3, మే 2024, శుక్రవారం

సమస్య - 4754

4-5-2024 (శనివారం)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“సీతాసతి కూఁతురయ్యె శ్రీరామునకున్”
(లేదా...)
“సీత కుమార్తె యయ్యెఁ గద శ్రీరఘురామునకుం దలంపఁగన్”

19 కామెంట్‌లు:

  1. జాతగజనకునియింటను
    సీతాసతికూతురయ్యె, శ్రీరామునికి న్
    సాతముధర్మాచరణను
    త్రేతాయుగమునకనబడెదేహార్థంబై

    రిప్లయితొలగించండి
  2. కందం
    భూతలమున భూజానియె
    జోతలుగొని రాఘవుఁడగుచు నవనిజఁ గొనన్
    జేతమున వరుసలు గలుప
    సీతాసతి కూఁతురయ్యె శ్రీరామునకున్

    ఉత్పలమాల
    భూతలమందునన్ గనఁగ భూమికి భర్తగ విష్ణుమూర్తియే
    జోతల నంది రామునిగ జూపుచు శౌర్యమునొంద భూసుతన్
    జేతమునందునన్ వరుసఁ జేయుచునెంచగ విస్తుపోవఁగన్
    సీత కుమార్తె యయ్యెఁ గద శ్రీరఘురామునకుం దలంపఁగన్

    రిప్లయితొలగించండి
  3. మాతగలోకపావనిగమానసమౌనికిముక్తినీయగన్
    సీతకుమార్తెయయ్యెగద, శ్రీరఘురామునికిన్దలంపగన్
    సాత,ముధర్మపత్నిగనుసన్నుతినందెనుతోడునీడయై
    చేతనశక్తిరూపిణిగజేతగనిల్చెనధర్మవిచ్ఛితి న్

    రిప్లయితొలగించండి
  4. ప్రీతిగమిథిలాపతికిల
    *“సీతాసతి కూఁతురయ్యె శ్రీరామునకున్”*
    చేతమునలరించుచునా
    మాతయనుసరించిపంచెమమకారమ్మున్


    రిప్లయితొలగించండి
  5. సీత దొరకగ జనకునకు
    సీతాసతి కూతరయ్యె, శ్రీరామునకున్
    జేతము పొంగెను భార్యగ
    సీతను కార్ముకమునొంచి చేకొను వేళన్.

    రిప్లయితొలగించండి
  6. రిప్లయిలు
    1. కం॥ భూతల ప్రభువు జనకునికి
      సీతాసతి కూఁతురయ్యె, శ్రీరామునకున్
      సీత సతిగ ననవరతము
      నాతని వీడకఁ బరఁగుచు నౌచితిఁ బొందెన్

      ఉ॥ భూతల నాథుఁడౌ జనకభూపతి మోదముఁ గాంచి యొప్పుచున్
      సీత కుమార్తె యయ్యెఁ గద, శ్రీరఘురామునకుం దలంపఁగన్
      సీతయె పత్నియై మిగుల స్నేహము తోడఁ జరించె సాధ్విగన్
      బ్రీతిగ సర్వదా యతని వీడక వర్ధిలె సాటిఁ గాంచకన్

      తొలగించండి

  7. పీతాంబరుసకు పాణిగృ
    హీతి రసాసతి విరజుడె యిలలో రాముం
    డాతని సతి ధరణిజ కన
    సీతాసతి కూఁతురయ్యె శ్రీరామునకున్.


    భూతల మందు రామునిగ భూజని పుట్టగ సింధుకన్య భూ
    జాతగ పుట్టెనందురె రసాసతి దారయటంచు చెప్పిరే
    ఖ్యాతినిగన్న పావనున కయ్యది వాస్తవమైన గాంచగన్
    సీత కుమార్తె యయ్యెఁ గద శ్రీరఘురామునకుం దలంపఁగన్.

    రిప్లయితొలగించండి
  8. తాత యతి మైత్రిని దెలుప
    నాతడు నేర్చినది యెంతయనుచు నడుగగన్
    భీతిలక జెప్పె నిట్టుల
    సీతాసతి కూఁతురయ్యె శ్రీరామునకున్

    రిప్లయితొలగించండి
  9. పూత మనస్కుడౌ జనక భూపతి భూమిని దున్నునంత, భూ
    జాత లభింప, తచ్ఛిశువు, శాస్త్రగతమ్ముగ నెంచి చూడగా,
    సీత కుమార్తె యయ్యెఁ గద; శ్రీరఘురామునకుం దలంపఁగన్
    కౌతుక మాత్మ నివ్వటిలగా ననపాయిని యయ్యె నామెయే.

    రిప్లయితొలగించండి
  10. ప్రీతిగ మిథిలాధిపునకు
    సీతాసతి కూఁతురయ్యె; శ్రీరామునకున్
    సీతయె కళత్రమయ్యెను
    మాతయయెను కుశలవులకు మైథిలి తానే

    ప్రీతిగ పెంచినాడుమిథిలేశుడయోనిజ నాదరమ్ముతో
    సీత కుమార్తె యయ్యెఁ గద; శ్రీరఘురామునకుం దలంపఁగన్
    సీత కళత్రమయ్యె నట చిన్మయ రూపుడు విల్లుఁ ద్రుంచగా
    మాతగ తానుకన్నదట మన్నన నొందిన పుత్రులిద్దరిన్

    రిప్లయితొలగించండి
  11. ప్రీతి లభింప జనకునికి
    సీతా సతి కూతు ర య్యె,:: శ్రీరా మునికిన్
    చేతము లు ల్ల సిలంగను
    సీతయె సతి య య్యె గాదె శ్రీక ర మగు చున్

    రిప్లయితొలగించండి
  12. త్రేతాయుగమున శ్రీహరి
    సీతమ్మను బెండ్లియాడెఁ శ్రీరామునిగా
    సీతయె భూజాత యగుట
    సీతాసతి కూఁతురయ్యె శ్రీరామునకున్

    రిప్లయితొలగించండి
  13. భూతలమందు రామునిగ బుట్టెను శ్రీహరి లోకరక్షకై
    ప్రీతిగ జానకీసతియు శ్రీరఘురాముని భార్యయయ్యెనా
    సీత జనించె భూమిజగ చిత్రము కాదొకొ భూమి పుత్రియౌ
    సీత కుమార్తె యయ్యెఁ గద శ్రీరఘురామునకుం దలంపఁగన్

    రిప్లయితొలగించండి
  14. కం:చేతమున స్వర్ణహరిణ
    మ్మే తనకున్ మోజు పెంచ నింతికి గారా
    మే తా నొందగ రాముడు
    సీతాసతి కూఁతురయ్యె శ్రీరామునకున్”
    (స్వర్ణహరిణం కావా లని సీత అడిగితే గారాబం తో అది ఇద్దామని భావించిన సమయం లో సీత రాముడికి కూతు రై పోయింది.చిన్నపిల్లల కోరిక తండ్రి తీర్చే ప్రయత్నం చేసినట్టు. )

    రిప్లయితొలగించండి
  15. ఉ:శ్రీతరుణిన్, వసుంధరను జేకొని పత్నులుగా గ్రహించి భూ
    మాతకు గూతురై బరగు మానిని సీతను బొందె వెన్నుడే
    బ్రీతిగ రాముడై, కథల రీతులు శంకల దెచ్చు నెన్నియో
    సీత కుమార్తె యయ్యెఁ గద శ్రీరఘురామునకుం దలంపఁగన్”

    రిప్లయితొలగించండి
  16. ఏ తగవాడ దెప్పుడెదురేగి యెఱుంగదు తల్లిదండ్రికిన్
    తాఁతల దాల్చు నానతిగ తక్షణమే నది చెప్ప పెద్దలున్
    సీతనుగామి రామునికి జెల్లె సువర్తనమట్లు గాన నా
    సీత కుమార్తె యయ్యె గద శ్రీ రఘురామునకుం దలంపగన్

    రిప్లయితొలగించండి
  17. ఆతత గుణవతి జానకి
    వేతన లందంగఁ బుట్టె వివరించెను భూ
    మాతయె యటులన్ నా కీ
    సీతాసతి కూఁతు రయ్యె శ్రీరామునకున్


    యాతన లీయ నెల్లరకు నా దశకంఠుఁడు భీకరమ్ముగా
    భూతల మందు మాధవుఁడు వుట్టఁగ వాని వధార్థమై ధరన్
    ధాత సృజింప దారగను దథ్యముగా, మిథిలాధినేతకున్
    సీత కుమార్తె యయ్యెఁ గద, శ్రీ రఘు రామునకుం దలంపఁగన్

    రిప్లయితొలగించండి

  18. పిన్నక నాగేశ్వరరావు.
    హనుమకొండ.

    ప్రీతిగ మిథిలా ప్రభువుకు
    సీతాసతి కూతురయ్యె; శ్రీరామునకున్
    సీతనొసంగెను జనకుడు
    ఖ్యాతిగ శివధనువుఁ విఱచ కౌతుకమొప్పన్.

    రిప్లయితొలగించండి