11-5-2024 (శనివారం)కవిమిత్రులారా,ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...“దూరువాఁడె యఘవిదూరుఁ డగును”(లేదా...)“దూరెడివాఁడు దుష్కృతవిదూరుఁడు గణ్యుఁడు లోకమాన్యుఁడున్”(విట్టుబాబు పంపిన సమస్య)
గట్టిదెబ్బతోడ గానుగ యెద్దునుదారిబెట్టవలయుధర్మమిదియమోటుమనిషినెపుడుమోమోటమేలేకదూఱువాడెయఘవిదూరుడగును
ఆటవెలదిద్వారపాలకుండు వైకుంఠమందునపాపవశమున శిశుపాలుఁడయ్యెనరిగఁ బుట్టి రయమె హరిఁ జేరఁ జక్రినిన్దూరువాఁడె యఘవిదూరుఁ డగునుఉత్పలమాలశౌరికి ద్వారపాలకుడు శాపముతో శిశుపాలుడయ్యెఁ దావైరిగ బుట్టియున్ హరిని వైళమె జేరు వరాన జన్మమైమీరుచుఁ జక్రియౌ హరిని మృత్యు వశాన వికుంఠమొందఁగన్దూరెడివాఁడు దుష్కృతవిదూరుఁడు గణ్యుఁడు లోకమాన్యుఁడున్
నేరచరిత్రులౌ ఖలులు నిర్మలచిత్తుల నీతిమంతులన్ఘోరఁపు చర్యలన్ చెలఁగి కొందలపెట్టగ నద్దురాత్ములన్ వైరముబూని బుద్ధిగరపన్ దగు నెవ్విధినైన వారలన్దూరెడివాఁడు దుష్కృతవిదూరుఁడు గణ్యుఁడు లోకమాన్యుఁడున్
నీతిమంతులైన నిర్మలచిత్తులబాధపెట్టి కించ పరచువానిమంచి జెప్పిచూడ మాటవినకయున్నదూరువాఁడె యఘవిదూరుఁ డగును
ఆ॥ ఎదుటి వారి బాధ లెంచుచు సాయముఁజేయ ననవరతము సిద్ధమనుచుఁ గష్టనష్టములకుఁ గలతఁ బడక నటుదూరువాఁడె యఘవిదూరుఁ డగునుఉ॥ సారము లేని జీవితము సాగఁగ బాధల తోడఁ బేదకున్దూరము వెట్ట నాప్తులును దుఃఖముఁ బాపఁగ నెంచి సాయమున్భారము నెంచ కుండగను భావము మీరఁగఁ జేయ సిద్ధమైదూరెడి వాఁడు దుష్కృత విదూరుఁడు గణ్యుఁడు లోకమాన్యుఁడున్దూరు ప్రవేశించు
చెడ్డ వారినెపుడు చెండాడుచుండుముఅవనిలోని విధము నరసిజూడపాప కృత్యములను పన్నెడి వారినిదూరువాఁడె యఘవిదూరుఁ డగును
అన్యులైననేమి యాత్మజుండవనేమిపాప కర్మలనొనరించు పాళమందువారి హితము గోరి వారించ నెంచుచున్ దూరువాఁడె యఘవిదూరుఁ డగును.చారకమైన బంధములె సంకట హేతువు లంచు చెప్పుచున్ ధారుణి భోగభాగ్యముల త్యాగమొనర్చుచు ముక్తిమార్గమున్ గోరి పరాత్పరుండనట గొల్వదలంచుచు దేవళమ్మునన్ దూరెడివాఁడు దుష్కృతవిదూరుఁడు గణ్యుఁడు లోకమాన్యుఁడున్.
తాను మేలుగూర్చ తప్పొప్పులెంచకజనసమూహమనగ జంకు లేకసాయమందజేయ సానికొంపలలోనదూరువాఁడె యఘవిదూరుఁ డగునుదారుణమైన బాధలను తాముభరింతురు వారకాంతలేవారికి తోడ్పడందలచి బంధుర బృందము నుద్ధరింపగాకోరుచు సంశయమ్ము విడి గుప్పున వేశ్యలకొంపలందునన్దూరెడివాఁడు దుష్కృతవిదూరుఁడు గణ్యుఁడు లోకమాన్యుఁడున్
పరుల కుప క రించు భావాన మెలగుచుబాధ లందు దాను బంధు వగుచు వెనుక ముందు జూచి వెను దీయ క య్యె డ దూరు వాడె యఘవి దూరు డగును
తనపరయనుతారతమ్యముచూపకనేరము లొనరించనెమ్మినివిడితప్పులాచరించదండించి సరిదిద్ద*“దూరువాఁడె యఘవిదూరుఁ డగును”*
ఆటవెలదినిగమశర్మ తల్లిని మరి తండ్రిని దూరిపూర్వజన్మ కర్మ పూర్తి కాగపాదపూజ జేసె వారలకు, దొసగుదూరువాడె యఘ విదూరు డగునుప్రబల వేంకట సుబ్రహ్మణ్య శాస్త్రి ఉండవల్లి సెంటరు.
LIFE CERTIFICATE FOR 2024అందరికీ వందనములు !అందరి పూరణలూ అలరించు చున్నవి !అలరింప నున్నవి !అప్రస్తుత ప్రసంగిB-1)_______________________________________ధారగ సంస్కృతాంధ్ర యవ - ధానము సాగుచు నుండ మధ్యలోధోరణి మీరుచు, న్నతని - తొందరవెట్టుచు ద్యాస భంగ నిర్ధారణ గోరుచున్, కఱకు - ప్రశ్నల వేయుచు మాటిమాటికిన్దూరెడివాఁడు దుష్కృతవి - దూరుఁడు గణ్యుఁడు లోకమాన్యుఁడున్ !_______________________________________
ఆ.వె:దూరకుండ తాను దురితమ్ములందును,మంచి పేరు సుంత గాంచి నంతధర్మ మూర్తి యగునె? తన ముందు దుష్టులదూరువాఁడె యఘవిదూరుఁ డగును”(నేను పాపం చెయ్యను అన్నంత మాత్రాన ధర్మాత్ముడు కాదు.తన ముందు దుష్టు లుంటే వారిని దూరాలి అనగా తిట్టాలి.)
ఉ:దూరక పాపమార్గముల,దూరుచు జ్ఞానుల చర్చలందునన్,దూరుచు సంఘసేవలను,దుర్బలు లందున జాలి జూపుచున్,దూరక యన్య దైవముల, దుష్టత నెవ్వరి గాంచ,మార్చగన్దూరెడివాఁడు దుష్కృతవిదూరుఁడు గణ్యుఁడు లోకమాన్యుఁడున్(మొదటి రెండు పాదాల లో దూరక అంటే దూరటం అనే అర్థం.తరువాతి రెండు పాదాలతో దూరటం అంటే తిట్టటం.)
అందరికీ వందనములు !అందరి పూరణలూ అలరించు చున్నవి !అలరింప నున్నవి !శిశుపాలుడుB-2)_______________________________________మారెను రోత రూపమదె - మాధవుడే కరుణించి బ్రోవగాన్నూరును మించి తప్పులను - నోటికి వచ్చిన రీతి పల్కుచున్చేరెను విష్ణు లోకమదె - చేది నృపాలుడు చక్ర ఖండనన్దూరెడివాఁడు దుష్కృతవి - దూరుఁడు గణ్యుఁడు లోకమాన్యుఁడున్ !_______________________________________
గరుడవాహనమున అలమేలు మంగతోవేంకటేశుడేగ వీధులందురామచక్కనైన స్వామి పల్లకి క్రిందదూరువాఁడె యఘవిదూరుఁ డగును
నేరము కాదు పత్రికకుఁ నిందలు వేయగఁ గోరి చేయ కై వారముఁ వృత్తి ధర్మమని బద్ధుడునై జన పక్షపాతియై నేరిమి నావలోకనము నెమ్మదిఁ జేయు విలేఖకుండు తా న్దూరెడి వాడు దుష్కృత విదూరుడు గణ్యుడు లోకమాన్యుడున్
అందరికీ వందనములు !అందరి పూరణలూ అలరించు చున్నవి !అలరింప నున్నవి !భీమసేనుడుB-3)_______________________________________ధారుణి రాజ్య సంపద మ - దంబున సాధ్విని చిన్నబుచ్చినన్ఘోరముగా ప్రతిశ్రుతి వృ - కోదరు డారడి జేసె రాజునేపేరడగించె యుద్ధమున - వీరముతో శత భ్రాతలందరిన్దూరెడివాఁడు దుష్కృతవి - దూరుఁడు గణ్యుఁడు లోకమాన్యుఁడున్ !_______________________________________ఆరడి = తిట్టు
చేరెయశోదచెంతకునుశీఘ్రముగావసుదేవుచేతతాచోరుడుగానెకృష్ణుడిలచూపెను శౌర్యము గోకులమ్మునన్నేరములెన్నొచేసిననునిమ్మళమున్కనపర్చుచున్ తుదన్దూరెడువాడు దుష్కృతవిదూరుడుగణ్యుడులోకమాన్యుడున్
భక్తి శ్రద్ధల తోడ భర్గునిఁబూజించి యనుదినంబు మదిని ,నతని లోనదూరువాఁడెయఘవిదూరుఁడగును బొందు మోక్ష మునిఁక బొందుతోడ
పట్టణమ్ము లందు వంచనమ్ములు మెండు విశ్వసింతు రిట్లు విశ్వ జనులు నిక్కము వచియింప నొక్క సామెత గల దూరువాఁడె యఘవిదూరుఁ డగును మీఱి ధృతిన్ నిరంతరము మేలొన గూర్చుచు మానవాళికిందూఱక పానశాలల విదుల్చుచు దుడ్డుల నర్థికోటికింబాఱక భీత చిత్తుఁ డయి పార్థుని సన్నిధిఁ గల్మషాత్ములన్ దూఱెడివాఁడు దుష్కృతవిదూరుఁడు గణ్యుఁడు లోకమాన్యుఁడున్
భారమె యైన యాకలికిబాధను దీర్చుటకై గృహంబునన్ దూరెడివాఁడు దుష్కృతవిదూరుఁడు గణ్యుఁడు లోకమాన్యుఁడున్ సారమతీంద్రులెవ్వరును జాలరు తప్పని చెప్ప దానినిన్ నేరము కాదుగాఁ జెపుమ నీరజ! పాపముఁగల్గ దేరికిన్
పిన్నక నాగేశ్వరరావు.హనుమకొండ. ధర్మ మార్గమందు తా సంచరించుచుమంచి మనసు తోడ మసలుచుండిభక్తిభావ మొదవ ప్రతిరోజు గుడులందుదూరు వాడె యఘ విదూరు డగును.
గట్టిదెబ్బతోడ గానుగ యెద్దును
రిప్లయితొలగించండిదారిబెట్టవలయుధర్మమిదియ
మోటుమనిషినెపుడుమోమోటమేలేక
దూఱువాడెయఘవిదూరుడగును
ఆటవెలది
రిప్లయితొలగించండిద్వారపాలకుండు వైకుంఠమందున
పాపవశమున శిశుపాలుఁడయ్యె
నరిగఁ బుట్టి రయమె హరిఁ జేరఁ జక్రినిన్
దూరువాఁడె యఘవిదూరుఁ డగును
ఉత్పలమాల
శౌరికి ద్వారపాలకుడు శాపముతో శిశుపాలుడయ్యెఁ దా
వైరిగ బుట్టియున్ హరిని వైళమె జేరు వరాన జన్మమై
మీరుచుఁ జక్రియౌ హరిని మృత్యు వశాన వికుంఠమొందఁగన్
దూరెడివాఁడు దుష్కృతవిదూరుఁడు గణ్యుఁడు లోకమాన్యుఁడున్
నేరచరిత్రులౌ ఖలులు నిర్మలచిత్తుల నీతిమంతులన్
రిప్లయితొలగించండిఘోరఁపు చర్యలన్ చెలఁగి కొందలపెట్టగ నద్దురాత్ములన్
వైరముబూని బుద్ధిగరపన్ దగు నెవ్విధినైన వారలన్
దూరెడివాఁడు దుష్కృతవిదూరుఁడు గణ్యుఁడు లోకమాన్యుఁడున్
నీతిమంతులైన నిర్మలచిత్తుల
రిప్లయితొలగించండిబాధపెట్టి కించ పరచువాని
మంచి జెప్పిచూడ మాటవినకయున్న
దూరువాఁడె యఘవిదూరుఁ డగును
ఆ॥ ఎదుటి వారి బాధ లెంచుచు సాయముఁ
రిప్లయితొలగించండిజేయ ననవరతము సిద్ధమనుచుఁ
గష్టనష్టములకుఁ గలతఁ బడక నటు
దూరువాఁడె యఘవిదూరుఁ డగును
ఉ॥ సారము లేని జీవితము సాగఁగ బాధల తోడఁ బేదకున్
దూరము వెట్ట నాప్తులును దుఃఖముఁ బాపఁగ నెంచి సాయమున్
భారము నెంచ కుండగను భావము మీరఁగఁ జేయ సిద్ధమై
దూరెడి వాఁడు దుష్కృత విదూరుఁడు గణ్యుఁడు లోకమాన్యుఁడున్
దూరు ప్రవేశించు
చెడ్డ వారినెపుడు చెండాడుచుండుము
రిప్లయితొలగించండిఅవనిలోని విధము నరసిజూడ
పాప కృత్యములను పన్నెడి వారిని
దూరువాఁడె యఘవిదూరుఁ డగును
రిప్లయితొలగించండిఅన్యులైననేమి యాత్మజుండవనేమి
పాప కర్మలనొనరించు పాళమందు
వారి హితము గోరి వారించ నెంచుచున్
దూరువాఁడె యఘవిదూరుఁ డగును.
చారకమైన బంధములె సంకట హేతువు లంచు చెప్పుచున్
ధారుణి భోగభాగ్యముల త్యాగమొనర్చుచు ముక్తి
మార్గమున్
గోరి పరాత్పరుండనట గొల్వదలంచుచు దేవళమ్మునన్
దూరెడివాఁడు దుష్కృతవిదూరుఁడు గణ్యుఁడు లోకమాన్యుఁడున్.
తాను మేలుగూర్చ తప్పొప్పులెంచక
రిప్లయితొలగించండిజనసమూహమనగ జంకు లేక
సాయమందజేయ సానికొంపలలోన
దూరువాఁడె యఘవిదూరుఁ డగును
దారుణమైన బాధలను తాముభరింతురు వారకాంతలే
వారికి తోడ్పడందలచి బంధుర బృందము నుద్ధరింపగా
కోరుచు సంశయమ్ము విడి గుప్పున వేశ్యలకొంపలందునన్
దూరెడివాఁడు దుష్కృతవిదూరుఁడు గణ్యుఁడు లోకమాన్యుఁడున్
పరుల కుప క రించు భావాన మెలగుచు
రిప్లయితొలగించండిబాధ లందు దాను బంధు వగుచు
వెనుక ముందు జూచి వెను దీయ క య్యె డ
దూరు వాడె యఘవి దూరు డగును
తనపరయనుతారతమ్యముచూపక
రిప్లయితొలగించండినేరము లొనరించనెమ్మినివిడి
తప్పులాచరించదండించి సరిదిద్ద
*“దూరువాఁడె యఘవిదూరుఁ డగును”*
ఆటవెలది
రిప్లయితొలగించండినిగమశర్మ తల్లిని మరి తండ్రిని దూరి
పూర్వజన్మ కర్మ పూర్తి కాగ
పాదపూజ జేసె వారలకు, దొసగు
దూరువాడె యఘ విదూరు డగును
ప్రబల వేంకట సుబ్రహ్మణ్య శాస్త్రి
ఉండవల్లి సెంటరు.
LIFE CERTIFICATE FOR 2024
రిప్లయితొలగించండిఅందరికీ వందనములు !
అందరి పూరణలూ అలరించు చున్నవి !
అలరింప నున్నవి !
అప్రస్తుత ప్రసంగి
B-1)
_______________________________________
ధారగ సంస్కృతాంధ్ర యవ - ధానము సాగుచు నుండ మధ్యలో
ధోరణి మీరుచు, న్నతని - తొందరవెట్టుచు ద్యాస భంగ ని
ర్ధారణ గోరుచున్, కఱకు - ప్రశ్నల వేయుచు మాటిమాటికిన్
దూరెడివాఁడు దుష్కృతవి - దూరుఁడు గణ్యుఁడు లోకమాన్యుఁడున్ !
_______________________________________
ఆ.వె:దూరకుండ తాను దురితమ్ములందును,
రిప్లయితొలగించండిమంచి పేరు సుంత గాంచి నంత
ధర్మ మూర్తి యగునె? తన ముందు దుష్టుల
దూరువాఁడె యఘవిదూరుఁ డగును”
(నేను పాపం చెయ్యను అన్నంత మాత్రాన ధర్మాత్ముడు కాదు.తన ముందు దుష్టు లుంటే వారిని దూరాలి అనగా తిట్టాలి.)
ఉ:దూరక పాపమార్గముల,దూరుచు జ్ఞానుల చర్చలందునన్,
రిప్లయితొలగించండిదూరుచు సంఘసేవలను,దుర్బలు లందున జాలి జూపుచున్,
దూరక యన్య దైవముల, దుష్టత నెవ్వరి గాంచ,మార్చగన్
దూరెడివాఁడు దుష్కృతవిదూరుఁడు గణ్యుఁడు లోకమాన్యుఁడున్
(మొదటి రెండు పాదాల లో దూరక అంటే దూరటం అనే అర్థం.తరువాతి రెండు పాదాలతో దూరటం అంటే తిట్టటం.)
అందరికీ వందనములు !
రిప్లయితొలగించండిఅందరి పూరణలూ అలరించు చున్నవి !
అలరింప నున్నవి !
శిశుపాలుడు
B-2)
_______________________________________
మారెను రోత రూపమదె - మాధవుడే కరుణించి బ్రోవగాన్
నూరును మించి తప్పులను - నోటికి వచ్చిన రీతి పల్కుచున్
చేరెను విష్ణు లోకమదె - చేది నృపాలుడు చక్ర ఖండనన్
దూరెడివాఁడు దుష్కృతవి - దూరుఁడు గణ్యుఁడు లోకమాన్యుఁడున్ !
_______________________________________
రిప్లయితొలగించండిగరుడవాహనమున అలమేలు మంగతో
వేంకటేశుడేగ వీధులందు
రామచక్కనైన స్వామి పల్లకి క్రింద
దూరువాఁడె యఘవిదూరుఁ డగును
నేరము కాదు పత్రికకుఁ నిందలు వేయగఁ గోరి చేయ కై
రిప్లయితొలగించండివారముఁ వృత్తి ధర్మమని బద్ధుడునై జన పక్షపాతియై
నేరిమి నావలోకనము నెమ్మదిఁ జేయు విలేఖకుండు తా
న్దూరెడి వాడు దుష్కృత విదూరుడు గణ్యుడు లోకమాన్యుడున్
అందరికీ వందనములు !
రిప్లయితొలగించండిఅందరి పూరణలూ అలరించు చున్నవి !
అలరింప నున్నవి !
భీమసేనుడు
B-3)
_______________________________________
ధారుణి రాజ్య సంపద మ - దంబున సాధ్విని చిన్నబుచ్చినన్
ఘోరముగా ప్రతిశ్రుతి వృ - కోదరు డారడి జేసె రాజునే
పేరడగించె యుద్ధమున - వీరముతో శత భ్రాతలందరిన్
దూరెడివాఁడు దుష్కృతవి - దూరుఁడు గణ్యుఁడు లోకమాన్యుఁడున్ !
_______________________________________
ఆరడి = తిట్టు
చేరెయశోదచెంతకునుశీఘ్రముగావసుదేవుచేతతా
రిప్లయితొలగించండిచోరుడుగానెకృష్ణుడిలచూపెను శౌర్యము గోకులమ్మునన్
నేరములెన్నొచేసిననునిమ్మళమున్కనపర్చుచున్ తుదన్
దూరెడువాడు దుష్కృతవిదూరుడుగణ్యుడులోకమాన్యుడున్
భక్తి శ్రద్ధల తోడ భర్గునిఁబూజించి
రిప్లయితొలగించండియనుదినంబు మదిని ,నతని లోన
దూరువాఁడెయఘవిదూరుఁడగును
బొందు మోక్ష మునిఁక బొందుతోడ
పట్టణమ్ము లందు వంచనమ్ములు మెండు
రిప్లయితొలగించండివిశ్వసింతు రిట్లు విశ్వ జనులు
నిక్కము వచియింప నొక్క సామెత గల
దూరువాఁడె యఘవిదూరుఁ డగును
మీఱి ధృతిన్ నిరంతరము మేలొన గూర్చుచు మానవాళికిం
దూఱక పానశాలల విదుల్చుచు దుడ్డుల నర్థికోటికిం
బాఱక భీత చిత్తుఁ డయి పార్థుని సన్నిధిఁ గల్మషాత్ములన్
దూఱెడివాఁడు దుష్కృతవిదూరుఁడు గణ్యుఁడు లోకమాన్యుఁడున్
భారమె యైన యాకలికిబాధను దీర్చుటకై గృహంబునన్
రిప్లయితొలగించండిదూరెడివాఁడు దుష్కృతవిదూరుఁడు గణ్యుఁడు లోకమాన్యుఁడున్
సారమతీంద్రులెవ్వరును జాలరు తప్పని చెప్ప దానినిన్
నేరము కాదుగాఁ జెపుమ నీరజ! పాపముఁగల్గ దేరికిన్
రిప్లయితొలగించండిపిన్నక నాగేశ్వరరావు.
హనుమకొండ.
ధర్మ మార్గమందు తా సంచరించుచు
మంచి మనసు తోడ మసలుచుండి
భక్తిభావ మొదవ ప్రతిరోజు గుడులందు
దూరు వాడె యఘ విదూరు డగును.