15, మే 2024, బుధవారం

సమస్య - 4765

16-5-2024 (గురువారం)

కవిమిత్రులారా,

ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...

“సర్పసంతతి హెచ్చిన జరుగు మేలు”

(లేదా...)

“సంతతి వృద్ధి సేసినవి సర్పము లీభువి మేలుఁ గోరుచున్”

24 కామెంట్‌లు:

 1. తేటగీతి
  సకలజీవుల సమతుల్యమొకటెదిక్కు
  సృష్టి కొనసాగ లోకాన సేమముగను
  సర్వమయునాన ప్రతిజీవి సాగ, నెటుల
  సర్పసంతతి హెచ్చిన జరుగు మేలు?

  ఉత్పలమాల
  ఎంతగ నేది కావలెనొ యీశ్వరనిర్ణయమౌచు సృష్టిదౌ
  దొంతర సాగుచుండు సమతుల్యత పాయక జీవులందునన్
  పొంతనలేని వాదనల ప్రొద్దును బుచ్చుట మేలొకో? యెటన్
  సంతతి వృద్ధి సేసినవి సర్పము లీభువి మేలుఁ గోరుచున్?

  రిప్లయితొలగించండి
 2. మనసుకల్మషమైనచోమనగలేము
  అట్టిఖలులవలననుహానికలుగు
  మనిషికాటుకులేదికమందుకూడ
  సర్పసంతతిహెచ్చినజరుగుమేలు

  రిప్లయితొలగించండి
 3. అంతముగాగలోకమునునాగతినిర్ణయమైనసృష్టిలో
  పంతముతోడమానవులుభావనసేసిరికాలకూటమున్
  వింతగతోటివారలునుపెచ్చుగకాటునువేయుచుండగా
  సంతతివృద్ధిజేసినవిసర్పములీభువిమేలుగోరుచున్

  రిప్లయితొలగించండి
 4. కప్పలు బెరుగు జొచ్చెను గాలు వెట్ట
  సందు లేదాయె పొలములో సాగుజేయ
  వాటి సంఖ్యను దగ్గించు మేటి జాతి
  సర్పసంతతి హెచ్చిన జరుగు మేలు?

  రిప్లయితొలగించండి

 5. పుడమి బొరియలు జేయుచు భూరిగాను
  నష్టము గలిగించు నవి ఖనకము లవియె
  వాటిని భుజియించెడి విష ప్రాణు లైన
  సర్పసంతతి హెచ్చిన జరుగు మేలు.


  వింతయె యైన వాస్తవము ప్రీతిగ వండి భుజింతు రంచు నా
  ప్రాంతము కేగి విందువగు పాణికుడొక్క డుపాధి కోసమై
  పంతును వీడి పెంచెనట పాము లవే కన కొన్ని నాళ్ళలో
  సంతతి వృద్ధి సేసినవి సర్పము లీభువి మేలుఁ గోరుచున్.

  రిప్లయితొలగించండి
 6. తే॥ మూషికముల సంతతి హెచ్చి పొరలఁగాను
  బంటలకు కీడు పెరుఁగుచు మంటఁ గలియు
  కర్షకుల కష్టమంతయుఁ గనఁగ నపుడు
  సర్ప సంతతి హెచ్చిన జరుగు మేలు

  ఉ॥ సంతును మూషికమ్ములకు సాఁగుచు హెచ్చిన నంతు లేనటుల్
  పంతము తోడ నాశనము పంటలఁ జేయుటఁ గాంచుచుందుమే
  యంతముఁ జేసి కుందువుల నాదుకొనంగను రైతు వీరులన్
  సంతతి వృద్ధి సేసినవి సర్పము లీభువి మేలుఁ గోరుచున్

  కుందువు ఎలుక నిఘంటువు సహాయమండి

  ఎలుకలు ఎక్కువైతే పంటలను నాశనము చేస్తాయండి. పొలాలలో పాములు ఎలుకలను తిని రైతుకు మేలు చేస్తాయండి. జెఱ్ఱిపోతు (Rat snake) విషము లేని పామండి. అది ఎలుకలను పొలలాలో నియంత్రిస్తుందండి

  రిప్లయితొలగించండి
 7. ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.

  రిప్లయితొలగించండి
 8. పట్టణీకరణ మడచ పన్నగముల
  ముసురుకొనె నల్దెసలలోన మూషికములు
  సర్పసంతతి హెచ్చిన జరుగు మేలు
  జీవ సమతౌల్యము భువికి జీవధార

  రిప్లయితొలగించండి
 9. ముప్పు లేకున్న జీవించు మోద మలర
  ప్రాణులన్నియు లోకాన ప్రమద ముగను
  కాటు వేయగ యత్నించు గనుక నెటుల
  సర్ప సంతతి హెచ్చి న జరుగు మేలు?

  రిప్లయితొలగించండి
 10. తేటగీతి
  సర్పయాగము జరిగెడి సమయ మందు
  సర్ప జాతి కలత చెంది స్తవము జేసె
  మానవుల దర్ప మణగంగ మరల ముఖ్య
  సర్పసంతతి హెచ్చిన జరుగు మేలు.

  ప్రబల వేంకట సుబ్రహ్మణ్య శాస్త్రి
  ఉండవల్లి సెంటరు.

  రిప్లయితొలగించండి
 11. సర్పయాగమున జనమేజయుని వలన
  రక్షణ కొరకై తపియించె తక్షకుండు
  సర్పయాగాన కడతేరె సర్పజాతి
  సర్పసంతతి హెచ్చిన జరుగు మేలు

  కంతలలోన దాగునవి కర్షక శత్రువు లెన్నడు న్నధో
  గంతలు వాటినే చమరు కర్షక మిత్రులు పన్నగంబులే
  చింతలు తీర్చి రైతులకు చిత్తము నందున హాయి నింపగా
  సంతతి వృద్ధి సేసినవి సర్పము లీభువి మేలుఁ గోరుచున్

  రిప్లయితొలగించండి
 12. ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.

  రిప్లయితొలగించండి
 13. పామునొక దైవముగ నెంచి పడతులగుమి
  పుట్టల దరికేగి ఫణికి పూజ జేయు
  విధము గలుగు దేశమునందు విషము నిడని
  సర్పసంతతి హెచ్చిన జరుగు మేలు

  రిప్లయితొలగించండి
 14. పంటచేలలో కర్వముల్ పంటలన్ని
  ధ్వంస మొనరించి రైతుల బాధపెట్ట
  వెతలు బాపఁగ పొలమున విసములేని
  సర్పసంతతి హెచ్చిన జరుగు మేలు

  రిప్లయితొలగించండి
 15. ఎంతయు మేలుచేకురగ నేపుగ పండిన పంటలన్నియున్
  సంతియొనర్చు కర్వముల సర్వము సంక్షయమొంద జేయగన్
  సంతసమొంద నెల్లరును సాంత్వన గూర్చగ కర్షకాళికిన్
  సంతతి వృద్ధి సేసినవి సర్పము లీభువి మేలుఁ గోరుచున్

  రిప్లయితొలగించండి
 16. తే.గీ:సర్ప వనమును జూచెడు జనుల రాక
  తగ్గుచున్నది, జబ్బులన్ తరిగిపోయె
  సర్పములు,మంచి వైద్యము జరుప వలయు
  సర్పసంతతి హెచ్చిన జరుగు మేలు
  (సర్పవనము=స్నేక్ పార్క్. మనకి పాములు పెరిగితే కష్టం కానీ వాళ్లకి కావలసిందే పాములు.)

  రిప్లయితొలగించండి
 17. ఉ:సంతత మెంతొ బాధ నిడ సర్పములున్ ,జనమేజయుండు తా
  పంతము బూని యిట్లనియె బల్మిని, స్వేచ్ఛగ సంచరించుచున్
  సంతతి వృద్ధి సేసినవి సర్పము, లీభువి మేలుఁ గోరుచున్”
  జంతు మనుష్య శాంతి కొక జన్నము చేయుట నాకు ధర్మమౌ.
  (జనమేజయుని సర్పయాగం. )

  రిప్లయితొలగించండి
 18. చేతన జంతు జాలము విశృంఖల రీతి చరించి మందలై
  యాతతమైన వైరితతి నంతము జేయహితంబు కానకే
  సంతతి ఎక్కుడైన నుపచారము జేయు పరాన్నభుక్తులై
  సంతతి వృద్ధి సేసినవి సర్పములీ భువి మేలు గోరుచున్

  రిప్లయితొలగించండి
 19. ఒక్కొకరికినిఁ బదిమంది యుద్భవింప
  నందను లిల నందార్భక నారులకును
  యదువరేణ్య! నీలాంబుదశ్యామ! తల్ప
  సర్ప! సంతతి హెచ్చిన జరుగు మేలు

  [తల్ప సర్ప=తల్పమయిన సర్పము గలవాఁడు]


  శాంతి యొనర్చి యంతము స శాస్త్ర మొనర్పఁగ సర్ప దోషముం
  బంతము నంతరంగములఁ బన్నుగ వీడి దయారసార్ద్రతన్
  సంతస మంద డెందములఁ జారు తరమ్ముగ వంశమం దహో
  సంతతి వృద్ధి సేసినవి సర్పము లీ భువి మేలుఁ గోరుచున్

  రిప్లయితొలగించండి
 20. పంట పొలముల సాగును బాడు చేయు
  మూషికములను జంపనౌ పూర్తిగాను
  సర్పసంతతి హెచ్చిన జరుగు మేలు
  నాహరించుట మూలాన యదియ జరుగు

  రిప్లయితొలగించండి
 21. సంతతి వృద్ధి సేసినవి సర్పము లీభువి మేలుఁ గోరుచున్
  వింతగ నుండెయీపలుకు బేరిమి తోడన వృద్ధి చేసెనా?
  యంతముఁజేయునే మనిషి యాకృతి కంటికి గానిపించుచో
  కంతలు సేయుచున్ మెయిని కాటును వేయుచు నాక్షణంబునన్

  రిప్లయితొలగించండి

 22. పిన్నక నాగేశ్వరరావు.
  హనుమకొండ.

  పొలము నందలి పంటను మూషికములు
  పాడుచేయుచు నుండె, సర్పములు తిరుగ
  చేలలో పారిపోవు మూషికము లన్ని
  సర్ప సంతతి హెచ్చిన జరుగు మేలు.

  రిప్లయితొలగించండి