22, మే 2024, బుధవారం

సమస్య - 4771

23-5-2024 (గురువారం)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“గర్భముం దాల్చె నా పతి గౌరవముగ”
(లేదా...)
“గర్భముఁ దాల్చె నా మగఁడు గౌరవనీయుఁడు సచ్చరిత్రుఁడున్”

36 కామెంట్‌లు:

 1. తేటగీతి
  గ్రహబలమ్ము గొదువయౌచు కలసిరాక
  కార్యసఫలమ్ము గూర్చఁగ కాంచనమున
  నయ్యవారలాదేశించినటుల నశ్మ
  గర్భముం దాల్చె నా పతి గౌరవముగ

  అశ్మగర్భము=మరకతము

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. అభిమన్యునికి వీరతిలకము దిద్ది పద్మవ్యూము ఛేదించ డానికి పంపుతుా ఉత్తర దైవ ప్రార్థన:

   ఉత్పలమాల
   నిర్భయుఁడౌచు కౌరవులు నేర్పుగఁ బన్నిన వ్యూహమందు న
   య్యార్భటి ధాటిగన్ నిలుప నప్పయె లేడన దూకనెంచెనే
   దుర్భరమౌను చూలిగ వధూటికి! దైవమ! గావుమయ్య శ్రీ
   గర్భముఁ దాల్చె నా మగఁడు గౌరవనీయుఁడు సచ్చరిత్రుఁడున్

   తొలగించండి
  2. మీ రెండు పూరణలు ప్రశస్తంగా ఉన్నవి. అభినందనలు.

   తొలగించండి
  3. 🙏గురుదేవులకు మరియు రామోక్తమ్ గారికి ధన్యవాదములు🙏

   తొలగించండి
 2. విరియవిజ్ఞానవీచికవిస్తరముగ
  గర్భముందాల్చెనాపతిగౌరవముగ
  పిల్లపాపలుమాయింటప్రేమగురియ
  వచ్చియాడుదురీవేళపండనోము

  రిప్లయితొలగించండి
 3. దర్భలుచేతబుచ్చుకొనితండ్రికితర్పణమిచ్చువేళలో
  నిర్భరశాంతిధారనవనీతమునట్లుగజాలువారగా
  అర్భకుడౌనుగాయనగనాగతిదైన్యతఖిన్నుడైకుశా
  గర్భముదాల్చెనామగడుగౌరవనీయుడుసచ్చరిత్రుడున్

  రిప్లయితొలగించండి

 4. *(వైద్యులు టెస్ట్ ట్యూబ్ బేబి గురించి పడతికి వివరిస్తున్న సందర్భము)*


  ప్రగతి సాధించె నేడిల వైద్య రంగ
  మనుచు నావిధానమునందు నతివ యేని
  గర్భముం దాల్చెనా, పతి గౌరవముగ
  మనగ వచ్చు నిట్టి సమాజ మున నిజమ్ము.


  అర్భకులైన వారలిట యంకిలి పెట్టదలంచుచున్ సదా
  దుర్భరమైనమాటలను దూరిన నేమిర సత్యమాగునే
  నిర్భయమందు చెప్పెదను నీ సతి నీ దయ వల్లనే కదా
  గర్భముఁ దాల్చె , నా మగఁడు గౌరవనీయుఁడు సచ్చరిత్రుఁడున్.

  రిప్లయితొలగించండి
 5. దుర్భర బాధలుం బడిసె దోషములన్ని
  తొలంగె, పుత్రియున్
  గర్భము దాల్చ నామగడు గౌరవ
  నీయుడు సచ్చరిత్రుడున్
  నిర్భయశాలి, చెందె గడు నెయ్యము
  తీరెనటంచు చింతయున్
  గర్భము దాల్చకున్న గడు కాలము
  వేదన కల్గుదప్పకన్.

  రిప్లయితొలగించండి
 6. తే॥ పిల్లలు కలుగ లేదంచు నెల్లరుఁ దగు
  సూచనలొసఁగి నిట్టూర్చు చుండఁగ సతి
  గర్భముం దాల్చె నాపతి గౌరవముగ
  నందరికిఁ దెలిపి తనిసె నతి ముదముగ

  ఉ॥ అర్భకుఁడంచు లోకులటు లందరు దూరఁగ సంతు లేదనిన్
  నిర్భయులౌచు నత్తరిని నిత్యముఁ బ్రార్థన జేయ భార్యయే
  గర్భముఁ దాల్చె నామగఁడు గౌరవ నీయుఁడు సచ్చరిత్రుఁడున్
  గర్భముఁ దాల్చె భార్య యని గాదిలి మీరఁగఁ దెల్పె నంతటన్

  రిప్లయితొలగించండి
 7. అధిక సంతానవతియగు నబల మరల
  గర్భముం దాల్చె, నా పతి గౌరవముగ
  బిడ్డనిమ్మని కోరెను పెంచుకొనఁగ,
  పిల్లలఁ బడయు భాగ్యము కల్ల గాఁగ

  రిప్లయితొలగించండి
 8. పూజ లొనరించి నోముల పుడమి జేయ
  గర్భ మున్ దాల్చెనా :: పతి గౌర వముగ
  మిగుల హర్షాన దెలి పెను మిత్ర తతికి
  పొంది నభి నంద నలు దాను మోద మందె

  రిప్లయితొలగించండి
 9. అతివ ల సభకు తన పతి నామతించి
  గౌర వించగ , దానికి కదలి పోయి
  యింతు ల పయి కై త నుడువ , నిడిన యగ్ని
  గర్భముం దాల్చె నా పతి గౌరవముగ

  రిప్లయితొలగించండి
 10. ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. మీ రెండు పూరణలు ప్రశస్తంగా ఉన్నవి. అభినందనలు.
   "లభ్యమైనచో నర్భకుడందువా..." అనండి.

   తొలగించండి
  2. వైద్యుడౌ నామగడు చూపు వైద్య ప్రతిభ
   వలన సంతానమేలేని వనితయొకతె
   గర్భముం దాల్చె నా పతి గౌరవముగ
   స్వీకరించె కృతజ్ఞతల్ వెల్లివిరియ

   దుర్భరమేకదా బ్రతుకు దుష్టుడు భర్తగ లభ్యమైనచో
   నర్భకుడందువా కమనుడార్యుడు భర్తగ సంక్రమించెగా
   నిర్భర వైద్యసేవలిడు నెప్పరి నిష్కళ నీరజాక్షియే
   గర్భముఁ దాల్చె నా మగఁడు గౌరవనీయుఁడు సచ్చరిత్రుఁడున్

   తొలగించండి
 11. దుర్భరమాయె జీవనము, దూఁకొని సంతతి యగ్గలమ్ముగా
  నిర్భర లేమిడిన్ బ్రతుక నేరని దుస్థితిఁ మ్రగ్గుచుండఁదా
  గర్భముఁ దాల్చె, నా మగఁడు గౌరవనీయుఁడు సచ్చరిత్రుఁడున్
  నిర్భయమొందజేసి తరుణిన్ గొనె దత్తత నాపె బిడ్డడిన్

  రిప్లయితొలగించండి
 12. నిర్భయుడైన నా మగడు నేర్చె మ్రుచ్చుతనంబు నాదినం
  దుర్భర క్షుధఁ దాళకనె దోచెను భక్ష్యములా నిశీధిఁ దా
  నర్భకుడౌచు భక్ష్యములనంగిని దాచగ నామనంబనెన్
  గర్భముఁ దాల్చె నామగడు గౌరవ పాత్రుడు సచ్చరిత్రుడున్

  రిప్లయితొలగించండి
 13. తే.గీ:ప్రముఖ సన్మానసభయందు పలుచ నైన
  వచనకవిత లందరు జెప్ప భావ భరిత
  మైన చంపకమాలల, నందు గీత
  గర్భముం దాల్చె నా పతి గౌరవముగ
  (కవి ఐన భర్త గర్భం ధరించ లేదు.గర్భకవిత్వాన్ని ధరించాడు.)

  రిప్లయితొలగించండి
 14. (2)ఉ:దర్భల దాల్చి నా మగడు తద్దయు నిష్ఠగ నుండు, నెట్టి సం
  దర్భము నందు నన్ను విడి దారులు తప్పడు,వ్యర్థ నిందయే
  దుర్భర, మామె ఎవ్వతెయొ, దుష్టు డదెవ్వడొ వాని స్పర్శతో
  గర్భముఁ దాల్చె, నా మగఁడు గౌరవనీయుఁడు సచ్చరిత్రుఁడున్”
  (ఎవరో ఒక స్త్రీ అక్రమసంబంధం తో గర్భం ధరిస్తే ఆ నింద ఈ పిచ్చి బేంబడి మీద వేసారు. నా మొగుడు మంచి వాడే అని భార్య రోదన.)

  రిప్లయితొలగించండి
 15. తనర వంశాభివృద్ధి సంతసము మీఱ
  నుభయ వంశమ్ములఁ జెలంగ నుత్సవములు
  నిల్ప బంధు వర్గమ్మున నెమ్మిఁ బత్ని
  గర్భముం దాల్చె నా పతి గౌరవముగ


  దుర్భరమై చెలంగ రహి తూర్ణము డెందము లందు నౌర స్వీ
  యార్భక సంచయమ్మునకు నాతని పుట్టిన యట్టి ఘస్ర సం
  దర్భము నందు సంతసము దద్ద సెలంగఁగ మించి ద్వీపవ
  ద్గర్భముఁ దాల్చె నా మగఁడు గౌరవనీయుఁడు సచ్చరిత్రుఁడున్

  [ద్వీపవద్గర్భము = సముద్రము నుండి పుట్టినది, రత్నము]

  రిప్లయితొలగించండి
 16. లింగ మార్పిడి యగుటన యంగనవలె
  గర్భముం దాల్చె నా పతి గౌరవముగ
  నెలలు నిండిన తదుపరి నీరసపడి
  పనస పండును బోలెడు పట్టిఁగనెను

  రిప్లయితొలగించండి
 17. అర్భకు వోలెఁగాక తను హర్షము తో డన లింగ మార్పిడిన్
  నిర్భయ మొందగా జరుగ నేరపు భావన లేకసంతుకై
  గర్భముఁ దాల్చె నా మగఁడు గౌరవనీయుఁడు సచ్చరిత్రుఁడున్
  దుర్భరమైననున్ గనెను దొడ్డగుణంబులు గల్గు పుత్రునిన్

  రిప్లయితొలగించండి

 18. పిన్నక నాగేశ్వరరావు.
  హనుమకొండ.

  పెండ్లి జరిగి వత్సరమయ్యె,పెద్ద చెల్లి
  గర్భముం దాల్చె; నా పతి గౌరవముగ
  తోడుకొని వచ్చి సీమంత వేడుకలను
  చేసి పుట్టింట పంపించె చెల్లినపుడు
  బంధు మిత్రులకున్ బంచి బహుమతులను.

  రిప్లయితొలగించండి