31, మే 2024, శుక్రవారం

సమస్య - 4779

1-6-2024 (శనివారం)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“సంక్లిష్టప్రాసనిత్తు సత్కవి చెపుమా”
(లేదా...)
“సంక్లిష్టంబగు ప్రాసనిచ్చెదఁ గవీ సామర్థ్యముం జూపుమా”
(అక్కెర కరుణాసాగర్ గారికి ధన్యవాదాలతో...)

21 కామెంట్‌లు:

  1. కందం
    సంక్లిష్టప్రాస నిడగ
    సంక్లిష్టపదమె తొడిగెఁ బొసగ పాదాదుల్?
    సంక్లిష్ట పదమదె గొనక
    సంక్లిష్టప్రాసనిత్తు సత్కవి చెపుమా!

    శార్దూలవిక్రీడితము
    సంక్లిష్టంబగు ప్రాసనీయ తమరున్ సంక్లిష్టతన్ వీడ నా
    సంక్లిష్టంబగు ముందు మాటె కొనిరే సాధింప పాదాదులన్!
    సంక్లిష్టంబగు నా పదమ్ము విడుచున్ సంధించి వేర్వేరుఁగన్,
    సంక్లిష్టంబగు ప్రాసనిచ్చెదఁ గవీ! సామర్థ్యముం జూపుమా!

    రిప్లయితొలగించండి

  2. సంక్లిష్టమేది? ఐం బీ
    జం క్లీం శక్తి యని తీవ్ర సాధన తోడన్
    సంక్లిష్టముండదంటివి
    సంక్లిష్టప్రాసనిత్తు సత్కవి చెపుమా.


    సంక్లిష్టమ్మును గాంచి భీతిలను భాషాయోష దీవించినన్
    సంక్లిష్టమ్మె సుసాధ్యమౌ సఖుడ నేసాధింతు నిమ్మంటి వే
    సంక్లిష్టత్వము గల్గినట్టి పదమున్ శాస్త్రీ యిదో యిప్పుడే
    సంక్లిష్టంబగు ప్రాసనిచ్చెదఁ గవీ సామర్థ్యముం జూపుమా.

    రిప్లయితొలగించండి
  3. సంక్లిష్ట కైపదముతో
    సంక్లిష్టప్రాసనిత్తు సత్కవి చెపుమా
    సంక్లిష్ట మనుచు విడువక
    సంక్లిష్ట పదములతోడ సాధ్యమగుగదా

    రిప్లయితొలగించండి
  4. సంక్లిష్టతలెదురైనన్
    ఓంక్లీమ్మను మంత్రముంది ఓంకారేశా!
    సంక్లిష్టతయని తలపక
    సంక్లిష్టప్రాసనిత్తు సత్కవి చెపుమా

    'సంక్లిష్టంబగు ప్రాసనిచ్చెదఁ గవీ సామర్థ్యముం జూపుమా!'
    ఓం క్లీం హ్రీమ్మను మంత్రమున్ దలపగా ఓంకారమే స్పష్టమై
    సంక్లిష్టంబగు చిక్కులే విడివడున్! సందర్భమేతెంచినన్
    సంక్లిష్టంబగు ప్రాస కూర్చెదఁ సదా సామర్థ్యమున్ జూపెదన్

    రిప్లయితొలగించండి
  5. సంక్లుప్తంబగు పదముల
    సంక్లిష్టప్రాసనిచ్చి సద్గురువర్యుల్
    సంక్లిన్నమొనర్చియనిరి:
    "సంక్లిష్టప్రాసనిత్తు సత్కవి చెపుమా"

    రిప్లయితొలగించండి
  6. కం॥ సంక్లిష్టన్యస్తాక్షరి
    సంక్లిష్టముఁజేతు నన్ని చతురత నెరుగన్
    సంక్లిష్ట సమస్యకటుల
    సంక్లిష్టప్రాసనిత్తు సత్కవి చెపుమా

    శా॥ సంక్లిష్టంబుగఁ జేయ నెంచుచునటుల్ సారించి న్యస్తంబునున్
    సంక్లిష్టంబగు ఛందముల్ నడపఁగా సాధించఁగన్ బృచ్ఛకుల్
    సంక్లిష్టంబును స్వీకరించఁ గవియున్ శ్లాఘించి ప్రశ్నించెరో
    సంక్లిష్టంబగు ప్రాసనిచ్చెదఁ గవీ సామర్థ్యముం జూపుమా

    రిప్లయితొలగించండి
  7. సంక్లిష్టంబను చేతనన్ గలిగియున్ సాధ్యంబు కానట్టిదౌ,
    సంక్లిన్నంబొనరించి నాతనువు, 'క్లీ' శబ్దంబునున్ బ్రాసగా
    సంక్లుప్తంబుగనిచ్చి పూరణమునున్ సల్పంగ నిట్లందురా:
    "సంక్లిష్టంబగు ప్రాసనిచ్చెదఁ గవీ సామర్థ్యముం జూపుమా"

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. సంకౢప్తంబు లో కౢ సంయుక్తాక్షరము కాదండి. ఇందులో లా వత్తు లేదు కృ వలె కౢ కా గుణింతములోని ఌ కారముతోఁ గూడిన యొక యక్షరము. అప్పుడు సంయు తాసంయుత ప్రాసగా భావింప వచ్చును.

      తొలగించండి
    2. తమరి వివరణాత్మక సూచనకు ధన్యవాదములు ఆర్యా🙏

      తొలగించండి
  8. సంక్లిష్ట o బ య్యె ననుచు
    సంక్లిష్ట ము గా దల చక సరసపు మతితో
    సంక్లిష్టము బో నడ చుచు
    సంక్లిష్టపు ప్రాస నిత్తు సత్కవి చెపుమా

    రిప్లయితొలగించండి
  9. కం:వాంక్లోతు మంగ్లి యందువు,
    ఓం క్లీం హ్రీ మనియు ప్రాస నొనరింతువు లే,
    జింక్ లో యందువు నీ కే
    సంక్లిష్టప్రాసనిత్తు సత్కవి చెపుమా?
    (ఇలాంటి పదాలతో సమస్య నెట్టన అవధానికి ఏ క్లిష్టప్రాస ఇస్తాము?అని.)

    రిప్లయితొలగించండి
  10. 2)శా:"వాంక్లోత్ మంగ్లి" యటంచు నెత్తెదవు లే ,"బాగుండ వారోగ్యముల్
    జింక్ లోపమ్మున" నందు వేమొ ! యెటులో చిత్రింతు వా ప్రాస, యే
    సంక్లిష్టంబగు ప్రాసనిచ్చెదఁ గవీ? సామర్థ్యముం జూపుమా
    సంక్లిష్టమ్ము నొసంగినంత పరభాషన్ దెచ్చు నీ ప్రజ్ఞతో !
    (ఈ అవధానికి క్లిష్టప్రాస ఇవ్వగానే పరభాష లో పదాల తో పూరిస్తాడు.వాటికి తెలుగు పదాలు అడగా లంటే అవి ఉండవు. కాబట్టి "నీ కెదురు లేదు.సామర్థ్యం చూపించెయ్" అని చమత్కరిస్తున్నాడు పృచ్ఛకుడు. )


    రిప్లయితొలగించండి
  11. పెన్ క్లిష్టంబులె నేర్పుప్రజ్ఞఁ గనుకన్ వేసారకయ్యవ్వి నీ
    కున్ క్లీతాదులగన్దలంచి ప్రతిభాగుంఛంపువై దిట్టవై
    యక్లాంతుండవునై వెలుంగవలెన న్నభ్యాసఛందస్సునన్
    సంక్లిష్టంబగు ప్రాసనిచ్చెదఁ గవీ సామర్థ్యముం జూపుమా

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. పెను క్లిష్టంబులె పెన్క్లిష్టంబులె యగును. అప్పుడు ప్రాస భంగమండి.
      నీకున్ క్లీతాదులు నీకుం గ్లీతాదులు కాఁగఁ బ్రాస భంగము.
      గమనింపుఁడు.

      తొలగించండి
  12. సంక్లిష్టప్రాస కవులకు
    సంక్లిష్టముగాదె యెపుఁడు సత్కవి వర్యా!
    సంక్లిష్టమునిడఁదలఁచితి
    సంక్లిష్టప్రాసనిత్తు సత్కవి చెపుమా

    రిప్లయితొలగించండి
  13. అడర శబ్ద గాంభీర్యము నర్థ లాఘ
    వమ్ము కన్పట్టు నట్టులఁ బండితాధి
    ప! సరళీకృత సంక్లిష్ట! ప్రాస నిత్తు
    సత్కవి చెపుమా పద్యము సత్కరింప


    ఓం క్లీం హ్రీ మ్మని దేవతా స్మరణమం దుత్సాహినై చింతనా
    సంక్లిన్నామల మానసుండ నయి నిశ్శబ్దమ్ము వర్ధిల్లఁగా
    సంక్లేశమ్ములఁ బాసి పూరణము నిశ్శంకన్ వెలారించెదన్
    సంక్లిష్టం బగు ప్రాస నిచ్చెదఁ గవీ సామర్థ్యముం జూపుమా

    రిప్లయితొలగించండి
  14. సంక్లిష్టంబగు ప్రాసనిచ్చెదఁ గవీ సామర్థ్యముం జూపుమా
    సంక్లిష్టంబగు ప్రాసనీయుడుగురూ! సామర్ధ్యముంజూపుదున్
    సంక్లిష్టంబన నేదియుండదు సుమా సాకారమేయంతయున్
    సంక్లిష్టంబగు రానివారికి భువిన్ ఛందస్సు నర్ధాదులున్

    రిప్లయితొలగించండి

  15. పిన్నక నాగేశ్వరరావు.
    హనుమకొండ.

    సంక్లిష్టమగు సమస్యలు
    సంక్లిష్ట పదముల తోడ చక్కగ సాగున్
    సంక్లేశంబులు లేకను
    సంక్లిష్ట ప్రాసనిత్తు సత్కవి చెపుమా!

    రిప్లయితొలగించండి