1, మే 2024, బుధవారం

సమస్య - 4752

2-5-2024 (గురువారం)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“పూలను సిగలోనఁ దుఱుమఁబోలదు తరుణీ”
(లేదా...)
“పూవుల మాలలన్ సిగను ముద్దులగుమ్మ ధరింప నేరమౌ”

20 కామెంట్‌లు:

  1. కందం
    ఆలయమే యిల్లనగన్
    బూలను గృహలక్ష్మి తాల్చు, పోరున దూకన్
    జ్వాలామయమౌ సత్యగఁ
    బూలను సిగలోనఁ దుఱుమఁబోలదు తరుణీ!


    ఉత్పలమాల
    దేవళమే గృహమ్మనఁగ దేవతగా యిలుగాచు నాలికిన్
    బూవులు భూషణమ్మగుచు ముచ్చట గొల్పును, దుష్టమూకలున్
    జావగ పోరునన్ జెలఁగు సత్యగ భర్తకు తోడునుండుచున్
    బూవుల మాలలన్ సిగను ముద్దులగుమ్మ ధరింప నేరమౌ!

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. గురుదేవుల సూచనతో సవరించిన వృత్త పూరణ:

      ఉత్పలమాల
      దేవళమే గృహమ్మనఁగ దేవతగా నిలుగాచు నాలికిన్
      బూవులు భూషణమ్మగుచు ముచ్చట గొల్పును, దుష్టమూకలున్
      జావగ పోరునన్ జెలఁగు సత్యగ భర్తకు తోడుగా జనన్
      బూవుల మాలలన్ సిగను ముద్దులగుమ్మ ధరింప నేరమౌ!

      తొలగించండి
  2. లాలనచేయగముద్దుల
    బాలలుమనసునభావనసేయన్
    కేలనుగిలిలినవాడును
    పూలనుసిగలోనదురుమబోలదుతరుణీ

    రిప్లయితొలగించండి
  3. భావనసేయగాశివునిపాదములంటినమోక్షమందునే
    సేవనుశక్తిరూపమునుచేతననందువిశేషసంగతిన్
    కావుముమూగజీవులనుకంఠముద్రుంపకప్రాణదాతలై
    పూవులమాలలన్సిగనుముద్దులగుమ్మధరింపనేరమౌ

    రిప్లయితొలగించండి
  4. -

    శీలవతి జిలేబి ! తురుము
    పూలను సిగలోనఁ దుఱుమఁబోలదు తరుణీ
    వాలుజ డలోన నీ కో
    పాలంకారమ్ములన్ తుపాకీ గుళ్ళన్



    రిప్లయితొలగించండి
  5. ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. వేలుపు కొరకై తెచ్చిన
      పూలపయినమక్కువ గల పొల్తుకవైనన్
      మాలను దేవుని కీయక
      పూలను సిగలోనఁ దుఱుమఁబోలదు తరుణీ

      పూవులపైనసంశ్రయము పొల్తుకకుండుట సాజమకదా
      దేవునిపూజకై విరులఁ దెచ్చిన దేవునికే యొసంగుమా
      దైవసమర్పణమ్మునకు దైవము కోసము సిద్ధమైనవౌ
      పూవుల మాలలన్ సిగను ముద్దులగుమ్మ ధరింప నేరమౌ

      తొలగించండి
  6. కం॥ మేలగు చీరలు నగలును
    జాలిన రీతిగఁ గొనడని సరసిజ కినుకన్
    హేలగఁ బతిపైన నలిగి
    పూలను సిగలోనఁ దుఱుమఁ బోలదు తరుణీ

    ఉ॥ కోవెలఁ గాంచు నప్పుడటు కొబ్బరి కాయలఁ బూలమాలలన్
    దేవత కిచ్చుటే సరళి దేహికి యేలను మ్రొక్కు వేళలన్
    భావము మీర నర్పణను భక్తినిఁ జేయుచు వేడఁగాఁ దగున్
    బూవుల మాలలన్ సిగను ముద్దులగుమ్మ ధరింప నేరమౌ

    రిప్లయితొలగించండి
  7. మేలగు కుసుమము ల వలెన్
    చాల గ మెరయుచు జనులను జకి తు ల జేసే
    బేలలు మెచ్చె డి కృత్రిమ
    పూలను సిగ లోన దుఱు మ బోలదు తరుణీ

    రిప్లయితొలగించండి
  8. బాలాజీ వెలసిన దే
    వాలయమిది సాంప్రదాయ పద్ధతి గనుమా
    బాలా తిరుమల లోనను
    పూలను సిగలోనఁ దుఱుమఁబోలదు తరుణీ.

    2).
    చాలునిక పిచ్చి చేష్టలు
    బాలా! నవ్వెదరు కాదె ప్రజలిది గని యే
    కాలంబైనను గోబీ
    పూలను సిగలోనఁ దురుమఁబోలదు తరుణీ.

    ఉ.మా.
    పావన మైన క్షేత్రమిది పంకజ నాభుడు శ్రీనివాసుడై
    కోవెల లోన నిల్చి మన కోర్కెల దీర్చెడు వాడనే కదా
    నీవిట కేగుదెంచితివి నీమమెఱుంగుమటంటి నిచ్చటన్
    బూవుల మాలలన్ సిగను ముద్దులగుమ్మ ధరింప నేరమౌ.

    రిప్లయితొలగించండి
  9. ఆ విభు వందనార్చనము లందున నామము కొక్కపూవు దో
    షావళి బాసి లోకులు శుభాయతవృత్తిఁ జెలంగునంద్రు, త
    త్భావన మర్చి నిండుగను పాటవ మొప్పగ నేర్చిగూర్చుచున్,
    పూవుల మాలలన్ సిగను ముద్దులగుమ్మ ధరింప నేరమౌ.

    రిప్లయితొలగించండి
  10. గోలల నీలి కురులపై
    వీలగు తెల్లని సుమములు వెలయుచు నుండున్
    బాలమున వాడి పోయిన
    పూలను సిగలోనఁ దుఱుమఁబోలదు తరుణీ

    రిప్లయితొలగించండి
  11. పూవుల మోజునెల్లపుడు మూరల మూరల చెండ్లు తుర్మ నీ
    లావు జడందు నప్పటి లలామల వాడుక సామ్యవాదమన్
    భావన తెచ్చె మార్పు మగవారి మనమ్మున దప్పె వాడుకన్
    పూవుల మాలలన్ సిగను ముద్దుగుమ్మ ధరింప నేరమౌ

    రిప్లయితొలగించండి
  12. మేలములాడగఁ నలిగెను
    పూలను సిగలోనఁ దుఱుమఁబోలదు తరుణీ
    లాలనమున చెంతకుఁజని
    యాలలనకు నలుకదీర్చి యలరింపఁగదే!

    రిప్లయితొలగించండి
  13. దేవుని గొల్వగా విరులు దెచ్చితి మాలలుగట్టి వేయగన్
    దీవెనలిచ్చి వాంఛితముఁదీర్చగ స్వామిని వేడుకొందు నీ
    వీవిధి కేశపాశమున నింపుగ గూర్చఁగ న్యాయమౌనొకో?
    పూవుల మాలలన్ సిగను ముద్దులగుమ్మ ధరింప నేరమౌ

    రిప్లయితొలగించండి
  14. కం:చేలము రంగుది చెల్లదు,
    పూలను సిగలోనఁ దుఱుమఁబోలదు ,తరుణీ
    లాలస లేవియు చెల్లవు
    స్త్రీలు విధవ లైన బెండ్లి చేయుట యొకటా?
    (భర్త గతించిన స్త్రీ కి పై ఇన్ని నిషేధాన్ని లున్నాయి. వీటికే నిషేధాన్ని లుండరా పెళ్లి చెయ్యటం కూడానా?)

    రిప్లయితొలగించండి
  15. ఉ:ఏవిధి జెప్పు మందు వయ!ఇంతుల తోడి సమస్య,స్వేచ్ఛ గా
    నా విరిబోణి యంగముల నన్నిటి జూపెడు వేష మెంచెడిన్
    పూవుల మాలలన్ సిగను ముద్దులగుమ్మ ధరింప, నేరమౌ
    "నీవుగ యందగత్తె" వన నిత్యము కూర్చొను ప్రక్క సీటునన్
    (ఆమె అలా వేషం వేస్తుంది.కానీ దాన్ని గురించి ఎవరూ ఏమీ కామెంట్ చెయ్య కూడదు.)

    రిప్లయితొలగించండి
  16. (3)ఉ:పూవుల పైన జాలి గొని పుట్టెడు పద్యము లల్లినావు శా
    స్త్రీ!విను మిట్టి దౌ కరుణ తీరుగ నీ గృహ మందు జూపినన్
    పూవులు సంతసించు, నిక పూవులు పెట్టకు నీదు భార్యకున్
    పూవుల మాలలన్ సిగను ముద్దులగుమ్మ ధరింప నేరమౌ”
    (జంధ్యాల పాపయ్య శాస్త్రి గారు పుష్పవిలాపం వ్రాసినప్పుడు ఒక కాలేజ్ కుర్రాడు తమాషా కి బోర్డు పై ఇలా రాసాడట.
    పాపయ శాస్త్రికి పెళ్లాం లేదా?
    పెళ్లాం జడ లో పువ్వులు లేవా?
    పువ్వుల జోలికి మళ్లీ వెడితే
    పరువు దక్కదోయ్ పాపయ శాస్త్రీ)

    రిప్లయితొలగించండి
  17. మేలి కుసుమమ్ము లుండఁగఁ
    జాల నిచట సదమలాంగి! చారు నయన! యె
    క్కాలమ్ము నందు వాడిన
    పూలను సిగలోనఁ దుఱుమఁ బోలదు తరుణీ


    పూవుల నెల్ల వాడ వలెఁ బూజకు మాత్రమ యేడు కొండలన్
    వావిరి పాప మంటుకొను బద్మ దళాక్షు నగౌర వించినన్
    దేవుని వేంకటేశ్వరుని దివ్య నివాస ధరాధరమ్మునం
    బూవుల మాలలన్ సిగను ముద్దులగుమ్మ ధరింప నేరమౌ

    రిప్లయితొలగించండి
  18. ఆలయమునకేగంగను
    *“పూలను సిగలోనఁ దుఱుమఁబోలదు తరుణీ”*
    పూలవిదైవమునకెతగు
    నేలాసందేహమువినుమిదినిక్కంబౌ

    రిప్లయితొలగించండి