27-5-2024 (సోమవారం)కవిమిత్రులారా,ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...“విద్యుల్లత లాకసమున వెలుఁగు స్థిరముగన్”(లేదా...)“విద్యుద్వల్లరు లభ్రవీథి స్థిరమై వెల్గొందుచుండున్ సదా”(బందరు దుర్గాప్రసాద్ గారికి ధన్యవాదాలతో...)
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
కందంసద్యశ దృశ్యగ్రాహకుడుద్యోగి గ్రహింపఁ బేటి నుత్సాహముగానాద్యంతము సిత్రములన్విద్యుల్లత లాకసమున వెలుఁగు స్థిరముగన్శార్దూలవిక్రీడితముహృద్యమ్మౌ పలు చిత్రముల్వెలయఁగా నెంతెంత శోధించెనో!యాద్యంతమ్మును నింగిలో మెరయ ఛాయాగ్రాహకుండౌచుఁ దానుద్యోగమ్ముగఁ బేటినందు గొనఁగా నుత్సాహియై చిత్రణన్విద్యుద్వల్లరు లభ్రవీథి స్థిరమై వెల్గొందుచుండున్ సదా!
మీ రెండు పూరణలు ప్రశస్తంగా ఉన్నవి. అభినందనలు.
🙏ధన్యోస్మి గురుదేవా!🙏
విద్యలనగ్రేసరులైసద్యోవిలసితపరిణతిసాధనతోడన్ఖద్యోతంబునతారలువిద్యుల్లతలాకసమునవెలుగుస్థిరముగన్
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
పద్యాలెంచనివారుగానిలచిరేవాదంబునవ్యత్వమేగద్యంబెంచిరికావ్యకల్పనకుసంఘాతంబులేదంచునున్హృద్యంబైఁజనెభావవీచికలుగ్రాహంబుల్ప్రజారంజనన్విద్యుద్వల్లరులభ్రవీధిస్థిరమైవెల్గొందుచుండున్సదా
మీ పూరణ బాగున్నది. అభినందనలు.'హృద్యంబై' తరువాత అరసున్న రాదు. 'గ్రాహంబు' ?
చోద్యముగ జరుగుచుండునుపద్యము వ్రాయ మొదలిడగ పండితునింటన్సద్యము పయికెత్తి కనగవిద్యుల్లత లాకసమున వెలుఁగు స్థిరముగన్
ఆద్యులు వచించి రిట్టులహృద్యంబౌ యశము నంది యిలలో ధృవుడే యుద్యోదించును, కాదురవిద్యుల్లత , లాకసమున వెలుఁగు స్థిరముగన్,విద్యావంతుడు కాకపోయినను తా బింకమ్ముతో కానలో నాద్యంతమ్ములు లేనిచేతనుని ప్రత్యక్షమ్ముగా గాంచి తాహృద్యమ్మౌ ఘనకీర్తితో ధృవుడు బర్సిస్సందు, కాకుండగావిద్యుద్వల్లరు లభ్రవీథి , స్థిరమై వెల్గొందుచుండున్ సదా
మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.
కం॥ విద్యాలబ్ధత నొందుచువిద్యా దానము జనులకు భేదముఁ గనకన్హృద్యంబుగ సేయ యశపువిద్యుల్లత లాకసమున వెలుఁగు స్థిరముగన్శా॥ విద్యుద్వల్లరు లభ్రవీది స్థిరమై వెల్గొందుచుండున్ సదావిద్యాలబ్ధత నొంది జ్ఞానమునటుల్ భేదమ్మునే యెంచకన్హృద్యంబౌ పగిదిన్ జనాళికి సదా హేలాయ మానంబుగన్విద్యాదానముఁ జేయ మోదముగ సంవేదంబుతోఁ గూర్మినిన్
ఉద్యోగముకై వెదకుచుమధ్యాహ్నపుటెండలోన మాడుచునుండన్ఉద్యానవనంబగుపడవిద్యుల్లత లాకసమున వెలుఁగు స్థిరముగన్వాద్యములు మ్రోగు హృదిని సహాధ్యాయిని యొక చిరుదరహాసం బిడినన్ విద్యార్థికి యుల్లంబున విద్యుల్లత లాకసమున వెలుఁగు స్థిరముగన్
మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు. మొదటి కందంలో 'ఉద్యోగమునకు వెదకుచు' అనండి. రెండవ కందంలో 'విద్యార్థికి నుల్లంబున' అనండి.
🙏
హృద్యముగా శ్రీనాథుడుపద్య రచన సల్పెను కవి భట్టారకుడైపద్యపు రుచి దివికరుగగవిద్యుల్లత లాకసమున వెలుఁగు స్థిరముగన్హృద్యంబౌ పలు పద్యకావ్యములతో హెచ్చిల్లె శ్రీనాథుడేపద్యాలందున వెల్గులీను కవిగా స్వర్గంబునే చేరగాపద్యాలే తన ప్రౌఢిమన్ దెలుపగా ప్రాకాశ్యమున్ బొందగావిద్యుద్వల్లరు లభ్రవీథి స్థిరమై వెల్గొందుచుండున్ సదా
ధన్యవాదాలు గురూజీ 🙏
విద్యా వతి సతి పతిగని పద్యము నల్లంగ నొక్క పాదము నీయన్ చోద్య ము గ దోచె. న త నికి విద్యు ల్ల త లాక స మున వెలుగు స్థి ర ము గన్
విద్యయు వినయంబు దయయుసద్యము జనులకు సహాయ సాధకుడౌచున్హృద్యము గలవారి యశపువిద్యుల్లత లాకసమున వెలుఁగు స్థిరముగన్
శా:సేద్యమ్ముల్ విడి తోట నెల్ల మలచెన్ శ్రీమంతు డై ఆర్జనావిద్యాసక్తిని రైతు హోటలుగ ,నే వీక్షంపగా నక్షి నైవేద్యమ్మౌ విధి,నా యలంకరణ లో విద్యుత్ప్రభల్ జేర్చెగా!విద్యుద్వల్లరు లభ్రవీథి స్థిరమై వెల్గొందుచుండున్ సదా”(రైతు తోట వదిలి దానిలో హోటల్ కట్టాడు. పైన కరెంట్ డెకొరేషన్ చేసాడు.ఆ కరెంట్ దీపాలను తీగల వరసలు ఎప్పుడూ వెలుగుతుంటాయి.)
మీ పూరణ ప్రశస్తంగా ఉన్నది. అభినందనలు.
ధన్యవాదం గురువు గారు!
కం:విద్యుల్లత యస్థిరమే,హృద్యమ్ముగ కుంభవృష్టి నెన్నొ వరుసగావాద్యము లై యురుము లలరవిద్యుల్లత లాకసమున వెలుఁగు స్థిరముగన్”(ఒక మెరుపు తీగ అస్థిరమే కానీ కుంభవృష్టి లో ఒకదాని వెంట ఒకటి వస్తూ స్థిరం గా ఉంటాయి.)
విద్యాబుద్దులు నేరిచిసద్యశమును బొందినట్టి ఛాత్రుని యెదలోసద్యస్స్ఫూర్తిగనెన్నోవిద్యుల్లత లాకసమున వెలుఁగు స్థిరముగన్
చోద్యము కాదిట్టు లనిన సద్యో౽స్థిరములు కడింది సకలార్య జ నావేద్య మిది వింత యగు నన విద్యుల్లత లాకసమున వెలుఁగు స్థిరముగన్ వేద్యం బెల్లర కియ్య దింపుగను నీ విశ్వంబు నందెన్నఁగా విద్యావేత్తలు నొల్ల కుండుదురె గాంభీర్యమ్మునన్ సుంత హృద్భే ద్యాభీలములై నిరంతరము ప్రావృట్కాల ఘస్రమ్ములన్ విద్యుద్వల్లరు లభ్రవీథి స్థిరమై వెల్గొందుచుండున్ సదా
మీ రెండు పూరణలు అద్భుతంగా ఉన్నవి. అభినందనలు.
పిన్నక నాగేశ్వరరావు.హనుమకొండ. విద్యా సంపద తోడనుపద్యపు కావ్యము రచించె పదగుంభనతోహృద్యంబగు నా కవితావిద్యుల్లత లాకసమున వెలుగు స్థిరముగన్.
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండికందం
తొలగించండిసద్యశ దృశ్యగ్రాహకు
డుద్యోగి గ్రహింపఁ బేటి నుత్సాహముగా
నాద్యంతము సిత్రములన్
విద్యుల్లత లాకసమున వెలుఁగు స్థిరముగన్
శార్దూలవిక్రీడితము
హృద్యమ్మౌ పలు చిత్రముల్వెలయఁగా నెంతెంత శోధించెనో!
యాద్యంతమ్మును నింగిలో మెరయ ఛాయాగ్రాహకుండౌచుఁ దా
నుద్యోగమ్ముగఁ బేటినందు గొనఁగా నుత్సాహియై చిత్రణన్
విద్యుద్వల్లరు లభ్రవీథి స్థిరమై వెల్గొందుచుండున్ సదా!
మీ రెండు పూరణలు ప్రశస్తంగా ఉన్నవి. అభినందనలు.
తొలగించండి🙏ధన్యోస్మి గురుదేవా!🙏
తొలగించండివిద్యలనగ్రేసరులై
రిప్లయితొలగించండిసద్యోవిలసితపరిణతిసాధనతోడన్
ఖద్యోతంబునతారలు
విద్యుల్లతలాకసమునవెలుగుస్థిరముగన్
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండిపద్యాలెంచనివారుగానిలచిరేవాదంబునవ్యత్వమే
రిప్లయితొలగించండిగద్యంబెంచిరికావ్యకల్పనకుసంఘాతంబులేదంచునున్
హృద్యంబైఁజనెభావవీచికలుగ్రాహంబుల్ప్రజారంజనన్
విద్యుద్వల్లరులభ్రవీధిస్థిరమైవెల్గొందుచుండున్సదా
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండి'హృద్యంబై' తరువాత అరసున్న రాదు. 'గ్రాహంబు' ?
చోద్యముగ జరుగుచుండును
రిప్లయితొలగించండిపద్యము వ్రాయ మొదలిడగ పండితునింటన్
సద్యము పయికెత్తి కనగ
విద్యుల్లత లాకసమున వెలుఁగు స్థిరముగన్
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండిఆద్యులు వచించి రిట్టుల
రిప్లయితొలగించండిహృద్యంబౌ యశము నంది యిలలో ధృవుడే
యుద్యోదించును, కాదుర
విద్యుల్లత , లాకసమున వెలుఁగు స్థిరముగన్,
విద్యావంతుడు కాకపోయినను తా బింకమ్ముతో కానలో
నాద్యంతమ్ములు లేనిచేతనుని ప్రత్యక్షమ్ముగా గాంచి తా
హృద్యమ్మౌ ఘనకీర్తితో ధృవుడు బర్సిస్సందు, కాకుండగా
విద్యుద్వల్లరు లభ్రవీథి , స్థిరమై వెల్గొందుచుండున్ సదా
మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.
తొలగించండిఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండికం॥ విద్యాలబ్ధత నొందుచు
తొలగించండివిద్యా దానము జనులకు భేదముఁ గనకన్
హృద్యంబుగ సేయ యశపు
విద్యుల్లత లాకసమున వెలుఁగు స్థిరముగన్
శా॥ విద్యుద్వల్లరు లభ్రవీది స్థిరమై వెల్గొందుచుండున్ సదా
విద్యాలబ్ధత నొంది జ్ఞానమునటుల్ భేదమ్మునే యెంచకన్
హృద్యంబౌ పగిదిన్ జనాళికి సదా హేలాయ మానంబుగన్
విద్యాదానముఁ జేయ మోదముగ సంవేదంబుతోఁ గూర్మినిన్
మీ రెండు పూరణలు ప్రశస్తంగా ఉన్నవి. అభినందనలు.
తొలగించండిఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండిఉద్యోగముకై వెదకుచు
రిప్లయితొలగించండిమధ్యాహ్నపుటెండలోన మాడుచునుండన్
ఉద్యానవనంబగుపడ
విద్యుల్లత లాకసమున వెలుఁగు స్థిరముగన్
వాద్యములు మ్రోగు హృదిని స
హాధ్యాయిని యొక చిరుదరహాసం బిడినన్
విద్యార్థికి యుల్లంబున
విద్యుల్లత లాకసమున వెలుఁగు స్థిరముగన్
మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.
తొలగించండిమొదటి కందంలో 'ఉద్యోగమునకు వెదకుచు' అనండి.
రెండవ కందంలో 'విద్యార్థికి నుల్లంబున' అనండి.
🙏
తొలగించండిహృద్యముగా శ్రీనాథుడు
రిప్లయితొలగించండిపద్య రచన సల్పెను కవి భట్టారకుడై
పద్యపు రుచి దివికరుగగ
విద్యుల్లత లాకసమున వెలుఁగు స్థిరముగన్
హృద్యంబౌ పలు పద్యకావ్యములతో హెచ్చిల్లె శ్రీనాథుడే
పద్యాలందున వెల్గులీను కవిగా స్వర్గంబునే చేరగా
పద్యాలే తన ప్రౌఢిమన్ దెలుపగా ప్రాకాశ్యమున్ బొందగా
విద్యుద్వల్లరు లభ్రవీథి స్థిరమై వెల్గొందుచుండున్ సదా
మీ రెండు పూరణలు ప్రశస్తంగా ఉన్నవి. అభినందనలు.
తొలగించండిధన్యవాదాలు గురూజీ 🙏
తొలగించండివిద్యా వతి సతి పతిగని
రిప్లయితొలగించండిపద్యము నల్లంగ నొక్క పాదము నీయన్
చోద్య ము గ దోచె. న త నికి
విద్యు ల్ల త లాక స మున వెలుగు స్థి ర ము గన్
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండిఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండిఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండివిద్యయు వినయంబు దయయు
రిప్లయితొలగించండిసద్యము జనులకు సహాయ సాధకుడౌచున్
హృద్యము గలవారి యశపు
విద్యుల్లత లాకసమున వెలుఁగు స్థిరముగన్
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండిశా:సేద్యమ్ముల్ విడి తోట నెల్ల మలచెన్ శ్రీమంతు డై ఆర్జనా
రిప్లయితొలగించండివిద్యాసక్తిని రైతు హోటలుగ ,నే వీక్షంపగా నక్షి నై
వేద్యమ్మౌ విధి,నా యలంకరణ లో విద్యుత్ప్రభల్ జేర్చెగా!
విద్యుద్వల్లరు లభ్రవీథి స్థిరమై వెల్గొందుచుండున్ సదా”
(రైతు తోట వదిలి దానిలో హోటల్ కట్టాడు. పైన కరెంట్ డెకొరేషన్ చేసాడు.ఆ కరెంట్ దీపాలను తీగల వరసలు ఎప్పుడూ వెలుగుతుంటాయి.)
మీ పూరణ ప్రశస్తంగా ఉన్నది. అభినందనలు.
తొలగించండిధన్యవాదం గురువు గారు!
తొలగించండికం:విద్యుల్లత యస్థిరమే,
రిప్లయితొలగించండిహృద్యమ్ముగ కుంభవృష్టి నెన్నొ వరుసగా
వాద్యము లై యురుము లలర
విద్యుల్లత లాకసమున వెలుఁగు స్థిరముగన్”
(ఒక మెరుపు తీగ అస్థిరమే కానీ కుంభవృష్టి లో ఒకదాని వెంట ఒకటి వస్తూ స్థిరం గా ఉంటాయి.)
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండిధన్యవాదం గురువు గారు!
రిప్లయితొలగించండివిద్యాబుద్దులు నేరిచి
రిప్లయితొలగించండిసద్యశమును బొందినట్టి ఛాత్రుని యెదలో
సద్యస్స్ఫూర్తిగనెన్నో
విద్యుల్లత లాకసమున వెలుఁగు స్థిరముగన్
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండిచోద్యము కాదిట్టు లనిన
రిప్లయితొలగించండిసద్యో౽స్థిరములు కడింది సకలార్య జ నా
వేద్య మిది వింత యగు నన
విద్యుల్లత లాకసమున వెలుఁగు స్థిరముగన్
వేద్యం బెల్లర కియ్య దింపుగను నీ విశ్వంబు నందెన్నఁగా
విద్యావేత్తలు నొల్ల కుండుదురె గాంభీర్యమ్మునన్ సుంత హృ
ద్భే ద్యాభీలములై నిరంతరము ప్రావృట్కాల ఘస్రమ్ములన్
విద్యుద్వల్లరు లభ్రవీథి స్థిరమై వెల్గొందుచుండున్ సదా
మీ రెండు పూరణలు అద్భుతంగా ఉన్నవి. అభినందనలు.
తొలగించండి
రిప్లయితొలగించండిపిన్నక నాగేశ్వరరావు.
హనుమకొండ.
విద్యా సంపద తోడను
పద్యపు కావ్యము రచించె పదగుంభనతో
హృద్యంబగు నా కవితా
విద్యుల్లత లాకసమున వెలుగు స్థిరముగన్.
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండి