రాముని యానతి తోడ న సామాన్యుడు గాలిచూలి సంద్రము దాటెన్ ధీమంతుండై శీఘ్రమె రాముని విడి వాయు సుతుఁడు రావణుఁ జేరెన్
రాముని యానతిన్ గదిలి రావణ లంకకు సాగిపోయెగా రాముని సేవకుండు తను లక్ష్యము నందని వేళ నంతరా రాముఁడు పిల్చినన్ హనుమ రాననె; రావణుఁ గొల్వ నెంచియున్ రాముని పత్నినే విడిచి రమ్మని పల్కె విభీషణుండటన్
రాముని బంటు యై పగతుడౌ దశకంఠుని కూల్చు వేళనా రాముడు పిల్చినన్ హనుమ రాననె, రావణుఁ గొల్వనెంచియున్ రామవిరోధులై పెనగు రాక్షస మూకల చెండి యంతకా గ్రామము కంపి మారుతి విరాజిలెనీ ధర రామదాసుడై
కామఱిసీతను వెనుక
రిప్లయితొలగించండిరామునివిడి, వాయుసుతుడురామునిగొల్చెన్
ధామములంకనుజేరెను
నీమముదప్పకతలపడినేరుపుతోడన్
తామఱి
రిప్లయితొలగించండిపామరువోలెదుఃఖమునుభావనఁజేయుచురాముడాయెడన్
రిప్లయితొలగించండికోమలిజాడకోరుచునుకోతులమూకనువచ్చిచేరెనే
తామఱియాదనంతటనుధర్మదప్పనిబంటుతానయై
రాముడుపిల్చినన్హనుమరాననెరావణుగొల్వనెంచుచున్
కం॥ స్వామియె హృదిలో మనునా
రిప్లయితొలగించండిరాముని విడి వాయుసుతుఁడు, రావణుఁ జేరెన్
దామస గుణములు తీరగు
ధామమిది మనకు మెరియఁగ ధరణిని యనుచున్
ఉ॥ రాముని సేవకుండనుచుఁ బ్రాణము నిచ్చుట కైన సిద్ధమౌ
రాముఁడు పిల్చినన్ హనుమ, రాననె రావణుఁ గొల్వ నెంచియున్
దామస తత్వముల్ దమకు దక్కెను దీరగు చోటుయంచు మా
ధామము వీడి రామనుచు ధాటిగ పల్కుచుఁ దిష్ట వేసెనే
భూమిజ వెదుక న్ బోయెను
రిప్లయితొలగించండిరాముని విడి వాయు సుతుడు :: రావణు జేరె న్
దామస యై శూర్ప ణ ఖ యె
గోముగ దన బాధ నెల్ల కుములుచు దెలు పన్
రిప్లయితొలగించండిరామాయణమును చదవని
పామరుడవు నీవు గనుక పలికితి విటులన్
హేమాంగుడనుచు నమ్మిన
రాముని విడి వాయుసుతుఁడు రావణుఁ జేరెన్?
కాముకుడై నిరంతరము కాంతల పొందుకు గోరునట్టి యా
పామరు డాతడొక్క సహవాసిని గైకొని కల్లు పాకలో
నేమము మర్చి షాడబము నీచుడుగ్రోలుచు పల్కె నిట్టులన్
రాముఁడు పిల్చినన్ హనుమ రాననె రావణుఁ గొల్వ నెంచియున్.
మామిడిచిగురు విడి పికము మరువము మేసెన్
రిప్లయితొలగించండిసోముని లలి విడి కమలము సూర్యుని మరగెన్
రాముని విడి వాయుసుతుఁడు రావణుఁ జేరెన్
నీమము విడిఛిన తలపులు నివ్వెర గొలుపున్
రాముని యానతి తోడ న
రిప్లయితొలగించండిసామాన్యుడు గాలిచూలి సంద్రము దాటెన్
ధీమంతుండై శీఘ్రమె
రాముని విడి వాయు సుతుఁడు రావణుఁ జేరెన్
రాముని యానతిన్ గదిలి రావణ లంకకు సాగిపోయెగా
రాముని సేవకుండు తను లక్ష్యము నందని వేళ నంతరా
రాముఁడు పిల్చినన్ హనుమ రాననె; రావణుఁ గొల్వ నెంచియున్
రాముని పత్నినే విడిచి రమ్మని పల్కె విభీషణుండటన్
కందం
రిప్లయితొలగించండిరాముని నామము తలచుచు
రాముని విడి వాయుసుతుఁడు రావణుఁ జేరెన్
రాముని సతి సీతను గని
క్షేమము తెలిపెను హనుమ విశేష పలుకులన్.
ప్రబల వేంకట సుబ్రహ్మణ్య శాస్త్రి
ఉండవల్లి సెంటరు.
రాముని శోకము బాపఁగ
రిప్లయితొలగించండిదీమసముగ వార్ధిదాటి తేజోమయుఁడై
భూమిజ సీతను వెదకుచు
రాముని విడి వాయుసుతుఁడు రావణుఁ జేరెన్
రాముని బంటు యై పగతుడౌ దశకంఠుని కూల్చు వేళనా
రిప్లయితొలగించండిరాముడు పిల్చినన్ హనుమ రాననె, రావణుఁ గొల్వనెంచియున్
రామవిరోధులై పెనగు రాక్షస మూకల చెండి యంతకా
గ్రామము కంపి మారుతి విరాజిలెనీ ధర రామదాసుడై
దీమసమొప్పగా హనుమ ధేనము దాటగ నిశ్చయించెనా
రిప్లయితొలగించండిభూమిజ జాడగన్గొనక భోరన రాముని చింత దీర్చకన్
రాముఁడు పిల్చినన్ హనుమ రాననె, రావణుఁ గొల్వ నెంచియున్
రామునిపత్ని జానకిని రామునకిమ్మనె సోదరుండు తాన్
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండిపదవులకోసము పార్టీలు మారిన సామీర్,మారుతిలను ప్రజలు విమర్శించుట.....
తొలగించండికందం
ఏమందు రాజకీయము!
రామారావును వదలియు రాక్షసు వైపున్
సామీరి చేర ననిరే,
"రాముని విడి వాయుసుతుఁడు రావణుఁ జేరెన్!"
ఉత్పలమాల
ఏమిది రాజకీయము? భరింపగ కష్టము సజ్జనాళికిన్!
రాముని బంటనన్ మసలి రావణు జేరునె యాంజనేయుడే?
తామస పక్షమేగుచును దప్పగ మారుతి లోకమిట్లనెన్,
"రాముఁడు పిల్చినన్ హనుమ రాననె రావణుఁ గొల్వ నెంచియున్!"
కం:రాముని ప్రక్కన నిలచియు
రిప్లయితొలగించండిబ్రేమగ, రావణుడు రెచ్చు విధమున్ గని స్వా
మీ! మీ రిపు గూల్చెద నని
రాముని విడి వాయుసుతుఁడు రావణుఁ జేరెన్”
(రావణుణ్ని నేనే చంపుతాను అని రావణుడి ప్రక్కకు చేరాడు.)
ఉ:రాముని బంటు నంచు బజరంగదళమ్మున నున్న వాడె నే
రిప్లయితొలగించండిడేమి గడింపనో తమకు నిష్టుడు రావణుడే యటంచు,నా
రాముని కై యయోధ్యకును రా ననె ద్రావిడవాది యై యహో
రాముఁడు పిల్చినన్ హనుమ రాననె రావణుఁ గొల్వ నెంచియున్
(ఒకప్పుడు బజరంగ దళ్ లో ఉన్న వాడే.ఇప్పుడు రాముణ్ని తిట్టి రావణుణ్ని మెచ్చ్గే టంత ద్రవిడవాది ఐ రామాలయం చూడటానికి కూడా రా నన్నాడు. )
రిప్లయితొలగించండినీమము దప్పక వెదకియు
భామామణి సీతజాడ బడయుట కొరకై
ధీమంతుడు దోర్బలుడును
రాముని విడి వాయుసుతుడు రావనుజేరెన్
భూమిజ నారసి లంకా
రిప్లయితొలగించండినామ నగర మందు దాఁటి నక్రాలయమున్
గోముగఁ బ్రస్రవ ణాద్రిని
రాముని విడి వాయుసుతుఁడు రావణుఁ జేరెన్
ఏ మనుజుండు గాదని వచింపఁగ నేరని యట్టి రీతినిన్
వేమఱు చింత సేయక వివేకము గన్పడ నీ క్షణంబ నీ
వీ మహి గొప్పదౌ యనృత మిచ్చటఁ బల్కు మనంగ నిట్లనెన్
రాముఁడు పిల్చినన్ హనుమ రాననె రావణుఁ గొల్వ నెంచియున్
కోమలి సీతాదేవిని
రిప్లయితొలగించండిగోముగఁదావెదకి యచటకువలయ సుతదౌ
సేమముఁదెలుపుట కొఱకై
రాముని విడి వాయుసుతుఁడు రావణుఁ జేరెన్
రాముఁడు పిల్చినన్ హనుమ రాననె రావణుఁ గొల్వ నెంచియున్
రిప్లయితొలగించండిభామరొ! వింతపోకడలు భైరవు మాటను లెక్క చేయడా?
రాముని కోపధాటికిల రావణుఁడియ్యెడ యోర్వనోపునే?
రాముఁడు లోకమంతటిని రంజిలఁజేసెను బాాలనంబునన్
రాముని యానతి తోడను
రిప్లయితొలగించండిధీమతియౌపవనసుతుడుతీరుగ సాగెన్
భామామణిజాడనరయ
*“రాముని విడి వాయుసుతుఁడు రావణుఁ జేరెన్”*
తామసబుద్ధిపూనుచునుదానవులెల్లరుపెట్టగాశిఖిన్
రాముడు పిల్చినన్ హనుమ రాననె రావణు గొల్వ నెంచియున్
కోమలకాయుడైనకపి క్రోధము తోడను కాల్చుచు న్పురిన్
సామముతో డతామరలె సాధ్వి శిరోమణి యానవాలు తో
రిప్లయితొలగించండిపిన్నక నాగేశ్వరరావు.
హనుమకొండ.
రాముని యాజ్ఞను గైకొని
ధీమంతుడు పవనసుతుడు తేకువతోడన్
భూమిజ సీతను కనుగొన
రాముని విడి వాయుసుతుడు రావణుఁజేరెన్.