5, మే 2024, ఆదివారం

దత్తపది - 208

6-5-2024 (సోమవారం)
కవిమిత్రులారా,
పాము - కప్ప - తేలు - బల్లి
ఈ పదాలను అన్యార్థంలో ప్రయోగిస్తూ స్వేచ్ఛాచందంలో
భారతార్థంలో పద్యం చెప్పండి.

19 కామెంట్‌లు:

  1. అధిపా ముందరనీవుగాగనుము నాయాసంబునేలేకనే
    విధితోకప్పకుకార్యమున్మసలితావీకన్నధర్మంబుకున్
    సుధలన్తేలుటతథ్యమున్గనగనీసున్వీడుమార్గంబులో
    బుధుడున్బల్లిదుడౌదుగామనసునాబోధన్వినన్జాలుచో

    రిప్లయితొలగించండి
  2. కురుక్షేత్ర సంగ్రామంలో శ్రీకృష్ణుడు అర్జునునితో...

    కందం
    పాముచు నని బంధమ్ముల
    సేమము నీకప్పగింప చెల్లునె తప్పన్
    నీమము వీడుదె? తేలుము
    భీమరమున బల్లిదుడన వీరా! లెమ్మా!

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. స్వర్గంలో ఊర్వశి అర్జునునితో...

      కందం
      పాముచు వావి వరుసలన్
      భామామణికప్పగింప వలదని తనువున్
      నీమము లాడుదె? తేలుము
      ప్రేమంబల్లి శయనాన విందులు గొనఁగన్

      తొలగించండి
  3. *(ధృతరాష్ట్రునితో సంధికై వచ్చిన శ్రీ కృష్ణుని మాటలుగా)*


    కౌరవాధిపా! ముదమది కాదు రణము
    మిమ్ముల తమకప్పగ నెంచి మెదలు వారు
    బల్లిదులగు పాండు సుతులు వైర మేల
    చర్చతో తేలు విషయమ్ము శాంతి కూడు.

    రిప్లయితొలగించండి
  4. ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.

    రిప్లయితొలగించండి
  5. రాయబార సమయమున కృష్ణుడు ధృతరాష్ట్రునితో

    ఉ॥ పాముకొనంగఁ బాండవుల భాగము ధర్మము వీడి పాడియే
    నేమము వీడి తేలుటయు నీకటు లోప్పదు కీడుఁ దప్పునా
    సామముఁ దెల్ప బల్లిదము శౌర్యము నందున గొప్ప పాండవుల్
    తీమిరమేలఁ బుత్రులను దిద్దుము కూడదు కప్పరంబునున్

    రిప్లయితొలగించండి
  6. కం:
    కప్పడె కృష్ణుడు చీరలు,
    విప్పడె యమునా తటిని నవియె మరి యధిపా
    మప్పుగద బల్లిదు డతడు
    తప్పక తేలు ననిని ఫలితము శత్రువుదై.

    రిప్లయితొలగించండి
  7. ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.

    రిప్లయితొలగించండి
  8. వినుము పాపా! ముగియబోవు విగ్రహమున
    తేలునది చెప్పు మంటివి, తలిపెద విను!
    మాజి విధము నెదుటి వాని కప్పగించి
    భీముడు దన బల్లిదమును పెంచి గెలుచు

    రిప్లయితొలగించండి
  9. మేలగు న ధి పా మునుకొని మీరు రణము
    మాని బల్లిదు లగు వారి మైత్రి వలన
    సర్వ మును దేలు మీ కని చక్రి దెలు ప
    దాని కప్పటి కొప్పర ధ ర్ము లకట!

    రిప్లయితొలగించండి
  10. చంపకమాల:
    కలలనుఁ దేలు కీచకుఁడు కాముకుడై జనె నాట్యశాలకున్
    వలలుడు బల్లిదుండటకు వచ్చెను నాతిగ చీరకట్టులో
    యలరుచువచ్చి పాముకొను నంతనె భీముడు కీచకాధమున్
    బలమగు ముష్టిఘాతముల పన్నుగ కాలున కప్పగించెతాన్

    రిప్లయితొలగించండి
  11. సంధికై కృష్ణుని పంపుతూ ధర్మజుని పలుకులు....

    ధన్య సుగుణరూపా ముకుందా తలకొని
    కప్పరపడకుంటిమి గద కయ్యమునకు
    తీవ్రమైనట్టి క్రోధాగ్ని తేలువాఱ
    బవరమందున భీముడు బల్లిదుండు

    రిప్లయితొలగించండి
  12. ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.

    రిప్లయితొలగించండి
  13. ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.

    రిప్లయితొలగించండి
  14. రిప్లయిలు
    1. అధిపా! ముఁదెలియ కప్పటి
      విధమునతడు బాధనోర్చె విలువిద్యకునై
      విధి బల్లిదు పాలిటులయె
      నధికస్రముతో లుకలుకలాడెను గ్రిమియున్

      తొలగించండి
  15. చం:ఎవరికి రాజువై నిలచి?తేలుము గుర్రము, నేన్ గు లేక, యీ
    పవరము గెల్వ నద్ది గెలుపా ముద మొందగ! చచ్చిరే కదా
    స్తవము లొనర్చి కప్ప మిడి దండము బెట్టెడు వార లెందరో,
    యవనిని మేమె బల్లిదుల మంచు వచించుటె మీకు చాలునే!
    (మరణించ బోతున్న దుర్యోధనుడు "అంతా నాశన మైన రాజ్యాన్ని నువ్వే ఏలుకో. గెలిచా మనే పేరు తప్ప మీకు దక్కిందేమిటి?అని గెలుపుని ఎక్కిరిస్తాడు.)

    రిప్లయితొలగించండి
  16. అధిపా మునుంగ కప్పటి
    వ్యధ నందక తేలు టట్లు బల్లిదుఁ డరయన్
    విధి రక్షితుండు సుమ్మీ
    యధికమ్ముగ భీమ సేనుఁ డాశ్చర్యముగన్

    రిప్లయితొలగించండి
  17. విదురుడు :
    కురునృపా! మున్గిదాగె నీ కొడుకు మడుగు
    నందుఁ గప్పఁ దమము కులయశము పైని;
    బల్లిదులు పాండవులు చేరి వాని వెదుక
    తేలు సత్యము, యుద్ధము తేలు నేడు.

    రిప్లయితొలగించండి