తే.గీ:నీచుడౌ సభాపతి సభన్ నెలకొనంగ బూతులే పల్క, సభ్యులు నీతి వదలి, సర్వనియమాళి నెదిరించి,చాచి కాల దన్ని ధిక్కరించిన నవ్వఁ దగును సభను” (స్పీకర్ పనికి మాలిన వా డైతే సభలో ఏమి జరిగినా నవ్వుతూ ఉంటారు.దేనికీ బాధపడరు.)
ఉ:ఎన్నిక లందు గెల్వగనె, యింద్రుడ నేనను ముఖ్యమంత్రికే మన్నన లేక సాగినను, మాటల సభ్యత లేకయుండినన్ దున్నల వోలె రెచ్చి తమ దూకుడు తో గణతంత్రరీతులన్ తన్నిన ధిక్కరింప సభఁ దాపముఁ జెందక నవ్వఁగాఁ దగున్ (సభ నీచాతినీచం గా నడుస్తుంటే ముఖ్యమంత్రి అది చూసి నవ్వటం .)
ఎన్నికవేళలోసభలనెంచుచుమంత్రియుమాటలాడగా
రిప్లయితొలగించండిపిన్నలుపెద్దలున్వినుచువేనకువేలుగనిందఁజేయగా
మన్నునుదిన్నపామువలెమంద్రతతోడుతమాయగ్రమ్మగా
తన్నినధిక్కరింపసభతాపముఁజెందక,
నవ్వగాఁదగున్
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండిపాఠశాలలో వక్తృత్వ పంతమందు
రిప్లయితొలగించండిబూతులను మాటలాడెడు పొత్తుకాని
బంతులయ్య తన చిరాకు బట్టలేక
తన్ని ధిక్కరించిన నవ్వఁ దగును సభను
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండి
రిప్లయితొలగించండిప్రజల సొమ్మును దిగమ్రింగ పదవి గోరి
యెన్నికలయందు నిల్చున దెవ్వడైన
నోర్మినెంతయొ నటియించి యోటరులట
తన్ని ధిక్కరించిన నవ్వఁ దగును సభను.
ఎన్నిక గెల్చుటొక్కటియె యెవ్వడు లక్ష్యమటంచు దల్చువా
డెన్నొ పరాభవమ్ముల సహింపక తప్పదు లోకులెల్లరున్
మన్నన సేయబోరిల విమర్షకు లచ్చట కోపమందునన్
తన్నిన ధిక్కరింప సభఁ దాపముఁ జెందక నవ్వఁగాఁ దగున్.
మీ రెండు పూరణలు ప్రశస్తంగా ఉన్నవి. అభినందనలు.
తొలగించండితే॥ “తన్ని ధిక్కరింప నవ్వఁ దగును సభను”
రిప్లయితొలగించండిరాజకీయ నాయకు లిట్లు మోజు పడుచుఁ
బల్కరో సానుభూతినిన్ బ్రజలు తమకు
గెలుపుఁ గట్టఁబెట్టుదురని వలచి మురిసి
ఉ॥ “తన్నిన ధిక్కరింప సభఁ దాపముఁ జెందక నవ్వఁగాఁ దగున్”
మిన్నగ రాజకీయమున మేలనిఁ దెల్పుదురీ విధంబుగన్
జెన్నగు సానుభూతిఁ గని క్షేమముగా గెలువంగ వీలనిన్
బన్నవొ యివ్విధిన్ బ్రజలు బాగుగఁ గాంచఁగ సంభవించఁగన్
అతడు సినిమా లోని సంఘటన ఆధారంగానండి
మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.
తొలగించండి'వీలనిన్'...... అనిన్ అన్న రూపం సాధువు కాదు.
ధన్యవాదములండి
తొలగించండితేటగీతి
రిప్లయితొలగించండిపండితుండను నాకేరు పట్టరనఁగ
తూలిపడునట్లుఁ జెలఁగి తెనాలి వారుఁ
దాల్చి 'తిలకాష్టమహిష బంధనము' న తలఁ
దన్ని ధిక్కరించిన నవ్వఁ దగును సభను
ఉత్పలమాల
మిన్నగ నేర్చి నన్నెవరు మేదిని మించఁగలేరటంచుఁ దాఁ
దిన్నగ కృష్ణరాయలకు దెల్పగ నొక్కడు, రామలింగఁడున్
గ్రన్ననఁ గట్టి వైచి 'తిలకాష్టముమాహిషబంధనన్ దలన్
దన్నిన ధిక్కరింప సభఁ దాపముఁ జెందక నవ్వఁగాఁ దగున్!
మీ రెండు పూరణలు ప్రశస్తంగా ఉన్నవి. అభినందనలు.
తొలగించండి🙏ధన్యోస్మి గురుదేవా!🙏
తొలగించండిప్రజల సొమ్ముకై తహతహ లాడువాడు
రిప్లయితొలగించండిపాడు పనులకై సిగ్గును వీడువాడు
నేర చరితుని చెంతకు చేరు వాడు
తన్ని ధిక్కరించిన నవ్వఁ దగును సభను
ఎన్నికలందునన్ గెలిచె నెవ్వడు వీడక సిగ్గు లజ్జలన్
దున్నను పోలియుండవలె దుష్పరిపాలన చేయు నేతకే
క్రన్నన నూతమిచ్చి తను రాజుకు బంటుగ నుండగావలెన్
దన్నిన ధిక్కరింప సభఁ దాపముఁ జెందక నవ్వఁగాఁ దగున్
మీ రెండు పూరణలు ప్రశస్తంగా ఉన్నవి. అభినందనలు.
తొలగించండిధన్యవాదాలు గురూజీ 🙏
తొలగించండిపెక్కు హామీలు గుప్పించి ప్రియము లొలుకు
రిప్లయితొలగించండిమాటలను బల్కి ప్రజలను మభ్య పెట్టి
పదవి పొందియు మరచిన వాని నొకడు
తన్ని ధిక్క రించిన నవ్వ దగును సభను
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండితేటగీతి
రిప్లయితొలగించండిపండితుల నడుమన చేరి పచ్చి బూతు
లాడు మూర్ఖుని, జల్పము లాడు వాని
తికమక గొనక దండించ తీర్పు నిడుచు
తన్ని, దిక్కరించిన నవ్వదగును సభను.
ప్రబల వేంకట సుబ్రహ్మణ్య శాస్త్రి
ఉండవల్లి సెంటరు.
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండిఓట్లకోసమై నేతల పాట్లు వేలు
రిప్లయితొలగించండిమురికి కాల్వల నూడ్తురు ముదముతోడఁ
నొప్పుగా చేతురెన్నియో యూడిగములు
తన్ని ధిక్కరించిన నవ్వఁ దగును సభను
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండిఎన్నికలందు నాయకుల కెన్ని యవస్థలొ యెంచి చూడ సం
రిప్లయితొలగించండిపన్నులు పేదవారలను వాసి దలంపక నెల్లవారలన్
పన్నుగ పల్కరింపఁదగు వాదములాడక నుండగా దగున్
తన్నిన ధిక్కరింప సభఁ దాపముఁ జెందక నవ్వఁగాఁ దగున్
మీ పూరణ ప్రశస్తంగా ఉన్నది. అభినందనలు.
తొలగించండితే.గీ:నీచుడౌ సభాపతి సభన్ నెలకొనంగ
రిప్లయితొలగించండిబూతులే పల్క, సభ్యులు నీతి వదలి,
సర్వనియమాళి నెదిరించి,చాచి కాల
దన్ని ధిక్కరించిన నవ్వఁ దగును సభను”
(స్పీకర్ పనికి మాలిన వా డైతే సభలో ఏమి జరిగినా నవ్వుతూ ఉంటారు.దేనికీ బాధపడరు.)
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండిఉ:ఎన్నిక లందు గెల్వగనె, యింద్రుడ నేనను ముఖ్యమంత్రికే
రిప్లయితొలగించండిమన్నన లేక సాగినను, మాటల సభ్యత లేకయుండినన్
దున్నల వోలె రెచ్చి తమ దూకుడు తో గణతంత్రరీతులన్
తన్నిన ధిక్కరింప సభఁ దాపముఁ జెందక నవ్వఁగాఁ దగున్
(సభ నీచాతినీచం గా నడుస్తుంటే ముఖ్యమంత్రి అది చూసి నవ్వటం .)
మీ పూరణ ప్రశస్తంగా ఉన్నది. అభినందనలు.
తొలగించండిచిన్ని పిల్లల చెయ్వుల సిగ్గు సెంద
రిప్లయితొలగించండినేల పెద్దలు తప్పుగ నెదల నెంచి
యలరి మందహాసమున రాజార్భకుండు
తన్ని ధిక్కరించిన నవ్వఁ దగును సభను
ఎన్నఁగ దైవ కల్పితములే గెలు పోటము లెల్ల ధాత్రినిన్
మున్నరయన్ జయాపజయముల్ మనుజాలికి నేర శక్యమే
తన్నెదిరింపఁ బంతమునఁ దాటినిఁ దన్న శిరమ్ము నంతఁ దాఁ
దన్నిన ధిక్కరింప సభఁ దాపముఁ జెందక నవ్వఁగాఁ దగున్
చంద మామను చూపుచు చక్క గాను
రిప్లయితొలగించండిగోరు ముద్దలను కలిపి కూర్మి తోడ
నోట బెట్టుచు నుండగ నొల్ల ననుచు
*తన్ని ధిక్కరించి ననవ్వ దగును సభను*
పన్నగశాయియౌహరిని ప్రస్తుతి చేయుచు సంచరిం చుచున్
మన్నన చేయు చెప్పుడును మానుగ మ్రొక్కెడు మౌని తా వడిన్
తిన్నగ నేగి క్రూరమగుదృష్టినిపర్చుచు పాదమెత్తుచున్
*“తన్నిన ధిక్కరింప సభఁ దాపముఁ జెందక నవ్వఁగాఁ దగున్”*
రిప్లయితొలగించండిపిన్నక నాగేశ్వరరావు.
హనుమకొండ.
అక్రమార్జన యందు తా నారితేరి
నీతి సూత్రాలు వల్లించు నేత యొకడు
మాటలాడుచు నుండగ మధ్యలోనె
యతని చరిత తెలిసిన ప్రజాళి లాగి,
తన్ని, ధిక్కరించిన నవ్వఁ దగును సభను.