16, మే 2024, గురువారం

సమస్య - 4766

17-5-2024 (శుక్రవారం)

కవిమిత్రులారా,

ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...

“సారెకు సారెకును సారె సారెకుఁ గనఁగన్”

(లేదా...)

“సారెకు సారెకున్ మఱియు సారెకు సారెకు సారెసారెకున్”

23 కామెంట్‌లు:

  1. కం॥ పోరఁగఁ బిల్లలు నిరతము
    వారికి యక్కరలఁ దీర్చ వలసిన వాఁడై
    సారించ వ్యయము పెరిఁగెరొ
    సారెకు సారెకును సారె సారెకుఁ గనఁగన్

    ఉ॥ పోరఁగ సంతు నిత్యమును ముద్దుగఁ గోరుచు నెన్నియో యటుల్
    వారిని తృప్తిఁ జేయఁగను బాధ్యత మీరఁగఁ గష్టమెంతయో
    పేరిమి తో భరించినను భీతినిఁ బొందితి వెచ్చమెక్కువై
    సారెకు సారెకున్ మఱియు సారెకు సారెకు సారెసారెకున్

    రిప్లయితొలగించండి
  2. వారిజనేత్ర కుంతల
    కూరిమిదుష్యంతునియెడకోరికతోడన్
    భారముతోడుతనడుగిడె
    సారెకుసారెకునుసారెసారెకుగనగన్

    రిప్లయితొలగించండి
  3. భారమునయ్యెగామనసుపావనిసీతనువీడనాటవిన్
    ఆరనిమంటయీతఱినిహా! విధివంచితరాముభార్యయే
    నేరమునాదియయ్యెననినెవ్వగలక్ష్మణుడంబజూచెగా
    సారెకుసారెకున్మఱయుసారెకుసారెకుసారెసారెకున్

    రిప్లయితొలగించండి
  4. కోరికయొకటి జనించును
    తీరిన మరియొక్క కోర్కె తిరిగి జనించున్
    కోరికలు జనించు నిటుల
    సారెకు సారెకును సారె సారెకుఁ గనఁగన్

    రిప్లయితొలగించండి
  5. ఆరడు లత్తగారికి పెనాశలుఁ గల్గగ లడ్లుకొమ్ములున్
    బారెడు పూతరేకులటుపై శెనగచ్చులు సున్నిఉండలున్
    పేరరిసెల్లు జంతికలుఁ బిండివంటలఁ జెప్పె నెల్నెలా
    సారెకు సారెకున్ మఱియు సారెకు సారెకు సారెసారెకున్

    రిప్లయితొలగించండి
  6. కందం
    భారతమున నెన్నికలన
    పూరితి కావలె విడతలు పొందగ ఫలితాల్!
    మారునె తేదీ యాత్రుత
    సారెకు సారెకును సారె సారెకుఁ గనఁగన్?

    ఉత్పలమాల
    పూరితిఁ జేయనెన్నికలఁ బూనుచు భారతదేశమందునన్
    దీరిచె భా. ఎ. సం తరచి తీరికగన్ దశలేడు శాంతికై
    మారునె తేది యాత్రుత నమాంతముగన్ ఫలితాలకై గనన్
    సారెకు సారెకున్ మఱియు సారెకు సారెకు సారెసారెకున్?

    (భా. ఎ. సం = భారత ఎన్నికల సంఘము)

    రిప్లయితొలగించండి
  7. కోరిన పక్షము లందున
    చేరిన నేతలు నిరతము చెప్పెదరు గదా
    దారుణ రీతిని కల్లలు
    సారెకు సారెకును సారె సారెకుఁ గనఁగన్

    కోరికతోడ నెన్నికల కోసము వేచిన నేతలెల్లరున్
    జేరుట గాంచవచ్చుగద చిత్తము వచ్చిన పక్షమందునన్
    వారిక చేయుచుంద్రుగద పచ్చియబద్దపు బాసలన్ గనన్
    సారెకు సారెకున్ మఱియు సారెకు సారెకు సారెసారెకున్

    రిప్లయితొలగించండి
  8. కోరికలెంచి జూడ మధుకోశము నందలి తేనెటీగలే
    కోరిన కోర్కె దీరఁగనె క్రొత్తగ వేరొక కోర్కెపుట్టు నా
    కోరికదీర వేరొకటి కొందలపాటొనరించు నివ్విధిన్
    సారెకు సారెకున్ మఱియు సారెకు సారెకు సారెసారెకున్

    రిప్లయితొలగించండి
  9. వేరిమి యుండె సుతలకిడు
    సారెకు సారెకును , సారె సారెకుఁ గనఁగన్
    నేరముకద నట్లు సలుప
    వారిరువురు నీ పిరమగు వశలుగ నెరుగన్

    సారె = కుమార్తెకిచ్చు సామగ్రి ,
    మాటిమాటికి

    రిప్లయితొలగించండి

  10. కౌరవుల కెవరు చెప్పిన
    వారాపగలేదు కాదె పార్ష్వపు చేష్టల్
    పేరుకొన నొక్కటా యవి
    సారెకు సారెకును సారె సారెకుఁ గనఁగన్.


    కౌరవు లెంతకుచ్చితులు కల్కపు జూదము నందు గెల్చుచున్
    వారిజనేత్రి కృష్ణను సభాంతర మందున నెగ్గు సేసిరే
    వారల దుష్కృతమ్ములతిభారము కుట్రలు పన్ను చుందురే
    సారెకు సారెకున్ మఱియు సారెకు సారెకు సారెసారెకున్.

    రిప్లయితొలగించండి
  11. తారా పథమున మబ్బులు
    జోరుగ నేర్పడియు వర్ష సూచన గాగన్
    పేరిమి సవ్వడి గ నురిమె
    సారె కు సారెకు ను సారె సారెకు గనగన్

    రిప్లయితొలగించండి
  12. కందం
    ఓరిమి గల దేశప్రజ,
    తీరుబడిగ యెన్నికలన తీర్పుల కొరకై
    చేరిరి ఓట్లను వేయన్
    సారెకు సారెకును సారె సారెకుఁ గనఁగన్

    ప్రబల వేంకట సుబ్రహ్మణ్య శాస్త్రి
    ఉండవల్లి సెంటరు

    రిప్లయితొలగించండి
  13. గారెలు పాయసమ్ము కడు గమ్మని చారులు దప్పళమ్ములున్
    బూరెలు ఇడ్డెనల్ వడలు పూర్ణము భక్ష్యములామెతమ్మునన్
    బారులు తీరగా జనులు వచ్చిరి భోజన శాలలోనికిన్
    సారెకు సారెకున్ మఱియు సారెకు సారెకు సారెసారెకున్

    రిప్లయితొలగించండి
  14. వారిజనేత్ర ప్రేమరస వాహినులందున ఓలలాడెనో
    కూరిమి జేరదీయ తన కుచ్చిత బుద్ధిని గానకుండెనో
    మీరడు యాలి మాటలను మిక్కిలి ప్రేమగ జెప్పజూచినన్
    సారెకు సారెకున్ మఱియు సారెకు సారెకు సారెసారెకున్

    కొడుకు కోడలి మాటే వింటున్నాడు అని ఆవేదన చెందుతున్న ఓ తల్లి వ్యధ.

    రిప్లయితొలగించండి
  15. కం:సారెలు బిడ్డల పెండ్లికి,
    సారెలు గర్భమ్ములకును,శ్రావణమునకున్
    సారెలు,మా సొమ్మెందుకు?
    సారెకు సారెకును సారె సారెకుఁ గనఁగన్”
    (సారె సారె కీ సారెలే. )

    రిప్లయితొలగించండి
  16. ఉ:వీరలకే జగాన మగ బిడ్డ జనించిన యట్లు పెండ్లిలో
    సారెకు మూతి త్రిప్పుటలు, చక్కని తిండికి వంక పెట్టుటల్,
    గౌరవ మేదొ తగ్గెనని గద్దరి దెప్పిడులున్ చెలంగెగా!
    సారెకు సారెకున్ మఱియు సారెకు సారెకు సారెసారెకున్”
    (పెళ్లిళ్ల లో మగ పెండ్లి వారి హడావిడీలు)

    రిప్లయితొలగించండి
  17. చోరుని కడుహింసించిన
    చోరత్వము మానఁడతఁడు ,చుక్కలు పొడవన్
    చొరబడ యత్నముఁజేయును
    సారెకు సారెకును సారె సారెకుఁ గనఁగన్

    రిప్లయితొలగించండి
  18. దారుణములై చెలంగు న
    పారమ్ము నిరంతరమ్ము వాని వచనముల్
    తోరమ్ము మాఱు చుండును
    సారెకు సారెకును సారె సారెకుఁ గనఁగన్


    వారక పల్కుఁ బల్కినదె పాడును బాడిన యట్టి పాటనే
    కోరును మూరి కోరినదె గోడును జెప్పును జెప్పి నట్టిదే
    వారిని వీరినిం గదిసి భ్రాంత మనష్కుఁడు భీత చిత్తుఁడై
    సారెకు సారెకున్ మఱియు సారెకు సారెకు సారె సారెకున్

    రిప్లయితొలగించండి
  19. చోరుని చూచియా వనిత చోరుఁడ యంచును గేక వేయగా
    వారును వీరునున్ పరుగు పర్గున నాతని కట్టి కొట్టగా
    భైరవమించుకైన మది పట్టక యేగును దొంగ వానిగన్
    సారెకు సారెకున్ మఱియు సారెకు సారెకు సారెసారెకున్”

    రిప్లయితొలగించండి

  20. భారము బెరిగెను దండ్రికి
    చీరెలు దోవతులు వెట్ట చింతలు బెర్గెన్
    ధారుణ మీ యాచారము
    సారెకు సారెకును సారె సారెకుఁ గనఁగన్

    రిప్లయితొలగించండి

  21. పిన్నక నాగేశ్వరరావు.
    హనుమకొండ.

    చీర ధరించె నొకటిపుడు
    మారెను గంటకొకటి గృహమందున వేడ్కన్
    తీరుగ లేవని మార్చెను
    సారెకు సారెకును సారె సారెకుఁ గనగన్.

    రిప్లయితొలగించండి