2, మే 2024, గురువారం

సమస్య - 4753

3-5-2024 (శుక్రవారం)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“కవనముం జెప్పు కవికి సత్కారమేల”
(లేదా...)
“కవనమ్మున్ వినిపించు సత్కవికి సత్కారంబు వ్యర్థంబగున్”

16 కామెంట్‌లు:

  1. పరమయోగీశ్వరుంజేలభావమందు
    లౌక్యమెంచునురసమయలౌల్యుడగుచు
    బ్రహ్మమానందమయమైనపలుకుతోడ
    కవనమునుజెప్పుకవికిసత్కారమేల

    రిప్లయితొలగించండి
  2. తేటగీతి
    శ్రావ్యమైన కంఠమ్మున రాగమొలుక
    నాపక సభలో జేజేలు నభము దాక
    నదియె నిజమైన గౌరవమనగనొప్ప
    కవనముం జెప్పు కవికి సత్కారమేల?

    మత్తేభవిక్రీడితము
    శ్రవణోపేయపు గానమాధురులతో రంజిల్లగాఁ బల్కగన్
    స్తవనీయమ్మనిమెచ్చుచున్ జయజయధ్వానాలు మిన్నంటగన్
    భువిలోనంతకుమించి గౌరవమొకో? పూమాలలన్ వైచుచున్
    గవనమ్మున్ వినిపించు సత్కవికి సత్కారంబు వ్యర్థంబగున్!

    రిప్లయితొలగించండి
  3. ప్రజల రంజింప జేసెడు భావ కవిత
    రచన జేసెడు వాడౌ చు రాణ కెక్క
    భేషు భేషని రసికులు బ్రీతి బొగడ
    కవన ముo జెప్పు కవికి సత్కార మేల?

    రిప్లయితొలగించండి
  4. తే॥ పాఠకుల మెప్పు ఘనమగు ప్రాభవమును
    గనుచుఁ బడయఁగ గుర్తింపు కవివరునకు
    నన్య సత్కార మేలొకో నరయఁ గాను
    కవనముం జెప్పు కవికి సత్కార మేల

    మ॥ భువిలో సత్కవి వ్రాయగా నటుల నద్భుతమ్ముగన్ గావ్యముల్
    జవులూరించెడి మాధురిన్ గనుచు నాసాతంబు భాసిల్లఁగన్
    నవతా భావము వెల్లువై పరఁగ సన్మానించఁగా నెట్టులన్
    గవనమ్మున్ వినిపించు సత్కవికి సత్కారంబు వ్యర్థంబగపన్

    రిప్లయితొలగించండి
  5. కీర్తి కాంక్షతో పలువిధ కృతులు వ్రాయ
    నేమి యందించుక సమాజ హితము లేక
    రాసి మెండైన నిసుమంత వాసి లేని
    కవనముం జెప్పు కవికి సత్కారమేల?


    ద్రవిణంబిచ్చి పురస్కృతుల్ విరివిగాతా బొందుచున్ వానివౌ
    జవసత్త్వమ్ములు లేని కావ్యములనే సత్కావ్య రాజమ్ములై
    భువిలో నిల్చిన నేమి సాహితి సభన్ మూర్ఖత్వమున్ దెల్పెడిన్
    గవనమ్మున్ వినిపించు సత్కవికి సత్కారంబు వ్యర్థంబగున్.

    రిప్లయితొలగించండి
  6. ఆరయగ మన సంఘమునందున గల
    చట్టముల గూర్చి తగు పరిజ్ఞానమేమి
    లేని వానిని ప్రభుతపై రెచ్చగొట్టు
    కవనముం జెప్పు కవికి సత్కారమేల

    రిప్లయితొలగించండి
  7. నిరతము కవిత్వమే తనసురతమైన
    ఘనుడు జనఘోష విననట్టి కవివరుండు
    కవన కోకిలగామారి కమ్మనైన
    కవనముంజెప్పు కవికి సత్కారమేల

    కవులెవ్వారలొ యెందరో గలరు లోకంబందునన్ గన్గొనన్
    వివరింపంగ పికంబు వోలె ఘనమౌ విద్వత్తు చూపించుచున్
    గవనమ్మున్ వినిపించు సత్కవికి సత్కారంబు వ్యర్థంబగున్
    గవితామ్రాక్షము కూయకుండదుకదా కాంక్షించి సన్మానముల్

    రిప్లయితొలగించండి
  8. ఐహిక సుఖములకునెప్పుడాశపడక
    కర్మ మీమాంస యొనరించు కవియతండు
    భక్తి మార్గము జూపించు పదములల్లి
    కవనముం జెప్పు కవికి సత్కారమేల

    రిప్లయితొలగించండి
  9. భవబంధమ్ముల నుజ్జగించు సరణిన్ పద్యమ్ములల్లున్ సదా
    కవితల్ కావ్యములందు నైహికములన్ గర్హించు, సన్మానముల్
    కవి తానెన్నఁడు వాంఛ చేయడు, విరాగత్వమ్ముగా నిట్లనున్
    కవనమ్మున్ వినిపించు సత్కవికి సత్కారంబు వ్యర్థంబగున్

    రిప్లయితొలగించండి
  10. తే.గీ:స్వంత బంధువునకు మాట సాయ మిడక,
    బిచ్చ గానికి నొక రూక వేయ కుండ,
    సామ్యవాదవిప్లవమంచు చక్క నైన
    కవనముం జెప్పు కవికి సత్కారమేల?

    రిప్లయితొలగించండి
  11. మ:చవియున్, సారము లేని పద్యములనే శ్లాఘించి నిన్నే మహా
    కవి వంచున్ బొగడంగ మిత్రు లదియే గమ్యమ్మె ఓ సాధకా!
    కవనమ్మున్ వినిపించు సత్కవికి ,సత్కారంబు వ్యర్థంబగున్,
    కవితామర్మవిదుండు కాక పలు సంఘమ్ముల్ నినున్ మెచ్చినన్.

    రిప్లయితొలగించండి
  12. తనదు పద్యాల గానాన దన్మయులుగఁ
    జేయు కవికిలఁ శ్రోతల చిందు లుండ
    యంత కంటెను సంతోష మైన ఘటన
    నొండు యుండునె చెప్పుమ యోలతాంగి!
    కవనముం జెప్పు కవికి సత్కారమేల?

    రిప్లయితొలగించండి
  13. అర్థవంత శబ్దమ్ముల నలరు చుండఁ
    గావ్యముం బఠియించి సత్కవులు మెచ్చఁ
    జదివి పలువు రానందింపఁ జక్కఁగాను
    గవనముం జెప్పు కవికి సత్కార మేల


    భువిలో నింపెసలారు కావ్యముల నంభోజాక్షు వర్ణించుచుం
    గవిలోకమ్మున మూరి రాజిలుచు విఖ్యాతమ్ముగా నుండఁగా
    నవివేకుల్ దనరింప స్వార్థమును వారాశించి కావింపఁగాఁ
    గవనమ్మున్ వినిపించు సత్కవికి సత్కారంబు వ్యర్థం బగున్

    రిప్లయితొలగించండి
  14. కవనమ్మున్ వినిపించు సత్కవికి సత్కారంబు వ్యర్థంబగున్
    పవనా!యేమిది పిచ్చియా ,చెపుమ
    దుర్వ్యాపారచిత్తుండవా?
    కవులం గూరిచియిట్లుగా బలుక సత్కార్యంబె? చింతింపుమా
    కవనమ్మున్ వినిపించు సత్కవికి సత్కారంబు యోగ్యంబునౌ

    రిప్లయితొలగించండి
  15. కవిత వ్రాయవలయుననుకాంక్షతోడ
    పదములపయినేమాత్రముపట్టులేక
    భావరహితముగసతముపసయులేని
    కవనముంజెప్పుకవికిసత్కారమేల

    రిప్లయితొలగించండి