21, మే 2024, మంగళవారం

సమస్య - 4771

22-5-2024 (బుధవారం)

కవిమిత్రులారా,

ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...

*“భద్రత నొసగె రారాజు పాండవులకు”*

(లేదా...)

*“సోదరు లంచు పాండవుల శోకము దీర్చె సుయోధనాఖ్యుడే”*


కంది శంకరయ్య వద్ద 5/21/2024 09:00:00 PM

34 కామెంట్‌లు:

  1. తేటగీతి
    సాయమెంచి గోపాలుని సదనమేగి
    పాదములకడ పీఠమ్ము పార్థునికిడి
    ప్రథమముగఁ గృష్ణుఁ గోరెడు వంతునిచ్చి
    భద్రత నొసగె రారాజు పాండవులకు

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. ఉత్పలమాల
      ఆదరువెంచి యుద్ధమున నా మధుసూదను జేరి గర్వమై
      పాదము వద్దనాసనము వాయుచు శీర్షము వైపుఁ దీరుచున్
      మాధవుఁ గోరువంతు ప్రధమమ్ముగ పార్థునకిచ్చి కూలెనే!
      సోదరు లంచు పాండవుల శోకము దీర్చె సుయోధనాఖ్యుడే! !

      తొలగించండి
    2. మీ రెండు పూరణలు ప్రశస్తంగా ఉన్నవి. అభినందనలు.

      తొలగించండి

  2. రణము వలదంచు కృష్ణుండు రాయబారి
    గాను వచ్చి పలుకగ వికర్ణుడు విని
    కదన మాగిన స్వప్నమ్ము గాంచె నందు
    భద్రత నొసగె రారాజు పాండవులకు.


    జూదము నందునోడిరని జోటిని యవ్విధి పిన్న సేయగా
    ఖేదమునంది పాండవుల కీర్తిని గూర్చి నుతించి వారిపై
    గాదిలి చూపువాడగు వికర్ణుడు గాంచెను స్వప్న మందునన్
    సోదరు లంచు పాండవుల శోకము దీర్చె సుయోధనాఖ్యుడే.

    రిప్లయితొలగించండి
  3. జూద మాడించి యోడించి చోద్యముగను
    పాండవులనంపె గానకు కష్ట బెట్ట
    దల్చి , వారల నడివిలో తరచుగా న
    భద్రత నొసగె రారాజు పాండవులకు

    రిప్లయి

    రిప్లయితొలగించండి
  4. కోరు నవ కాశ మీయగా కౌరవ పతి
    పంత మూని యు కృష్ణుని పార్థు కు విడి
    తాను సైన్యము గైకొని తప్పు జేసి
    భద్రత నొసగె రారాజు పాండవు లకు

    రిప్లయితొలగించండి
  5. రిప్లయిలు
    1. తే॥ కర్ణుని హితుడనిఁ దలచి కావనెంచి
      భద్రత నొసఁగె రారాజు పాండవులకు
      కీడు సేయ తలుపఁగను గృష్ణఁడడ్డు
      పడుచు రక్షను గాంచుచు వరలు చుండె

      ఉ॥ వేదనఁ జెంది కుంతియటు వేడఁగఁ గర్ణుని నీవెరుంగుమా
      సోదరులంచు పాండవుల, శోకముఁ దీర్చె సుయోధనాఖ్యుఁడే
      నాదు సఖుండటంచుఁ గను న్యాయము నెంచఁగఁ గౌరవాగ్రజున్
      మోదము తోడఁ గొల్చుటగుఁ బోరును గర్ణుఁడు ధర్మబద్ధుడై

      తొలగించండి
    2. మీ రెండు పూరణలు ప్రశస్తంగా ఉన్నవి. అభినందనలు.

      తొలగించండి
  6. వారణావతమున దన పగనిగుడగ
    పన్నుగడ నొక టి రచించి , పండుటకయి
    లక్క యింటిని నిర్మించి , రహిగ వసతి
    భద్రత నొసగె రారాజు పాండవులకు

    రిప్లయితొలగించండి
  7. అంగ రాజుగ రాధేయు నాదరించి
    భద్రతనొసగె రారాజు పాండవులకు
    నభయ హస్తము నొసగుచు నర్జునునకు
    సారథిగ తేరు నడిపెను శౌరి తాను





    "

    రిప్లయితొలగించండి
  8. పాండవుల పుత్రులేవురు పవ్వళించి
    యుండఁ దునిమె ద్రోణసుతుడు దుండగీడు
    మాపటిసమయమునఁ బంపి మన్నిగొని య
    భద్రత నొసగె రారాజు పాండవులకు

    రోదన మిన్నుముట్టెనట ద్రోణుని పుత్రుడురాత్రివేళలో
    చోరుని భంగి త్రెక్కొనగ జోరున పాండవ పుత్రులందరిన్
    ఖేదము మట్టగించుటకు కృష్ణుడు పల్కెను శక్తిమంతులౌ
    సోదరు లంచు; పాండవుల శోకము దీర్చె సుయోధనాఖ్యుడే

    రిప్లయితొలగించండి
  9. చిన్ననాట యవగడము లెన్నొజేసె
    పాచికలయాట నాడించె పాండుసుతుల
    యిడుములను గూర్చెఁ దానంపి యడవులకు న
    భద్రత నొసగె రారాజు పాండవులకు

    రిప్లయితొలగించండి
  10. బాధలువెట్టె పాండవుల పాచికలాడుచు మాయఁజేసి సం
    వేదనఁ గూర్చె ద్రోవతికి వేవురి ముందర చీరలూడ్చుచున్
    సోదరులన్న భావనము జూపక వంతలఁగూర్చి యెవ్విధిన్
    సోదరు లంచు పాండవుల శోకము దీర్చె సుయోధనాఖ్యుడే?

    రిప్లయితొలగించండి
  11. తే.గీ:లక్క యింటిలో బెట్టి కాల్చంగ జూచె,
    జూద మాడి కానల కంపె, చూడ బడక
    యుండు శిక్ష విధించె,సయోధ్య విడి , య
    భద్రత నొసగె రారాజు పాండవులకు

    రిప్లయితొలగించండి
  12. ఉ:వేదన జెందు నంథు గని,వేదన జెందియు ధర్మ బోధ కే
    ఆదరమిచ్చుచున్ విదురు డాతని తో ననె "పాండవాళికిన్
    వేదన లిచ్చి తా తనువు వీడిచు, "బంధువు లేరి? లేరుగా
    సోదరు" లంచు పాండవుల శోకము దీర్చె సుయోధనాఖ్యుడే”*
    ("దుర్యోధనుడు మరణించటం ద్వారా పాండవుల శోకం తీర్చాడు.లేరు గా సోదరులు!అంటూ మరణించాడు." అని విదురుడు ధృతరాష్ట్రుడి తో అన్నాడు. విదురుడు కూడా ఆ వినాశానికి బాధ పడ్డాడు కానీ అతడు ధర్మాన్ని నిర్ముఖమాటం గానే మాట్లాడుతాడు.)

    రిప్లయితొలగించండి
  13. తరతరములఖ్యాతియేతమదికాగ
    యోధనుండునుతనవైరియోగమరసి
    దారిజూపెనుకథయంతతానునడపి
    భద్రతనొసగెరారాజుపాండవులకు

    రిప్లయితొలగించండి
  14. ధర్మరతులకు సంతత దైవ రక్షి
    తులకు నాపద లిచ్చునె కలఁత లరయఁ
    జిన్ననాఁటి నుండియుఁ బగ మిన్నగా న
    భద్రత నొసఁగె రారాజు పాండవులకు


    మేదిని నెందుఁ గాంచినను మేటి దురాత్ముఁడు గానరాఁడు దా
    నే దరి కేఁగెనో యనుచు నెంతయు దుఃఖము నందఁ బాండవుల్
    దా దొరవిం దొలంగి వెస దర్శన మిచ్చి తలంచి వీరలా
    సోదరు లంచుఁ బాండవుల శోకము దీర్చె సుయోధనాఖ్యుఁడే

    రిప్లయితొలగించండి
  15. పిన్నక నాగేశ్వరరావు.
    హనుమకొండ.

    సూతపుత్రుడైనను తాను చూడకుండ
    కర్ణునికిడి రాజ్యమ్మును కరుణతోడ
    భద్రత నొసగె రారాజు; పాండవులకు
    నండగా నుండ కృష్ణుడె యందె జయము.

    రిప్లయితొలగించండి
  16. సార్,నమస్తే..నేను గ్రూపులో వ్రాసిన పద్యాలు యిక్కడ కనిపించడం లేదు..ఎందుకో తెలుసుకోవచ్చా..

    రిప్లయితొలగించండి