8, మే 2024, బుధవారం

సమస్య - 4758

9-5-2024 (గురువారం)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“అన్నము లేనట్టి విందు నందఱ కిడిరే”
(లేదా...)
“అన్నము లేని భోజనము నప్పుడు పెట్టిరి పెండ్లి విందులో”

17 కామెంట్‌లు:

  1. కందం
    ఎన్నగ శశిరేఖను ల
    క్ష్మణ్ణ ఘటోత్కచ కృతంపు మాయల కతనన్
    దిన్నగ సున్నమ్మైననె
    యన్నము లేనట్టి విందు నందఱ కిడిరే!

    ఉత్పలమాల
    ఎన్నగ లక్ష్మణుండు మదినిష్టము సూపుచు రేవతీ సుతన్
    బన్నుచు నా ఘటోత్కచుఁడు పార్థుని పుత్రునిఁ జేర్చు పూనికన్
    దిన్నగ మాయలొల్కుచును దీర్చఁగ విస్తరినందు సున్నమై
    యన్నము లేని భోజనము నప్పుడు పెట్టిరి పెండ్లి విందులో

    రిప్లయితొలగించండి
  2. మిన్నగనవధానంబున
    క్రన్ననపద్యమువెలువడిరాగములొలుకన్
    చెన్నుగచెవులకువినబడ
    అన్నములేనట్టివిందునందరికిడిరే

    రిప్లయితొలగించండి

  3. ఎన్నగ మధుమేహము గల
    పన్నలు పెక్కురు గలరని వారల కొరకై
    మొన్నటి యుత్సవ మున పర
    మాన్నము లేనట్టి విందు నందఱ కిడిరే.



    ఎన్నగ స్వాస్త్యమిచ్చి కన నింపగు భోజన మున్న చాలనన్
    బిన్నలు పెద్దలున్ సతులు వృద్ధులు సైతము మెచ్చు రీతిగా
    మిన్నగ కూరగాయలును మీగడ మంగళయమ్ము నుంచి చి
    త్రాన్నము లేని భోజనము నప్పుడు పెట్టిరి పెండ్లి విందులో.

    రిప్లయితొలగించండి
  4. చెన్నుగనొంటిమిట్టపరచెంగదపూర్ణునిచంద్రనింటిలో
    మిన్నునతారకామణులుమేదినిచూడగపెండ్లివేడుకన్
    వెన్నుడురాముడంతటనుపేర్మినిసీతనుచెట్టబట్టగా
    అన్నములేనిభోజనమునప్పుడుపెట్టిరిపెడ్లివిందులో

    రిప్లయితొలగించండి
  5. మొన్నటి దివసము నందున
    పిన్నలు ప్రశ్నించిరిటుల పెద్దలతోడన్
    ఎన్నడెచట నైనను పర
    మాన్నము లేనట్టి విందు నందఱ కిడిరే

    రిప్లయితొలగించండి
  6. అమృతకిరణములనాస్వాదించిరనిఅర్థము

    రిప్లయితొలగించండి
  7. కం॥ ఎన్నుచు మధుమేహమునకు
    మిన్నని చిరుధాన్యములను మెచ్చఁగ వైద్యుల్
    మన్నన తోడను ముదముగ
    నన్నము లేనట్టి విందు నందఱ కిడిరే

    ఉ॥ మిన్నయటంచుఁ దెల్ప మధుమేహము తగ్గగ నౌషధంబునై
    దన్నుగ నిల్చుఁ గాద చిరుధాన్యము లేనని వైద్యులెల్లరున్
    మన్నన తోడ మోదమని మాన్యులుఁ జాటఁగ సర్వులుంకగా
    నన్నము లేని భోజనము నప్పుడు పెట్టిరి పెండ్లి విందులో

    ఉంకు సమ్మతి నిఘంటువు సహాయమండి

    పద్యము విషయము తెలియదు కానీయండి భావము వంద శాతము సత్యమండి. అన్నిటికంటే కొఱ్ఱలు (Foxtail millets) ఆరికలు (Barnyard millets) ఒరుగులు (Kodo millets) మంచివండి.

    రిప్లయితొలగించండి
  8. ఎన్నడు గాంచి నేనెరుగ నెందుకొ
    గొప్పగ చేసి పెండిలిన్
    మన్ననతోడ బంధువుల మాన్యుల
    బిల్చియు చూడ వేడ్క ప
    ప్పన్నము లేని భోజనము నప్పుడు
    పెట్టిరి పెండ్లి విందులో
    నన్నియునున్నగాని జనులందరు
    గోరుదు రట్టి యన్నమే.

    రిప్లయితొలగించండి
  9. మిన్నగ నొండిరి వంటలు
    జొన్నన్నము జొన్నరొట్టె జొన్నల తోడన్
    వెన్నెల వెలుగులలో స
    న్నన్నము లేనట్టి విందు నందఱ కిడిరే

    మిన్నగ పెండ్లిచేయుటకు మిత్రులు బంధుగణాలకోసమై
    వెన్నెల కాంతిలోన తగు విందులు సిద్ధము చేసినారు తా
    మున్నది పల్లినాడు మరియున్నది జొన్నల పంట యంచు స
    న్నన్నము లేని భోజనము నప్పుడు పెట్టిరి పెండ్లి విందులో

    రిప్లయితొలగించండి
  10. పన్ను గ రుచికర భక్ష్య ము
    లెన్ని యొ ఘుమ ఘుమ గ వండి రింపగు రీతిన్
    చెన్నుగ న య్యె డ లన్ పర
    మాన్నము లేనట్టి విందునందరి కిడ రే

    రిప్లయితొలగించండి
  11. ఎన్నడెరుంగని రీతిగ
    పన్నుగ సంపన్నులింట పరిణయమందున్
    సన్నుతమగు రీతిని క్షీ
    రాన్నము లేనట్టి విందు నందఱ కిడిరే

    రిప్లయితొలగించండి
  12. ఎన్నఁడెరుంగనట్టి మునుపెన్నడు కన్నుల గాంచనట్టి సం
    పన్నుల విందుభోజనము పన్నుగ జేసితినీ దినంబునన్
    మిన్నగ పిండివంటలును మేలగు భోజ్యములన్నియున్న క్షీ
    రాన్నము లేని భోజనము నప్పుడు పెట్టిరి పెండ్లి విందులో

    రిప్లయితొలగించండి
  13. కందం
    మున్నొకనాడు సుకవి భీ
    మన్న యొనర్చె కనికట్టు మాయ ఘనముగన్
    సున్నమయె యన్నమంతట
    అన్నము లేనట్టి విందు నందఱ కిడిరే.

    ప్రబల వేంకట సుబ్రహ్మణ్య శాస్త్రి
    ఉండవల్లి సెంటరు.

    రిప్లయితొలగించండి
  14. కం:అన్నా!గొప్ప కులము వా
    రన్నము లేనట్టి విందు నందర కిడిరే?
    కొన్ని కులములకు కూ డిడి
    కొన్ని కులమ్ములకు కల్లు కొని పోసిరి లే !

    రిప్లయితొలగించండి
  15. ఎన్నికగల విద్వాంసులు
    సన్నాయి మృదంగ వీణ సంధానమునన్
    సన్నగ పలుకగ సరిగమ
    అన్నము లేనట్టి విందు నందఱ కిడిరే

    నున్నని యద్దపు చెక్కిలి
    సన్నని నడుమొంపులు మధుశాలాధరముల్
    కన్నెలు హొయలొలకించుచు
    అన్నము లేనట్టి విందు నందఱ కిడిరే

    రిప్లయితొలగించండి
  16. ప్రశ్నోత్తరి

    ఉ:అన్న!అదేమి?పెండ్లి,యని యందర బిల్చి చపాతు లిచ్చిరే?
    అన్నము లేని భోజనము నప్పుడు పెట్టిరి పెండ్లి విందులో”
    అన్న మనంగ నే మనకు నా వరి యన్నమె,యుత్తరాదిలో
    అన్న మనంగ రొట్టెలని యందరి వాడుక యయ్యె తమ్ముడూ!
    (ఒక్కొక్క ప్రాంతం లో ఒక్కొక్కటి అన్నం. ప్రథానాహారం ఏదైనా అన్నమే .)

    రిప్లయితొలగించండి
  17. సన్నని తెల్లని యన్నము
    పన్నుగ వడ్డించి గౌరవమ్ముగను నిజం
    బన్నా యిసుమంతయు దో
    షాన్నము లేనట్టి విందు నందఱ కిడిరే


    కన్నుల పండువై తనరఁగం బరమాప్త జనాలి కప్డు ప్ర
    చ్ఛన్న సభాంతరమ్మునను జక్కఁగ వాసన లీను చుండఁగా
    నెన్నిన లేహ్య చోష్యములు నేనియు పేయము లేని చిత్ర నా
    నాన్నము లేని భోజనము నప్పుడు పెట్టిరి పెండ్లి విందులో

    రిప్లయితొలగించండి