24, మే 2024, శుక్రవారం

సమస్య - 4773

25-5-2024 (శనివారం)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“తార్క్ష్యుని పదములకు మ్రొక్కె దామోదరుఁడే”
(లేదా...)
“తార్క్ష్యపదాభివందనమొనర్చెను శ్రీపతి భక్తి పెంపునన్”

16 కామెంట్‌లు:

 1. కందం
  తార్క్ష్యుని పాత్రకు తండ్రియుఁ
  దార్క్ష్యుని ప్రభువుగ సుతుండు దాల్చగ పాత్రన్
  దార్క్ష్యునధిష్టించు మునుపు
  తార్క్ష్యుని పదములకు మ్రొక్కె దామోదరుఁడే!

  ఉత్పలమాల
  తార్క్ష్యుని పాత్రకున్ వలయు దార్డ్యము గల్గగఁ దండ్రినెంచియున్
  దార్క్ష్యుని స్వామియౌ హరిగఁ దత్సుతునెంచెను దర్శకుండహో!
  తార్క్ష్యునిపై విహారమును దప్పక చిత్రణకెంచ ముందుగన్
  దార్క్ష్యపదాభివందనమొనర్చెను శ్రీపతి భక్తి పెంపునన్!

  రిప్లయితొలగించండి
 2. తార్క్ష్యుండనగా గరుడుఁడు
  తార్క్ష్యుఁడుహరి వాహనమ్ము, తన యజమానిన్
  తార్క్ష్యుఁడు పూజించు, నెటుల
  తార్క్ష్యుని పదములకు మ్రొక్కె దామోదరుఁడే?

  రిప్లయితొలగించండి
 3. తార్క్ష్యుని గాంచిన భక్తుడు
  తార్క్ష్యుని పదములకు మ్రొక్కె; దామోదరుఁడే
  తార్క్ష్యుని పైనెక్కితిరుగు
  తార్క్ష్యుడు వాహనముగాదె దామోదరుకున్

  తార్క్ష్యుడు విష్ణుసేవకుడు తామరకంటికి యానమేకదా
  తార్క్ష్యుడు విష్ణువేననుచు తల్చుట లోకము నందు సాజమే
  తార్క్ష్యుని పైన తార్క్ష్యుడు సదా తిరుగాడుట కన్న వానిగా
  తార్క్ష్యపదాభివందనమొనర్చెను శ్రీపతి భక్తి పెంపునన్

  శ్రీపతి = రాజు

  రిప్లయితొలగించండి
 4. రిప్లయిలు
  1. కం॥ తార్క్ష్యుఁడు వాహనమంచును
   దార్క్ష్యధ్వజుఁడు ముదముగఁ దత్పరతఁ గనిన్
   దార్క్ష్యు నధిరోహమునకటు
   తార్క్ష్యుని పదములకు మ్రొక్కె దామోదరుఁడే

   ఉ॥ తార్క్ష్యుఁడు వాహనమ్ము గను దత్పరతన్ గని యుండఁగన్ సదా
   తార్క్ష్యుని సేవలన్ దనిసి తాల్చుచు శ్రీహరి మోదమంచుచున్
   దార్క్ష్యుని గౌరవించఁగను దానుగ నెంచుచు నర్మిలిన్ గనిం
   దార్క్ష్య పదాభివందనమొనర్చెను శ్రీపతి భక్తి పెంపునన్

   తొలగించండి
  2. రాత్రి కందములో మొదటి పాదము copy చెయ్యకుండా paste చేసానండి

   తొలగించండి

 5. తార్క్ష్యుడు దినకర సారథి
  తార్క్ష్యుండన హరియె భువిని దాశరథిగ నా
  తార్క్ష్యుండుషోదయమ్మున
  తార్క్ష్యుని పదములకు మ్రొక్కె దామోదరుఁడే


  తార్క్ష్యుడు కశ్యపాత్మజుడు తమ్ముల విందుకు దక్షిణస్థుడున్
  దార్క్ష్యుడు తార్క్ష్యుడన్న తరిదాల్పని చెప్పిరి పక్కిరాయునిన్
  దార్క్ష్యుడటంచు పిల్చెదరు ధాత్రిని రాముని రూపమందున
  న్తార్క్ష్య పదాభివందనమొనర్చెను శ్రీపతి భక్తి పెంపునన్.

  రిప్లయితొలగించండి
 6. తార్క్ష్యుఁడు వైనతేయుఁడు సదా హరి సేవనమందు నుండునా
  తార్క్ష్యుఁడుగాదె శ్రీహరికి దానొక వాహనమై చరించు నీ
  తార్క్ష్యుఁని కేశవుండెపుఁడుదాత్తముగా దయఁజూడ నెవ్విధిం
  దార్క్ష్యపదాభివందనమొనర్చెను శ్రీపతి భక్తి పెంపునన్

  రిప్లయితొలగించండి
 7. తార్క్ష్యుని బిలచి ముకుందుడు
  తార్క్ష్యా ! రమ్మచట కరిని దడవుట కనగన్
  తార్క్ష్యుడు రాకుండుట గని
  తార్క్ష్యుని పదములకు మ్రొక్కె దామోదరుఁడే

  రిప్లయితొలగించండి
 8. తా ర్ష్యు డె వాహన మ య్యె ను
  తా ర్ష్యు డు సేవలొ న రించు దా మో దరు కే
  తా ర్ష్యు ని. కె య్యె డ. నె ట్టు ల
  తా ర్ష్యు ని పద ములకు మ్రొ క్కె దామో దరు డే?

  రిప్లయితొలగించండి
 9. తార్క్ష్యుని సద్గుణ ములకును
  తార్క్ష్యునిఁదామెచ్చుకొనుచు తఱుగని భక్తిన్
  తార్క్ష్యుని నభినందించుచు
  తార్క్ష్యుని పదములకు మ్రొక్కె దామోదరుఁడే

  రిప్లయితొలగించండి
 10. తార్క్ష్యుండు గరుడుఁ డన్నయుఁ
  దార్క్ష్యుఁడు మాలను ధరించి తాఁ జిత్రముగన్
  వార్క్ష్యమున వెలుఁగుచు నహో
  తార్క్ష్యుని పదములకు మ్రొక్కె దామోదరుఁడే


  ఆర్క్ష్య పథాను వర్తి యయి యంచిత రీతిఁ గుబేరుఁ డింపుగాఁ
  బార్క్ష్య వచో సుమాంజళులఁ బద్మదళాక్షు నుతించి నిత్యమున్
  వార్క్ష్య పదార్థసంతతులఁ బన్నుగ శ్రీపతి కిచ్చి తృప్తినిం
  దార్క్ష్య పదాభివందన మొనర్చెను శ్రీపతి భక్తి పెంపునన్

  [తార్క్ష్యుఁడు = విష్ణువు; శ్రీపతి = సంపదల కధిపతి, కుబేరుఁడు; ఆర్క్ష్యము = నక్షత్రములకు సంబంధించినది; పార్క్ష్యము = వేదములకు సంబంధించిన; వార్క్ష్యము = వృక్షములకు సంబంధించిన]

  రిప్లయితొలగించండి
 11. రిప్లయిలు
  1. తార్క్ష్యులె వాహనంబులుగదా దనుజారికి నంశుమాలికిన్
   తార్క్ష్యుడు నర్ఘ్యమిచ్చు నిశిదాయకుఁ బ్రొద్దుటి సంధ్యవేళలన్
   తార్క్ష్యుడు నంజలింప వనతస్కరికిన్ కననిట్లు తోచునే
   తార్క్ష్య పదాభివందనమొనర్చెను శ్రీపతి భక్తి పెంపునన్

   తొలగించండి
 12. తార్క్ష్యుని సద్గుణంబులకుఁదామదిఁభూరిగ మెచ్చు కొంటచే
  తార్క్ష్యపదాభివందనమొనర్చెను శ్రీపతి భక్తి పెంపునన్
  తార్క్ష్యుఁడు విష్ణువాహనము తద్దయు భక్తిని సేవఁజేయుచున్
  తార్క్ష్యుడు దాస్యబంధమును దల్లికి లేమిని జేసెఁబాలచేన్

  రిప్లయితొలగించండి