4, మే 2024, శనివారం

సమస్య - 4755

5-5-2024 (ఆదివారం)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“రవితేజము చల్లఁదనము ప్రజలకొసంగెన్”
(లేదా...)
“రవితేజంబిడె లోకులెల్లరకుఁ దీవ్రంబైన శైత్యంబిలన్”

(మొన్నటి బులుసు అపర్ణ గారి అష్టావధాన సమస్య)

33 కామెంట్‌లు:

  1. భువనము నందున వెలుగుచు
    నవని తలమున కురిపించె నమృత తరఁగలన్
    జవిచూచిన చాలును కై
    రవితేజము చల్లఁదనము ప్రజలకొసంగెన్

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. రవి తేజోవతుడై జగత్తును సదా రక్షింపగా నిల్చిన
      న్నవలోకింతురు మానవుల్ పొలుపుతో నారాజు రేవెల్గులే
      భువనంబందున రాత్రివేళ రయమున్ బోగొట్టి చీకట్లు కై
      రవితేజంబిడె లోకులెల్లరకుఁ దీవ్రంబైన శైత్యంబిలన్

      తొలగించండి
    2. మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.

      తొలగించండి
    3. తేజోవతుడు రూప మసాధువండి. తేజస్వంతుఁడు సాధు రూపము. వత్, విన్, వల ప్రత్యయముల వ కారమునకు "అస్" న కోత్వము రాదు.

      తొలగించండి
  2. దివమున భానుడెసగిపడ
    అవనిపయి జనులు నిదాఘమాస్వా దించన్
    రవి యస్తమించగనె కై
    రవితేజము చల్లఁదనము ప్రజలకొసంగెన్

    రిప్లయితొలగించండి
  3. రవి కిరణపు తీవ్రతచే
    దివసంబున వేడిచేత తిప్పలవడగన్
    రవి గ్రుంకిన వెంటనె కై
    రవితేజము చల్లఁదనము ప్రజలకొసంగెన్

    రిప్లయితొలగించండి

  4. అవిషిన్ దారల మధ్యన
    సువిధానుండయి వెలుగుచు క్షోణితలమునన్
    ధవలపు కాంతినిడెడి కై
    రవితేజము చల్లఁదనము ప్రజలకొసంగెన్.


    దవమున్ ద్రుంచిరి మానవుండ్రనుచు సంతాపమ్మునే చెందెనో
    రవి కోపంబును బూని భూరిగను మండ్రాటమ్మునే రాల్చగా
    నవిషిన్ గాంచ మనోజ్ఞమై మదిని యాహ్లాదమ్ములో ముంచు కై
    రవితేజంబిడె లోకులెల్లరకుఁ దీవ్రంబైన శైత్యంబిలన్.

    రిప్లయితొలగించండి
  5. కం॥ భువిలో భానుఁడు గ్రీష్మపు
    జవమునఁ దీక్షణతఁ గనుచుఁ జనగా మనుజుల్
    వివశత్వముఁ బడయ నెచట
    రవితేజము చల్లఁదనము ప్రజలకొసంగెన్

    మ॥ భువిలో భానుఁడు నిప్పులన్ జెదర నబ్బురంబునౌ రీతిగన్
    జవమున్ బొందుచు గ్రీష్మ తాపమును సంస్తంభించఁ గానుగ్రుఁడై
    వివశత్వంబును బొంద మానవులటుల్ వీక్ష్యమ్ము నీపల్కులే
    “రవితేజంబిడె లోకులెల్లరకుఁ దీవ్రంబైన శైత్యంబిలన్”

    ఈసంవత్సరము నేనింతవరకు చూడని గ్రీష్మ తాపము చూసానండి బెంగళూరులో.

    రిప్లయితొలగించండి
  6. రవి వహ్నిద్యుతి బోలుచున్ ధరణినిన్ ద్రాసంబు గావింపగా
    వివశభ్రాంతి యుగాంతమో యని ప్రజల్ వేగంగ మధ్యాహ్నమున్
    సవిశేషమ్ముగ రాత్రివేళ కనగా సంపూర్ణ చంద్రుండు, కై
    రవితేజంబిడె లోకులెల్లరకుఁ దీవ్రంబైన శైత్యంబిలన్.

    రిప్లయితొలగించండి
  7. రవి భగ్గున మం డుట గని
    కువ కువ లాడెను జనతతి కువలయ మందున్
    రవి యస్త మించగ నె కై
    రవి తేజము చల్లదనము ప్రజల కొ సం గె న్

    రిప్లయితొలగించండి
  8. కం:శివుని జటను జన్మించిన,
    స్తవములకున్ గరగు వీరభద్రుని కొలువై
    న విలక్షణ మౌ పల్లె కు
    రవి తేజము చల్లఁదనము ప్రజలకొసంగెన్”
    (కురవి అనేది ఒక ప్రసిద్ధపుణ్యక్షేత్రం.అక్కడ దైవం వీరభద్రుడు.అతను శివుని జటాజూటం నుంచి ఉద్భవించాడు.)

    రిప్లయితొలగించండి
  9. సెవలను జిమ్మఁగ దివమున
    రవితేజము, చల్లఁదనము ప్రజలకొసంగెన్
    భువనమ్మున రాకాశశి
    రవిచంద్రులు భూమిజనుల రక్షకులిలలో

    రిప్లయితొలగించండి
  10. సెవలన్ జిమ్ముచు నుగ్రతాపనమునున్ స్ఫీతమ్ముగా నీభువిన్
    రవితేజంబిడె లోకులెల్లరకుఁ, దీవ్రంబైన శైత్యంబిలన్
    పవనుండిచ్చెను యంత్ర మాధ్యమమునన్బంపించగా మానవుల్
    వివరింపన్ జనపాళికీభువిని నిర్భేద్యంబు గాదెయ్యదిన్

    రిప్లయితొలగించండి
  11. నా పేరుతో నే పూరణ

    మ:కవి యౌ నీ ధనికొండ వ్యాసములతో గ్రాహ్యమ్ము గావించె స
    త్యవిదూరమ్మగు భావజాలముల యన్యాయమ్ములన్ ధాటిగా,
    రవితేజంబిడె లోకులెల్లరకుఁ దీవ్రంబైన శైత్యంబిలన్
    యువ లోకమ్మును బట్టి నిష్క్రియత లో నుంచన్ సమాజస్పృహన్

    రిప్లయితొలగించండి
  12. (3)కం:కవితన్ కిరాతపాత్రన్,
    శివపాత్రన్ సమము గా విచిత్రగతులతో
    స్తవనీయత దిద్దుచు భా
    రవి తేజము చల్లదనము ప్రజలకు నొసగెన్
    (కిరాతార్జునీయం కావ్యం లో భారవి మహాకవి కిరాతుని పాత్ర లో తేజస్సుని,శివుని పాత్ర లో చల్లదనాన్ని సమంగా పంచాడని క్రమాలంకారం లో)

    రిప్లయితొలగించండి
  13. భువిలోన శరత్కాలము
    న విశేషముగ వెలుఁగు గగనమ్మున శశియే
    ఛవి నిచయమ్మునఁ జంద్రుని
    రవి! తేజము చల్లఁదనము ప్రజల కొసంగెన్


    అవికారంబు ననార్త చిత్తముల సత్యంబెన్న విశ్వంబులో
    నెవ రెందేని చరింత్రు ధైర్యముగఁ బంచేష్వార్త మర్త్యాలి నేఁ
    చి విశేషమ్ముగ నా నిశీధిఁ బరగన్ శీతాంశు కాంతుల్ నభో
    రవి తేజం బిడె లోకు లెల్లరకుఁ దీవ్రంబైన శైత్యం బిలన్
    [నభో రవి = ఆకాశ జీవి; రవి = జీవుడు]

    రిప్లయితొలగించండి
  14. పవలును రాత్రియు సూర్యుని
    నవిరళమగు వేడివలన నడరెడు ప్రజకున్
    వివశత తొలగించుచుకై
    రవితేజముచల్లఁదనము ప్రజలకొసంగెన్

    రిప్లయితొలగించండి
  15. కందం
    రవితేజంబున మాడిన
    నవనీ ప్రజ సంధ్యవేళ నలరఁగ గాలిన్
    రవి యస్తమించ నొగి కై
    రవితేజము చల్లఁదనము ప్రజలకొసంగెన్

    మత్తేభవిక్రీడితము
    రవితేజంబున వేసవిన్ జనులు నల్లాడంగ సాయంత్రమై
    యవనిన్ మెల్లగ చల్లగాలులొదవన్ హ్లాదాన సాంత్వమ్మునన్
    జవముల్ గూరగ స్సానమాచరణతో శయ్యన్ వినోదింపఁ గై
    రవితేజంబిడె లోకులెల్లరకుఁ దీవ్రంబైన శైత్యంబిలన్!

    రిప్లయితొలగించండి
  16. పవలున్ రాత్రియు నెండవేడిమికి తాపంబొంది శోషిల్ల, కై
    రవితేజంబిడె లోకులెల్లరకుఁ దీవ్రంబైన శైత్యంబిలన్
    గవులున్ బెద్దలు బండితోత్తములు సత్కార్యంబుఁగావించె నా
    శివునిన్ జూటము నందువెల్గుమణి యాశేషాహి కాప్తుండునున్

    రిప్లయితొలగించండి
  17. కవితాధారలశంకరు
    లవిరళకృషితోతలపడిహాయినిగొల్పన్
    శివుడేహ్లాదమునందగ
    రవితేజముచల్లదనముప్రజ కొసంగెన్

    రిప్లయితొలగించండి
  18. కవనంబందున రావణాదసురులన్ గాష్టంబు పాల్జేసి పే
    రువు కైవారముఁ గొన్న సీతఁగొని చిద్రూపంబుతోడన్ కుబే
    ర విమానంబధిష్టించి రాజ్యమునకా రాముండు జేరంగ నా
    రవి తేజంబిడె లోకులెల్లరకు తీవ్రంబైన శైత్యంబిలన్

    రిప్లయితొలగించండి

  19. పిన్నక నాగేశ్వరరావు.
    హనుమకొండ.

    పవలంతయు ప్రజ్వరిలగ
    రవి తేజము; చల్లదనము ప్రజల కొసంగెన్
    భువి సాయంసమయము కై
    రవి తన శీతకిరణముల ప్రాబల్యముతో.

    రిప్లయితొలగించండి
  20. డా బల్లూరి ఉమాదేవి

    భువిలో వెలుగును పంచును
    రవితేజము చల్లదనము ప్రజలకొసంగెన్
    పవనుడుజతకూడంగన
    నవరతము జనాళియెల్లనందమ్మొందన్

    రిప్లయితొలగించండి