11, మే 2024, శనివారం

సమస్య - 4761

12-5-2024 (ఆదివారం)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“ద్రోవది కొక భర్త యనుచు ద్రోణుఁడు వలికెన్”
(లేదా...)
“ద్రోవది కొక్క భర్తయని ద్రోణుఁడు దెల్పె సభాంతరమ్మునన్”
(అక్కెర కరుణాసాగర్ గారు పంపిన సమస్య)

36 కామెంట్‌లు:

  1. పాంచాలీ! పంచభర్తృకా! యని నిందించెడు రారాజుతో
    అలా అనఁదగదని.....

    యుద్ధకందం
    దేవత కుంతీమాతగ
    పావనియగు యాజ్ఞసేనిఁ బంచుకొన సుతుల్
    సేవింప వత్సరమునకు
    ద్రోవది కొక భర్త యనుచు ద్రోణుఁడు వలికెన్!

    ఉత్పలమాల
    దేవతగాఁ దలంచి పృథ ధీమతులౌచును దల్లి యాజ్ఞగన్
    పావని యాజ్ఞసేనిఁదగఁ బాండవులేవరు భార్యగాఁ గొనన్
    సేవలు ధర్మపత్నిగను సేయఁగనొప్పఁగ వత్సరంబునన్
    ద్రోవది కొక్క భర్తయని ద్రోణుఁడు దెల్పె సభాంతరమ్మునన్!

    రిప్లయితొలగించండి
  2. ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.

    రిప్లయితొలగించండి
  3. ఆ వైరి ద్రుపదుని సుతకి
    యేవురు పతులుండియు దననెదురుచు నిలువన్
    చేవను జూపుట కొరకై
    ద్రోవది కొక భర్త యనుచు ద్రోణుఁడు వలికెన్

    రిప్లయితొలగించండి
  4. ఏవిధముగ పాండవులకు
    ద్రోవది పరిచర్యలోన దోడ్పడుననుచున్
    భావించు నపుడు సాలుకు
    ద్రోవది కొక భర్త యనుచు ద్రోనుడు పలికెన్

    రిప్లయితొలగించండి
  5. కం॥ ఏవిధిన్ గనఁగ ద్రుపద సుత
    కేవురు పతులు పరమశివుఁ డిచ్చెను వరమున్
    బావనికి, కల్ల యిదియే
    “ద్రోవది కొక భర్త యనుచు ద్రోణుఁడు పలికెన్”

    ఉ॥ పావని చేయగన్ దపము భర్తను గోరుచు భక్తిశ్రద్ధలన్
    భావము మీర నీశ్వరుఁడు భక్తికి మెచ్చి యొసంగె నేవురన్
    ద్రావిన మూర్ఖుఁడొక్కఁడిటు తప్పుగఁ బల్కెను గ్రమ్మ మైకమే
    “ద్రౌవది కొక్క భర్తయని ద్రోణుఁడు దెల్పె సభాంతరమ్మునన్”

    రిప్లయితొలగించండి
  6. భావిని పృథ యానతితో
    జీవను లంగీకరించి చేగొనిన ప్రియుం
    డ్రేవురిలో సహ దేవుడు
    ద్రోవది కొక భర్త యనుచు ద్రోణుఁడు వలికెన్.


    ఏవురు పాండుపుత్రులొక యింతిని భార్యగ స్వీకరించినన్
    బావన మౌ చరిత్రగల వారలు విజ్ఞులు ధర్మమూర్తులా
    భావిని యేటికొక్కరికి భార్యగ నుండెడి నిర్ణయమ్ముతో
    ద్రోవది కొక్క భర్తయని ద్రోణుఁడు దెల్పె సభాంతరమ్మునన్.

    రిప్లయితొలగించండి
  7. ఏవురు భర్తలయందున
    దావరి విలువిద్యయందు తనశిష్యుండై
    చేవను చూపెడు పార్థుఁడు
    ద్రోవది కొక భర్త యనుచు ద్రోణుఁడు వలికెన్

    రిప్లయితొలగించండి
  8. పావన నియమావళితో
    ద్రోవతి సతియయ్యెనుగద దోషరహితయై
    కావున ప్రతి వత్సరమున
    ద్రోవది కొక భర్త యనుచు ద్రోణుఁడు వలికెన్

    ద్రోవది పెండ్లిగూర్చి ద్రుపదుండనుమోదము చూపకుండినన్
    దీవెనలిచ్చి వ్యాసుడట తెల్పెను దేవుని నిర్ణయంబుగా
    కావున నిర్ణయించిన ప్రకారమునన్ బ్రతి వత్సరంబునన్
    ద్రోవది కొక్క భర్తయని ద్రోణుఁడు దెల్పె సభాంతరమ్మునన్

    రిప్లయితొలగించండి
  9. కందం
    చేవను జూపిన పార్థుడు
    ద్రోవది కొక భర్త యనుచు ద్రోణుఁడు వలికెన్
    పావని పరమ పతివ్రత
    దేవుని వరమున జతపడె దివ్యపురుషులన్
    ప్రబల వేంకట సుబ్రహ్మణ్య శాస్త్రి
    ఉండవల్లి సెంటరు.

    రిప్లయితొలగించండి
  10. ఏవు రు పతులను గల్గియు
    చేవను జూపించు వాడు శ్రే ష్ఠు o డిలలో
    దేవ పతి సుతుడు క్రీడి యె
    ద్రోవది కొక భర్త యనుచు ద్రోణు డు బలి కెన్

    రిప్లయితొలగించండి
  11. వేవురు మెచ్చురీతి యరి వీరభయంకరుడాజి యందునన్
    చేవనుజూపి శస్త్రముల చిత్తొనరించును వైరిసైన్యమున్
    యేవురు భర్తలందతఁడు యెక్కటి యోధుడు ఫల్గుణుండు తాఁ
    ద్రోవది కొక్క భర్తయని ద్రోణుఁడు దెల్పె సభాంతరమ్మునన్

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      "రీతి నరి... వైరిసైన్య మా యేవురు.. దతఁడె యెక్కటి.." అనండి.

      తొలగించండి
    2. సవరణలకు ధన్యవాదములు గురువుగారూ 🙏

      తొలగించండి
    3. వేవురు మెచ్చురీతి నరి వీరభయంకరుడాజి యందునన్
      చేవనుజూపి శస్త్రముల చిత్తొనరించును వైరిసైన్యమా
      యేవురు భర్తలందతఁడె యెక్కటి యోధుడు ఫల్గుణుండు తాఁ
      ద్రోవది కొక్క భర్తయని ద్రోణుఁడు దెల్పె సభాంతరమ్మునన్

      తొలగించండి
  12. ద్రోవది భంగపాటుఁగని రోసిరి యోలగమందు సర్వులే
    కోవకు చెందినన్ పరువు కూలి యడర్చుచు మూడె ఘోరమౌ
    చావులు నన్న భీముని ప్రశంసపు చూపుల దీవనిచ్చి యీ
    ద్రోవది కొక్క భర్తయని ద్రోణుడు పల్కె సభాంతరమ్మునన్

    రిప్లయితొలగించండి
  13. పావన మూర్తులు వారలు
    భావింపఁగ శౌర్యవరులు భరణిని సుమ్మీ
    సేవింపగ వారి నెపుడు
    ద్రోవది కొక భర్త యనుచు ద్రోణుఁడు వలికెన్

    రిప్లయితొలగించండి
  14. వావిరి వాసవ పంచక
    మే వసుధం బాండు సూను లెన్నఁగ నిజముం
    గావునఁ బాంచాలికి నా
    ద్రోవది కొక భర్త యనుచు ద్రోణుఁడు వలికెన్


    పావన వంశజాతకులు పాండువు లందు నొకండు నింపుగా
    వావిరి భర్తగాఁ దనరు పద్ధతి నారదు నాజ్ఞఁ దాల్పఁగా
    నీ వసుధాతలమ్మునను నెన్నఁగ నొక్కొక వత్సరమ్మునన్
    ద్రోవది కొక్క భర్తయని ద్రోణుఁడు దెల్పె సభాంతరమ్మునన్

    రిప్లయితొలగించండి
  15. పావన వంశియా సతికి పాండవులందున నొక్క సాలుకున్
    ద్రోవది కొక్కభర్తయని ద్రోణుఁడు తెల్పె సభాంతరమ్మునన్
    ద్రోవది సంతసం బలరి ద్రోణుని గారవ మొప్ప మ్రొక్కిడెన్
    నేవురు పాండవుల్ దనరి యిచ్ఛను దెల్పిరి యాక్షణంబునన్

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      "మ్రొక్కె నా యేవురు పాండవుల్..." అనండి.

      తొలగించండి
  16. కం:ఏవురు పతు లుండి సభను
    నీ విధి స్త్రీ కుందు చుండ నీక్షించెదరే?
    కావడె, ధైర్య మ్మిడడే
    ద్రోవది కొక భర్త?యనుచు ద్రోణుఁడు వలికెన్”

    రిప్లయితొలగించండి
  17. పావనిద్రుపదునిపుత్రిక
    భావనయందునతనపతిప్రాణములైదున్
    చేవనునొకటిగదలచెను
    ద్రోవదికొకభర్తయనుచుదోరోణుడువలికెన్

    రిప్లయితొలగించండి
  18. ఉ:ఏ విధి క్షాత్రధర్మమిది? యింతికి నింతటి యెగ్గు కల్గగా
    నేవురు భర్త లుండి యిట నీక్షణ జేయుచు మిన్నకుందురే!
    కావగ నుంటి నే ననుచు గ్రక్కున ప్రక్కన జేర ధర్మమౌ
    ద్రోవది కొక్క భర్త?యని ద్రోణుఁడు దెల్పె సభాంతరమ్మునన్”
    (ద్రౌపది ప్రక్కన ఒక్క భర్త ఐనా చే4అటం ధర్మం అన్నాడు ద్రోణాచార్యులు. )

    రిప్లయితొలగించండి