12, మే 2024, ఆదివారం

సమస్య - 4762

13-5-2024 (సోమవారం)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“కొండపై నున్న దేవుని గుండె రాయి”
(లేదా...)
“దేవుని గుండె రాయి గద తిష్ఠను వేసెను కొండ కోనలన్”
(అక్కెర కరుణాసాగర్ గారు పంపిన సమస్య)

41 కామెంట్‌లు:

  1. నీవుగమానసాంబుధినినేర్పుననీదుచు సాగుచోగనన్
    ఈవిధిదర్శనీయుడుగ నిద్ధరనుండెనువేంకటేశుడున్
    త్రోవను గాంచి కష్టమునురోయకసాగుమధర్మబద్ధతన్
    దేవునిగుండెరాయిగదతిష్ఠనువేసెనుకొండకోనలన్

    రిప్లయితొలగించండి
  2. తిప్పలుపడుచు తమగుండె దిటవు లేక
    వేడుకొందురు భక్తులు వేలవేలు
    కొండపై నున్న దేవుని; గుండె రాయి
    చేసికొను బలిమిని ప్రోదిచేయమనుచు

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. దేవతలందునన్ ఘనుని తేల్చుటకై భృగువే తటాలునన్‌
      దైవపు వామవక్షమున తన్నగ వీడెను లక్ష్మి విష్ణువున్
      దేవుని గుండెమారెనట తిప్పలు తప్పక బండరాయిగా
      దేవుని గుండె రాయి గద తిష్ఠను వేసెను కొండ కోనలన్

      తొలగించండి
    2. మీ రెండు పూరణలు ప్రశస్తంగా ఉన్నవి. అభినందనలు.

      తొలగించండి

  3. కాలి బాటన నిను జేరు కాంక్షతోడ
    తరలి వచ్చెడు బాలికన్ జిరుత యొకటి
    చంపి భక్షించె గాదె కాంచగ తిరుమల
    కొండపై నున్న దేవుని గుండె రాయి.


    పావనుడా జనార్దనుడు భక్తుల బ్రోచు నిమిత్తమై యటన్
    గోవెల లోన నిల్చెనని కోర్కెలు తీర్చునటంచు నమ్ముచున్
    గావుమటంచు జేరుతరి కర్వరి మ్రింగిన మిన్నకుండె నా
    దేవుని గుండె రాయి గద తిష్ఠను వేసెను కొండ కోనలన్.

    రిప్లయితొలగించండి
  4. వాడికన్నులకాటుకపట్టియుండు
    కదలడెప్పుడునొకచోటకానబడును
    భావమెంచడుతానుగాపలుకడెపుడు
    కొండపైనున్నదేవునిగుండెరాయి

    రిప్లయితొలగించండి
  5. చిత్తగించి జూడగ, నూరి చివరనగల
    కొండపై నున్న దేవుని గుండె రాయి,
    కానియెడ నేల భక్తుల కామనలను
    తీరకుండు విధంబుగ దిద్దు చుండు

    రిప్లయితొలగించండి
  6. నిత్య పూజలు సల్పుచు నియతితోడ
    కష్టములఁ బాపి దయజూపి గావుమనుచు
    నెంతవేడిన దయరాదు సుంతయేని
    కొండపై నున్న దేవుని గుండె రాయి

    రిప్లయితొలగించండి
  7. ముడుపు లెన్నియొ కట్టుచు
    మొక్కు కొన్న
    దీర్చ లేవయ్య కోరికల్ దేవ దేవ
    యనుచు భక్తుడు బాధ తో నని యె నిట్లు
    కొండపై నున్న దేవుని గుండె రాయి

    రిప్లయితొలగించండి
  8. భక్తరామదాసు మానసము చెరసాలలో:

    తేటగీతి
    పుట్టలోనఁ జూచిన రామమూర్తిఁ దెచ్చి
    భద్రగిరిపైని యాలయపరము సేయఁ
    గట్టి చెరసాల పాలైనఁ గరుణఁగనఁడు
    కొండపై నున్న దేవుని గుండె రాయి!


    ఉత్పలమాల
    ఆ వని పుట్టలోఁ గనియు నందియు భద్రగిరీశుఁ జేసితిన్
    సేవలకెంచియున్ నగల సీతకు రామునికందజేసి నే
    నావల కార నున్నఁ గరుణాలయుఁ డేలనొ కావరాడె! యా
    దేవుని గుండె రాయి గద తిష్ఠను వేసెను కొండ కోనలన్!

    రిప్లయితొలగించండి
  9. తే॥ “కొండపై నున్న దేవుని గుండె రాయి”
    నింద వేయఁగ ఫలమేమి నీవటులను
    భక్తి యొక్కటె చాలదు ముక్తిఁ బడయ
    దేవుఁడు గను సద్వర్తన దేహి యందు

    ఉ॥ కోవెల కేఁగి మ్రొక్కఁగను గోరిక తీరకఁ దోఁచు నిట్టులన్
    దేవుని గుండె రాయి గద తిష్ఠను వేసెను కొండ కోనలన్
    దేవుని లీలలన్ గనఁగ దేహికి సాధ్యమె ధర్మ బద్ధులై
    భావము మీరఁ గొల్వఁగను భాగవతోత్తముఁ డాదరించడా!

    రిప్లయితొలగించండి
  10. తేటగీతి
    పిలిచిన బలికెడి మనసుగల తిరుమల
    శ్రీనివాసుని సేవలు జేయ తాను
    పలుకు, కాదని వెళ్ళెడి వారలకది
    కొండపై నున్న దేవుని గుండె రాయి.
    ప్రబల వేంకట సుబ్రహ్మణ్య శాస్త్రి
    ఉండవల్లి సెంటరు.

    రిప్లయితొలగించండి
  11. పావనమూర్తిగా దలచి భక్తి ప్రపత్తులతోడ దైవమున్
    గావుమటంచు వేడినను క్రన్నన గావఁగ రాడదేలనో
    భావన చేసిచూడ భగవానుడు నిర్దయుఁడయ్యె నా యెడన్
    దేవుని గుండె రాయి గద తిష్ఠను వేసెను కొండ కోనలన్

    రిప్లయితొలగించండి
  12. నన్ను తిట్టుకుంటూ నా పూరణ

    తే.గీ:కుటిలుడున్, దుష్టుడున్ ధని కొండ కవియె
    వాడు న న్నెంతొ ముంచెను వాని భక్తి
    కవిత మాయ యే,దేవుని కరుణయె ధని
    కొండపై నున్న దేవుని గుండె రాయి”
    (ధనికొండ దుష్టుడు.వాడి భక్తి ఒక మోసం. దేవుడు వాడి మీద కరుణ చూపితే ఆ దేవుడి గుండె ఒక రాయి అని ఎవరో అన్నట్టు. )

    రిప్లయితొలగించండి
  13. ఉ:దేవుని పేర్ల యుద్ధముల దెచ్చుట,లంచము లీయ, జూచుచున్,
    సేవ యొనర్చ దీనులకు సేమము మాధవు డిచ్చు నంచు స
    ద్భావము నెంచు వారి గను భాగ్యము లేక, నిరాశ నిండు నా
    దేవుని గుండె రాయి గద !తిష్ఠను వేసెను కొండ కోనలన్”
    (మనుషుల ప్రవర్తన చూసి దేవుని గుండె రాయి అయిందని)

    రిప్లయితొలగించండి
  14. అంతుచిక్కని వ్యాధిచే నంతమవగ
    భర్తయుమరణింప మదిని పరితపించి
    *“కొండపై నున్న దేవుని గుండె రాయి”*
    యనుచువిలపించెను సతియు నార్తితోడ.


    కావలివారలడ్డిడినగర్జనచేయుచువిష్ణుమూర్తిపై
    దైవుడటంచునెంచకనుదన్నగ గుండెల పైనమౌనితా
    నావరలక్ష్మియున్ దలచెనాపతి యౌహరి యిట్టుజేసె నీ
    *“దేవుని గుండె రాయి గద తిష్ఠను వేసెను కొండ కోనలన్”*

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.
      వృత్తంలో "దైవమటంచు" అనండి.

      తొలగించండి
  15. ఏడుకొండలు చకచక యెక్కి సుంత
    పలుకు కులుకు లేక నిలువ భార్య లిర్వు
    రరసి కిన్కను వచియించి రార్తి తోడఁ
    గొండపై నున్న దేవుని గుండె రాయి


    పూవును బోలు గుండె యని మూరి వచింతురు మేలొసంగినం
    జేవ గణింపకుండగను జేయఁ పనుల్ ఫలియింపకున్నచోఁ
    గావఁగ నేరడంద్రు దయఁ గాంచఁడె యంచుఁ దలంతు రివ్విధిన్
    దేవుని గుండె రాయి గద తిష్ఠను వేసెను గొండ కోనలన్

    రిప్లయితొలగించండి
  16. బాధలకు బెదరి యొకడు బావురుమనె
    కొండపై నున్న దేవుని గుండె రాయి
    యనుచు, పాపపుణ్య ఫలమునందుకొనక
    జనుడు జీవించ జాలడీ జగతియందు.

    రిప్లయితొలగించండి
  17. ఎన్ని మ్రొక్కులు మ్రొక్కిన నెంత వేడ
    కరుణఁ జూపడు సరికదా కలుగఁజేయు నిడుము
    కొండపై నున్న దేవుని గుండె రాయి
    యనెడు వచనము సత్యమె యక్షరాల

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      రెండవ పాదంలో గణభంగం. "సరికదా కష్టమిడును" అంటే సరి.

      తొలగించండి
  18. ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.

    రిప్లయితొలగించండి
  19. దేవుని గుండె రాయి గద తిష్ఠను వేసెను కొండ కోనలన్
    నావచనంబుసత్యములు నంతియెచెప్పుమ నీరజాక్షి!నీ
    భావము కూడ తెల్పుమిఁక భర్గుని డెందము జాలి గుండెయా?
    ప్రోవునె నెల్లవేళలను భోరున నేడ్చెడు భక్తకోటినిన్?


    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      "ప్రోవునె యెల్లవేళలను" అనండి.

      తొలగించండి

  20. పిన్నక నాగేశ్వరరావు.
    హనుమకొండ.

    కాలి నడకన నేగు భక్తాళి యందు
    వెనుకబడిన బాలికఁ గని పిల్ల చిరుత
    పైబడి యనుకొనని రీతి ప్రాణము గొన
    తల్లి రోదించి శోకమం దనియె నిటుల
    "కొండ పైనున్న దేవుని గుండె రాయి".

    రిప్లయితొలగించండి