17, మే 2024, శుక్రవారం

సమస్య - 4767

18-5-2024 (శనివారం)

కవిమిత్రులారా,

ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...

“యువతినిఁ బెండ్లాడె వనిత యొప్పఁగ విబుధుల్”

(లేదా...)

“యువతిన్ బెండిలియాడె నొక్క జవరా లోహో యనన్ బండితుల్”

16 కామెంట్‌లు:

  1. భువిజయు రాముల వేషము
    అవసరమున గట్టిరిర్వు రబలామణులే
    భవమగు వివాహ ఘడియను
    యువతినిఁ బెండ్లాడె వనియ యొప్పఁగ విబుధుల్

    రిప్లయితొలగించండి
  2. కందం
    అవగుణుఁడో? సద్గుణుఁడో?
    వివరమ్ముగ వరునిపై నివేదిక నందన్
    ధ్రువపరుచఁ గూర్చి సఖియౌ
    యువతినిఁ, బెండ్లాడె వనిత యొప్పఁగ విబుధుల్!

    మత్తేభవిక్రీడితము
    ప్రవరుండాతఁడు నీకుఁ దగ్గ వరుఁడన్ భాష్యంబునన్ బెద్దలున్
    నవలారత్నము తోడఁదెల్పి మనువందంగన్ బ్రయత్నింపఁగన్
    ద్రువపత్రంపు నివేదికన్ గొనఁగఁదానున్ గూర్చి శోధించెడున్
    యువతిన్, బెండిలియాడె నొక్క జవరా లోహో యనన్ బండితుల్!

    రిప్లయితొలగించండి
  3. భవితన్గోరుచునాగరీకుడునుశోభాసక్తినుద్యోగినిన్
    యువతిన్బెండిలియాడె, నొక్కజవరాలహోయనన్పండితుల్
    నవతన్జూపుచురామయైగృహిణిగానైకాత్మయైనాథుకున్
    చవిజూపించెగసచ్చరిత్రయనతాసాంగత్యసన్మార్గయై

    రిప్లయితొలగించండి
  4. యువకుండు గడందమయిన
    యువతినిఁ బెండ్లాడె, వనిత యొప్పఁగ విబుధుల్!
    అవిరల ధనవంతుని గని
    సవినయముగ బెండ్లియాడె సంతసమొప్పన్

    రిప్లయితొలగించండి
  5. కం॥ నవయువకుడు మెచ్చుచు నొక
    యువతినిఁ బెండ్లాడె, వనిత యొప్పఁగ విబుధుల్
    భవితను గాంచెను జక్కని
    యువకుని మనువాడి పడయ యోగ్యుని యటులన్

    మ॥ యువకుండొక్కఁడు తల్లిదండ్రులటు సంయోజించఁ గన్యామణిన్
    యువతిన్ బెండిలి యాడె, నొక్క జవరాలోహో యనన్ బండితుల్
    గవితల్ వ్రాసెను బోతనాదులయటుల్ కాంక్షించి భక్త్యామృతం
    బు విలాసంబుగఁ బారగన్ జనుల భావోద్వేగ మొప్పారఁగన్

    రిప్లయితొలగించండి
  6. కవనము నంకితమీయగ
    కవుల సభకు నాపుర యధికారిణి బిలువన్
    బవిసిగ నచ్చట కవితా
    యువతినిఁ బెండ్లాడె వనియ యొప్పఁగ విబుధుల్

    రిప్లయితొలగించండి
  7. యువవిద్యార్థి విధవయౌ
    యువతినిఁ బెండ్లాడె వనిత యొప్పఁగ; విబుధుల్
    యువకుని సన్మానించిరి
    భవితవ్యముపై పలువురు బాధ్యత గొనగా

    వివరింపందగు నిట్టి సంఘటనలన్ విద్యార్థి లోకంబుకున్
    యువ విద్యార్థుల బృందమందు నొకడే యోచింపకన్ జక్కనౌ
    యువతిన్ బెండిలియాడె నొక్క జవరా లోహో యనన్; బండితుల్
    భవదీయమ్మిది యంచు తప్పుకొనిరే ప్రాధాన్యతన్ జూపకన్

    రిప్లయితొలగించండి

  8. చెవియొగ్గి వినుము నీ శు
    శ్రువు మరణింపగ జనకుడు చూడుమచట నా
    ధవళాంబరములు గట్టిన
    యువతినిఁ బెండ్లాడె వనిత , యొప్పఁగ విబుధుల్


    అవమానంబని యెంచకన్ ద్రుపద రాజాత్మోద్భ వన్ వీరులున్
    భువిలో ధర్మమెఱంగు వారలు పృథాపుత్రుండ్రు ప్రాజ్ఞుండ్రు శు
    శ్రువు తా గోరెనటంచు నొప్పుకొనుచున్ జోద్యంబుగా నేవురున్
    యువతిన్ బెండిలియాడె నొక్క జవరా లోహో యనన్ , బండితుల్.

    రిప్లయితొలగించండి
  9. కవితను వలచియు నొకడా
    యువతిని బెండ్లాడె :: వనిత యొ ప్ప గ విబు ధు ల్
    యవ ధాన ము నందు ద నదు
    ప్రవి మల ప్రతిభ లను జూపి రాణిం చె కదా

    రిప్లయితొలగించండి
  10. కం:యువకుడు వికలాంగి యయిన
    యువతినిఁ బెండ్లాడె వనితయొప్పఁగ ,విబుధుల్
    "స్తవనీయ"మ్మని చక్కని
    కవితలతో దీవెనలను కమ్మగ జదువన్.

    రిప్లయితొలగించండి
  11. మ:కవితల్ వ్రాసెడు నట్టి భర్త వలయున్, కా రన్యు లంచున్ సదా
    నవలల్ వ్రాయుచు ,నొక్క పేద కవియే నవ్యత్వమున్ గోరుచున్
    యువతుల్ మెచ్చెడి రీతి ధీయుతగ దా నూహించి చిత్రించగా
    యువతిన్, బెండిలియాడె నొక్క జవరా లోహో యనన్ బండితుల్”
    (ఒక రచయిత్రి కవినే పెళ్లాడతా నంది.ఆ కవి పేద వాడైనా ఒక మంచి స్త్రీపాత్రని చిత్రించాడు.అది చూసి అతన్ని పెళ్లి చేసుకుంది.)

    రిప్లయితొలగించండి
  12. భువిలో వింతలు వేనవేలు కనగన్! పోఁగాలమో మౌఢ్యమో
    భవితవ్యంబును నిర్ణయించిరొకటే ప్రాణంబుగా నొండొరుల్
    యువతుల్ పెండిలి యాడి సౌఖ్యముగ తాముండంగ నేకాంగులై
    యువతిన్ బెండిలియాడె నొక్క జవరా లోహో యనన్ బండితుల్

    రిప్లయితొలగించండి
  13. యువకుడు కాతరుడు వలచి
    యువతినిఁ బెండ్లాడె, వనిత యొప్పఁగ విబుధుల్
    భవితవ్యము మదిని దలచి
    యువకుని ప్రాజ్ఞునిగ మలచె నోరిమితోడన్

    రిప్లయితొలగించండి
  14. దివిని నగు వివాహమ్ములు
    యువకునిఁ గని యిట్టు లన నహో మెచ్చితి నే
    ను విశేషముగ నెడఁద నీ
    యువతినిఁ బెండ్లాడె వనిత యొప్పఁగ విబుధుల్


    యువతుల్ మెచ్చు వరుండు దుర్లభుఁ డహో యుర్విన్ విచారింపఁగా
    సవతాలిన్ సమకూర్చు వార యధికుల్ శాతోదరీ విన్మ మా
    నవులం దుత్తముఁ డీతఁ డెన్న నన నానందించి కీర్తించి యా
    యువతిన్బెండిలి యాడె నొక్క జవరా లోహో యనన్ బండితుల్

    రిప్లయితొలగించండి
  15. అవయవ పుష్టిం గలిగిన
    యువతినిఁ బెండ్లాడె ,వనిత యొప్పఁగ విబుధుల్
    వివరించిన పాఠములను
    నవగాహనఁజేసికొనుచు నచ్చెరువందెన్

    రిప్లయితొలగించండి

  16. పిన్నక నాగేశ్వరరావు.
    హనుమకొండ.

    అవిటితనము వాడైనను
    యువతినిఁ బెండ్లాడె, వనిత యొప్పగ;
    విబుధుల్
    యువతిని మెచ్చుకొనుచు తమ
    అవిరళమగు దీవెనలిడి రానందముగా.

    రిప్లయితొలగించండి