7, మే 2024, మంగళవారం

సమస్య - 4757

8-5-2024 (బుధవారం)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“చీమల పదఘోషను విని సింగము జడిసెన్”
(లేదా...)
“చీమల పాదఘోష విని సింహము భీతిలి పాఱె గ్రక్కునన్”
(క్రొవ్విడి వేంకట రాజారావు గారికి ధన్యవాదాలతో...)

27 కామెంట్‌లు:

  1. నీమముదప్పనిప్రజలను
    కామాతురుడై దొరయటకాటునువేయన్
    వేమరుఖండనసేసిరి
    చీమలపదఘోషనుగనిసింగముదడిసెన్

    రిప్లయితొలగించండి
  2. కందం
    సామాన్యులు మాముందర
    భీమాదులటంచు నోడి వెన్నిడి దాగెన్
    గూమమున సుయోధనుడే!
    చీమల పదఘోషను విని సింగము జడిసెన్!

    ఉత్పలమాల
    మేమడుగంగ చేరినవి మిక్కుటమౌ హరిసేన ద్రోణుడున్
    రామునెదుర్చి నిల్చిన సురాపగ సూనుఁడు మాకుదక్కఁగన్
    జీమలు పాండవేయులని చెల్గి సుయోధనుఁడోడి నక్కెనే!
    చీమల పాదఘోష విని సింహము భీతిలి పాఱె గ్రక్కునన్!

    రిప్లయితొలగించండి
  3. తామసు డై వర్తించుచు
    నీమము లనువీడి నట్టి నీచుని యెడ లన్ గ్రామ ము లేక మ్మ యి నన్
    చీమల పద ఘోష ను విని సింగము జడి సెన్

    రిప్లయితొలగించండి
  4. క్షేమము దలపక పేదల
    కోమల మానసులనొంచి కోట్లు ఘడించా
    భీముని వంచగ పలు చిరు
    చీమల పదఘోషనుగని సింగము దడిసెన్

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      "కోట్లు గండించు"... 'గడించి + ఆ' అన్నపుడు సంధి లేదు.

      తొలగించండి
  5. హే మధు సూదన నేనీ
    భీమరమును సేయనంచు విజయుండనగా
    నా మురళీధరు డిట్లనె
    చీమల పదఘోషను విని సింగము జడిసెన్?


    భీమరమందు పోరి తమ వీరులు సోదరు లస్తమింపగా
    కూమము నందు దాగెనని కుచ్చితు డైన సుయోధనాఖ్యు సం
    గ్రామము జేయరమ్మనుచు కంకుడు తా బరిగొల్పె నిట్టులన్
    చీమల పాదఘోష విని సింహము భీతిలి పాఱె గ్రక్కునన్.

    రిప్లయితొలగించండి
  6. కం:
    సోమరియై తన గుహలో
    ఏమఱి నిదురించిన దెదురెరుగని దైనన్,
    చీమలు చెవిలో దూరగ,
    చీమల పదఘోషను విని సింగము జడిసెన్.

    రిప్లయితొలగించండి
  7. కం॥ ప్రామాణికముగ విధియగు
    సామాన్యుల బాధలు విని చర్చించుటకే
    యామంత్రి వెఱువఁ దోఁచెనె
    చీమల పదఘోషను విని సింగము జడిసెన్

    ఉ॥ ఏమనిఁ దెల్పగా వలయు నెందరినో తన ధీమసమ్ముతోఁ
    బ్రేమగ రాజకీయమున లేమల వంచనఁ జేసి సొక్కఁగన్
    భామలు నైకమత్యముగఁ బాపికి బుద్ధిని నేర్పఁ బూనఁగన్
    జీమల పాదఘోష విని సింహము భీతిలి పాఱెఁ గ్రక్కునన్

    రిప్లయితొలగించండి
  8. నీమము దప్పిన మంత్రికి
    ధామము నకు వచ్చిన జనదండును గనగన్
    నేమని జెప్పెద సఖుడా!
    చీమల పదఘోషను విని సింగము జడిసెన్

    రిప్లయితొలగించండి
  9. గామిడితనమునఁ బేదల
    బాములపెట్టెడు విసపరి పాపము పండెన్
    దీమసముగ దిరగఁబడిరి
    చీమల పదఘోషను విని సింగము జడిసెన్

    రిప్లయితొలగించండి
  10. నీమమువీడి పేదలను నిర్దయఁజూచి పరాభవించుచున్
    బాములపెట్టు దుర్మతుల పాపమడంచగ సంఘటిల్లియా
    చీమలవంటి నిర్ధనులు చేరిరి దీటుగ నొక్క త్రాటిపై
    చీమల పాదఘోష విని సింహము భీతిలి పాఱె గ్రక్కునన్

    రిప్లయితొలగించండి
  11. చీమల బోలు జనావళి
    ధీమంతుల నేలచిక్కె తెల్లదొరలకున్
    శేముషితో నెదురునిలువ
    చీమల పదఘోషను విని సింగము జడిసెన్

    చీమలబోలునట్టి జనజీవన ముండిన భారతావనిన్
    దాము క్రమించి యుండిరిగ దారుణ రీతిని తెల్లవారిటన్
    శేముషితోడనుద్యమము చేయగ దేశముఁ వీడి పాఱిరే
    చీమల పాదఘోష విని సింహము భీతిలి పాఱె గ్రక్కునన్

    రిప్లయితొలగించండి
  12. ధీమత్తేభములు పులులు
    చీమల వలె చిన్న వైన చిత్రమునందున్
    భీమమునౌ కాయముగల
    చీమల పదఘోషను విని సింగము జడిసెన్

    రిప్లయితొలగించండి
  13. ఏమన జాలు నాబుడతలీలువు నాశ్రమవాసులై సదా
    సామపిపాసులైనఁ గడు శౌర్యమునార్చిరి రామసేనలన్
    రామప్రతాపం పొడమి రాజిలిరే వెనుదీక పోల్చినన్
    చీమల పాదఘోష విని సింహము భీతిలి పాఱె గ్రక్కునన్

    రిప్లయితొలగించండి
  14. ఈ మలపై నీ వడుగిడ
    సామజ గణ మృగ సహితము సంతత జిత సం
    గ్రామా! రక్షో వర! నము
    చీ! మల పదఘోషను విని సింగము జడిసెన్


    కామ రిపుం డుమా ధవుఁడు గ్రన్నన మెచ్చి యనుగ్రహింపఁగా
    భీమ తపోతినిష్ఠకును బ్రేముడిఁ బాండవ సింహ పంక్తినిన్
    భీమునిఁ దొట్టి సైంధవ పిపీలిక పోరునఁ బాఱఁదోలెనే
    చీమల పాదఘోష విని సింహము భీతిలి పాఱె గ్రక్కునన్

    రిప్లయితొలగించండి
  15. కం:శ్రామికుల జీమ లనుకొని
    ప్రేమ వదలి పెట్టుబడిన పెరిగిన సింగ
    మ్మే మారె క్రాంతి గీతుల
    చీమల పదఘోషను విని సింగము జడిసెన్”
    (పదఘోష అంటే=వారు పాడే పదముల ఘోష.శ్రామిక చీమల పదాల ఘోష కి పెట్టుబడి దారు సింహం మారి పోయింది. )

    రిప్లయితొలగించండి
  16. ఉ:ఏమి శతావధాన మది!యిత్తుము మేము సమస్య లంచు బల్
    చీమల వోలె జేరి కవి సింహకు నిచ్చిరి పెక్కు పాదముల్
    నీమము లే మెరుంగకయె నేను భరించగ లేనటంచు నా
    చీమల పాదఘోష విని సింహము భీతిలి పాఱె గ్రక్కునన్.
    (ఆ శతావధానికి కవిసింహ అనే బిరుదుంది. చీమల లాగా పోగైన పృచ్ఛకులు ఛందోవ్యాకరణనియమాలు లేని అడ్డమైన పాదాలని సమస్యలు గా ఇస్తే ఆ కవి సింహ భయపడి పారిపోయాడు. )

    రిప్లయితొలగించండి

  17. పిన్నక నాగేశ్వరరావు.
    హనుమకొండ.

    రాముని పత్ని యయోనిజ
    క్షేమము కోరి కపిసేన చేరగ లంకన్
    రాముని రిపువు గని యడలె
    చీమల పదఘోషను విని సింగము జడిసెన్.

    రిప్లయితొలగించండి