ధర్మవిరుద్ధమౌను గద తండ్రికి సాగిలి మ్రొక్కు కార్యమే.
ధర్మపు మార్గముంజనుచు తాపసియై భవబంధనమ్ములన్
రిప్లయితొలగించండినిర్మలచిత్తుడై విడచి నిష్ఠగ దేవుని ధ్యానమందునం
దర్మిలి నొందునాపరమహంసను దర్శనమొంద వచ్చినన్
ధర్మవిరుద్ధమౌను గద తండ్రికి సాగిలి మ్రొక్కు కార్యమే
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండిఅర్మిలి చిత్తము తోడన్
రిప్లయితొలగించండిగర్మల నొనరించు వాడు కమ్రపు రీతిన్
ని ర్మ లు డై.మ్రొ క్కు నెటు ల
ధర్మ విరు ద్ధ మగు దండ్రికి మ్రొ క్కన్
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండి[11:19 AM, 8/1/2023] Ramabrahmam Penukona: కం॥ మర్మముఁ దెల్పఁగఁ దండ్రిని
రిప్లయితొలగించండికర్మ కొదలి వైచి సుతుఁడు కనక మనఁగన్
ధర్మముఁ గాదుగ మ్రొక్కిన
ధర్మ విరుద్ధమ్మె యగును తండ్రికి మ్రొక్కన్
ఉ॥ మర్మముఁ దెల్ప సంతుఁ దగు మాన్యతఁ జూపరు నేఁడు తండ్రికిన్
ధర్మము తల్లిదండ్రులను దప్పక చక్కఁగఁ జూచి కాంచ నా
ధర్మము వీడు సంతతియుఁ దండ్రికి మ్రొక్కఁగఁ బాడి కాదురో
ధర్మవిరుద్ధమౌను గద తండ్రికి సాగిలి మ్రొక్కు కార్యమే
ఉత్వ సంధిని కం॥ 3వ పాదములో గమనించలేదండి. ఇప్పుడు సవరించాను
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండిధర్మాధర్మవిచక్షణ
రిప్లయితొలగించండిమర్మ మెరిగినట్టి సత్కుమారునకెపుడున్
దుర్మతి పితయే యైనన్
ధర్మ విరుద్ధంబెయౌను తండ్రికి మ్రొక్కన్
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండినా ప్రయత్నం..
రిప్లయితొలగించండికం.
కర్మలొనరింప కుండుట
ధర్మ విరుద్ధమ్మె యగును; తండ్రికి మ్రొక్కన్
కర్మాచరణమ్మగు నా
కర్మ ఫలంబున శుభములు కలుగు నిజముగన్
తిరివీధి శ్రీమన్నారాయణ
రిప్లయితొలగించండి
కందం
రిప్లయితొలగించండినిర్మాణాత్మక పాత్రన్
గర్మల నొనగూర్ప మఱచి కసరి పనచియున్
దుర్మతి! పితరుల దినమున
ధర్మవిరుద్ధమ్మె యగును తండ్రికి మ్రొక్కన్
ఉత్పలమాల
మర్మము లేని రీతిగను మానసమొప్పగ నీదు బాగుకై
కర్మల నెన్నొ చేయ కనుగానక వారల శ్రేయమెప్పుడున్
దుర్మతి! యాశ్రమమ్ములకుఁ ద్రోసియు, తండ్రుల నాడు చేరినన్
ధర్మవిరుద్ధమౌను గద తండ్రికి సాగిలి మ్రొక్కు కార్యమే!
రిప్లయితొలగించండిపిన్నక నాగేశ్వరరావు.
హనుమకొండ.
కర్మలు చేయక పోవుట
ధర్మ విరుద్ధమ్మె యగును; తండ్రికి మ్రొక్కన్
నిర్మల చిత్తము తోడను
నర్మిలితో నందజేయు నాశీస్సులనే!